Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్..

ABN , First Publish Date - Jan 25 , 2026 | 06:52 AM

ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్..
BREAKING

Live News & Updates

  • Jan 25, 2026 18:02 IST

    శుక్లాకు అశోక చక్ర పురస్కారం..!

    • భారత వ్యోమగాని శుభాంశు శుక్లాకు అశోక చక్ర పురస్కారం!

    • రిపబ్లిక్‌ డే వేడుకల్లో అవార్డు ప్రదానం చేయనున్నట్లు కథనాలు

    • ISSలోకి వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామిగా శుభాంశు శుక్లా రికార్డు

  • Jan 25, 2026 17:25 IST

    టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

    • అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

    • టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి హాజరైన టీడీపీ ఎంపీలు

    • పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చంద్రబాబు మార్గనిర్దేశం

    • అమరావతి, పోలవరానికి కేంద్రం ఇచ్చే నిధులకు సంబంధించిన అంశాలపై చర్చ

    పూర్తి కథనం

  • Jan 25, 2026 16:51 IST

    ఢిల్లీ: రిపబ్లిక్‌ డే వేడుకలకు ఐదంచెల భద్రత

    • 30 వేలమంది పోలీసులు, కేంద్ర బలగాలతో బందోబస్తు

    • కర్తవ్యపథ్‌ దగ్గర 6 కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటు

    • పరేడ్‌కు 10 వేల మంది ప్రత్యేక ఆహ్వానితులు

    • 17 రాష్ట్రాలు, 13 కేంద్ర ప్రభుత్వ శకటాలు

    • ఈసారి పరేడ్‌లో తెలుగు రాష్ట్రాలకు దక్కని చోటు

  • Jan 25, 2026 16:50 IST

    నిజామాబాద్: పార్టీ కోసం పనిచేసేవారికి సముచిత స్థానం: మహేష్‌గౌడ్‌

    • అర్హులైనవారి ఇళ్లకే నేరుగా బీఫాంలు వస్తాయి: మహేష్‌గౌడ్‌

    • అందరికీ న్యాయం చేయలేం.. ఓపిక ఉండాలి: మహేష్‌గౌడ్‌

    • దేవుళ్ల పేరు చెప్పుకుని అర్వింద్‌ ఎంపీ అయ్యారు: మహేష్‌గౌడ్‌

    • మేము అభివృద్ధి చేసి చూపించి ఓట్లు అడుగుతాం: మహేష్‌గౌడ్‌

    • 2, 3 రోజుల్లో మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌: మహేష్‌గౌడ్

    • ఫిబ్రవరిలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌: మహేష్‌గౌడ్

    • 2028 ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌దే గెలుపు: మహేష్‌గౌడ్

  • Jan 25, 2026 16:23 IST

    విషాదం.. సంపులో పడి..

    • నాగర్‌కర్నూల్‌: ఊరుకొండ మండలం ముచ్చర్లపల్లిలో విషాదం

    • ప్రమాదవశాత్తూ నీటిసంపులో పడి ముగ్గురు చిన్నారులు మృతి

    • మృతులు స్నేహ, సిరి, శ్రీమాన్‌ గా గుర్తింపు

  • Jan 25, 2026 15:02 IST

    తమిళనాడు: మహాబలిపురంలో TVK చీఫ్‌ విజయ్ బహిరంగ సభ

    • వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పోరాటానికైనా సిద్ధం: విజయ్‌

    • నన్ను ఎవరూ భయపెట్టలేరు: TVK చీఫ్‌ విజయ్

    • నన్ను అణచివేయాలని కుట్ర చేస్తున్నారు: విజయ్

    • ఎవరి బెదిరింపులకూ నేను లొంగను: విజయ్

    • అవినీతి రహిత పాలనే TVK లక్ష్యం: విజయ్

    • ఒంటరి పోరుకైనా TVK సిద్ధం: విజయ్

    • బానిసత్వం వద్దు, సలాం కొట్టాల్సిన అవసరం లేదు: విజయ్

    • 234 స్థానాల్లో నిలబడి గెలిచే సత్తా ఉంది: TVK చీఫ్‌ విజయ్

  • Jan 25, 2026 15:02 IST

    ఢిల్లీలో మెరుగుపడిన వాయు నాణ్యత

    • వర్ష ప్రభావం, గాలి వేగంతో తగ్గిన వాయు కాలుష్యం

    • 3 నెలల తర్వాత ఢిల్లీలో తగ్గిన వాయు కాలుష్యం

    • ఢిల్లీలో సగటున 150 పాయింట్లుగా AQI స్థాయి

  • Jan 25, 2026 14:46 IST

    పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం

    • న్యూఢిల్లీ: నేడు పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

    • ఈసారి 5మందికి పద్మ విభూషన్, 13 మందికి పద్మ భూషన్

    • 113 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

    • ఈసారి 11మంది తెలుగు వారికి పద్మశ్రీ

    పూర్తి కథనం

  • Jan 25, 2026 13:47 IST

    అనంతపురం ప్రజల శ్రమకు ప్రధాని మోదీ అభినందనలు

    • నీటి ఎద్దడి పరిష్కారానికి చేపట్టిన చర్యలకు ప్రధాని ప్రశంసలు.

    • జలాశయాల పునురుద్ధరణకు ప్రజలు ముందుకు వచ్చారు.

    • ఏపీ ప్రభుత్వం సహకారంతో 10కి పైగా జలాశయాలు పునరుద్ధరించారు.

    • ఆయా ప్రాంతాల్లో 7వేలకు పైగా చెట్లను నాటారు.

  • Jan 25, 2026 13:21 IST

    అనంతపురం: పేరూరు జలాశయానికి నీటి తరలింపు పనులు పునఃప్రారంభం

    • ఆత్మకూరు మండలం కొత్తపల్లి వద్ద డ్యామ్‌కు నీరు తరలించే కాలువ పనులు ప్రారంభం.

    • జీడిపల్లి జలాశయం నుంచి పేరూరు డ్యామ్‌కు నీటి తరలింపు.

    • వైసీపీ హయాంలో నిలిచిన పనులను ప్రారంభించిన పరిటాల సునీత.

  • Jan 25, 2026 13:16 IST

    కర్నూలు: HIV ఇంజెక్షన్ కేసులో దర్యాప్తు ముమ్మరం

    ప్రియుడి భార్యకు హెచ్ఐవీ ఇంజెక్షన్‌ ఇచ్చిన నర్సు వసుంధర.

    సహకరించిన జీజీహెచ్ స్టాఫ్‌నర్సును విచారిస్తున్న పోలీసులు.

    స్టాఫ్ నర్సు సహాయంతో హెచ్ఐవీ రోగి నుంచి బ్లడ్‌ సేకరణ.

    కర్నూలులోని ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న వసుంధర.

  • Jan 25, 2026 12:16 IST

    హైదరాబాద్‌: నాంపల్లి అగ్నిప్రమాదంలో ఐదుగురు మృతి

    • ఐదు మృతదేహాలు వెలికితీసి ఉస్మానియా మార్చురీకి తరలింపు

    • మృతులు: బేబి(45), హబీబ్‌(32), ఇంతియాజ్‌(28), అఖిల్‌(11), ప్రణీత్‌(8)

  • Jan 25, 2026 12:15 IST

    H-1B దరఖాస్తుదారులకు షాక్‌..

    • స్టాంపింగ్‌ ఇంటర్వ్యూలు 2027లోకి మార్పు.

    • కొత్త ఇంటర్వ్యూల స్లాట్లకు కొరతతో ఈ పరిస్థితి.

    • భారతీయ వృత్తి నిపుణులకు అమెరికా ప్రయాణాల్లో జాప్యం.

  • Jan 25, 2026 11:14 IST

    ఢిల్లీ: రిపబ్లిక్‌ డే సందర్భంగా 982 మంది పోలీసులకు అవార్డులు

    • పోలీసులు, ఫైర్‌ సిబ్బంది, హోంగార్డులకు గ్యాలెంటరీ, సర్వీస్‌ మెడల్స్‌.

    • ఆరుగురు CBI అధికారులకు రాష్ట్రపతి అవార్డులు.

    • గణతంత్ర దినోత్సవం సందర్భంగా 25 మందికి పోలీస్‌ మెడల్స్‌.

    పూర్తికథనం

  • Jan 25, 2026 10:46 IST

    అమెరికాలోని పలు ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితి ప్రకటన

    • అమెరికా ప్రజలు సురక్షితంగా ఉండాలని సూచించిన ట్రంప్‌

    • మంచు తుఫాన్‌ దృష్ట్యా అమెరికాలో అత్యవసర పరిస్థితి.

    • జార్జియా, నారత్‌ కరోలినా, మేరీల్యాండ్‌, అర్కాన్సాస్‌, కెంటకీ, లూసియానా, మిసిసిపీ, ఇండియానా, వెస్ట్‌ వర్జీనియాలో అత్యవసర పరిస్థితి.

  • Jan 25, 2026 10:43 IST

    బంగ్లాదేశ్‌: నార్సింగ్డి ఏరియాలో దారుణం

    • మరో హిందూ యువకుడి సజీవదహనం.

    • ఓ దుకాణంపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన అల్లరిమూకలు.

    • దుకాణంలో నిద్రిస్తున్న చంచల్‌ భౌమిక్‌ (23) సజీవదహనం.

    పూర్తికథనం

  • Jan 25, 2026 09:57 IST

    నాంపల్లి అగ్నిప్రమాద ఘటనలో డెడ్‌బాడీల గుర్తింపు

    • ఫర్నీచర్ షాపులో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.

    • మంటల్లో చిక్కుకున్న వారి డెడ్‌బాడీలు గుర్తించిన ఫైర్ సిబ్బంది.

    • ఇప్పటి వరకు రెండు డెడ్‌బాడీలు బయటకు తీసిన ఫైర్ సిబ్బంది.

    • ఉస్మానియా మార్చురీకి తరలింపు.

    పూర్తికథనం

  • Jan 25, 2026 09:40 IST

    గుజరాత్‌లో ఘోర రోడ్డుప్రమాదం

    • ట్రక్కును ఢీకొట్టిన కారు, ఏడుగురు మృతి.

    • మరో ముగ్గురికి తీవ్రగాయాలు, ఆసుపత్రికి తరలింపు.

    • గుజరాత్‌-రాజస్థాన్‌ సరిహద్దులో ప్రమాదం.

    పూర్తికథనం

  • Jan 25, 2026 09:25 IST

    ఇండోనేషియాలో భారీ వర్షాలు, వరదలు

    • జావా ద్వీపంలో విరిగిపడిన మట్టిచరియలు.

    • 8 మంది మృతి, మరో 82 మంది గల్లంతు.

  • Jan 25, 2026 09:22 IST

    మేడారంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

    • ఆదివారం కావడంతో భారీగా పోటెత్తిన భక్తులు.

    • మహాజాతరకు ముందే భక్తుల మొక్కులు చెల్లింపు.

    • 3 లక్షల మందికి పైగా తరలివస్తారని అంచనా.

    • పోలీసుల పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు.

  • Jan 25, 2026 09:20 IST

    యాదగిరిగుట్టలో వైభవంగా రథసప్తమి వేడుకలు

    • సూర్యప్రభ వాహనంపై స్వామివారి ఊరేగింపు

  • Jan 25, 2026 09:19 IST

    విజయవాడ భవానీపురంలోని అగ్నిప్రమాదం

    • ఓ అపార్ట్‌మెంట్‌ ఐదో అంతస్తులో ఏసీ పేలి చెలరేగిన మంటలు.

    • మంటల్లో చిక్కుకున్న వృద్ధులను కాపాడిన భవానీపురం పోలీసులు.

    • మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది.

  • Jan 25, 2026 08:39 IST

    భద్రాద్రి: రెండోరోజు కొత్తగూడెంలో కిషన్‌రెడ్డి పర్యటన

    • సింగరేణి అండర్‌ గ్రౌండ్‌ గని సందర్శించి.. కార్మికులతో చర్చ.

    • సింగరేణి కార్మిక సంఘాలతో ప్రత్యేకంగా సమావేశం కానున్న కిషన్‌రెడ్డి.

    • అనంతరం సింగరేణి ప్రధాన కార్యాలయంలో సమీక్ష.

  • Jan 25, 2026 07:10 IST

    హైదరాబాద్‌: ఫర్నిచర్‌ దుకాణంలో కొనసాగుతున్న సహాయ చర్యలు.

    • చిక్కుకున్న ఐదుగురిని కాపాడేందుకు శ్రమిస్తున్న రెస్క్యూ టీమ్‌.

    • అగ్నిప్రమాదం జరిగిన భవనంలో నిన్నటి నుంచి సహాయ చర్యలు.

    • సహాయ చర్యలకు ఆటంకంగా ఉన్న దట్టమైన పొగ.

    • పొగను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న రెస్క్యూ టీమ్‌.

    • నాంపల్లి నాలుగంతస్తుల భవనంలో నిన్న మధ్యాహ్నం అగ్నిప్రమాదం.

  • Jan 25, 2026 06:58 IST

    శ్రీకాకుళం: భక్తులతో పూజలందుకుంటున్న ఏకైక సూర్య దేవాలయం అరసవల్లి: మంత్రి అచ్చెన్నాయుడు

    • ముఖ్యమంత్రి కి రాష్ట్ర పండగగా ఏర్పాటు చేయమని కోరాం.

    • మేం చెప్పిన వెంటనే.. రాష్ట్ర పండుగగా సీఎం చంద్రబాబు ప్రకటించారు.

    • ఉత్సవాలు రెండు రోజులుగా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి.

    • న భూతో న భవిష్యత్‌గా రథసప్తమి శోభాయాత్ర జరిగింది.

    • గత నెలరోజులుగా అద్బుత ఏర్పాట్లు చేసాం.

    • రథసప్తమి ఆదివారం రావడం అదృష్టం.

  • Jan 25, 2026 06:55 IST

    శ్రీకాకుళం: అరసవల్లి సూర్యనారాయణ స్వామి జయంతి ఉత్సవాలకు అంకురార్పణ.

    • స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి అచ్చెన్నాయుడు దంపతులు.

    • హాజరైన కేంద్రమంత్రి రాంమోహన్ నాయుడు, హోంమంత్రి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాస్.

  • Jan 25, 2026 06:52 IST

    తిరుమల: రథసప్తమి సందర్భంగా సప్త వాహనాలపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న కోనేటిరాయుడు

    • ఇప్పటికే భక్తులతో నిండి.. మాడ వీధుల్లో గ్యాలరీలు.

    • నిన్న సాయంత్రం నుంచి తిరు వీధుల్లో గ్యాలరీలలో వేచి వున్న భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ.

    • ఇవాళ ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనసేవతో వాహనసేవలు ప్రారంభం.

    • రాత్రి 8 గంటలకు జరిగే చంద్రప్రభ వాహనసేవతో ముగియనున్న వాహన సేవలు.