Share News

కశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పులు.. ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు

ABN , Publish Date - Nov 11 , 2026 | 03:50 PM

జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు బుధవారం కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు. కుల్గాం జిల్లాలోని సీఆర్పీఎఫ్ చెక్‌పాయింట్ వద్ద ఈ ఘటన జరిగింది.

కశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పులు.. ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు

ఇంటర్నెట్ డెస్క్: జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు బుధవారం కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు. కుల్గాం జిల్లాలోని సీఆర్పీఎఫ్ చెక్‌పాయింట్ వద్ద ఈ ఘటన జరిగింది. టెర్రరిస్టులు బైకులపై చెక్‌పాయింట్ వద్దకు వచ్చి జవాన్లపై కాల్పులు జరిపి పారిపోయారు. జవాన్లలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన బలగాలు.. వెంటనే ఎదురు కాల్పులు జరిపాయి.


అలాగే క్విక్ రియాక్షన్ టీమ్స్ (క్యూటీఆర్) కూడా ఘటనా స్థలానికి చేరుకున్నాయి. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. పారిపోయిన ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. చెక్ పాయింట్ ప్రాంతంలో భద్రతను పూర్తిగా కట్టుదిట్టం చేశారు. ఆ ప్రాంతంలో రాకపోకలు కొనసాగించే వాహనదారులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

యుద్ధానికి ముగింపు పలకాలంటే.. అమెరికాకు ఇరాన్ ఏం చెప్పిందంటే..


స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే...

Updated Date - Nov 11 , 2026 | 03:50 PM