హైదరాబాద్‌లో కొత్తగా మరో జీసీసీ కేంద్రం
ABN , Publish Date - May 26 , 2026 | 02:41 PM
హైదరాబాద్‌లో కొత్తగా మరో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్(జీసీసీ) కేంద్రం ఏర్పాటు కానుంది. రీజెనరాన్.. తొలి విదేశీ జీసీసీకి తెలంగాణ ఎంపిక అయింది.
హైదరాబాద్, మే 26: నగరంలో కొత్తగా మరో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్(జీసీసీ) కేంద్రం ఏర్పాటు కానుంది. రీజెనరాన్.. తొలి విదేశీ జీసీసీకి తెలంగాణ ఎంపిక అయింది. మంగళవారం హైదరాబాద్‌లో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో రీజెనరాన్ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీరి మధ్య ఒప్పందం ఖరారైంది. హైదరాబాద్‌ను గ్లోబల్ హబ్‌గా రీజెనరాన్ అభివృద్ధి చేయనుంది. క్లినికల్ ట్రయల్స్, ఏఐ, డేటా సైన్స్ సేవలను జీసీసీ అందించనుంది. దీంతో తెలంగాణలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల సంఖ్య 450కి చేరనుంది.
జీసీసీల కేంద్రంగా దేశంలో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. దీని ద్వారా బయోటెక్, ఏఐ రంగాల్లో హైదరాబాద్‌కు ఆదరణ పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. జీనోమ్ వ్యాలీ విస్తరణతో లైఫ్ సైన్సెస్‌కు మరింత బలం చేకూరనుంది. గ్రీన్ ఫార్మా సిటీతో కొత్త పెట్టుబడులకు ఊతం ఇచ్చినట్లు అవుతోంది. రీజెనరాన్ జీసీసీ ఏర్పాటుతో భారీగా ఉద్యోగావకాశాలు రానున్నాయి. రీజెనరాన్ పెట్టుబడితో తెలంగాణ ప్రతిష్ఠను మరింత పెంచినట్లు అయింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈసారి మహానాడు గిన్నిస్ బుక్ లో ఎక్కబోతుంది: పల్లా శ్రీనివాసరావు
అత్యాచార కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష.. ఇప్పటికి 16 సార్లు పెరోల్..
Read Latest Telangana News And Telugu News