త్వరలోనే విజయవాడ, అనంతపురంలో తలసేమియా సెంటర్లు: నారా భువనేశ్వరి
ABN , Publish Date - Mar 27 , 2026 | 03:05 PM
కుప్పంలో పర్యటిస్తున్న నారా భువనేశ్వరి స్వయం ఉపాధికి చేయూత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురికి కట్టుమిషన్లు, తోపుడు బండ్లు, వినికిడి మిషన్లను అందజేశారు.
చిత్తూరు, మార్చి 27: కుప్పం నియోజకవర్గంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి(Nara Bhuvaneshwari) పర్యటన కొనసాగుతోంది. ఈరోజు(శుక్రవారం) కుప్పం టీటీడీ కల్యాణ మండపంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్వయం ఉపాధికి చేయూత’ కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 40 మంది మహిళలకు కుట్టు మిషన్లు, 30 మందికి తోపుడు బండ్లు, పలువురికి వినికిడి మిషన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలను భువనేశ్వరి వివరించారు.
ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ పనిచేశారని భువనేశ్వరి తెలిపారు. ఎన్టీఆర్ స్పూర్తితో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ స్థాపించి 29 సంవత్సరాలు పూర్తయిందన్నారు. చంద్రబాబు రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల ట్రస్ట్ బాధ్యతలు తనకు అప్పగించారని అన్నారు. చంద్రబాబు అందించిన స్పూర్తితో ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. తలసేమియా వ్యాధిగ్రస్తులకు తమ వంతు సాయం అందిస్తున్నామని చెప్పారు. త్వరలోనే విజయవాడ, అనంతపురంలో కూడా తలసేమియా సెంటర్లు ప్రారంభిస్తామని నారా భువనేశ్వరి ప్రకటించారు.
ఇవి కూడా చదవండి...
పీఎం సూర్యఘర్ కనెక్షన్లను వేగవంతం చేయాలి: మంత్రి గొట్టిపాటి రవికుమార్
వ్యాపారవేత్తలుగా వడ్డెర్లు... ఇదే సీఎం సంకల్పం: మంత్రి సవిత
Read Latest AP News And Telugu News