ఏపీ వైద్య ఆరోగ్యశాఖలో మార్పులు
ABN , Publish Date - May 26 , 2026 | 03:35 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. డీఎంఈగా డాక్టర్ విష్ణువర్ధన్ నియామకంతో పాటు పలువురు ఏడీఎంఈలకు పోస్టింగ్‌లు ఇచ్చింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. వైద్య విద్యా విభాగం డీఎంఈగా డాక్టర్ విష్ణువర్ధన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో పదోన్నతి పొందిన 15 మంది ఏడీఎంఈ లకు కొత్త పోస్టింగ్‌లు కేటాయించింది.
ఇక రాష్ట్రంలోని పలు ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రుల్లో కూడా కొత్త నియామకాలు చేపట్టింది. నలుగురు కొత్త ప్రిన్సిపల్స్‌తో పాటు తొమ్మిది మంది కొత్త సూపరింటెండెంట్‌లను ప్రభుత్వం నియమించింది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్ రఘునందన్‌ను నియమించగా, కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌గా డాక్టర్ పి. ఉషాకిరణ్‌కు బాధ్యతలు అప్పగించింది. ఈ మార్పులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపినట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి...
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్‌లను ప్రోత్సహిస్తాం: సీఎం చంద్రబాబు
గోదావరి పుష్కరాల పనుల్లో జాప్యం.. అధికారుల తీరుపై పవన్ అసహనం
Read Latest AP News