ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు స్పాట్ డెడ్..
ABN , Publish Date - Jan 25 , 2026 | 10:34 AM
గుజరాత్ బనాస్‌కాంతా జిల్లాలో జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
గాంధీనగర్, జనవరి 25: గుజరాత్ బనాస్‌కాంతా జిల్లాలో జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అమీర్‌గఢ్ తాలూకా ఇక్బాల్‌గఢ్ సమీపంలోని పాలన్‌పూర్ - అబు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ట్రక్కు.. అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ఇన్నోవా వాహనాన్ని ఢీ కొట్టింది. దాంతో కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని.. స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను పాలన్‌పూర్ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాద సమయంలో ఇన్నోవా కారులో తొమ్మిది మంది ప్రయాణిస్తున్నారు. వీరంతా రాజస్థాన్‌కు చెందిన వారని పోలీసులు తెలిపారు.
ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ ప్రశాంత్ సుంబే వెల్లడించారు. ఈ ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్ పరారీలో ఉన్నాడని.. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడపడంతోపాటు.. రాంగ్ సైడ్‌లో వాహనం రావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తమ ప్రాథమిక విచారణలో వెల్లడైందని జిల్లా ఎస్పీ వివరించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా ఉర్సులా వాన్ డెర్ లేయన్
నాంపల్లి అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న వారి ఆచూకీ లభ్యం
For More National News And Telugu News