ఎలాన్ మస్క్‌పై ఒవైసీ ఫైర్.. భారత్‌ను విదేశీయులు శాసించలేరని వ్యాఖ్య
ABN , Publish Date - Oct 16 , 2026 | 02:52 PM
ఎలాన్ మస్క్ వ్యాఖ్యలపై హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీని రాజకీయంగా వ్యతిరేకించడం వేరు.. భారతదేశ నిర్ణయాలను విదేశీ వ్యాపారవేత్తలు శాసించేందుకు ప్రయత్నించడాన్ని అంగీకరించడం వేరని వ్యాఖ్యానించారు.
Asaduddin Owaisi on Elon Musk: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని తాము ఎంతగానో వ్యతిరేకిస్తున్నప్పటికీ, ఒక విదేశీ బిలియనీర్ భారత్ అంతర్గత విధానాలను, రాజకీయ నిర్ణయాలను ప్రశ్నించడాన్ని లేదా శాసించడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని ఏఐఎంఐఎం (AIMIM) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) స్పష్టం చేశారు. స్టార్‌లింక్ (Starlink) వాణిజ్య కార్యకలాపాల ప్రారంభంపై టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ (Elon Musk) కేంద్ర ప్రభుత్వం మధ్య నడుస్తున్న వివాదంపై ఒవైసీ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్‌లో ఇవాళ(శుక్రవారం) మీడియాతో మాట్లాడిన ఒవైసీ.. మోదీ ప్రభుత్వాన్ని విమర్శించడం వేరు, భారతదేశ సార్వభౌమత్వాన్ని ఒక విదేశీ వ్యాపారవేత్త ప్రశ్నించడాన్ని సమర్థించడం వేరని తేల్చిచెప్పారు.
మోదీని వ్యతిరేకిస్తాం.. కానీ విదేశీయుల జోక్యం సహించం
'మేము ఎప్పుడూ నరేంద్ర మోదీకి వ్యతిరేకమే, భవిష్యత్తులోనూ వ్యతిరేకంగానే ఉంటాం. కానీ, ఎలాన్ మస్క్ లాంటి వ్యక్తి మన భారతదేశం గురించి, మన ప్రధాని గురించి ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేయగలడు?' అని ఒవైసీ ప్రశ్నించారు. ఒక 'గోరా' (తెల్ల జాతీయుడు) వచ్చి మన దేశాన్ని ఎలా నడపాలో డిక్టేట్ చేస్తాడా? అని మండిపడ్డారు.
ఎల్లప్పుడూ జాతీయవాదం గురించి మాట్లాడే బీజేపీ, మోదీ ప్రభుత్వం.. ఒక శక్తివంతమైన విదేశీ వ్యాపారవేత్త దేశ నిర్ణయాధికారాన్ని సవాల్ చేసినప్పుడు ఎందుకు మౌనంగా ఉంటోందని ఒవైసీ నిలదీశారు. బీజేపీకి 'గోరచర్మం' (తెల్లని చర్మం) పట్ల ఎందుకంత భయమని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. భారతీయ కార్మికులు, పౌరుల ప్రయోజనాలే దేశానికి ప్రథమ ప్రాధాన్యత కావాలని స్పష్టం చేశారు.
అమెరికా వైఖరిపై విమర్శ
భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులు తగ్గించాలని అమెరికా ఒత్తిడి తెస్తోందని, కానీ అమెరికా మాత్రం స్వయంగా రష్యన్ ఇంధన ఉత్పత్తులను కొనుగోలు చేస్తోందని ఒవైసీ ఎత్తిచూపారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భిన్నమైన స్పందన
మరోవైపు, కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇదే అంశంపై భిన్నమైన వైఖరిని ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఎలాన్ మస్క్.. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయగా, రాహుల్ గాంధీ దానికి స్పందిస్తూ ఎక్స్ (X) వేదికగా 'భారత్‌కు స్వాగతం ఎలాన్.. మరొకరిని కనుగొనే వరకు వేచి చూడండి' అంటూ పరోక్షంగా గౌతమ్ అదానీని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. దీనికి మస్క్ కూడా స్పందించడం రాజకీయంగా దుమారం రేపింది.
అయితే, రాహుల్ గాంధీ కార్పొరేట్ అనుకూల విధానాలపై విమర్శలు గుప్పించేందుకు ఈ వివాదాన్ని వాడుకోగా.. అసదుద్దీన్ ఒవైసీ మాత్రం దీనిని దేశ సార్వభౌమత్వం, జాతీయ గౌరవానికి సంబంధించిన అంశంగా మలచడం గమనార్హం.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజకీయ ప్రమేయం లేకుండా రిజర్వేషన్లు.. అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం: మంత్రి నారాయణ
స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకని దిక్కుతోచని స్థితిలో గొడ్డలి పార్టీ: మంత్రి కొల్లు రవీంద్ర
ఏపీకి భారీగా పెట్టుబడులు.. త్వరలో మూడు ప్రాంతాల్లో సదస్సులు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News