గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా ఉర్సులా వాన్ డెర్ లేయన్
ABN , Publish Date - Jan 25 , 2026 | 09:18 AM
77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశ రాజధాని న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్ ముస్తాబు అయింది. సోమవారం జరిగే ఈ వేడుకల్లో ముఖ్య అతిథి ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు.
న్యూఢిల్లీ, జనవరి 25: భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం జరగనున్నాయి. ఈ వేడుకల్లో యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్‌తోపాటు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో లూయిస్ శాంటోస్ డా కోస్టా ముఖ్య అతిథులుగా పాల్గొనున్నారు. ఇప్పటికే వీరు భారత్ చేరుకున్నారు. న్యూఢిల్లీ ఎయిర్ పోర్టులో వీరికి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద ఘన స్వాగతం పలికారు. జనవరి 27న జరగనున్న16వ భారత్, ఈయూ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీతో కలిసి వీరు పాల్గొననున్నారు. భారత పర్యటనలో భాగంగా వీరు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం కానున్నారు. మరోవైపు ఈ గణతంత్ర వేడుకలకు ఢిల్లీలోని కర్తవ్య పథ్ ఇప్పటికే ముస్తాబు అయింది.
ప్రతి ఏటా జనవరి 26వ తేదీన దేశ రాజధాని న్యూఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఏదో ఒక దేశానికి చెందిన ప్రముఖులు హాజరవుతూ వస్తున్న విషయం విదితమే. 2015 నుంచి ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన ప్రముఖులను ఒకసారి పరిశీలిస్తే..
2015లో జరిగిన గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పాల్గొన్నారు. ఆయన ఈ పర్యటనతో భారత్, అమెరికా వ్యూహాత్మక మైత్రిని మరింత బలోపేతం చేసింది.
2016లో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ విచ్చేశారు. ఈ పర్యటన సందర్భంగా రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించిన రక్షణ ఒప్పందాలు.. ఇరు దేశాల మధ్య జరిగాయి.
2017లో అబుదాబి ప్రిన్స్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ హాజరయ్యారు. భారత్, గల్ఫ్ దేశాల మధ్య ఆర్థిక, ఇంధన రంగాలతోపాటు పరస్పర పెట్టుబడులతో సంబంధాలు బలపడ్డాయి.
2018లో ఆసియన్‌లో సభ్య దేశాల అధినేతలు ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఇండో - పసిఫిక్‌పై వారంతా దృష్టి సారించారు.
2019లో దక్షిణాఫ్రికా దేశాధ్యక్షుడు సిరిల్ రామఫోసా హాజరయ్యారు. 2020లో బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో ఈ గణతంత్ర వేడుకలకు విచ్చేశారు.
2021, 2022లో కోవిడ్ విజృంభించింది. ఈ నేపథ్యంలో గణతంత్ర వేడుకలు నిర్వహించ లేదు. ముఖ్య అతిథిగా ఏ దేశాధినేత హాజరు కాలేదు.
2023లో ఈజిప్టు దేశాధ్యక్షుడు అబ్దేల్ ఫత్తా హాజరయ్యారు. 2024లో ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య మరోసారి కీలక ఒప్పందాలు జరిగాయి.
2025లో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో వచ్చారు. దీంతో భారత్, ఇండోనేషియాలో మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ఎయిరిండియాకు రూ.1,100 కోట్లు..
అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాను.. స్థంభించిన జన జీవనం.. వేల విమాన సర్వీసులు రద్దు..
For More National News And Telugu News