వాట్సాప్‌లో మీ చాటింగ్ సేఫ్.. నిరూపించిన గూగుల్ డీప్‌మైండ్
ABN , Publish Date - Nov 11 , 2026 | 12:13 PM
వాట్సాప్, సిగ్నల్ లాంటి మెసేజింగ్ యాప్‌లలో చాటింగ్ ఎంత సురక్షితమో తెలుసుకునేందుకు గూగుల్ డీప్‌మైండ్ సంస్థ ఒక పరిశోధన నిర్వహించింది.
ఇంటర్నెట్ డెస్క్: వాట్సాప్, సిగ్నల్ లాంటి మెసేజింగ్ యాప్‌లలో చాటింగ్ ఎంత సురక్షితమో తెలుసుకునేందుకు గూగుల్ డీప్‌మైండ్ సంస్థ ఒక పరిశోధన నిర్వహించింది. ఆయా యాప్‌లు వాడే ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్ రక్షణ వ్యవస్థను పరీక్షించింది. ఆల్ఫాప్రూఫ్ అనే ఏఐ ఫ్రేమ్‌వర్క్ ద్వారా ఒక ప్రత్యేక బృందం.. స్విగ్నల్ యాప్ ఉపయోగించే క్రిప్టోగ్రాఫిక్ ప్రోటోకాల్‌ను మెషిన్-కోడ్ స్థాయి వరకు వెరీఫై చేసింది. ఈ మేరకు డీప్‌మైండ్ శాస్త్రవేత్త స్వరాట్ చౌదరి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తాము వాట్సాప్, సిగ్నల్ వినియోగించే ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్ వ్యవస్థలో గణితశాస్త్రం ప్రకారం ఎలాంటి లోపాలూ లేనట్టు నిరూపించామని వెల్లడించారు. ఆ యాప్‌ల రక్షణ వ్యవస్థ అత్యంత బలంగా ఉందని గుర్తించామని, వాటిలోని చాటింగ్ ఇతరులు హ్యాక్ చేసే అవకాశం లేదని తెలిపారు.
సాధారణంగా ఒక సాఫ్ట్‌వేర్ కోడ్ గణితశాస్త్రం ప్రకారం భద్రమైందని నిరూపించటానికి దశాబ్దాల సమయం పడుతుంది. అయితే ఆల్ఫాప్రూఫ్ ఏఐ వ్యవస్థతో డీప్‌మైండ్ ఈ పనిని కేవలం నాలుగు వారాల్లో చేసేసింది. మానవ నిపుణుల ఆధ్వర్యంలో ఉన్న ఏఐ మోడళ్లు కోడ్‌ను విస్తృతంగా తనిఖీ చేశాయి. మొత్తం కోడ్‌బేస్‌లోని 1 శాతం భాగాన్ని మాత్రమే నిపుణులు పరిశీలించారు. కృత్రిమ మేధ సరిగ్గా పనిచేస్తుందా..? లేదా అనే అనుమానం తీరడానికి శాస్త్రవేత్తలు అదే కోడ్‌లో రెండు బగ్‌లను ప్రవేశపెడితే.. వాటిని ఏఐ విజయవంతంగా గుర్తించింది. దీంతో ఈ సాఫ్ట్‌వేర్ కోడ్ గణితశాస్త్రం ప్రకారం లోపరహితమైందని పరిశోధనలో వెల్లడైంది.
ఈ వార్తలూ చదవండి
వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. బ్లూ టిక్స్ పడకుండానే మెసేజ్‌లు చదవొచ్చు!
ఇన్‌స్టాలో ఏఐతో వయసు గుర్తింపు.. టీనేజర్ల ఖాతాలకు అదనపు భద్రత!