Share News

అనిరుధ్, కావ్య పెళ్లి రిసెప్షన్.. రజినీ కాంత్, కమల్ హాసన్, విజయ్, రేవంత్ హాజరు

ABN , Publish Date - Nov 21 , 2026 | 08:48 PM

మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కోఓనర్ కావ్య మారన్‌ల వివాహ రిసెప్షన్ చెన్నైలో శనివారం రాత్రి ఘనంగా జరిగింది. ఐటీసీ గ్రాండ్ చోళా ఫంక్షన్ హాల్‌లో ఈ వేడుక నిర్వహించారు.

అనిరుధ్, కావ్య పెళ్లి రిసెప్షన్.. రజినీ కాంత్, కమల్ హాసన్, విజయ్, రేవంత్ హాజరు

ఇంటర్నెట్ డెస్క్: మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కోఓనర్ కావ్య మారన్‌ల వివాహ రిసెప్షన్ చెన్నైలో శనివారం రాత్రి ఘనంగా జరిగింది. ఐటీసీ గ్రాండ్ చోళా ఫంక్షన్ హాల్‌లో ఈ వేడుక నిర్వహించారు. రిసెప్షన్‌కు దిగ్గజ నటులు కమల్ హాసన్, రజినీ కాంత్, తమిళనాడు సీఎం విజయ్, మాజీ సీఎం ఎంకే స్టాలిన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. రజినీ కాంత్ బ్లాక్ సూట్ వేసుకోగా, కమల్ సిల్క్ షర్ట్, ధోతీలో కనిపించారు. సీఎం విజయ్ నెవీ బ్లూ జాకెట్, నల్ల ప్యాంటులో కనిపించారు. క్రికెట్, సినీ పరిశ్రమ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని కొత్త దంపతులకు శుభాభినందనలు తెలిపారు. క్రికెటర్లు కేన్ విలియమ్సన్, డానియెల్ వెటోరీ, డేల్ స్టెయిన్ కూడా హాజరయ్యారు.


కాగా.. ఈనెల 11న కావ్య, అనిరుధ్ గ్రీస్‌లో అతికొద్ది మంది సన్నిహితులు, స్నేహితుల మధ్య వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ పెళ్లికి సూపర్ స్టార్ రజినీ కాంత్, తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్ తదితరులు హాజరయ్యారు. తమ వివాహానికి సంబంధించిన ఫొటోలను అనిరుధ్ షేర్ చేశారు. ‘మీ రాకతో మాకెంతో ఆనందం కలిగింది. మీ ప్రేమ, ఆశీర్వాదాన్ని మాటల్లో వర్ణించలేం. మా కొత్త జీవితాన్ని ప్రత్యేకం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీ ప్రేమను మేమెప్పుడూ మాతోనే ఉంచుకుంటాం. ఇట్లు కావ్య, అనిరుధ్’ అని అనిరుధ్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

ప్రైవేటు వాహనాలపై కుల గుర్తులు, పేర్ల నిషేధం.. గుజరాత్ ప్రభుత్వం ఆదేశం

ఆర్మీ జవాన్‌కు చలాన్ విధించిన అధికారి.. విధుల నుంచి తొలగింపు

Updated Date - Nov 21 , 2026 | 08:48 PM