Share News

అన్నాడీఎంకే-బీజేపీ సీట్ల షేరింగ్‌పై అన్నామలై అసంతృప్తి.. పోటీకి దూరంగా ఉండే అవకాశం

ABN , Publish Date - Mar 27 , 2026 | 06:12 PM

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ-అన్నాడీఎంకే మధ్య సీట్ల పంపకాలపై బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పార్టీ వర్గాల సమాచారం. దీనిపై ఢిల్లీలోని పార్టీ అధిష్ఠానానికి లేఖ రాసినట్టు చెబుతున్నారు.

అన్నాడీఎంకే-బీజేపీ సీట్ల షేరింగ్‌పై అన్నామలై అసంతృప్తి.. పోటీకి దూరంగా ఉండే అవకాశం

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ-అన్నాడీఎంకే (BJP-AIADMK) మధ్య సీట్ల పంపకాలపై బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై (K Annamalai) తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పార్టీ వర్గాల సమాచారం. సీట్ల పంపకాల ఒప్పందంలో భాగంగా బీజేపీకి కేటాయించిన నియోజకవర్గాలపైనా ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ ఢిల్లీలోని పార్టీ అధిష్ఠానానికి లేఖ రాసినట్టు ఆ వర్గాలు తెలిపాయి.


బీజేపీ తేలిగ్గా గెలిచే కినితుకడవు నియోజకవర్గంతో సహా పలు నియోజకవర్గాలను అన్నాడీఎంకే కేటాయించలేదని అన్నామలై ఆ లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. తమిళనాడు ఎన్నికల్లో తాను పోటీ చేసేది లేదని కూడా పార్టీ అధిష్ఠానానికి తెలియజేసినట్టు చెబుతున్నారు. సీట్ల పంపకాల ఒప్పందంపై కినితుకడవు నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తలు గురువారంనాడు నిరనస ప్రదర్శన కూడా నిర్వహించారు.


తమిళనాడులో ఎన్డీయే ఇటీవల సీట్ల కేటాయింపు ఒప్పందాన్ని ఖరారు చేసింది. 169 సీట్లలో అన్నాడీఎంకే పోటీ చేయనుండగా, బీజేపీకి 27 సీట్లు కేటాయించింది. ఇతర భాగస్వామ్య పార్టీలైన పీఎంకే 18, ఏఎంఎంకే 11 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. 27 సీట్లతో బీజేపీ సంతృప్తికరంగా ఉన్నట్టు ఆపార్టీ తమిళనాడు ఇన్‌చార్జి, కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరుగనుండగా, మే 4న ఫలితాలు వెలువడతాయి.


ఇవి కూడా చదవండి..

ఇంధన సమస్యల పర్యవేక్షణకు కేంద్ర మంత్రులతో కమిటీ

127 మంది అభ్యర్థులతో అన్నాడీఎంకే రెండో జాబితా

Updated Date - Mar 27 , 2026 | 06:22 PM