వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
ABN , Publish Date - Aug 07 , 2026 | 12:17 PM
వందేమాతరం గేయానికి మరిన్ని రక్షణలు కల్పించే నేషనల్ ఆనర్ (అమెండ్‌మెంట్) యాక్ట్-2026కు రాష్ట్రపతి ఆమోదం లభించింది.
ఇంటర్నెట్ డెస్క్: వందేమాతరం గేయానికి మరిన్ని రక్షణలు కల్పించే నేషనల్ ఆనర్ (అమెండ్‌మెంట్) యాక్ట్-2026కు రాష్ట్రపతి ఆమోదం లభించింది. జాతీయ గేయాన్ని అవమానించడాన్ని నేరంగా గుర్తించేలా 1971 నాటి చట్టానికి కేంద్రం తాజాగా మార్పులు చేసిన విషయం తెలిసిందే. జాతీయ గీతం స్థాయిలో వందేమాతరం గేయానికి రక్షణ కల్పించేలా ఈ మార్పులు చేసింది. ఇటీవలే పార్లమెంటు ఆమోదించిన బిల్లుకు తాజాగా రాష్ట్రపతి ఆమోదం కూడా లభించింది.
తాజాగా నిబంధనల ప్రకారం, జాతీయ గీతం లేదా గేయం ఆలాపనను అడ్డుకున్న వారికి గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. ఈ పాటల ఆలాపన జరుగుతున్న సమయంలో అడ్డంకులు సృష్టించేవారికీ ఇవే శిక్షలు విధిస్తారు. అంతకుముందున్న చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం, కేవలం జాతీయ గీతానికి ఈ రక్షణలు ఉండేవి. ప్రస్తుతం వందేమాతరం గేయానికీ ఇవే రక్షణలు కల్పిస్తూ చట్టంలో మార్పులు చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
థాయ్‌లాండ్ స్కూల్‌లో కాల్పులు.. నలుగురి మృతి.. 15 మందికి గాయాలు..
భారతీయులకు యూఎస్ స్టూడెంట్ వీసాల్లో 62 శాతం కోత