-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National International breaking Live Updates of 7th August 2026 kjr
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Aug 07 , 2026 | 05:49 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Aug 07, 2026 21:24 IST
సంగారెడ్డి: జహీరాబాద్ రైల్వే స్టేషన్‌లో బీదర్-యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్‌కి తప్పిన ప్రమాదం
రైల్వే స్టేషన్ వద్ద ఇంజన్ వెనుక ఏసీ బోగీలో దట్టంగా అలుముకున్న పొగ
వెంటనే అలెర్ట్ అయ్యి రైలు నిలిపివేసిన అధికారులు
బ్యాటరీలో లోపంతో పొగ వచ్చినట్టు గుర్తించి మరమ్మతులు
అనంతరం యశ్వంతపూర్ బయలుదేరిన రైలు
-
Aug 07, 2026 21:19 IST
కర్నూలు: ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే తమ్ముడు శ్రీరాములు అరెస్టు
నేమకల్లులో టీడీపీ కార్యకర్తలపై దాడి కేసులో A2 ముద్దాయిగా ఉన్న శ్రీరాములు
ఆలూరు కోర్టులో హాజరు పరిచిన పోలీసులు
14 రోజుల రిమాండ్ విధించిన న్యాయాధికారి
-
Aug 07, 2026 21:03 IST
అమరావతి: కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్ పదవికి చలసాని ఆంజనేయులు రాజీనామా
ఫలించిన మంత్రుల మంత్రాంగం, సమసిన వివాదం
టీడీపీ అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవిస్తూ చలసాని ఆంజనేయులు రాజీనామా
పార్టీ నిర్ణయమే తనకు శిరోధార్యమన్న చలసాని ఆంజనేయులు
-
Aug 07, 2026 20:55 IST
జగిత్యాల: నూకపల్లిలో మహిళపై సామూహిక అత్యాచారం
మల్యాల పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
Aug 07, 2026 20:03 IST
ఢిల్లీ: రేపు తమిళనాడులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన
తిరువణ్ణామలై అరుణాచలేశ్వరుడిని దర్శించుకోనున్న అమిత్ షా
పుదుచ్చేరిలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న అమిత్ షా
-
Aug 07, 2026 20:02 IST
హైదరాబాద్: తెలంగాణలో గిగ్ వర్కర్ల సమ్మె తాత్కాలిక వాయిదా
సమస్యలు పరిష్కరిస్తామన్న మంత్రి వివేక్ హామీతో సమ్మె వాయిదా
-
Aug 07, 2026 19:36 IST
త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలు, అరెస్టులపై నటుడు విశాల్ స్పందన
బహిరంగ వేదికలపై రాజకీయ నేతలు జాగ్రత్తగా మాట్లాడాలి: విశాల్
వాక్ స్వాతంత్ర్యం అందరికీ ఉంటుంది కానీ కొన్ని అంశాల విషయంలో దూరంగా ఉండాలి: విశాల్
లయోలా కాలేజ్‌లో విజయ్ నా సీనియర్.. ఉదయనిధి బ్యాచ్‌మేట్: విశాల్
ఇదంతా రాజకీయాల్లో ఒక భాగమే.. అదే రాజకీయం అంటే: విశాల్
-
Aug 07, 2026 19:34 IST
హైదరాబాద్: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని మరోసారి కస్టడీకి కోరిన పోలీసులు
రెండు రోజుల కస్టడీలో నోరు మెదపని ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ రెడ్డి
చాలా వాటికి సమాధానాలు చెప్పేందుకు నిరాకరించిన ఉదయ్ కృష్ణ
దీంతో మరోసారి కస్టడీకి అనుమతి ఇవ్వాలని కోరుతూ పిటీషన్ దాఖలు చేసిన పోలీసులు
రేపు ఉప్పరపల్లి కోర్టులో విచారణకు వచ్చే అవకాశం
-
Aug 07, 2026 19:21 IST
తిరుమల మొదటి ఘాట్‌రోడ్‌లో ప్రమాదం
ఘాట్‌రోడ్ 21వ మలుపు దగ్గర అదుపుతప్పి లోయలో కారు బోల్తా
ఇద్దరు భక్తులకు గాయాలు, ఒకరి పరిస్థితి విషమం
స్విమ్స్ ఆస్పత్రికి క్షతగాత్రుల తరలింపు
-
Aug 07, 2026 19:20 IST
ఢిల్లీ: ప్రధాని మోదీని కలిసిన శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్‌బీర్‌సింగ్ బాదల్
ఉదయం పార్లమెంట్‌లో ప్రధాని మోదీతో సమావేశం
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో BJP-అకాలీదళ్ పొత్తుపై చర్చలు
-
Aug 07, 2026 18:15 IST
ఢిల్లీ: ఎన్నికల్లో పొత్తులపై టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు ఉండదు: రాంచందర్‌రావు
తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీచేస్తుంది: రాంచందర్‌రావు
జనసేన సహా ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోం: రాంచందర్‌రావు
జనసేన ఎన్డీయేలో భాగస్వామి: రాంచందర్‌రావు
జనసేన అంశాన్ని అధిష్ఠానం చూసుకుంటుంది: రాంచందర్‌రావు
-
Aug 07, 2026 17:33 IST
మెదక్: టెక్మాల్ మండలం ధనూర గ్రామ శివారులోని వాగులో మొసలి కలకలం
మొసలిని చూసి భయాందోళనకు గురైన గ్రామస్థులు
మత్స్యకారులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
-
Aug 07, 2026 16:53 IST
రాజమండ్రి మెడికో మృతి కేసులో ఇద్దరికి రిమాండ్
మద్యం మత్తులో కారుతో ఢీకొట్టిన యువకులు దస్వంత్, జోసెఫ్
ఇద్దరు నిందితులకు ఈ నెల 21 వరకు రిమాండ్
ఈ నెల 3న మెడికో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన నిందితులు
హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మెడికో ప్రియాంక మృతి
-
Aug 07, 2026 16:52 IST
ఢిల్లీ: బీజేపీ చీఫ్ నితిన్ నబీన్‌తో ముగిసిన టీబీజేపీ నేతల భేటీ
తెలంగాణలో పార్టీ బలోపేతంపై చర్చించిన నేతలు
నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిపై సమీక్ష
పార్టీ సంస్థాగత విస్తరణ, భవిష్యత్ కార్యాచరణపై చర్చ
-
Aug 07, 2026 16:34 IST
తమ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసిన కాంగ్రెస్ అధిస్ఠానం
ఆగస్టు 10, 11, 12 తేదీల్లో తప్పకుండా పార్లమెంట్‌కు హాజరుకావాలని ఆదేశం
ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుపై చర్చకు సన్నాహాలు
ఇండియా కూటమి ఎంపీలకూ కాంగ్రెస్ సూచనలు
కీలక బిల్లులపై పార్లమెంట్‌లో ఉత్కంఠ
పార్టీ వైఖరికి మద్దతివ్వాలని విప్
-
Aug 07, 2026 16:33 IST
ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నం మండలం జూపూడి వద్ద రోడ్డు ప్రమాదం
స్వామి నారాయణ గురుకుల ఇంటర్నేషనల్ స్కూల్ బస్సు బోల్తా
కేతనకొండ నుంచి విజయవాడ వస్తుండుగా జూపూడి వద్ద డివైడర్‌ని ఢీ కొట్టి బోల్తా పడిన స్కూల్ బస్సు
17 మంది పిల్లలకు గాయాలు, నిమ్రా ఆసుపత్రికి తరలింపు
స్వల్ప గాయాలతో బయటపడిన విద్యార్థులు
-
Aug 07, 2026 16:31 IST
హైదరాబాద్: రాయదుర్గంలో మైనర్ డ్రైవింగ్‌తో ఒకరు బలి
షేక్‌పేట ఎల్లమ్మ ఆలయం దగ్గర కారు బీభత్సం
బాలుడు వేగంగా కారుతో ఢీకొట్టడంతో ఒకరి మృతి
-
Aug 07, 2026 16:30 IST
రాజమండ్రిలో కారుతో ఢీకొట్టిన ఘటనలో విషాదం
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి
ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్
-
Aug 07, 2026 16:19 IST
ఢిల్లీ: టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
వర్చువల్ హాజరుకు సుప్రీంకోర్టు నిరాకరణ
పోలీసుల ఎదుట ప్రత్యక్షంగా హాజరుకావాలని సూచన
పిటిషన్‌ను ఉపసంహరించుకున్న మహువా మొయిత్రా
హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం సూచన
-
Aug 07, 2026 16:10 IST
హైదరాబాద్: ముగిసిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కస్టడీ విచారణ
ఉదయ్‌ను ప్రశ్నించిన ఉమెన్స్ సేఫ్టీ వింగ్ డీసీపీ లావణ్య నాయక్
చాలా ప్రశ్నలకు ఉదయ్ కృష్ణారెడ్డి దాటవేత సమాధానాలు
ఉదయ్ కృష్ణారెడ్డి ఐఫోన్‌పై ఇప్పటివరకు రాని స్పష్టత
రెండు రోజుల కస్టడీ సమయం ముగియడంతో ఉదయ్ కృష్ణారెడ్డిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలింపు
అనంతరం ఉదయ్‌ను కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు
-
Aug 07, 2026 16:09 IST
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
456 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్
65 పాయింట్ల నష్టంతో ముగిసిన నిఫ్టీ
-
Aug 07, 2026 16:03 IST
హైదరాబాద్: మందు బాబులకు షాకిచ్చిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్
బోనాల పండుగ సందర్భంగా ఆగస్టు 9న మద్యం దుకాణాలు మూసివేస్తూ నిర్ణయం
ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు వైన్ షాపులు, కల్లు దుకాణాలు, బార్ల మూసివేత
కూకట్‌పల్లి, అల్లాపూర్, రాయదుర్గం, జీడిమెట్ల, మెడ్చల్, చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదేశాల అమలు
-
Aug 07, 2026 15:53 IST
ఢిల్లీ: బీజేపీ చీఫ్ నితిన్ నబీన్‌తో టీబీజేపీ నేతలు భేటీ
హాజరుకానున్న రాంచందర్‌రావు సహా టీబీజేపీ నేతలు
తెలంగాణలో పార్టీ బలోపేతంపై చర్చ
నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిపై సమీక్ష
పార్టీ సంస్థాగత విస్తరణ, భవిష్యత్ కార్యాచరణపై చర్చ
సమావేశంలో పాల్గొననున్న సునీల్ బన్సాల్, అభయ్ పాటిల్
-
Aug 07, 2026 15:48 IST
తమిళనాడు సీఎం విజయ్ డైవర్స్ కేసులో కీలక మలుపు
విడాకుల కేసును ఉపసంహరించుకున్న విజయ్ భార్య సంగీత
కేసును ముగించిన చెంగల్పట్టు కోర్టు
-
Aug 07, 2026 15:47 IST
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత
జెడ్డా నుంచి వచ్చిన ప్రయాణికుడి అరెస్టు
869 గ్రాముల బంగారు బిస్కెట్లు స్వాధీనం
-
Aug 07, 2026 14:56 IST
కర్నూలు: ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించిన వైసీపీ నాయకులు
విరూపాక్షితో ములాఖత్ అయిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి
పంచలింగాల జిల్లా జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి
-
Aug 07, 2026 14:53 IST
సీదిరి అప్పలరాజు బెయిల్ పిటిషన్ మరోసారి డిస్మిస్
బెయిల్ పిటిషన్ తిరస్కరించిన సోంపేట కోర్టు
సీదిరి అప్పలరాజు రిమాండ్ మరో 14 రోజుల పొడిగింపు
ఇప్పటివరకు రెండుసార్లు అప్పలరాజు బెయిల్ పిటిషన్ డిస్మిస్
16 రోజులుగా జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అప్పలరాజు
-
Aug 07, 2026 14:52 IST
పేషెంట్‌కు ఆపరేషన్ చేస్తుండగా.. 7.1 తీవ్రతతో భూకంపం!
జపాన్‌లో వెలుగు చూసిన ఘటన
ఒక్కసారిగా భూమి కంపించడంతో తూలి పడ్డ డాక్టర్లు
పేషెంట్‌కు అపాయం రాకుండా డాక్టర్ల ప్రయత్నాలు
నెట్టింట వీడియో వైరల్
-
Aug 07, 2026 13:45 IST
చిత్తూరు: పెద్దపంజాణి మండలం మారపల్లిలో వ్యక్తి అనుమానాస్పద మృతి
మృతుడి ఛాతీపై నాటు తుపాకీ బుల్లెట్ల గాయాలు
మృతుడి పక్కనే నాటు తుపాకీని గుర్తించిన పోలీసులు
మృతుడి సొంత పొలం పక్కనే ఘటన
మృతుడు శ్రీనివాసులు(50)గా గుర్తింపు
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Aug 07, 2026 13:30 IST
తమిళనాడు సీఎం విజయ్, సంగీత విడాకుల కేసు
కోర్టుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన సంగీత
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయన్న విజయ్ లాయర్
మరో తేదీకి విచారణ వాయిదా వేయాలన్న అడ్వొకేట్
ఇవాళే విచారణ జరగాలని జడ్జిని కోరిన సంగీత
విచారణ మధ్యాహ్నానికి వాయిదా వేసిన కోర్టు
-
Aug 07, 2026 13:15 IST
బిహార్ రాజధాని పాట్నాలో చెలరేగిన హింస
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతితో ఉద్రిక్తత
హైవేపై పలు వాహనాలను తగలబెట్టిన ఆందోళనకారులు
నిరసనకారులపై పోలీసుల లాఠీచార్జ్
-
Aug 07, 2026 12:57 IST
ఇలా చేసినందుకు మా అమ్మకు కోపం రావొచ్చు: రాహుల్ గాంధీ
తన తల్లి సోనియా గాంధీ పెంపుడు కుక్కను పరిచయం చేసిన రాహుల్ గాంధీ
ఇలా చేసినందుకు తన తల్లికి కోపం రావొచ్చని వ్యాఖ్య
తాను డాగ్ పేరెంట్ కాదని స్పష్టీకరణ
ఇతర జీవాలతో కలిసి మనుషులు భూమ్మీద ఉంటున్నారని వ్యాఖ్య
-
Aug 07, 2026 12:47 IST
మాజీ జడ్జి జస్టిస్ యశ్వంత్ కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
జస్టిస్ యశ్వంత్ వర్మపై FIR, విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ
న్యాయవాది ఘన్‌శ్యామ్ ఉపాధ్యాయ పిటిషన్ కొట్టివేత
పిటిషనర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం ధర్మాసనం
చౌకబారు పబ్లిసిటీ కోసమే పిటిషన్లు వేస్తున్నారు: సుప్రీంకోర్టు
న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేయొద్దు: సుప్రీంకోర్టు
-
Aug 07, 2026 12:46 IST
ఢిల్లీ: కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలి: మంత్రి అడ్లూరి
బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిన వ్యక్తి అంబేద్కర్: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
గాంధీకి ఇచ్చిన గౌరవాన్ని అంబేద్కర్‌కూ ఇవ్వాలి: అడ్లూరి
ఈ అంశాన్ని సీఎం రేవంత్, కేబినెట్ దృష్టికి తీసుకెళ్తా: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
-
Aug 07, 2026 12:24 IST
బాపట్ల: వేటపాలెం మండలం కొత్తపేటలో జాతీయ చేనేత దినోత్సవం
నేతన్న సేవలో పథకాన్ని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
ఒక్కో చేనేత కుటుంబానికి రూ.25 వేల చొప్పున సాయం
71,536 కుటుంబాలకు రూ.179 కోట్ల విడుదల
-
Aug 07, 2026 12:23 IST
'వందేమాతరం' నూతన చట్టానికి రాష్ట్రపతి ఆమోదముద్ర
దేశభక్తి గీత గౌరవాన్ని కాపాడేందుకు కేంద్రం కీలక నిర్ణయం
'వందేమాతరం' గీతాలాపనకు విఘాతం కలిగిస్తే తీవ్ర పరిణామాలు
కేంద్రం తెచ్చిన నూతన చట్టానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
-
Aug 07, 2026 12:20 IST
విశాఖ రైల్వే జోన్ రికార్డు స్థాయి పురోగతి
రూ.2,493కోట్ల వార్షిక రాబడితో దేశంలోనే అత్యుత్తమ జోన్‌గా సౌత్ కోస్ట్ రైల్వే
స్వల్పకాలంలోనే సత్తా చాటిన సౌత్ కోస్ట్ రైల్వే జోన్
రికార్డు స్థాయి పురోగతి సాధించినట్టు కేంద్ర రైల్వే శాఖ వెల్లడి
-
Aug 07, 2026 12:19 IST
ఢిల్లీ: ఉభయసభలు సోమవారానికి వాయిదా
విపక్షాల ఆందోళన నడుమ ఉభయ సభల వాయిదా
-
Aug 07, 2026 12:09 IST
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ముందు కీలక పరిణామం
మోదీని కలిసిన శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్
గతంలో NDA నుంచి బయటకు వచ్చిన శిరోమణి అకాలీదళ్
-
Aug 07, 2026 12:08 IST
లంచ్ బ్రేక్ సమయానికి లంక ఎలెవన్ స్కోర్ 138/1
కొలంబో వేదికగా భారత్‌తో వార్మప్ మ్యాచ్ ఆడుతోన్న శ్రీలంక ఎలెవన్ జట్టు
29 ఓవర్లకు శ్రీలంక ఎలెవన్ స్కోర్ 138/1
లంక ఓపెనర్ రవిందు(50*) హాఫ్ సెంచరీ
వికెట్లు తీయడానికి తీవ్రంగా శ్రమిస్తోన్న భారత బౌలర్లు
రనౌట్ రూపంలో వచ్చిన ఏకైక వికెట్
-
Aug 07, 2026 11:41 IST
కావేరి జలాల వివాదంపై తమిళనాడు అసెంబ్లీలో చర్చ
అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయాలని విపక్షాల డిమాండ్
కర్ణాటక సీఎంతో సమావేశంపై విపక్షాల ప్రశ్నలు
కావేరి జలాల సమస్య పరిష్కారానికే చర్చలు: సీఎం విజయ్
ఇరు రాష్ట్రాల నీటి సమస్యలపై మాట్లాడతా: సీఎం విజయ్
ఇతర రాష్ట్రాలతో చర్చిస్తే తప్పేంటి?: సీఎం విజయ్
-
Aug 07, 2026 11:26 IST
పల్నాడు: కారంపూడి మండలం చింతపల్లిలో యువతి హత్య
ప్రేమించిన యువతి మీద అనుమానంతో హత్య చేసిన ప్రియుడు
మృతురాలు చిలకలూరిపేటకు చెందిన షేక్ హసీనాగా గుర్తింపు
నిందితుడు కారంపూడి మండలం ఇనుపరాజుపల్లెకు చెందిన జిలుగు బాల సైదులు
గుంటూరులోనీ చలపతి ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్న సైదులు, హసీనా
-
Aug 07, 2026 11:10 IST
గుంటూరు: అంబటి రాంబాబుపై ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు ఫైర్
అంబటి రాంబాబు ఓ జోకర్: : నక్కా ఆనంద్ బాబు
అంబటి రాజకీయాలు వదిలేసి డ్రామాలు వేసుకుంటే మంచిది: నక్కా ఆనంద్ బాబు
విద్యావంతుడు పెమ్మసానిపై అంబటి విమర్శలు సిగ్గుచేటు: నక్కా ఆనంద్ బాబు
వివాదాలతో ప్రచారం పొందాలని అంబటి తాపత్రయం: నక్కా ఆనంద్ బాబు
-
Aug 07, 2026 11:08 IST
తెలంగాణ హైకోర్టు ముందు హాజరైన IAS సందీప్ సుల్తానియా
కోర్టు ధిక్కరణ కేసులో సందీప్‌పై నిన్న హైకోర్టు ఆగ్రహం
సందీప్ కేసు విచారణలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సందీప్ సుల్తానియాపై వెయ్యి కేసులున్నాయి: హైకోర్టు
అవన్నీ విచారణ చేస్తే జీవితకాలం జైల్లో ఉండాలి: హైకోర్టు
-
Aug 07, 2026 11:07 IST
హైదరాబాద్: BRS నాయకురాలు రూపారెడ్డికి రిమాండ్
14 రోజుల రిమాండ్ విధించిన మెజిస్ట్రేట్
చంచల్‌గూడ జైలుకు రూపారెడ్డి తరలింపు
-
Aug 07, 2026 11:07 IST
ఢిల్లీ: లోక్ సభ 12 గంటల వరకు వాయిదా
విపక్షాల ఆందోళన నడుమ సభ వాయిదా
-
Aug 07, 2026 10:54 IST
కొమురం భీం: రెబ్బెన మండలం గంగాపూర్ వైన్ షాపులో చోరి
రూ.15వేల నగదు, రూ.30 వేల విలువైన మద్యం బాటిళ్ల చోరీ
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Aug 07, 2026 10:53 IST
చేనేతను ఆదరిద్దాం.. అండగా నిలుద్దాం: ఏపీ డిప్యూటీ సీఎం పవన్
మన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించుకుందాం: పవన్ కల్యాణ్
చేనేత ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తెస్తాం: పవన్
-
Aug 07, 2026 10:51 IST
నేతన్నలకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు
చేనేత కార్మికుల సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యం: చంద్రబాబు
అంతా చేతులు కలుపుదాం.. చేనేత కళను కాపాడుదాం: సీఎం చంద్రబాబు
-
Aug 07, 2026 10:47 IST
విజయవాడ: వైసీపీ నేతలపై కొమ్మారెడ్డి పట్టాభి ఫైర్
రాష్ట్రంలో అశాంతి సృష్టించేందుకు గొడ్డలి పార్టీ కుట్రలు: స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్
DSC నియామకాల్లో అక్రమాలు జరిగాయని హడావుడి చేస్తున్నారు: పట్టాభి
అసాంఘిక శక్తులను అడ్డం పెట్టుకుని జెన్ జీ పేరుతో దీక్షలు: పట్టాభి
జెన్ జీ వెనుక గంజాయి బ్యాచ్, రౌడీ మూకలే ఉన్నారు: కొమ్మారెడ్డి పట్టాభిరామ్
-
Aug 07, 2026 10:45 IST
కామారెడ్డి: తాడ్వాయి మండలం కరడ్‌పల్లిలో కల్తీ కల్లు తయారీదారుల అరెస్ట్
కల్లు దుకాణ నిర్వాహకుడు స్వామిగౌడ్‌తో పాటు గాండ్ల పోచయ్య అరెస్ట్
60 సీసాల కల్తీ కల్లు, రెండు ఫోన్ల స్వాధీనం
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Aug 07, 2026 10:43 IST
కామారెడ్డి: రౌడీషీటర్ కాట్యాడ బాపూరావుపై పీడీ యాక్ట్ అమలు
సదాశివనగర్ మండలం వజ్జేపల్లికి చెందిన బాపూరావుపై కలెక్టర్ డిటెన్షన్ ఉత్తర్వులు
దోపిడీ, బెదిరింపుల కేసుల్లో నిందితుడిగా ఉండటంతో చర్యలు
-
Aug 07, 2026 10:39 IST
ఢిల్లీలో నేడు తెలంగాణ బీజేపీ నేతల కీలక సమావేశం
మధ్యాహ్నం 3.30 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయంలో భేటీ
జాతీయ అధ్యక్షుడు నితీన్ నబీన్ అధ్యక్షతన సమావేశం
హాజరుకావాలని ఎంపీలకు రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు పిలుపు
పార్టీ బలోపేతంపై కీలక చర్చ
నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిపై సమీక్ష
-
Aug 07, 2026 10:37 IST
హైదరాబాద్‌లో స్వల్పంగా పెరిగిన గోల్డ్ రేట్స్
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,890
22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,37,400
18 క్యారెట్ల బంగారం ధర రూ.1,12,420
-
Aug 07, 2026 10:31 IST
శ్రీలంకతో వార్మప్ మ్యాచ్: కేఎల్ రాహుల్ కెప్టెన్సీ
ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడ్డ శుభ్‌మన్ గిల్
వార్మప్ మ్యాచ్‌లో టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక ఎలెవన్
-
Aug 07, 2026 10:00 IST
థాయ్‌లాండ్‌లోని ఓ స్కూల్ దగ్గర కాల్పుల కలకలం
ఇద్దరి మృతి, మరో 10 మందికి గాయాలు
కాల్పులు జరిపిన దుండగుడు కూడా మృతి
-
Aug 07, 2026 09:59 IST
మెటాకు అమెరికాలోని న్యూమెక్సికో కోర్టు భారీ జరిమానా
పిల్లల భద్రతకు సంబంధించిన చర్యలు తీసుకోవడంలో విఫలమైందంటూ వ్యాఖ్యలు
567 మిలియన్ డాలర్ల ఫైన్ చెల్లించాలని కోర్టు ఆదేశం
-
Aug 07, 2026 09:56 IST
గుంటూరు: తెనాలి మండలం చావావారిపాలెంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆందోళన
అంగలకుదురు–యడ్లపల్లి రోడ్డు నిర్మించాలని ఆందోళన
రోడ్డు అధ్వానంగా ఉండడంతో అవస్థలు పడుతున్నామని ఆవేదన
ఫ్లకార్డులు పట్టుకుని రహదారిపై బైఠాయించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు
వెంటనే రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి
-
Aug 07, 2026 09:44 IST
జగిత్యాల: కండ్లపల్లి మోడల్ స్కూల్‌లో అదృశ్యమైన బాలిక ఆచూకీ లభ్యం
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో తన పెద్ద నాన్న ఇంటికి చేరిన బాలిక
బాలికను తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు
-
Aug 07, 2026 09:35 IST
మెదక్: నర్సాపూర్‌లో విషాద ఘటన
బోనాల పండుగ సందర్భంగా ఫ్లెక్సీ కడుతుండగా కరెంట్ షాక్
ఘటనలో హర్షవర్ధన్ (19) అనే యువకుడు అక్కడికక్కడే మృతి
అఖిల్, ఇర్ఫాన్‌లకు గాయాలు, నర్సాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలింపు
-
Aug 07, 2026 09:20 IST
ఏలూరు జిల్లా: బుట్టాయగూడెం మండలంలోకి ప్రవేశించిన పెద్ద పులి
కామవరం గ్రామ సమీపంలో ఆవుపై దాడి చేసి హతమార్చిన పులి
-
Aug 07, 2026 09:17 IST
ఏలూరు జిల్లా: వేలేరుపాడు మండలం శివాకాశీపురంలో విషాద ఘటన
బాలికల వసతి గృహంలో విద్యుత్ షాక్‌తో విద్యార్థిని మృతి
కిటికీపై బట్టలు ఆరవేస్తుండగా విద్యార్థినికి షాక్
మృతురాలు 8వ తరగతి చదువుతున్న కేచ్చేల లక్ష్మిపార్వతి(13)
-
Aug 07, 2026 08:53 IST
కర్నూలు: టీడీపీ నేత ఇంతియాజ్ హత్యపై మంత్రి భరత్ దిగ్భ్రాంతి
ఇంతియాజ్ మృతి బాధాకరం: మంత్రి టీజీ భరత్
బాధిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది: మంత్రి టీజీ భరత్
నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం: మంత్రి టీజీ భరత్
-
Aug 07, 2026 08:52 IST
భారతీయ ఆత్మకు ప్రతిరూపం చేనేత: కేంద్ర మంత్రి బండి సంజయ్
చేనేతను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు మోదీ కృషి: కేంద్ర మంత్రి బండి సంజయ్
చేనేత అతి పెద్ద కుటీర పరిశ్రమ: బండి సంజయ్
మేక్ ఇన్ ఇండియాతో చేనేతను బలోపేతం చేయడమే లక్ష్యం: బండి సంజయ్
నేతన్నల ఆదాయాన్ని పెంచడమే మోదీ లక్ష్యం: కేంద్రమంత్రి బండి సంజయ్
-
Aug 07, 2026 08:38 IST
వైభవ్ సూర్యవంశీపై అజింక్య రహానె ఆసక్తికర వ్యాఖ్యలు
వైభవ్ విజయాల్లో కుటుంబ సభ్యులదే కీలక పాత్ర: రహానె
అతడిని వాళ్లే క్రమశిక్షణలో పెట్టాలి: రహానె
-
Aug 07, 2026 08:37 IST
పుట్టుకతో యూఎస్ పౌరసత్వం.. నిబంధనలు మరింత కఠినతరం
బర్త్ టూరిజంను కట్టడి చేస్తూ ఆదేశాలు జారీ చేసిన అధ్యక్షుడు ట్రంప్
జన్మతః పౌరసత్వ అర్హతలను కఠినతరం చేస్తూ ఆదేశాలు
-
Aug 07, 2026 08:36 IST
జెన్‌జీని పూర్తిగా విశ్వసిస్తా: RSS చీఫ్ మోహన్ భగవత్
జెన్‌జీ ఆందోళనలో నిజాయితీ ఉంది
సంస్కరణలు కోరే హక్కు విద్యార్థులకు ఉంది: RSS చీఫ్ మోహన్ భగవత్
-
Aug 07, 2026 08:34 IST
పుదుచ్చేరిలో భారీ వర్షాలు
ప్రహరీ కూలి ఇద్దరి మృతి, నలుగురికి గాయాలు
సహాయక చర్యలను పర్యవేక్షించిన సీఎం రంగస్వామి
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం
-
Aug 07, 2026 08:25 IST
HILT దరఖాస్తు గడువు పెంచిన తెలంగాణ ప్రభుత్వం
మరో 3 నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
ఈనెల 1 నుంచి అందుబాటులోకి వచ్చిన ఆన్‌లైన్ పోర్టల్
-
Aug 07, 2026 08:20 IST
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ వీడియో విడుదల
చేనేత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని మోదీ పిలుపు
దేశంలోని నేతన్నల కుటుంబాలకు మద్దతివ్వాలి: ప్రధాని మోదీ
చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి, నేతన్నలకు అండగా నిలవాలి: ప్రధాని మోదీ
-
Aug 07, 2026 08:15 IST
ఈ నెల 10న సీఎం రేవంత్ రెడ్డి 'వరుణ యాగం'
తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ వరుణ యాగం
-
Aug 07, 2026 08:10 IST
విజయా డెయిరీ చైర్మన్ ఎన్నిక వ్యవహారంపై టీడీపీ అధిష్ఠానం సీరియస్
నేడు విజయా డెయిరీ డైరెక్టర్లతో మంత్రులు కొల్లు రవీంద్ర, పార్థసారథి భేటీ
-
Aug 07, 2026 08:00 IST
సీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలుగు వ్యక్తి
CJP మీడియా లీడ్‌గా విజయ్‌రెడ్డి మల్లంగి నియామకం
విజయ్‌రెడ్డి ఆప్ పార్టీలో పనిచేసినట్లు సమాచారం
-
Aug 07, 2026 07:50 IST
శ్రీకాకుళం: సీదిరి అప్పలరాజు బెయిల్ పిటిషన్‌పై నేడు తీర్పు
అంపోలు జైలులో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు
-
Aug 07, 2026 07:48 IST
IAS సందీప్ సుల్తానియాపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం
IAS సందీప్‌ను అరెస్ట్ చేయాలని సీపీకి ఆదేశాలు
ఉదయం 10:30కు తమ ఎదుట హాజరుపర్చాలన్న హైకోర్టు
సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు చెల్లించాల్సిన నిధులపై తమ ఆదేశాలు అమలు చేయలేదని హైకోర్టు ఆగ్రహం
-
Aug 07, 2026 07:30 IST
నేడు ప్రధాని మోదీతో NDA కొత్త ఎంపీల బ్రేక్‌ఫాస్ట్ మీట్
మోదీని కలవనున్న శివసేన, NCPI ఎంపీలు
-
Aug 07, 2026 07:20 IST
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని-4 ప్రయోగం విజయవంతం
ఒడిశా చాందీపూర్ నుంచి క్షిపణి ప్రయోగం
భారత్ వ్యూహాత్మక క్షిపణి సామర్థ్యానికి మైలురాయి
అగ్ని-4 విజయంతో దేశ రక్షణ శక్తి మరింత బలోపేతం
-
Aug 07, 2026 07:10 IST
అనకాపల్లి: నేడు పాయకరావుపేటలో హోంమంత్రి అనిత పర్యటన
ఒడ్డిమెట్టలో ‘రెండేళ్ల నమ్మకం-అభివృద్ధి, సంక్షేమం’.. కార్యక్రమం
ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న హోంమంత్రి అనిత
-
Aug 07, 2026 07:09 IST
అల్లూరి: నేడు పాడేరులో ఆదివాసీ జేఏసీ అరణ్యగర్జన సభ
ఆదివాసీ హక్కులు, చట్టాలను పరిరక్షించాలని డిమాండ్
-
Aug 07, 2026 06:56 IST
నేడు తమిళనాడు సీఎం విజయ్-సంగీత విడాకుల కేసు విచారణ
చెంగల్పట్టు జిల్లాలోని ఫ్యామిలీ కోర్టులో విచారణ
తన భర్త విజయ్ నుంచి విడాకులు కావాలని గత ఏడాది డిసెంబర్‌లో కోర్టుని ఆశ్రయించిన సంగీత
-
Aug 07, 2026 06:53 IST
నేటి నుంచి లంక ఎలెవన్‌తో భారత్ ప్రాక్టీస్ మ్యాచ్
ప్రాక్టీస్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు గాయం
నేటి మ్యాచ్‌లో గిల్ ఆడటంపై అనుమానాలు
-
Aug 07, 2026 06:52 IST
సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ టాప్
ప్రకటించిన కేంద్ర హోంశాఖ
తెలంగాణ పోలీసులకు సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు
-
Aug 07, 2026 06:52 IST
నేడు ఏపీలో పలు జిల్లాలకు వర్ష సూచన
శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, కోనసీమ, ప.గో., కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం
మిగిలిన జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు
-
Aug 07, 2026 06:26 IST
బాపట్ల: నేడు చీరాలలో సీఎం చంద్రబాబు పర్యటన
వేటపాలెం మండలం కొత్తపేటలో చేనేత దినోత్సవానికి హాజరుకానున్న సీఎం
నేతన్న సేవలో పథకం ద్వారా చేనేతల ఖాతాలకు రూ.25 వేల బదిలీ
చీరాల మండలం జాండ్రపేటలో చేనేత మగ్గాల పరిశీలన, లబ్ధిదారులతో ముఖాముఖి
-
Aug 07, 2026 06:10 IST
పల్నాడు జిల్లా: రెంటచింతల మండలం రెంటాలలో హత్య
మాజీ జెడ్పీటీసీ కుమారుడు చెన్నారెడ్డిని హత్య చేసిన దుండగులు
గ్రామ సమీపంలో చెన్నారెడ్డిని దారుణంగా కొట్టి చంపిన దుండగులు
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Aug 07, 2026 06:05 IST
రేపు ఢిల్లీ రావాలని టీబీజేపీ నేతలకు అధిష్ఠానం నుంచి పిలుపు
రేపు మధ్యాహ్నం 3 గంటలకు నితిన్ నబీన్‌తో భేటీకానున్న TBJP చీఫ్ రాంచందర్‌రావు తదితరులు
తెలంగాణలో పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్న నితిన్ నబీన్
-
Aug 07, 2026 06:00 IST
బంగాళాఖాతం, ఉత్తర ఒడిశాపై ఉపరితల ఆవర్తనం
రేపు, ఎల్లుండి ఏపీలో పలుచోట్ల వర్షాలు