ఎయిరిండియా విమానానికి హైజాక్ బెదిరింపు.. అప్రమత్తమైన అధికారులు..
ABN , Publish Date - Nov 11 , 2026 | 12:41 PM
కోల్‌కతా నుంచి ముంబై వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో హైజాక్ బెదిరింపు నోట్ కనిపించడం కలకలం రేపింది. విమానం టేకాఫ్ కావడానికి ముందు అందులో అనుమానాస్పద బెదిరింపు నోట్ కనిపించడంతో విమానాశ్రయ అధికారులు అప్రమత్తమయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: కోల్‌కతా నుంచి ముంబై వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో హైజాక్ బెదిరింపు నోట్ కనిపించడం కలకలం రేపింది. విమానం టేకాఫ్ కావడానికి ముందు అందులో అనుమానాస్పద బెదిరింపు నోట్ కనిపించడంతో విమానాశ్రయ అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే విమానంలోని ప్రయాణికులను కిందకు దించారు. భద్రతా తనిఖీల కోసం విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించారు (Air India Flight Hijack Threat).
భద్రతా సంస్థలు రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టాయి. ఈ ఘటనతో విమానాశ్రయంలో కొంతసేపు ఆందోళన నెలకొంది. గత అక్టోబర్‌లో, పుకెట్ నుంచి వచ్చిన ఒక విమానంలోని టాయిలెట్ అద్దంపై 'విమానంలో బాంబు' అని రాసి ఉండటం సంచలనం రేపింది. పుకెట్ నుంచి వచ్చిన విమానం కోల్‌కతాలో దిగిన తర్వాత, క్యాబిన్ సిబ్బంది టాయిలెట్‌ను శుభ్రం చేయడానికి లోపలికి వెళ్లారు. టాయిలెట్ లోపలి అద్దంపై 'విమానంలో బాంబు' అని రాసి ఉండటాన్ని గమనించారు. ఆ ఘటన తర్వాత కోల్‌కతా విమానాశ్రయంలో పూర్తిస్థాయి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు (Air India Hijack Scare).
విమానానికి హైజాక్ లేదా బాంబు బెదిరింపు వచ్చినప్పుడు అధికారులు దాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటారు (Flight Threat Note). విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు ప్రయాణికులు, వారి సామాన్లను కూడా పరిశీలిస్తారు. అనుమానాస్పద వస్తువులు లేవని నిర్ధారించిన తర్వాతే విమానానికి తిరిగి అనుమతి ఇస్తారు. ప్రస్తుతం కోల్‌కతా విమానాశ్రయంలో ఎయిరిండియా విమానాన్ని క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
యుద్ధానికి ముగింపు పలకాలంటే.. అమెరికాకు ఇరాన్ ఏం చెప్పిందంటే..
స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే...