Share News

నాంపల్లి అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న వారి ఆచూకీ లభ్యం

ABN , Publish Date - Jan 25 , 2026 | 10:01 AM

నాంపల్లి ఫర్నిచర్ షోరూంలో జరిగిన అగ్నిప్రమాదంలో చిక్కుకున్న వారి ఆచూకీ లభ్యమైంది. వారిలో ఒకరి మృతదేహాన్ని అగ్నిమాపక సిబ్బంది ఆదివారం గుర్తించింది.

నాంపల్లి అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న వారి ఆచూకీ లభ్యం

హైదరాబాద్, జనవరి 25: నాంపల్లి ఫర్నిచర్ గోదాంలో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న వారంతా మరణించారు. అందులో ఐదుగురి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. బేబీ, నిఖిల్ మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి పోలీసులు తరలించారు. మిగిలిన మూడు మృతదేహాలను తరలించేందుకు పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. వీరిలో ఇద్దరిని పోలీసులు గుర్తించారు. ఇంతియాజ్ (28), హబీబ్‌గా గుర్తించారు. వీరి మృతదేహాలను సైతం ఉస్మానియా ఆసుపత్రికి తరలించనున్నారు. ఈ అగ్నిప్రమాదంలో వీరంతా మరణించడంతో.. వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.


శనివారం నాంపల్లిలోని ఫర్నిచర్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నాలుగు అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఫైరింజిన్ల సాయంతో మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది నిన్నటి నుంచి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మొత్తం ఆరుగురు చిక్కుకున్నారు. సెల్లారులోని వాచ్‌మెన్ కుటుంబంలోని ఇద్దరు పిల్లలు, మరో కుటుంబంలోని నలుగురు చిక్కుకున్నారు. వారి జాడ కోసం పోలీసులు వెతికారు. అలా ఐదు మృతదేహాలను గుర్తించారు. అయితే రెస్క్యూ ఆపరేషన్‌కు పొగ, వేడి అడ్డంకిగా మారింది. మరోవైపు బిల్డింగ్ ముందు భాగాన్ని పోలీసులు తవ్వించారు. ముందు భాగంలో తవ్వడం ద్వారా సెల్లార్‌లోకి వెళ్లడానికి పోలీసులు రూట్ క్లియర్ చేసిన విషయం విదితమే.


ఈ వార్తలు కూడా చదవండి..

రథసప్తమి రోజు.. ఇలా చేస్తే..

ఆదివారం.. రథసప్తమి రావడం అదృష్టం: మంత్రి అచ్చెన్నాయుడు

For More TG News And Telugu News

Updated Date - Jan 25 , 2026 | 11:32 AM