అస్సాంలో పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్.. లోకోపైలట్ వీడియో వైరల్
ABN , Publish Date - Nov 11 , 2026 | 01:05 PM
ఈరోజు ఉదయం అస్సాంలో జరిగిన రైలు ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. పట్టాలు తప్పుతున్న రైలును ఆపడానికి అందులోని లోకోపైలట్ శ్రమించడం వీడియోలో రికార్డ్ అయింది.
ఇంటర్నెట్ డెస్క్: ఈరోజు ఉదయం అస్సాంలో జరిగిన రైలు ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. పట్టాలు తప్పుతున్న రైలును ఆపడానికి అందులోని లోకోపైలట్ శ్రమించడం వీడియోలో రికార్డ్ అయింది. బ్రేక్స్ వేయడానికి ఆయన తీవ్రంగా ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. ‘ఇక్కడ ఏదీ పనిచేయటం లేదు’ అని ఆ లోకోపైలట్ ఆవేదనతో అన్నారు. ఆ తరువాత రైలు పట్టాలు తప్పింది. సుమారు ఒక నిమిషం పాటు సాగిన లోకోపైలట్ వీడియో సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఎంత ప్రయత్నించినా బ్రేక్స్ ఎందుకు పనిచేయలేదనే ప్రశ్నలూ వ్యక్తమవుతున్నాయి. ఇంకా ఈ వీడియోపై రైల్వే అధికారికంగా స్పందించలేదు.
కాగా ఇవాళ ఉదయం అస్సాంలోని డిగారూ సమీపంలో 6.54 సమయంలో కోల్‌కతా-సైరంగ్ ఎక్స్‌ప్రెస్ రైలులోని ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గువాహటికి 30 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. ఒక లైన్ నుంచి మరో లైన్‌కు మారుతున్న వేళ సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు భావిస్తున్నారు.
ఈ వార్తలూ చదవండి
ఎయిరిండియా విమానానికి హైజాక్ బెదిరింపు.. అప్రమత్తమైన అధికారులు..
వాట్సాప్‌లో మీ చాటింగ్ సేఫ్.. నిరూపించిన గూగుల్ డీప్‌మైండ్