ప్రధాని చేతుల మీదుగా నోయిడా ఎయిర్‌పోర్ట్ ప్రారంభం.. ఎప్పుడంటే..
ABN , Publish Date - Mar 27 , 2026 | 03:26 PM
ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతానికి రేపటి నుంచి రెండో అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రానుందని కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రతిష్ఠాత్మకమైన నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించనున్నారని ఆయన వెల్లడించారు.
ఢిల్లీ: ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతానికి రేపటి నుంచి రెండో అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రానుందని కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రతిష్ఠాత్మకమైన నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించనున్నారని ఆయన వెల్లడించారు. ఈ విషయాన్ని తెలియజేస్తున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు కేంద్రమంత్రి.
ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రజలందరికీ అభినందనలు తెలిపారు. 'రేపు జేవార్(Jewar) వద్ద మీ అందరినీ కలుస్తా' అంటూ రామ్మోహన్ నాయుడు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కాగా, దేశంలో విమాన ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోవడంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ (IGI) విమానాశ్రయానికి ప్రయాణికుల తాకిడి విపరీతంగా పెరిగింది. దీంతో ఈ ప్రాంతాల్లో మరో నూతన అంతర్జాతీయ ఎయిర్ పోర్టును నిర్మించాలని భావించింది.
ఈ మేరకు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం జేవార్‌లో నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేసింది. అత్యాధునిక టెక్నాలజీ, హంగులతో దీన్ని నిర్మించారు. మార్చి 28న జేవార్‌లో ప్రారంభోత్సవానికి తేదీ సైతం ఖరారు చేశారు. ఈ కొత్త విమానాశ్రయం దేశ విమానాశ్రయ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
ఎరువుల కొరత లేదు, ఆందోళన వద్దు: లోక్‌సభలో జేపీ నడ్డా త్వరలోనే విజయవాడ, అనంతపురంలో తలసేమియా సెంటర్లు: నారా భువనేశ్వరి