పీఎం సూర్యఘర్ కనెక్షన్లను వేగవంతం చేయాలి: మంత్రి గొట్టిపాటి రవికుమార్
ABN , Publish Date - Mar 27 , 2026 | 01:01 PM
ఏపీ వ్యాప్తంగా ఆర్టీఎస్ఎస్ పనులు, పీఎం సూర్యఘర్ కనెక్షన్లను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాలు జారీ చేశారు.
అమరావతి, మార్చి 27: డిస్కంల సీఎండీలతో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్(Minister Gottipati Ravi Kumar) ఈరోజు(శుక్రవారం) టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పీఎం సూర్యఘర్, ఆర్డీఎస్ఎస్ పనుల పురోగతిపై సీఎండీలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీఎస్ఎస్ పనులు వేగంగా పూర్తి చేయాలని సీఎండీలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రణాళికాబద్ధంగా పీఎం సూర్యఘర్ కనెక్షన్లను అధికారులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ప్రతీ నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా అందించే పీఎం సూర్యఘర్ కనెక్షన్లను వేగవంతంగా చేపట్టాలని మంత్రి తెలిపారు.
జగజ్జీవన్ రామ్ జయంతి నుంచి అంబేడ్కర్ జయంతి నాటికి ప్రతీ నియోజకవర్గంలో కనీసం 2 వేల కనెక్షన్లు పూర్తి చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. వచ్చే వ్యవసాయ సీజన్‌కు పెండింగ్‌లో ఉన్న అగ్రికల్చర్ కనెక్షన్లు మంజూరు చేయాలన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో విద్యుత్ ప్రమాదాలు, ట్రాన్స్‌ఫార్మర్ చోరీలను అరికట్టేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. సీఎం చంద్రబాబు సూచనల మేరకు విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో శాఖాధికారులు, ఉద్యోగులు రెట్టింపు ఉత్సాహంతో పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
సింహాచలం కొండ దిగువన గుర్తుతెలియని వ్యక్తుల ఘాతుకం
విశాఖలో బయటపడ్డ రూ.217 కోట్ల భారీ జీఎస్టీ స్కామ్
Read Latest AP News And Telugu News