Share News

థాయ్‌లాండ్ స్కూల్‌లో కాల్పులు.. నలుగురి మృతి.. 15 మందికి గాయాలు..

ABN , Publish Date - Aug 07 , 2026 | 11:12 AM

థాయ్‌లాండ్‌లోని ఓ స్కూల్‌లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఓ విద్యార్థి గన్నుతో స్కూల్లోని తోటి విద్యార్థులు, టీచర్లపై కాల్పులకు తెగబడ్డాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు.

థాయ్‌లాండ్ స్కూల్‌లో కాల్పులు.. నలుగురి మృతి.. 15 మందికి గాయాలు..
Thailand School Shooting

ఇంటర్‌నెట్ డెస్క్: థాయ్‌లాండ్‌లోని ఓ స్కూల్‌లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఓ విద్యార్థి గన్నుతో స్కూల్లోని తోటి విద్యార్థులు, టీచర్లపై కాల్పులకు తెగబడ్డాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనలో మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన ప్రాథమిక దర్యాప్తు వివరాల మేరకు.. నాంతాబురి ప్రావిన్స్, బాంగ్ కురాయ్ జిల్లాలోని డెబ్సిరిన్ నాంతాబురి స్కూల్‌లో శుక్రవారం ఓ విద్యార్థి కాల్పులకు తెగబడ్డాడు. విచక్షణా రహితంగా తోటి విద్యార్థులు, టీచర్లను కాల్చాడు. అనంతరం తనను కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు.


ఈ సంఘటనలో నిందితుడితో పాటు మరో విద్యార్థి.. ఇద్దరు టీచర్లు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. దాదాపు 15 మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. గాయపడ్డ వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై థాయ్‌లాండ్ విద్యాశాఖ మంత్రి ప్రసెర్ట్ జంతరారువాంగ్‌థాంగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణ సాయం అందించాలని, ఘటనపై పూర్తి నివేదికను సమర్పించాలని ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు.


ఇవి కూడా చదవండి

నీరజ్‌చోప్రా స్ఫూర్తితో రాణిస్తున్న అథ్లెట్లు

ప్రతి భారతీయుడూ.. చేనేతకు అండగా నిలవాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Updated Date - Aug 07 , 2026 | 11:33 AM