Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Mar 21 , 2026 | 07:20 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Mar 21, 2026 17:53 IST

  • Mar 21, 2026 17:19 IST

    ఏపీ పశుసంవర్ధక రంగానికి భారీ ఊరట

    • పట్టణాల్లో పశుపోషకులకు అభివృద్ధి ఛార్జీల నుంచి మినహాయింపు

    • భవన అనుమతుల రుసుములో సడలింపు

    • మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడి

  • Mar 21, 2026 17:05 IST

    జగిత్యాల: జీవన్‌రెడ్డి మంచి వ్యక్తి: BRS ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్

    • అధిష్ఠానం ఆదేశిస్తే నేను వెళ్లి పార్టీలోకి తీసుకొస్తా: సంజయ్

    • జీవన్‌రెడ్డి వస్తానంటే.. నా భుజాలపై మోసుకుని వస్తా: సంజయ్

    • రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి జీవన్‌రెడ్డి: సంజయ్

  • Mar 21, 2026 16:53 IST

    కమర్షియల్ సిలిండర్ల సరఫరాపై కేంద్రం కీలక నిర్ణయం

    • కమర్షియల్ సిలిండర్ల సరఫరాను 20 శాతం పెంచిన కేంద్రం

    • వలస కూలీలకు ఉచితంగా 5 కిలోల సిలిండర్లు: కేంద్రం

    • అన్ని రాష్ట్రాలకు లేఖ రాసిన కేంద్ర ప్రభుత్వం

    • వచ్చే సోమవారం నుంచి సిలిండర్లు పంపుతామని లేఖలో వెల్లడి

  • Mar 21, 2026 16:45 IST

    ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌కు ప్రధాని మోదీ ఫోన్

    • పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులపై చర్చించిన మోదీ

    • ఇరాన్‌లోని మౌలిక స్థావరాలపై దాడులను ఖండించిన మోదీ

    • యుద్ధం తర్వాత తొలిసారి ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్

  • Mar 21, 2026 16:23 IST

    టీమిండియా ఐర్లాండ్ టూర్ షెడ్యూల్ రిలీజ్

    • రెండు టీ20 మ్యాచ్‌ల కోసం ఐర్లాండ్ వెళ్లనున్న భారత్

    • ఈ ఏడాది జూన్ 26, 28వ తేదీల్లో జరగనున్న మ్యాచ్‌లు

    • భారత కాలమానం ప్రకారం రాత్రి 7:00 గంటలకు ప్రారంభం

    పూర్తి కథనం

  • Mar 21, 2026 16:04 IST

    తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమవుతోన్న బీఆర్ఎస్

    6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే అంశంపై ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టే యోచనలో కేటీఆర్

    మూడేళ్లు అవుతున్నా కాంగ్రెస్ హామీలు అమలు చేయడం లేదు: కేటీఆర్

    6 గ్యారెంటీల్లో అర గ్యారంటీ కూడా అమలు చేయలేదు: కేటీఆర్

    6 గ్యారెంటీలకు చట్టబద్ధత కోరుతూ ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతాం: కేటీఆర్

  • Mar 21, 2026 15:49 IST

    హైదరాబాద్: అత్తాపూర్‌లో ఆటో చోరీకి యత్నించి దొరికిపోయిన దొంగ

    • కుల్దీప్ వైన్స్ సమీపంలో ఆటో చోరీకి యత్నించిన దుండగుడు

    • దుండగుణ్ని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు

    • అప్పటికే నార్సింగిలో ఓ ఆటో చోరీ చేసినట్టు గుర్తింపు

    • మరో ఆటోను చోరీ చేస్తుండగా పట్టుబడిన దుండగుడు

  • Mar 21, 2026 15:42 IST

    మరో 3 గంటల్లో ఏపీలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

    • అనకాపల్లి, తూ.గో, ప.గో, ఏలూరు, ఎన్టీఆర్‌, కృష్ణా..

    • గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు భారీ వర్ష సూచన

    • గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం

  • Mar 21, 2026 15:36 IST

    మహిళల టీ20లో చరిత్ర సృష్టించిన రువాండా క్రికెటర్

    • ఘనాతో జరిగిన మ్యాచ్‌లో అద్భుత సెంచరీ చేసిన ఫ్యానీ

    • అతిపిన్న వయసులో(15ఏళ్లు) సెంచరీ చేసిన ప్లేయర్‌గా రికార్డ్

    • అరంగేట్రంలోనే సెంచరీ చేసిన తొలి క్రీడాకారిణిగా నిలిచిన ఫ్యానీ

  • Mar 21, 2026 15:26 IST

    రంగారెడ్డి: కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని పెంజర్ల శివారులో టపాసుల లారీ దగ్ధం

  • Mar 21, 2026 15:04 IST

    విశాఖలో సీఐఐ వార్షిక సదస్సు.. హాజరైన కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు

    • విమానయానరంగంపై యుద్ధం ప్రభావం పడుతోంది: రామ్మోహన్‌

    • రైల్వేజోన్‌ ప్రధాన కార్యాలయ నిర్మాణం జరుగుతోంది: రామ్మెహన్

    • కేకే లైన్‌ కోసం చర్చలు జరుగుతున్నాయి: రామ్మోహన్‌

    • జూన్‌లో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభం: రామ్మోహన్‌

  • Mar 21, 2026 14:54 IST

    కడప జిల్లా సీఐ అశోక్‌రెడ్డిపై సి.కె.దిన్నె పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు

    • సీఐపై నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసు నమోదు

    • అనంతపురం వాసి ప్రభాకర్‌ను బెదిరించి ఆస్తుల సెటిల్మెంట్లు చేసినట్లు ఆరోపణలు

    • ఆస్తుల సెటిల్మెంట్లో సీఐ కీలకంగా వ్యవహరించినట్లు అభియోగాలు

    • వైసీపీ హయాంలో ఐదేళ్లపాటు కడప జిల్లాలో చక్రం తిప్పిన సీఐ అశోక్‌రెడ్డి

  • Mar 21, 2026 14:49 IST

    హైదరాబాద్: యశోద ఆస్పత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం

    • తొడ భాగంలో గడ్డ తొలగింపునకు ఆస్పత్రికి వెళ్లిన రోగి

    • రెండుసార్లు మత్తు ఇంజెక్షన్ ఇవ్వడంతో రోగి బ్రెయిన్‌ డెడ్

    • మాదాపూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేసిన బాధితులు

  • Mar 21, 2026 14:40 IST

    కాల్పుల విరమణకు అంగీకరించేది లేదని ఇరాన్ ప్రకటన

    • సైనిక చర్య నిలిపివేసే యోచనపై ట్రంప్ ప్రకటనను తోసిపుచ్చిన ఇరాన్ మంత్రి

    • ఇక ఎప్పటికీ యుద్ధానికి దిగమని హామీ ఇవ్వాలని అబ్బాస్ అరాగ్చీ డిమాండ్

    • దురాక్రమణ ఆపకపోతే ఆత్మరక్షణ చర్యలు కొనసాగిస్తామని స్పష్టీకరణ

  • Mar 21, 2026 14:33 IST

    హైదరాబాద్: బీజేపీ గ్రేటర్ ఎన్నికల సన్నాహక సమావేశం

    • పాల్గొన్న సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి పార్లమెంట్ కార్యకర్తలు

    • బీజేపీ నేతల తీరుపై పార్టీ కార్యకర్తలు అసంతృప్తి

    • పార్టీ కోసం కష్టపడి పనిచేసినవారికి..

    • పదవులు, ప్రాధాన్యం దక్కడంలేదని ఆవేదన

  • Mar 21, 2026 14:21 IST

    తగ్గిన బంగారం, వెండి ధరలు

    • రూ.2,940 తగ్గి రూ.1,45,970కి చేరిన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం

    • రూ.2,750 తగ్గి రూ.1,33,800కి చేరిన 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి

    • కిలోపై రూ.10వేలు పతనమై రూ.2,50,000కు చేరిన వెండి

    పూర్తి కథనం

  • Mar 21, 2026 14:18 IST

    పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్హౌస్ సీజ్

    • మొయినాబాద్‌లోని రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ సీజ్ చేసిన పోలీసులు

    • అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిన రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్

    • డ్రగ్స్ పార్టీకి అటెండైన వారి వాహనాలను సీజ్ చేసిన పోలీసులు

  • Mar 21, 2026 14:11 IST

    ఇరాన్‌కు సాయం నిలిపివేతపై మీడియాలో కథనాలు

    • అమెరికా ముందు రష్యా ఈ ప్రతిపాదన పెట్టిందన్న పొలిటికో వార్తాసంస్థ

    • ఉక్రెయిన్‌కు అమెరికా సాయం నిలిపివేయాలని ప్రతిపాదించినట్టు వార్త

    • ఇరాన్ విషయంలో వెనక్కు తగ్గేందుకు రష్యా ఆఫర్ చేసినట్టు కథనం

    • ఈ కథనాలను ఖండించిన రష్యా

    పూర్తి కథనం

  • Mar 21, 2026 14:04 IST

    గుంటూరు కొర్నెపాడులో ఘనంగా రైతు నేస్తం ఫౌండేషన్‌ పదో వార్షికోత్సవం

    • వార్షికోత్సవంలో పాల్గొన్న కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌

    • మిద్దెతోటలు సాగుచేస్తున్న మహిళలకు అవార్డులు అందజేసిన పెమ్మసాని

  • Mar 21, 2026 11:40 IST

    జీవన్ రెడ్డిని బుజ్జగిస్తున్న కాంగ్రెస్ పెద్దలు

    • జగిత్యాల: జీవన్‌రెడ్డి ఇంటికి మంత్రులు శ్రీధర్‌బాబు, లక్ష్మణ్‌

    • జీవన్‌రెడ్డితో చర్చలు జరుపుతున్న శ్రీధర్‌బాబు

    • పార్టీ మారొద్దని జీవన్‌రెడ్డికి మంత్రుల సూచన

    • సమస్య ఉంటే అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామని మంత్రుల హామీ

    పూర్తి కథనం

  • Mar 21, 2026 11:38 IST

    కరీంనగర్‌ టూ టౌన్‌ ఎస్ఐ చంద్రశేఖర్‌ ఆత్మహత్య

    • జమ్మికుంట మం. సీతంపేటలోని అత్తింట్లో ఉరివేసుకున్న చంద్రశేఖర్‌

    • 5 రోజుల క్రితమే గన్నేరుపప్పు తిని ఎస్ఐ భార్య ఆత్మహత్య

    • మనస్తాపంతో ఉరివేసుకుని చంద్రశేఖర్‌ ఆత్మహత్య

  • Mar 21, 2026 11:07 IST

    హిందూ మహాసముద్రంపై ఇరాన్‌ దాడులు

    • రెండు బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించిన ఇరాన్‌

    • హిందూ మహాసముద్రంలో ఉన్న US-UK సైనిక స్థావరం

    • డిగో గార్సియా లక్ష్యంగా దాడులు చేసిన ఇరాన్‌

    • 4వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను తాకని ఇరాన్‌ క్షిపణులు

  • Mar 21, 2026 10:39 IST

    తిరుమల: కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను సందర్శించిన సీఎం చంద్రబాబు

    • వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లో ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌

    • రెండంతస్తుల్లో వాటర్‌ అండ్‌ ఫుడ్‌ అనాలసిస్‌ లేబరేటరీ

    • ల్యాబ్‌లో నీరు, ఆహారం, ముడి సరుకుల నాణ్యత పరీక్షలు

    • రూ. 20 కోట్లతో ఆధునిక యంత్రాలతో కూడిన లేబరేటరీ

  • Mar 21, 2026 10:37 IST

    హైదరాబాద్‌: మొయినాబాద్‌ డ్రగ్స్‌ కేసులో పోలీసుల విచారణ

    • పోలీసుల అదుపులో డ్రగ్స్‌ పెడ్లర్‌ అభిషేక్‌ సింగ్‌

    • రోహిత్‌రెడ్డి పార్టీకి డ్రగ్స్‌ సప్లై చేసిన అభిషేక్‌ సింగ్‌

    • అభిషేక్‌ సింగ్‌ను విచారిస్తున్న సిట్‌ అధికారులు

  • Mar 21, 2026 10:29 IST

    హైదరాబాద్‌: అల్వాల్‌ పీఎస్‌ పరిధిలో వైద్య విద్యార్థిని ఆత్మహత్య

    • ఇంట్లో ఉరివేసుకున్న విద్యార్థిని తుమ్మల ప్రిన్సి శ్రేష్ఠ

    • పిల్లిని పెంచుకోవద్దని తల్లి చెప్పడంతో యువతి మనస్తాపం

  • Mar 21, 2026 10:26 IST

    విజయవాడ: పటమట పీఎస్‌ పరిధిలో దారుణం

    • మతిస్తిమితం లేని ఇద్దరు బాలికలపై యువకుడి అత్యాచారం

    • పాడుబడిన భవనంలోకి తీసుకెళ్లి బాలికలపై త్రినాథ్‌ అత్యాచారం

    • పటమట పీఎస్‌లో బాధితుల తల్లిదండ్రుల ఫిర్యాదు

    • పోలీసుల అదుపులో యువకుడు త్రినాథ్‌, పోక్సో కేసు నమోదు

  • Mar 21, 2026 10:15 IST

    రెచ్చిపోయిన వైసీపీ మూకలు..

    • అనంతపురం: ఉరవకొండ మండలం రేణుమాకులపల్లెలో వైసీపీ శ్రేణుల వీరంగం

    • టీడీపీ కార్యకర్తల ఇళ్లల్లోకి చొరబడి మహిళలు, చిన్నారులపై దాడులు

    • దాడులకు తెగబడ్డ వైసీపీ సర్పంచ్ రామాంజనేయులు అనుచరులు

    • అడ్డుకున్న వారిపై దాడి చేసి కార్లు, బైక్‌లు ధ్వంసం చేసిన దుండగులు

    • పలువురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు

    పూర్తికథనం

  • Mar 21, 2026 09:45 IST

    ఘోర రోడ్డు ప్రమాదం..

    • మదనపల్లి: చీకలబైలు దగ్గర బైక్‌ను ఢీకొన్న లారీ

    • విద్యార్థులు కుశాల్‌రెడ్డి, భువనేశ్వర్‌ మృతి

  • Mar 21, 2026 09:30 IST

    మంచిర్యాల: జైపూర్ మండలం శివ్వారం ఎర్ర చెరువులో మొసళ్ల కలకలం

    • మొసళ్ల దాడిలో రెండు గేదెలు మృతి

    • భయాందోళనలో స్థానికులు

  • Mar 21, 2026 08:41 IST

    ఇరాన్‌పై మా లక్ష్యాలను చేరుకోవడానికి చాలా దగ్గరగా ఉన్నాం: ట్రంప్‌

    • సైనిక చర్యను క్రమంగా తగ్గించే విషయాన్ని పరిశీలిస్తున్నాం

    • ఇరాన్‌ క్షిపణి సామర్థ్యాలను, వైమానిక, నావికా వ్యవస్థలను ధ్వంసం చేశాం

    • ఇరాన్‌ అణ్వాయుధాలు తయారు చేస్తే తగినవిధంగా స్పందిస్తాం

    • పశ్చిమాసియాలోని మిత్ర దేశాలకు రక్షణ కల్పిస్తున్నాం

  • Mar 21, 2026 08:39 IST

    కర్నూలు: పత్తికొండ చాకలి వీధిలో కోడి పెట్టిన చిచ్చు

    • కోడి మృతి విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ

    • పోలీసు స్టేషన్‌కు చేరిన వివాదం

  • Mar 21, 2026 08:00 IST

    ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు: మంత్రి లోకేశ్

    • నెల మొత్తం ఉపవాస దీక్షలు చేశారు

    • దాని ఫలితం సమాజానికి చేరుతుంది

    • ఆ అల్లాహ్ మిమ్మల్ని చల్లగా చూడాలి

    • ఈద్-ఉల్-ఫితర్ సంద‌ర్భంగా అందరికీ ఈద్ ముబారక్

    పూర్తికథనం

  • Mar 21, 2026 07:55 IST

    తిరుమల: భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన చంద్రబాబు

    • భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించిన సీఎం చంద్రబాబు

    • దేవాన్ష్‌ పుట్టినరోజు సందర్భంగా ఎస్వీ అన్నదాన ట్రస్ట్‌కు విరాళం

    • రూ.44 లక్షలు విరాళం ఇచ్చిన చంద్రబాబు కుటుంబ సభ్యులు

    • మనవడు దేవాన్ష్‌ పుట్టినరోజుకు ఏటా విరాళం అందజేయడం ఆనవాయితీ

  • Mar 21, 2026 07:37 IST

    హైదరాబాద్‌లో ఘనంగా రంజాన్ వేడుకలు

    • ఈద్గా, మసీదుల్లో ప్రత్యేక పార్థనలు చేసేందుకు సిద్ధమవుతున్న ముస్లిం సోదరులు

    • మీరాలం ట్యాంక్ వద్ద ఉన్న ఈద్గాకు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్న ముస్లిం సోదరులు

    • మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్న సామూహిక ప్రార్థనలు

    • మీరాలం ట్యాంక్ ఈద్గా పరిసర ప్రాంతాల్లో భారీ పోలీస్ బందోబస్తు

    • లా అండ్ ఆర్డర్, క్విక్ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ లతో భద్రతను ఏర్పాటు చేసిన అధికారులు

    • రద్దీ నేపథ్యంలో మీరాలం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

  • Mar 21, 2026 07:25 IST

    విజయనగరం: ట్రావెల్స్‌ బస్సులో అగ్నిప్రమాదం

    • రామభద్రపురం మం. తారాపురం దగ్గర బస్సులో చెలరేగిన మంటలు

    • బస్సు వెనుక టైర్‌ పేలి చెలరేగిన మంటలు

    • టైర్ పేలడంతో బస్సు నుంచి ప్రయాణికులను దించేసిన డ్రైవర్‌

    • మంటల ధాటికి పూర్తిగా దగ్ధమైన బస్సు, తప్పిన ప్రాణనష్టం

    • భువనేశ్వర్‌ నుంచి మల్కాజిగిరికి వెళ్తున్న ఒడిశా ట్రావెల్స్‌ బస్సు

  • Mar 21, 2026 07:24 IST

    అనంతపురం: టీడీపీ మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరి కన్నుమూత

    • గుండె సమస్యకు చికిత్స పొందుతూ హనుమంతరాయచౌదరి మృతి

  • Mar 21, 2026 07:24 IST

    తెలంగాణలో పాఠశాలలు, తరగతుల కోసం నిధులు

    • PP-2 నుంచి ఇంటర్‌ వరకు 11 కొత్త స్కూళ్లు ఏర్పాటు

    • ఇంటర్‌ వరకు అప్‌గ్రేడ్‌ అయిన మరో 17 స్కూళ్లు

    • 164 పాఠశాలల్లో 501 తరగతి గదుల నిర్మాణం

    • రూ.1,011 కోట్లు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం

  • Mar 21, 2026 07:23 IST

    ఈ నెల 23న తెలంగాణ కేబినెట్‌ సమావేశం

    • 23న సాయంత్రం 5 గంటలకు సమావేశం

  • Mar 21, 2026 07:23 IST

    రేపు సిద్దిపేట జిల్లా నర్మెట్టకు సీఎం రేవంత్‌ రెడ్డి

    • ఆయిల్‌ పామ్‌ ఫ్యాక్టరీని ప్రారంభించనున్న రేవంత్‌

    • రూ.300 కోట్లతో 365 ఎకరాల విస్తీర్ణంలో రిఫైనరీ

  • Mar 21, 2026 07:23 IST

    విశాఖలో త్వరలో సెమీకండక్టర్‌ తయారీ పరిశ్రమ

    • రూ.2,387 కోట్లు పెట్టుబడులు పెట్టనున్న ASIP సంస్థ

    • 30 ఎకరాలు కేటాయించిన ఏపీ ప్రభుత్వం

  • Mar 21, 2026 07:22 IST

    ద్రోణి ప్రభావంతో ఏపీలో తేలికపాటి వర్షాలు

    • పలుచోట్ల పిడుగులతో కూడిన వానలు

  • Mar 21, 2026 07:22 IST

    బ్రిటన్‌ వెళ్లే విద్యార్థులకు మరింత ఆర్థిక భారం

    • అన్ని కేటగిరీ వీసాలపై ఫీజులు పెంచిన బ్రిటన్‌

    • ఏప్రిల్‌ 8 నుంచి అమల్లోకి UK వీసా ఫీజుల పెంపు

  • Mar 21, 2026 07:22 IST

    పశ్చిమాసియాలో 22వ రోజుకు చేరిన యుద్ధం

    • ఇజ్రాయెల్‌, గల్ఫ్‌ దేశాలపై ఆగని ఇరాన్‌ దాడులు

    • కువైట్‌లోని కీలక రిఫైనరీలో మంటలు

    • పర్యాటక ప్రాంతాలపై కూడా దాడులు చేస్తామన్న ఇరాన్‌

  • Mar 21, 2026 07:21 IST

    ఏపీలో నేడు జరగాల్సిన టెన్త్‌ ఇంగ్లీష్‌ పరీక్ష వాయిదా

    • నేడు రంజాన్‌ సెలవు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

    • ఏప్రిల్‌ 2న జరగనున్న పదోతరగతి ఇంగ్లీష్‌ పరీక్ష

  • Mar 21, 2026 07:21 IST

    నేడు ఈద్‌-ఉల్‌-ఫితర్

    • నేడు రంజాన్‌ జరుపుకోనున్న ముస్లింలు

    • భారత్‌లో నిన్న కనిపించిన నెలవంక

  • Mar 21, 2026 07:20 IST

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు

    • మనవడు దేవాన్ష్ బర్త్‌డే సందర్భంగా..

    • స్వామివారిని దర్శించుకున్న చంద్రబాబు కుటుంబసభ్యులు