-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National International Live Updates of 25th May 2026
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - May 26 , 2026 | 07:21 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
May 26, 2026 21:54 IST
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
ప్రతి నెలా మొదటి తారీఖునే జీతాలు అందేలా చర్యలు: సీఎం రేవంత్‌రెడ్డి
జీతాల చెల్లింపునకు ప్రతి నెలా రూ.50 కోట్ల మంజూరు: సీఎం రేవంత్‌రెడ్డి
సిబ్బంది జీతాల చెల్లింపులో ఆలస్యమైతే చర్యలు: సీఎం రేవంత్‌రెడ్డి
-
May 26, 2026 21:30 IST
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
ప్రొఫెసర్ నాగేశ్వర్ రాజకీయ విశ్లేషణలకు అర్థం లేదు: పవన్
ఆయన పొరపాటున భావోద్వేగంతో మాట్లాడి ఉండొచ్చు: పవన్
నాగేశ్వర్‌పై కేసులు పెడితే.. వదిలేయమని చెప్పా: పవన్
మన పోరాటం నిర్మాణాత్మకంగా ఉండాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
May 26, 2026 21:21 IST
IPL: గుజరాత్ టైటాన్స్ టార్గెట్ 255
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 254/5
RCB బ్యాటింగ్: రజత్ పటిదార్ 93 నాటౌట్
-
May 26, 2026 21:21 IST
అమరావతి: మెగా DSCపై దుష్ప్రచారం చేస్తే క్రిమినల్ చర్యలు: ఏపీ ప్రభుత్వం
పారదర్శకంగా 15,941 పోస్టుల భర్తీ: ఏపీ పాఠశాల విద్యా శాఖ
నిరాధార ఆరోపణలపై పరువు నష్టం నోటీసులు, కేసుల నమోదు
ప్రభుత్వం చేపట్టే నియామక ప్రక్రియల్లో పారదర్శకత, ప్రతిభ ఆధారంగా ఎంపిక: ఏపీ ప్రభుత్వం
-
May 26, 2026 20:50 IST
నెల్లూరు: ఆత్మకూరు, మర్రిపాడు, అనంతసాగరం మండలాల్లో భారీ వర్షం
భారీ ఈదురు గాలులకు విరిగిపడ్డ చెట్లు, విద్యుత్ స్తంభాలు
విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం
-
May 26, 2026 20:37 IST
తమిళనాడు: మధురైలోని ఉసిలంపట్టిలో విషాద ఘటన
చెట్టుపై పిడుగు పడడంతో ముగ్గురు మహిళల మృతి.. మరో మహిళకు గాయాలు
పొలంలో పనులు చేస్తుండగా కురిసిన భారీ వర్షం
వర్షంలో తడవకుండా ఉండేందుకు చెట్టు కిందకు వెళ్లిన మహిళలు
-
May 26, 2026 20:09 IST
ఏఐతో తక్కువ వ్యయంతో నాణ్యమైన వైద్య సేవలు: మంత్రి సత్యకుమార్ యాదవ్
వ్యాధుల భారాన్ని తగ్గించడంలో 'ఏఐ'దే కీలకపాత్ర: మంత్రి సత్యకుమార్ యాదవ్
వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ సాధనలోనూ తోడ్పాటు
మెడ్ టెక్ ఛాలెంజ్ ద్వారా 'లైట్ హౌస్'గా నిలిచిన ఏపీ: మంత్రి సత్యకుమార్ యాదవ్
'ఆరోగ్య వ్యవస్థ-ఏఐ ఆధారిత సేవలు 'ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి
-
May 26, 2026 20:06 IST
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌తో ముగిసిన సినీ నిర్మాతల భేటీ
'పెద్ది' సినిమా విడుదలకు ఇబ్బందులు లేవు: నిర్మాతలు
సినీ పరిశ్రమ సమస్యలు త్వరలో పరిష్కారం: నిర్మాతలు
పరిస్థితిని వివరించడానికే పవన్‌తో సమావేశం: నిర్మాతలు
అందరికీ న్యాయం చేస్తామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు: నిర్మాతలు
-
May 26, 2026 20:05 IST
తెలంగాణలో ఎబోలా కేసులు నమోదు కాలేదు: మంత్రి దామోదర
ఎబోలా అంశంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: మంత్రి దామోదర
గాంధీ హాస్పిటల్లో ఐసోలేషన్ వార్డు
ఎబోలా విషయంలో ప్రభుత్వం అప్రమత్తం: మంత్రి దామోదర
-
May 26, 2026 19:35 IST
కృష్ణా: భావదేవరపల్లిలో అగ్నిప్రమాదం
పాత ONGC డ్రిల్లింగ్ పాయింట్ దగ్గర చెలరేగిన మంటలు
పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ
మంటలు ఆర్పేందుకు ONGC అధికారుల యత్నం
-
May 26, 2026 19:08 IST
ఐపీఎల్ 2026: టాస్ నెగ్గిన గుజరాత్ టైటాన్స్
టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్
తొలుత బ్యాటింగ్ చేయనున్న ఆర్సీబీ
ధర్మశాల వేదికగా మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం
-
May 26, 2026 19:03 IST
ఖమ్మం: పెనుబల్లి మండలం సీతారామపురంలో ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం
బ్రేక్ ఫెయిల్ అయి రోడ్డు పక్కకు దూసుకెళ్లిన బస్సు
ప్రమాద సమయంలో బస్సులో 56 మంది ప్రయాణికులు
సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు
సత్తుపల్లి నుంచి ఖమ్మంకు వెళ్తుండగా జరిగిన ప్రమాదం
-
May 26, 2026 18:56 IST
అన్నమయ్య: మొలకలచెరువు మండలం ఉచ్చోళ్లపల్లిలో విషాదం
చెరువులో దుస్తులు ఉతకడానికి వెళ్లి బాలిక నందిని (15) మృతి
-
May 26, 2026 18:55 IST
తూ.గో.: కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం
ఫ్యాక్టరీ గోడను ఢీకొన్న కారు, నలుగురి మృతి
మరో ఐదుగురికి తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు
-
May 26, 2026 18:55 IST
అమరావతి: వ్యవసాయ అనుబంధ రంగాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
రాష్ట్రంలో ఫార్మ్ టూ హోమ్ విధానం: సీఎం చంద్రబాబు
వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌పై కొత్త వ్యూహం
దేవరపల్లి మండలం యడవోలు దగ్గర కోకో సిటీ
జులైలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన
పులివెందులలో ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ పూర్తికి నిధుల మంజూరు: సీఎం చంద్రబాబు
-
May 26, 2026 18:53 IST
పల్నాడు జిల్లా: సత్తెనపల్లి సబ్ జైలు నుంచి జీవిత ఖైదీ పరారీ
సబ్ జైల్లోని పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న శ్రీనివాసరావు
నిన్న సాయంత్రం డ్యూటీ నుంచి పరారైన ఖైదీ
గుంటూరులో జరిగిన హత్య కేసులో శ్రీనివాసరావు ముద్దాయి
స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన జైలు సూపరింటెండెంట్ వెంకటరత్నం
ముద్దాయి కోసం గాలిస్తున్న పోలీసులు
-
May 26, 2026 18:29 IST
ప్రకాశం : కొండపి మండలంలో ఈదురు గాలులతో కూడిన వర్షం
ఈదురుగాలులకు విరిగిపడిన చెట్లు
కొండపి - టంగుటూరు మధ్య నిలిచిన వాహనాల రాకపోకలు
-
May 26, 2026 18:25 IST
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక్కసారిగా మారిన వాతావరణం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో ఈదురు గాలులతో కూడిన వర్షం
చిట్యాల మండలం శాంతినగర్‌లో వగడళ్ల వాన.. కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యం
పరకాలలో వడగళ్ల వాన.. అకాల వర్షంతో ఆందోళనలో రైతులు
-
May 26, 2026 18:23 IST
బెంగళూరులో భారీ వర్షం
ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం
భారీ ఈదురు గాలులకు విరిగిపడ్డ చెట్లు, హోర్డింగ్స్
రోడ్లుపై నీరు చేరడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్
-
May 26, 2026 18:17 IST
హైదరాబాద్: పోక్సో కేసులో బండి భగీరథ్‌కు పోలీస్ కస్టడీ
3 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చిన మేడ్చల్ కోర్టు
-
May 26, 2026 17:59 IST
నెల్లూరు: నాయుడుపేట మండలం కారుమంచి వారి కండ్రిగ గ్రామంలో విషాదం
పిడుగుపాటుకు యశ్వంత్(22) అనే యువకుడి మృతి
గ్రామ శివారులలో క్రికెట్ ఆడుతుండగా ఘటన
-
May 26, 2026 17:53 IST
కర్ణాటకలో సీఎం మార్పులేదు: కేసీ వేణుగోపాల్
సీఎం మార్పుపై అన్నీ ఊహాగానాలే: కేసీ వేణుగోపాల్
రాజ్యసభ ఎన్నికలపైనే చర్చ: కేసీ వేణుగోపాల్
-
May 26, 2026 17:49 IST
రూ.7వేల కోట్లతో గోదావరి ఫేజ్-2, 4 పనులు: మంత్రి పొన్నం ప్రభాకర్
BRS పాలనలో హైదరాబాద్‌కు నీటి భవిష్యత్ గురించి పట్టించుకోలేదు: మంత్రి పొన్నం
భవిష్యత్‌లో కృష్ణా ఫేజ్-4, 5 అమలుచేస్తాం: మంత్రి పొన్నం
వాటర్ హార్వెస్టింగ్ చేయకుండా ట్యాంకర్లు బుక్ చేసుకుంటే డబుల్ రేట్లు వసూలు చేస్తాం: మంత్రి పొన్నం
-
May 26, 2026 17:47 IST
చెన్నై: AIADMKలో మరో కీలక పరిణామం
TVK పార్టీలో చేరిన AIADMK ఎమ్మెల్యే సుబ్బయ్య
మంత్రులు ఆనంద్, సెంగొట్టెయన్ సమక్షంలో చేరిక
-
May 26, 2026 17:47 IST
కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం
చొరబాట్లు, అక్రమ వలసలపై కేంద్రం ఉక్కుపాదం
డెమోగ్రాఫిక్ మార్పుపై అత్యున్నత స్థాయి కమిటీ
రిటైర్డ్ జస్టిస్ నావలేకర్ అధ్యక్షతన కమిటీ
కమిటీలో సభ్యులుగా దుర్గా శంకర్ మిశ్రా, బాలాజీ, డా. షమిక రవి
-
May 26, 2026 17:46 IST
మహారాష్ట్రలో రోడ్డెక్కిన ఉల్లి రైతులు
ముంబై-ఆగ్రా హైవేను దిగ్బంధించిన ఉల్లి రైతులు
ఉల్లికి మద్దతు ధర కల్పించాలని రైతుల డిమాండ్
విపక్షాల నేతృత్వంలో ఉల్లి రైతుల ఆందోళన
-
May 26, 2026 17:44 IST
PM-WANI అమలుపై కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష
PM-WANI అమలును సులభతరం చేసేందుకు కీలక నిర్ణయాలు
ప్రతి పౌరుడికీ Wi-Fi లక్ష్యంగా PM-WANI సేవలు: పెమ్మసాని
15, 30, 60 నిమిషాల ఇంటర్నెట్ వినియోగ ప్లాన్లు: పెమ్మసాని
-
May 26, 2026 16:44 IST
అమరావతి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌తో సినీ నిర్మాతల భేటీ
హాజరైన నాగవంశీ, రవిశంకర్, కిలారి సతీష్
-
May 26, 2026 16:42 IST
కడప: ప్రొద్దుటూరులో ఉద్రిక్తత
ప్రొద్దుటూరులోని SS మాల్‌ను పరిశీలించిన టీడీపీ నేత ప్రవీణ్
MLA వరదరాజుల రెడ్డి వర్గం, ప్రవీణ్ మధ్య విభేదాలు
ప్రవీణ్‌ను ఇంటికి తరలించిన పోలీసులు
ప్రవీణ్ ఇంటిపై దాడికి ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి వర్గం యత్నం
-
May 26, 2026 16:20 IST
ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు
మాజీ MLA చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుటుంబానికి ఈడీ నోటీసు
విచారణకు హాజరైన చెవిరెడ్డి భార్య, కుమారుడు
చెవిరెడ్డి భార్య పేరుపై భారీఎత్తున లావాదేవీలు జరిగినట్లు గుర్తింపు
-
May 26, 2026 16:18 IST
పాస్‌పోర్ట్ సేవా సర్వీసులకు ఎల్లుండి (మే 28) సెలవు
మే 27 నుంచి 28కి మారిన బక్రీద్ సెలవు
రేపు యథావిధిగా పనిచేయనున్న పాస్‌పోర్ట్ ఆఫీసులు
28న స్లాట్‌లు బుక్ చేసుకున్నవారికి రేపు ఆఫీసుల్లో సేవలు
-
May 26, 2026 16:02 IST
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ 470, నిఫ్టీ 110 పాయింట్ల నష్టం
-
May 26, 2026 15:47 IST
ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో మార్పులు
వైద్య ఆరోగ్యశాఖ DMEగా డాక్టర్ విష్ణువర్ధన్
పదోన్నతి పొందిన 15 మంది ADMEలకు పోస్టింగ్‌లు
నలుగురు కొత్త ప్రిన్సిపాల్స్, 9మంది కొత్త సూపరింటెండెంట్ల నియామకం
విజయవాడ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్ రఘునందన్
కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌గా డాక్టర్ పి.ఉషాకిరణ్
-
May 26, 2026 15:46 IST
చెన్నై: రేపు ఢిల్లీకి తమిళనాడు సీఎం విజయ్
సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీ పర్యటన
ప్రధాని మోదీతో పాటూ సోనియాగాంధీని కలిసే అవకాశం
-
May 26, 2026 15:45 IST
హైదరాబాద్: డీజీపీ సీవీ ఆనంద్ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు నరహరి దంపతులు
పసునూరి నరహరికి రూ.25 లక్షలు, ధనమ్మకు రూ.20 లక్షల చెక్ అందజేసిన డీజీపీ
-
May 26, 2026 14:59 IST
హైదరాబాద్: శామీర్‌పేట్ MRO ఆఫీస్‌లో ACB అధికారుల దాడులు
MRO సుచరిత డ్రైవర్ డబ్బులు వసూలుచేసి, ఆమెకు ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు
MRO, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న ACB అధికారులు
-
May 26, 2026 14:58 IST
రైలు ఢీకొని.. 19 గొర్రెల మృతి
కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోనీ అడ్లూరు శివారులో ప్రమాదం
రైలు ఢీకొని 19 గొర్రెల మృతి
గొర్రెలను పట్టాలు దాటిస్తుండగా ప్రమాదం
-
May 26, 2026 14:30 IST
హైదరాబాద్‌లో మరో కొత్త GCC కేంద్రం
రీజెనరాన్ తొలి విదేశీ GCCకి తెలంగాణ ఎంపిక
మంత్రి శ్రీధర్ బాబుతో రీజెనరాన్ ప్రతినిధుల భేటీ
హైదరాబాద్‌ను గ్లోబల్ హబ్‌గా అభివృద్ధి చేయనున్న రీజెనరాన్
-
May 26, 2026 13:45 IST
పులివెందులలో రాజారెడ్డి అరాచకం సృష్టించారు: ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి
అధికారం కోసం హత్యలు చేసిన చరిత్ర వైఎస్ కుటుంబానిది: రాంగోపాల్ రెడ్డి
అధికారం కోసం హత్యలు.. ఆధిపత్యం కోసం కుట్రలు చేశారు: రాంగోపాల్ రెడ్డి
గనుల కోసం ఎంతోమందిని చంపేశారు: రాంగోపాల్‌రెడ్డి
-
May 26, 2026 13:36 IST
జమ్మూకశ్మీర్: సాంబాలో భారీగా పేలుడు పదార్థాలు పట్టివేత
సెర్చ్ ఆపరేషన్‌లో బయటపడ్డ బాంబులు, ఆయుధాలు
భారీగా గ్రెనేడ్లు, మోర్టార్ ఫిన్స్ స్వాధీనం
డ్రోన్ల ద్వారా జారవిడిచినట్టుగా భద్రతా దళాల అనుమానం
సరిహద్దు ప్రాంతాల్లో హైఅలర్ట్, విస్తృత తనిఖీలు
-
May 26, 2026 13:29 IST
అమరావతి: ఈసారి మహానాడు గిన్నిస్ బుక్‌లో ఎక్కబోతోంది: పల్లా శ్రీనివాసరావు
1,870 క్లస్టర్లలో ఒకేసారి కార్యక్రమం నిర్వహించడం రికార్డుగా నిలవబోతోంది: పల్లా
అభివృద్ధి, సంక్షేమానికి వైసీపీ అడ్డుపడటం, రాజధాని, పోలవరంపై వైసీపీ హయాంలో చేసిన అరాచకాలపై చర్చిస్తాం: పల్లా
వైసీపీ తీరును ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మాపై ఉంది: పల్లా
మహానాడులో రాజకీయ తీర్మానం కూడా ఉంటుంది: పల్లా
-
May 26, 2026 13:28 IST
హైదరాబాద్: ఎంజీబీఎస్‌లో అగ్ని ప్రమాదం
గద్వాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు
భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు
మంటలనార్పిన అగ్నిమాపక సిబ్బంది
-
May 26, 2026 12:49 IST
అదిరిపోయే ఫీచర్స్‌తో ఆధార్ కొత్త యాప్
ఆధార్ కొత్త యాప్‌ను తీసుకొచ్చిన UIDAI
పాత యాప్ త్వరలో నిలిపివేయనున్నట్లు ప్రకటన
ఆధార్ ఎక్స్ ఖాతా వేదికగా వివరాలు వెల్లడి
-
May 26, 2026 12:26 IST
అమరావతి: లేపాక్షి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్
ఉద్యోగులకు జీతాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం
ప్రస్తుతం ఇస్తున్న మూల వేతనంపై 10 శాతం పైగా పెంపు
2025-26లో రూ.60.75 కోట్లకు పెరిగిన అమ్మకాలు
-
May 26, 2026 12:11 IST
జగన్‌ది ముమ్మాటికీ గొడ్డలి పార్టీనే: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
జగన్ పాలనలో జరిగిన హత్యలను ఆధారాలతో నిరూపిస్తాం: మంత్రి
జగన్ అరాచకాలను ప్రజలు భరించలేకే 151 నుంచి 11 సీట్లు ఇచ్చారు: మంత్రి
బెదిరించే స్వభావంతోనే జగన్ మాట్లాడుతున్నారు: మంత్రి
-
May 26, 2026 12:10 IST
నటి త్విశా శర్మ కేసులో సీబీఐ దర్యాప్తు ప్రారంభం
సమర్థ్ సింగ్, గిరిబాలా సింగ్‌పై ఎఫ్ఐఆర్ రీరిజిస్టర్
సమర్థ్‌ను 10 గంటలపాటు విచారించిన సీబీఐ అధికారులు
త్విశాకు బైపోలార్ డిజార్డర్ ఉందని చెప్పిన సమర్థ్
-
May 26, 2026 12:06 IST
హైదరాబాద్: ఎబోలా ఎఫెక్ట్.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హైఅలర్ట్
ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తం
శంషాబాద్ విమానాశ్రయంలో ముందుజాగ్రత్త చర్యలు చేపట్టిన అధికారులు
వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్న అధికారులు
-
May 26, 2026 11:57 IST
ఏపీ ఎడ్‌సెట్-2026 ఫలితాలు విడుదల
ఎడ్‌సెట్‌లో 99.30 శాతం ఉత్తీర్ణత నమోదు
ఈఏడాది ఎడ్‌సెట్‌కు 19,880 మంది హాజరు
19,741 మంది అభ్యర్థులు అర్హత సాధించారు
-
May 26, 2026 11:56 IST
అనంతపురం జిల్లా కోర్టు వద్ద వైసీపీ శ్రేణుల హల్‌చల్
జై జగన్.. జై తోపుదుర్తి అంటూ నినాదాలు
పోలీసులను తోసుకుంటూ కోర్టు హాల్‌లోకి వెళ్లేందుకు యత్నం
అడ్డుకున్న పోలీసులతో వైసీపీ శ్రేణుల వాగ్వాదం
-
May 26, 2026 11:55 IST
విశాఖ: రుషికొండ సెబెల్ టవర్స్‌లో ACB సోదాలు
చిన్నప్పన్న ఆస్తులపై కొనుసాగుతున్న తనిఖీలు
పలు కీలక డాక్యుమెంట్లు పరిశీలిస్తున్న ACB బృందం
ఫ్లాట్లు, ఆర్థిక లావాదేవీలపై ACB ఆరా
కీలక ఆధారాలు లభించినట్టు సమాచారం
-
May 26, 2026 11:41 IST
హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో భారీ చోరీ
రోడ్ నెంబర్ 33లోని ఓ ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో చోరీ
రంగంలోకి దిగిన క్లూస్ టీమ్స్, జూబ్లీహిల్స్ పోలీసులు
పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది
-
May 26, 2026 11:22 IST
తూ.గో.: మంత్రి కందుల దుర్గేష్‌పై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్
పర్యావరణ మంత్రిగా గోదావరి కాలుష్యం కాకుండా చూడాల్సిన బాధ్యత మీది కాదా? అంటూ మండిపాటు
పుష్కరాల రేవును అందంగా తీర్చిదిద్దితే సరిపోతుందా? అని ఆగ్రహం
రాజమండ్రి పేపర్ మిల్లుతో రోజూ యుద్ధాలు చేస్తున్నామని పవన్ కల్యాణ్‌కు వివరణ ఇచ్చిన మంత్రి కందుల దుర్గేష్
-
May 26, 2026 11:20 IST
ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై బస్సు బోల్తా
ఆరుగురి మృతి, మరో 21 మందికి తీవ్రగాయాలు
-
May 26, 2026 11:20 IST
నెల్లూరు డీలిమిటేషన్ ప్రక్రియలో నా జోక్యం లేదు: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
మాకు కూడా కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి: కోటంరెడ్డి
నెల్లూరు డీలిమిటేషన్‌పై వైసీపీ నిరాధార ఆరోపణలు చేస్తోంది: కోటంరెడ్డి
నెల్లూరు డీలిమిటేషన్ ప్రక్రియలో అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం: కోటంరెడ్డి
నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అధికారులకు చెప్పాం: కోటంరెడ్డి
-
May 26, 2026 11:20 IST
అనంతపురం: తోపుదుర్తి రాజారెడ్డి బెదిరింపులతోనే మహేశ్వర్‌రెడ్డి ఆత్మహత్య: రూరల్ డీఎస్పీ
బెదిరింపులకు సంబంధించిన ఆడియో, వీడియోలు ఉన్నాయి: డీఎస్పీ
మహేశ్వర్‌రెడ్డి ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాం: డీఎస్పీ శ్రీనివాసులు
-
May 26, 2026 11:20 IST
అనంతపురం: తోపుదుర్తి మహేశ్వర్‌రెడ్డి మృతి కేసులో కీలక మలుపు
అనుమానాస్పద మృతి కేసును హత్య కేసుగా మార్చిన పోలీసులు
తోపుదుర్తి రాజారెడ్డి, జైపాల్‌రెడ్డిని కోర్టులో హాజరుపర్చిన పోలీసులు
ఇద్దరికి 14 రోజుల రిమాండ్ విధించిన మేజిస్ట్రేట్
రాప్తాడు మాజీ MLA ప్రకాశ్‌రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజారెడ్డి
-
May 26, 2026 10:20 IST
ఎన్టీఆర్: మైలవరంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పర్యటన
ఈదురు గాలులతో పంట నష్టపోయిన బాధితులను పరామర్శించి భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే
జరిగిన నష్టాన్ని కలెక్టర్‌కు ఫోన్‌లో వివరించిన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్
బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది: ఎమ్మెల్యే
నష్టపోయిన ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తాం: ఎమ్మెల్యే
-
May 26, 2026 10:19 IST
విశాఖ: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చిన్నప్పన్న అరెస్ట్
జూన్ 8 వరకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు
2019-2024 మధ్య భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్టు గుర్తింపు
విశాఖ, విజయనగరం, రాజమండ్రి, తాడేపల్లి, విజయవాడలో ACB తనిఖీలు
అక్రమాస్తుల విలువ రూ.30కోట్ల వరకు ఉంటుందని అంచనా
ఢిల్లీ ఏపీ భవన్‌లో స్పెషల్ అధికారిగా పనిచేసిన చిన్నప్పన్న
-
May 26, 2026 10:18 IST
నల్లగొండ: మూసీ ప్రాజెక్ట్ నుంచి వృథాగా పోతున్న నీరు
కుడి కాలువ గేటు ఊడిపోవడంతో భారీగా లీకవుతున్న వరద నీరు
నెల రోజులు గడుస్తున్నా మరమ్మతులు చేపట్టని వైనం
-
May 26, 2026 10:18 IST
హైదరాబాద్: మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు నరహరి లొంగుబాటు
పోలీసుల ఎదుట లొంగిపోయిన నరహరి, ఆయన భార్య
40 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న పసూనూరి నరహరి
మావోయిస్టు సెంట్రల్ కమిటీలో మిగిలింది ఇద్దరే: డీజీపీ
ప్రస్తుతం అజ్ఞాతంలో వార్త శేఖర్, గణపతి: డీజీపీ సీవీ ఆనంద్
-
May 26, 2026 09:46 IST
స్వల్ప లాభాల్లో దేశీయ సూచీలు
99 పాయింట్ల లాభంతో సెన్సెక్స్
37 పాయింట్లు ఆర్జించిన నిఫ్టీ
డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 95.39
-
May 26, 2026 09:45 IST
అమరావతి: గన్నవరం విమానాశ్రయంలో ఎబోలా వైరస్ స్క్రీనింగ్ పరీక్షలు
ఆఫ్రికాలో పెరుగుతున్న ఎబోలా వైరస్ కేసులు
గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎబోలా వైరస్ స్క్రీనింగ్ పరీక్షా కేంద్రం ఏర్పాటు
విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు పరీక్షలు నిర్వహిస్తున్న అధికారులు
-
May 26, 2026 09:39 IST
ఢిల్లీ: ప్రారంభమైన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం
భారత్, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా విదేశాంగ మంత్రుల హాజరు
-
May 26, 2026 09:33 IST
నిజామాబాద్: బిచ్కుంద మండలం షెట్లూర్ గ్రామంలో ఇసుక వివాదం
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఇసుక తరలిస్తుండగా ట్రాక్టర్లను అడ్డుకున్న పోలీసులు
పోలీసులతో వాగ్వాదానికి దిగిన గ్రామస్తులు
ఒంటిపై పెట్రోల్ పోసుకొని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
కాపాడిన పోలీసులు, తప్పిన ప్రాణాపాయం
-
May 26, 2026 09:30 IST
కర్నూలు: ఎమ్మిగనూరు జుబేదా ఫంక్షన్ హాల్ దగ్గర కోడిగుడ్ల ట్రాలీ ఆటో బోల్తా
డ్రైవర్‌కు స్వల్ప గాయాలు, ఆస్పత్రికి తరలింపు
రోడ్డుపాలైన రూ.2లక్షల విలువైన కోడిగుడ్లు
-
May 26, 2026 09:29 IST
తూర్పుగోదావరి: జిల్లాలో రెండో రోజు డిప్యూటీ సీఎం పవన్ పర్యటన
రాజమండ్రి రూరల్ వెంకట్ నగరం గ్రామంలో పేపర్ మిల్లు వ్యర్థ జలాలు కలుస్తున్న ప్రాంతాలను పరిశీలించిన పవన్ కళ్యాణ్.
మత్స్యకారుల సమస్యలను అడిగి తెలుసుకున్న పవన్.
-
May 26, 2026 09:02 IST
అనంతపురం: తోపుదుర్తి రాజారెడ్డి బెదిరింపులతోనే మహేశ్వర్‌రెడ్డి ఆత్మహత్య: రూరల్ డీఎస్పీ
బెదిరింపులకు సంబంధించిన ఆడియో, వీడియోలు ఉన్నాయి: డీఎస్పీ
మహేశ్వర్‌రెడ్డి ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాం: డీఎస్పీ శ్రీనివాసులు
తోపుదుర్తి రాజారెడ్డితో పాటు జయపాల్‌రెడ్డిని కూడా అరెస్ట్ చేశాం: డీఎస్పీ
-
May 26, 2026 09:02 IST
అనంతపురం: రాప్తాడు మాజీ MLA ప్రకాశ్‌రెడ్డి సోదరుడు అరెస్ట్
అనంతపురం రూరల్ పీఎస్‌కు తోపుదుర్తి రాజారెడ్డి తరలింపు
గతేడాది అనుమానాస్పద స్థితిలో తోపుదుర్తి మహేశ్వర్‌రెడ్డి మృతి
మహేశ్వర్‌రెడ్డిని తోపుదుర్తి సోదరులే హత్య చేశారని ఆరోపణలు
తోపుదుర్తి రాజారెడ్డిపై పోలీసులకు మహేశ్వర్‌రెడ్డి తండ్రి ఫిర్యాదు
-
May 26, 2026 08:43 IST
భూదాన్ భూముల కేసులో తెరపైకి నౌహీరా షేక్ పేరు
నిషేధిత భూములను నౌహీరా షేక్ అనుచరులకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినందుకే IAS అమోయ్ విచారణ
నిన్న 9 గంటల పాటు అమోయ్‌కుమార్‌ను ప్రశ్నించిన ఈడీ
ఇప్పటికే నౌహీరాకు సంబంధించిన పలు ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ
-
May 26, 2026 07:46 IST
నేడు IPL క్వాలిఫయర్-1 మ్యాచ్
బెంగళూరుతో తలపడనున్న గుజరాత్
ధర్మశాలలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్
-
May 26, 2026 07:45 IST
హైదరాబాద్: రాష్ట్రంలో మరో 3 రోజులపాటు కొసాగనున్న ఎండల తీవ్రత
ములుగు, భద్రాద్రి, ఖమ్మం, భూపాలపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్
పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
-
May 26, 2026 07:35 IST
ఇరాన్‌పై మరోసారి అమెరికా సైన్యం దాడులు
ఇరాన్ మిస్సైల్స్ సైట్స్, బోట్స్ లక్ష్యంగా దాడులు
ఆత్మరక్షణ కోసమే ఇరాన్‌పై దాడులు చేసినట్టు US ప్రకటన
హోర్ముజ్ జలసంధిలో IRGC మైన్లు ఏర్పాటు చేస్తున్నట్టు US గుర్తింపు
బందర్ అబ్బాస్ సమీపంలో దాడులు
లెబనాన్‌లోని హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ దాడులు
-
May 26, 2026 07:25 IST
మరోసారి పెరిగిన CNG ధరలు
కేజీ CNGపై రూ.2 పెంపు
12 రోజుల్లో 6 రూపాయల పెంపు
2 వారాల్లో నాలుగుసార్లు పెరిగిన ధరలు
ఢిల్లీలో రూ.83.09కి చేరిన కేజీ CNG ధర
-
May 26, 2026 07:22 IST
నేడు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సందర్శనకు మంత్రులు, ఎమ్మెల్యేలు
నార్లాపూర్ దగ్గర పంప్‌హౌస్‌లను పరిశీలించనున్న ప్రజాప్రతినిధులు
వట్టెం వరకు ఉన్న పంప్‌హౌస్‌లు, రిజర్వాయర్లు పరిశీలన
సాయంత్రం నాగర్‌కర్నూల్ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష
-
May 26, 2026 07:21 IST
ఢిల్లీ: నేడు క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం
ఇండో-పసిఫిక్ ప్రాంత భద్రత పరిస్థితులపై చర్చ
పాల్గొననున్న అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ విదేశాంగ మంత్రులు