ఐఐటీ ఖరగ్‌పూర్‌కు గూగుల్ రూ.46 కోట్ల విరాళం
ABN , Publish Date - Nov 21 , 2026 | 04:58 PM
ఏఐపై పరిశోధనల కోసం ఐఐటీ ఖరగ్‌పూర్‌కు గూగుల్ 5 మిలియన్ డాలర్ల (రూ.46.34 కోట్లు) విరాళాన్ని ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఏఐపై పరిశోధనల కోసం ఐఐటీ ఖరగ్‌పూర్‌కు టెక్ దిగ్గజం గూగుల్ 5 మిలియన్ డాలర్ల (రూ.46.34 కోట్లు) విరాళాన్ని ప్రకటించింది. వ్యవసాయం, విద్య, మెటీరియల్ సైన్స్, భారతీయ భాషల్లో వినియోగించేందుకు అనువైన ఏఐ సాధనాల అభివృద్ధి కోసం గూగుల్ ఈ నిధులను కేటాయించింది. విద్యార్థులు, టీచర్లకు ఏఐపై శిక్షణలో సాయపడటంతో పాటు ఐఐటీ ఖరగ్‌పూర్‌లో సాంకేతిక మౌలిక వసతుల కల్పనకు కూడా అండగా ఉంటామని గూగుల్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు తన బ్లాగ్ పోస్టులో వెల్లడించింది.
భారతీయ భాషలు మాట్లాడేవారి అవసరాలకు అనుగుణంగా ఏఐ సాధనాల అభివృద్ధికి గూగుల్ ఈ నిధులను కేటాయించింది. విద్యార్థులు, టీచర్లు, ఇతర ఫాకల్టీ సభ్యుల కోసం ఏఐ సిలబస్ రూపొందించేందుకు కూడా ఈ నిధులను వినియోగించనున్నారు. వీటితో పాటు ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఏఐ ఫ్రేమ్‌వర్క్, టూల్స్ వంటి మౌలికవసతుల అభివృద్ధికి కూడా ఈ నిధులను వినియోగిస్తారు. భారతీయ ఏఐ రంగంపై పట్టుసాధించేందుకు గూగుల్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఏఐ పరిశోధనల కోసం ఐఐటీ ఖరగ్‌పూర్‌కు నిధులను కేటాయిస్తోంది. రాబోయే ఐదేళ్ల కాలానికి గూగుల్ 15 బిలియన్ డాలర్ల నిధులను ఇప్పటికే ప్రకటించింది. ఇందులో భాగంగా వైజాగ్‌లో ఏఐ హబ్ నిర్మించనుంది.
ఈ వార్తలనూ చదవండి:
రైలు బోగీలో మహిళపై అత్యాచారం.. ఆపై హత్య! నిందితుడిని పట్టించిన బంగారు ఉంగరం
నితీశ్ సేతు బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ