గణతంత్ర దినోత్సవం..982 మంది పోలీసులకు అవార్డులు
ABN , Publish Date - Jan 25 , 2026 | 10:46 AM
గణతంత్ర దినోత్సవం సందర్భంగా 982 మంది పోలీసులకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. పోలీసులు, ఫైర్ సిబ్బంది, హోంగార్డులు గ్యాలెంటరీ, సర్వీస్ మెడల్స్ అందుకోనున్నారు. అలానే రాష్ట్రపతి అవార్డులకు ఆరుగురు సీబీఐ అధికారులు ఎంపికయ్యారు.
ఢిల్లీ, జనవరి 25: రిపబ్లిక్ డే(Republic Day 2026) సందర్భంగా 982 మంది పోలీసులకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. పోలీసులు, ఫైర్ సిబ్బంది, హోంగార్డులు గ్యాలెంటరీ, సర్వీస్ మెడల్స్ పొందారు. అలానే రాష్ట్రపతి అవార్డులకు( President Police Medal 2026) ఆరుగురు సీబీఐ అధికారులు ఎంపికయ్యారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా 25 మందికి పోలీస్ మెడల్స్ అందుకోనున్నారు. హెడ్ కానిస్టేబుల్ మర్రి వెంకట్‌రెడ్డి(తెలంగాణ) గ్యాలెంటరీ అవార్డుకు ఎంపికయ్యారు. అలానే ఏఎస్పీ ఆర్.ఎం.కె.తిరుమలాచారి(ఏపీ)కి ప్రెసిడెంట్ మెడల్, అదనపు ఎస్పీ జి.ఎస్. ప్రకాష్‌రావు(తెలంగాణ) ప్రెసిడెంట్ మెడల్ పొందారు.
తెలంగాణ నుంచి ఎస్ఐ దామోదర్‌రెడ్డికి ప్రెసిడెంట్ మెడల్(పీఎస్‌ఎం) దక్కింది. అలానే మెడల్ ఫర్ మెరిటోరియస్ విభాగంలో 12 మంది ఎంపికయ్యారు. ఐజీ సుమతికి మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ అవార్డు లభించింది. ఎంఎస్‌ఎం ఫైర్ విభాగంలో ముగ్గురికి అవార్డులు దక్కాయి. ఎంఎస్‌ఎం హోంగార్డు, సివిల్ డిఫెన్స్ విభాగంలో ముగ్గురు, ఎంఎస్‌ఎం కరెక్షనల్ సర్వీస్ విభాగం ఇద్దరు అవార్డులకు ఎంపికయ్యారు. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంఎస్‌ఎం కరెక్షనల్ సర్వీస్ విభాగంలో ముగ్గురు, మెడల్ ఫర్ మెరిటోరియస్ విభాగంలో 15 మంది అవార్డు అందుకోనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ఎయిరిండియాకు రూ.1,100 కోట్లు..
అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాను.. స్థంభించిన జన జీవనం.. వేల విమాన సర్వీసులు రద్దు..