ఐపీఎల్ 2026: పాటిదార్ విధ్వంసం.. గుజరాత్ ముందు భారీ టార్గెట్
ABN , Publish Date - May 26 , 2026 | 09:21 PM
ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1లో భాగంగా ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ తలపడుతోన్నాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసింది.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1లో భాగంగా ఇవాళ(మంగళవారం) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ తలపడుతోన్నాయి. ధర్మశాల వేదికగా జరుగుతోన్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజత్ పాటిదార్(33 బంతుల్లో 93 *పరుగులు) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. రజత్ పాటిదార్ గుజరాత్ బౌలర్లను ఊచకోత కోశాడు. కోహ్లీ (25 బంతుల్లో 43 పరుగులు), కృనాల్ పాండ్య(28 బంతుల్లో 43 పరుగులు) దేవ్‌దత్ పడిక్కల్ (19 బంతుల్లో 30 పరుగులు) రాణించారు. చివర్లో జితేశ్ శర్మ(5 బంతుల్లో 15 పరుగులు) దూకుడుగా ఆడాడు.
ఇక గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో రబాడా రెండు, జాసన్ హోల్డర్ చెరో రెండు వికెట్లు సాధించారు. ప్రసిద్ధ్ కృష్ణ ఒక వికెట్ పడగొట్టాడు. మొత్తంగా గుజరాత్ టైటాన్స్ ముందు ఆర్సీబీ 255 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్ధేశించింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్తుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. ఆ జట్టు ఫైనల్లో స్థానం కోసం ఎలిమినేటర్ (రాజస్థాన్ × హైదరాబాద్) విజేతతో తలపడుతుంది.
ఇవి కూడా చదవండి:
చెన్నై సూపర్ కింగ్స్‌లోకి ఊహించని ప్లేయర్!
కోహ్లీ-ట్రావిస్ మధ్య వివాదంలో మూడో వ్యక్తి!