127 మంది అభ్యర్థులతో అన్నాడీఎంకే రెండో జాబితా
ABN , Publish Date - Mar 27 , 2026 | 04:11 PM
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులతో రెండవ జాబితాను అన్నాడీఎంకే శుక్రవారంనాడు ప్రకటించింది. ఈ జాబితాలో 127 మంది అభ్యర్థులు ఉన్నారు.
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో (Tamil Nadu Assembly Elections) పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులతో రెండవ జాబితాను అన్నాడీఎంకే (AIADMK) శుక్రవారంనాడు ప్రకటించింది. ఈ జాబితాలో 127 మంది అభ్యర్థులు ఉన్నారు. దీనికి ముందు 23 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదలైంది. రెండవ జాబితా కూడా విడుదల కావడంతో ఇంతవరకూ ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 150కి చేరింది. తాజా జాబితాలో పలువురు సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చోటు లభించింది.
తిరువళ్లూరు నుంచి బీవీ రమణ, పొల్లాచి నుంచి పొల్లాచి వి.జయరామన్, మదురాంతకం నుంచి మరగదం కుమారవేల్, కుంబకోణం నుంచి వి.సత్యనారాయణ, పెన్నేరి నుంచి పి.బలరామన్, తిరుత్తణి నుంచి కె.తిరుత్తణి, మాధవరం నుంచి వి.మూర్తి, తిరువొట్టియూరు నుంచి కె.కుప్పన్, చెంగల్పట్టు నుచి ఎం.రాజా అలియాస్ కె.రాజేంద్రన్ పోటీలో ఉన్నారు.
ఎన్డీయే సీట్ల పంపకాల ఒప్పందం ఇదే
సీట్ల పంపకాలకు సంబంధించి ఎన్డీయే భాగస్వాముల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం అన్నాడీఎంకే 169 సీట్లలో పోటీ చేస్తోంది. తమది విజయవంతమైన కాంబినేషన్ అని, 210 సీట్లలో ఎన్డీయే గెలుపు ఖాయమని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఎన్డీయే భాగస్వాములైన బీజేపీ 27 సీట్లలో పోటీ చేయనుండగా, అన్బుమణి రామదాస్ సారథ్యంలోని పీఎంకే 18 నియోజకవర్గాల్లో, టీటీవీ దినకర్ సారథ్యంలోని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే) 11 సీట్లలో పోటీ చేయనుంది. తక్కిన తమిళ మానిల కాంగ్రెస్, ఐజేకే, పీబీకే, పీఎన్‌కే, టీఎంఎంకే, ఎస్ఐఎఫ్‌బీ పార్టీలు అన్నాడీఎంకే గుర్తుపై కానీ బీజేపీ గుర్తుపై కానీ పోటీ చేయనున్నాయి. 243 మంది సభ్యుల తమిళ అసెంబ్లీకి ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరుగనుండగా, మే 4న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
ఎరువుల కొరత లేదు, ఆందోళన వద్దు: లోక్‌సభలో జేపీ నడ్డా
ముఖ్యమంత్రి పదవికి 30న నితీశ్ రాజీనామా