Share News

పెద్దలుగా సహచరుని కుమార్తె వివాహం జరిపిన సైనికుల

ABN , Publish Date - Nov 23 , 2026 | 03:32 PM

సైనికులు పెళ్లి పెద్దలుగా మారి తమ సహోద్వోగి కుమార్తె వివాహాన్ని ఘనంగా నిర్వహించారు. పెళ్లి మండపం వరకు వధువును స్వయంగా వారే తీసుకెళ్లిన దృశ్యం చూపరులను ఆకట్టుకుంది. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పెద్దలుగా సహచరుని కుమార్తె వివాహం జరిపిన సైనికుల
16 jat regiment

ఇంటర్నెట్ డెస్క్: దేశ రక్షణలో ఎల్లప్పుడూ ముందుండే సైనికులు.. తమ తోటి జవాను కుటుంబం కష్టంలో ఉన్నా, వేడుకలో ఉన్నా అంతే ఆప్యాయతతో అండగా నిలుస్తారు. రాజస్థాన్ రాష్ట్రం అల్వార్ జిల్లాలోని హర్సోలి గ్రామంలో జరిగిన ఓ వివాహ వేడుక సైనికుల ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. తమ సహోద్వోగి కుమార్తె వివాహాన్ని ఘనంగా నిర్వహించారు. 16 జాట్ రెజిమెంట్‌లో పని చేసిన పప్పల్ సింగ్ కుమార్తె ప్రీతి వివాహం శనివారం (నవంబరు 21) జరిగింది. పప్పల్ సింగ్ చనిపోవడంతో అతడితో పాటు పని చేసిన 16 జాట్ రెజిమెంట్ సిబ్బంది పెళ్లి పెద్దలుగా మారి, ఆ కుటుంబానికి అండగా నిలిచారు.


రెజిమెంట్ అధికారులు, జూనియర్ కమిషన్డ్ అధికారులు (జేసీవో), ఇతర జవాన్లు పెళ్లి వేడుక హాజరయ్యారు. అంతేకాక వధువు కుటుంబానికి రూ.1.61 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. కేవలం సాయంతోనే ఆగిపోకుండా.. ప్రీతి తల్లి అనితా దేవిని రోష్ని ధావల్ శాలువాతో సత్కరించి ఆత్మీయత చాటుకున్నారు. జవాన్లే స్వయంగా పెళ్లి కుమార్తెను మండపం వద్దకు తీసుకొచ్చారు. తన తండ్రితో పని చేసిన సైనికులు చూపిన ఆప్యాయతకు వధువు కన్నీరు పెట్టుకుంది. సుబేదార్ వీరేంద్ర కుమార్ ధావల్, నాయబ్ సుబేదార్ సుబే సింగ్, హవల్దార్ సతీశ్ కుమార్, హవల్దార్ సునీల్ కుమార్, నాయక్ లోకేశ్, నాయక్ సోహన్ సింగ్, అగ్నివీర్ దివాకర్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.


తండ్రి లేని లోటు తెలియకుండా రెజిమెంట్ బృందం చూపిన చొరవ, ఆత్మీయత పట్ల పెళ్లికి వచ్చిన బంధువులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ‘సేవా పరమో ధర్మ’ స్ఫూర్తితో సైనికుల మధ్య ఉండే సోదరభావం మరణంతో ముగిసిపోదని, వారి కుటుంబ సభ్యుల వరకు కొనసాగుతుందని ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది.


ఇవి కూడా చదవండి:

రామచంద్రపురం మున్సిపల్ ఛైర్మన్‌గా మేడిశెట్టి శేషారావు ప్రమాణ స్వీకారం

విజయానికి 8 వికెట్లు

సెమీస్‌కు మనమ్మాయిలు

Updated Date - Nov 23 , 2026 | 03:50 PM