Share News

దీపావళి వస్తేనే కాలుష్యం గుర్తుకొస్తోందా.. సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు..

ABN , Publish Date - Nov 11 , 2026 | 01:45 PM

దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా కాల్చడంతో దేశంలోని పలు నగరాల్లో వాయు కాలుష్యం పెరిగిందన్న ఆందోళనలపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు.

దీపావళి వస్తేనే కాలుష్యం గుర్తుకొస్తోందా.. సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు..
Yogi Adityanath

ఇంటర్నెట్ డెస్క్: దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా కాల్చడంతో దేశంలోని పలు నగరాల్లో వాయు కాలుష్యం పెరిగిందన్న ఆందోళనలపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. పండుగ సమయంలో ప్రజలు టపాసులు కాలిస్తేనే కొందరికి కాలుష్యం గుర్తుకొస్తోందని వ్యాఖ్యానించారు. ఒకరోజు బాణసంచా కాల్చడం వల్ల ఏర్పడిన కాలుష్యం తొందరగానే తగ్గిపోతుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు (Yogi Adityanath about Diwali Pollution).


దీపావళి వేడుకలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి నిషేధాలూ విధించలేదని స్పష్టం చేశారు. బుధవారం ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో యోగి ఆదిత్యనాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీపావళి వేడుకలను ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారని, పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారని తెలిపారు. దీనిపై కొందరు కాలుష్యం పెరిగిందంటూ విమర్శలు చేస్తున్నారని అన్నారు. ప్రజలు ఒకరోజు టపాసులు కాల్చితే కాలుష్యం గురించి మాట్లాడుతున్నారని, కానీ అవినీతి కార్యకలాపాలతో మొత్తం వ్యవస్థను కలుషితం చేసిన వారిని ఎవరూ ప్రశ్నించడం లేదని వ్యాఖ్యానించారు (Yogi Diwali Statement).


దీపావళి వేడుకల సమయంలో అయోధ్యలో తాను కూడా బాణసంచా కాల్చే కార్యక్రమంలో పాల్గొన్నట్లు యోగి తెలిపారు (Uttar Pradesh News). 2017కు ముందు ఉత్తరప్రదేశ్‌లో హోలీ, దీపావళి, విజయదశమి, జన్మాష్టమి, శివరాత్రి, క్రిస్మస్, ఈద్ వంటి పండుగలు వచ్చినప్పుడు అల్లర్లు జరిగేవని ఆరోపించారు. ప్రస్తుతం ప్రజలు ప్రశాంతంగా పండుగలు జరుపుకునే పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. పండుగల సమయంలో ప్రజలు సంతోషంగా వేడుకలు జరుపుకుంటే కాలుష్యం గురించి మాట్లాడుతున్నారని, ఇతర తప్పిదాల విషయంలో మాత్రం అదే స్థాయిలో ప్రశ్నలు రావడం లేదని విమర్శించారు.


ఇవి కూడా చదవండి..

యుద్ధానికి ముగింపు పలకాలంటే.. అమెరికాకు ఇరాన్ ఏం చెప్పిందంటే..


స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే...

Updated Date - Nov 11 , 2026 | 01:45 PM