Share News

వ్యాపారవేత్తలుగా వడ్డెర్లు... ఇదే సీఎం సంకల్పం: మంత్రి సవిత

ABN , Publish Date - Mar 27 , 2026 | 01:45 PM

వడ్డెర్ల సంక్షేమమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. కూటమితోనే వడ్డెర్లకు ఆర్థిక, సామాజిక గుర్తింపు అని అన్నారు.

వ్యాపారవేత్తలుగా వడ్డెర్లు... ఇదే సీఎం సంకల్పం: మంత్రి సవిత
Minister Savitha

అమరావతి, మార్చి 27: నూతన వడ్డెర సొసైటీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రి సవిత(Minister Savitha) తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని స్పష్టం చేశారు. వడ్డెర్లకు ఇచ్చిన హామీలను మంత్రి నారా లోకేశ్‌ నిలబెట్టుకున్నారన్నారు. వడ్డెర్ల సంక్షేమమే ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) లక్ష్యమని.. వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని సీఎం సంకల్పించారని మంత్రి సవిత వెల్లడించారు.


కూటమితోనే వడ్డెర్లకు ఆర్థిక, సామాజిక గుర్తింపు అని మంత్రి తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మైనింగ్ లీజుల్లో వడ్డెర సొసైటీలకు 15 శాతం కేటాయింపు చేయనున్నట్లు తెలిపారు. సీనరేజీలో 50 శాతం మినహాయింపు కల్పించనున్నట్లు చెప్పారు. రాష్ట్ర పండుగగా వడ్డె ఓబన్న జయంతిని నిర్వహిస్తున్నట్లు మంత్రి సవిత పేర్కొన్నారు.


మైనింగ్ లీజుల్లో రిజర్వేషన్ల కేటాయింపు, 50 శాతం సీనరేజీ మినహాయింపు చర్యలపై వడ్డెర కులస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సవితకు వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ ఈశ్వరరావు, డైరెక్టర్లు ధన్యవాదాలు తెలిపారు. అలాగే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ చిత్రపటాలకు వడ్డెర్లు పాలాభిషేకం చేశారు.


ఇవి కూడా చదవండి...

విశాఖలో బయటపడ్డ రూ.217 కోట్ల భారీ జీఎస్టీ స్కామ్

పీఎం సూర్యఘర్ కనెక్షన్లను వేగవంతం చేయాలి: మంత్రి గొట్టిపాటి రవికుమార్

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 27 , 2026 | 01:52 PM