ధోని, రోహిత్‌ల సరసన చేరిన రియాన్ పరాగ్..
ABN , Publish Date - May 26 , 2026 | 08:14 PM
ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా తొలి ప్రయత్నంలోనే రాజస్థాన్ రాయల్స్‌ను ప్లే ఆఫ్స్‌కు చేర్చిన రియాన్ పరాగ్ ఓ భారీ కెప్టెన్సీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ 2026లో తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం సాధించడంతో రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్‌కు చేరింది.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా తొలి ప్రయత్నంలోనే రాజస్థాన్ రాయల్స్‌ను ప్లే ఆఫ్స్‌కు చేర్చిన రియాన్ పరాగ్ ఓ భారీ కెప్టెన్సీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ 2026లో తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం సాధించడంతో రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్‌కు చేరింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో తొలి సీజన్‌లోనే తన జట్టును ప్లే ఆఫ్స్‌కు చేర్చిన 24వ కెప్టెన్‌గా రికార్డుల్లోకెక్కాడు. తద్వారా లెజెండరీ కెప్టెన్లు ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ సరసన రియాన్ పరాగ్ చేరాడు.
షేన్ వార్న్(రాజస్థాన్ రాయల్స్ 2028), యువరాజ్ సింగ్(పంజాబ్ కింగ్స్ 2008), ఎంఎస్ ధోని( సీఎస్కే 2008), వీరేంద్ర సెహ్వాగ్(ఢిల్లీ క్యాపిటల్స్ 2008), అనిల్ కుంబ్లే(ఆర్సీబీ 2009), డేనియల్ వెట్టోరి(ఆర్సీబీ 2011), గౌతమ్ గంభీర్(కేకేఆర్ 2011) వంటి పలువురు ఆటగాళ్లు కెప్టెన్లుగా మొదటి సీజన్‌లో తమ జట్లను ప్లే ఆఫ్స్‌కు చేర్చి రికార్డు సృష్టించారు. రియాన్ పరాగ్ కంటే ముందు 23వ కెప్టెన్‌గా రజత్ పాటిదార్ ఉన్నాడు. అతడు 2025లో ఆర్సీబీ జట్టును ఫ్లే ఆఫ్స్‌కు చేర్చాడు.
కాగా, గత సీజన్ వరకు రాజస్థాన్ కెప్టెన్‌గా వ్యవహరించిన సంజు శాంసన్ సీఎస్కేకు ట్రేడ్ కావడంతో.. ఈ సీజన్‌తోనే రియాన్ పరాగ్ ఫుల్ టైమ్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన రియాన్.. సీజన్ ప్రారంభంలో జట్టును అద్భుతంగా ముందుండి నడిపించాడు. మధ్యలో తడబడినా, చివరికి మళ్లీ పుంజుకొని తన జట్టును ప్లే ఆఫ్స్‌కు చేర్చాడు.
ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో (ముంబై ఇండియన్స్) రాజస్థాన్ జట్టు అన్ని విభాగాల్లో సత్తా చాటి అద్భుత విజయం సాధించింది. ఈ గెలుపుతో నాలుగో ప్లే ఆఫ్స్ బెర్త్‌ను దక్కించుకొని ఎలిమినేటర్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌తో అమీతుమీకి సిద్దమైంది. రియాన్ కెప్టెన్‌గా మెప్పించినా బ్యాటర్‌గా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. 12 మ్యాచ్‌ల్లో కేవలం 272 పరుగులు మాత్రమే చేశాడు. స్ట్రైక్‌రేట్ బాగానే ఉన్నప్పటికీ, అతడి నుంచి మంచి ఇన్నింగ్స్‌లు రావాలని జట్టు ఆశించింది.
ఇవి కూడా చదవండి:
చెన్నై సూపర్ కింగ్స్‌లోకి ఊహించని ప్లేయర్!
కోహ్లీ-ట్రావిస్ మధ్య వివాదంలో మూడో వ్యక్తి!