Share News

14 జిల్లాలకు ‘బర్డ్‌ ఫ్లూ’ వ్యాప్తి

ABN , Publish Date - Mar 05 , 2026 | 01:06 PM

రాష్ట్రంలోని 14 జిల్లాలకు ‘బర్డ్‌ ఫ్లూ’ విస్తరించిందని ఆరోగ్యశాఖ తెలిపింది. అడయార్‌లో జనవరి 5వ తేది వరుసగా కాకులు మృతిచెందాయి.

14 జిల్లాలకు ‘బర్డ్‌ ఫ్లూ’ వ్యాప్తి

చెన్నై: రాష్ట్రంలోని 14 జిల్లాలకు ‘బర్డ్‌ ఫ్లూ’ విస్తరించిందని ఆరోగ్యశాఖ తెలిపింది. అడయార్‌లో జనవరి 5వ తేది వరుసగా కాకులు మృతిచెందాయి. వాటి నమూనాలు పరిశీలించిన జాతీయ పశువైద్య పరిశోధనసంస్థ, కాకుల మృతికి బర్డ్‌ ఫ్లూ కారణమని నిర్ధారించింది. ఈ నేపథ్యంలో, నగరం అనంతరం తిరువళ్లూర్‌, తిరువణ్ణామలై, కడలూరు సహా 14జిల్లాలు, పుదుచ్చేరి రాష్ట్రంలోనూ బర్డ్‌ ఫ్లూతో కాకులు మృతిచెందుతున్నాయి. ఈ విషయమై ఆరోగ్యశాఖ అధికారులు మాట్లాడుతూ...


nani1.3.jpgరాష్ట్రంలో 14 జిల్లాల్లో బర్డ్‌ ఫ్లూ కారణంగా కాకులు మృతిచెందుతున్నాయన్నారు. ఇతర పక్షులకు, మనుషుల్లో ఈ వ్యాధి ఇప్పటివరకు సోకలేదన్నారు. అయినా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అదే సమయంలో, జ్వరం లక్షణాలుంటే సత్వరం ఆసుపత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

జనం ప్రాణాలతో జగన్‌ చెలగాటం!

ఏప్రిల్‌ 24, 25 తేదీల్లో కవిత కీలక సమావేశం!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 05 , 2026 | 01:06 PM