Share News

అసోం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. బీజేపీపై కాంగ్రెస్ అగ్రనేత గౌరవ్ గొగోయ్ ఓటమి

ABN , Publish Date - May 04 , 2026 | 03:14 PM

అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అగ్రనేత గౌరవ్ గొగోయ్‌కు షాక్ తగిలింది. జోర్‌హాట్‌లో బీజేపీ సీనియర్ నేత హితేంద్రనాథ్ గోస్వామి చేతిలో 28వేల ఓట్లకు పైగా తేడాతో గొగోయ్ ఓటమి పాలయ్యారు.

అసోం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. బీజేపీపై కాంగ్రెస్ అగ్రనేత గౌరవ్ గొగోయ్ ఓటమి
Gourav Gogoi

ఇంటర్నెట్ డెస్క్: అసోం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అగ్రనేత గౌరవ్ గొగోయ్‌కు షాక్ తగిలింది. జోర్‌హాట్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత హితేంద్రనాథ్ గోస్వామి చేతిలో 28,184వేల ఓట్ల తేడాతో గొగోయ్ ఓటమి పాలయ్యారు. ఈ ఫలితం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ వారసత్వం, దాంతోపాటు జాతీయ స్థాయి ఇమేజ్‌తో బరిలోకి దిగిన గొగోయ్‌కు ఇది భారీ ఎదురుదెబ్బగా మారింది.


మరోవైపు, హితేంద్రనాథ్ గోస్వామి మొదటి నుంచే ఆధిపత్యం కొనసాగిస్తూ వచ్చారు. కౌంటింగ్ ప్రారంభమైన 12 రౌండ్ల తర్వాత దాదాపు 19వేల ఓట్ల ఆధిక్యం సాధించారు. చివరికి గౌరవ్ గొగొయ్‌పై హితేంద్రనాథ్ 28వేలకు పైగా ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. మొత్తంగా 59, 113 ఓట్లు సాధించి బీజేపీ బలాన్ని మరోసారి నిరూపించారు. ఇది రాష్ట్ర కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ. పార్టీ రాష్ట్రాధ్యక్షుడు తన సొంత నియోజకవర్గంలోనే ఓడిపోవడం.. స్థానిక నేతలలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే అంశంగా మారింది. ఫలితాల ముందు గొగోయ్ వ్యక్తం చేసిన ధీమా పూర్తిగా తలకిందులైంది. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ నేతృత్వంలోని బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమి 126 స్థానాల్లో మెజారిటీ మార్క్‌ను దాటేసి మరోసారి అధికారాన్ని దక్కించుకుంది. హిమంత్ బిశ్వ శర్మ మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది.


ఇవి కూడా చదవండి..

కౌంటింగ్ కేంద్రాలు వదలొద్దు.. తుది ఫలితాలు మనవైపే: మమతా బెనర్జీ

ముఖ్యమంత్రి కాబోతున్న విజయ్‌ని చూసి గర్వపడుతున్నా: ఎస్.ఎ.చంద్రశేఖర్..

Updated Date - May 04 , 2026 | 04:51 PM