Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Aug 18 , 2026 | 06:42 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Aug 18, 2026 07:44 IST

    నేడు మల్కాజిగిరికి BRS నేత హరీష్‌రావు

    • 22A నిషేధిత జాబితా సమస్యపై సమావేశానికి హాజరు

    • జాబితాలోని స్థిరాస్తుల సమస్యలు, ప్రజల ఇబ్బందులపై చర్చ

  • Aug 18, 2026 07:40 IST

    రేపు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి

    • కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశానికి హాజరుకానున్న సీఎం

  • Aug 18, 2026 07:39 IST

    కర్నూలు: వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లి క్వింటా రూ.3,299

    • ఆనందంలో రైతులు

  • Aug 18, 2026 07:36 IST

    రెండో రోజుకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

    • తొలుత ప్రశ్నోత్తరాల కార్యక్రమం

    • BAC నిర్ణయాలను సభ ముందుంచనున్న సీఎం చంద్రబాబు

    • విద్యుత్‌ శాఖ జీఓ ఆర్‌టీ నెం.27ను సభలో ప్రవేశపెట్టనున్న మంత్రి గొట్టిపాటి

  • Aug 18, 2026 07:34 IST

    నేడు కర్నూలుకు కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు

    • డ్రోన్ ఫ్యాక్టరీని సందర్శించనున్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి

  • Aug 18, 2026 07:28 IST

    నేడు జరగాల్సిన GRMB సమావేశం వాయిదా

    • ఏపీ అసెంబ్లీ సమావేశాలతో వాయిదా

    • తదుపరి తేదీని త్వరలో ప్రకటించనున్న గోదావరి రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు

  • Aug 18, 2026 07:28 IST

    నేటినుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణారెడ్డికి రెండు రోజుల కస్టడీ

    • ఉదయ్ కృష్ణారెడ్డి పొటెన్షియల్‌ టెస్ట్‌కు అనుమతి

    • ఉదయ్ కృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్‌ కొట్టివేత

  • Aug 18, 2026 07:20 IST

    ఝార్ఖండ్: జేఎస్‌ఎస్సీ కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ పరీక్షను రద్దు చేసిన ప్రభుత్వం

    • జేఎస్‌ఎస్సీ పరీక్షను రద్దు చేయాలని వారాలపాటు నిరసన తెలిపిన యువత

    • పరీక్ష రద్దుతో నిరాహారదీక్షను ఉపసంహరించుకున్న విద్యార్థి నాయకుడు దేవేంద్రనాథ్ మహాతో

  • Aug 18, 2026 07:16 IST

    ఢిల్లీలో గోవా గవర్నర్ అశోక్‌గజపతిరాజు

    • నేడు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని కలవనున్న గజపతిరాజు

  • Aug 18, 2026 07:10 IST

    విశాఖ పర్యటనలో బీజేపీ చీఫ్ నితిన్ నబీన్‌

    • నేడు సింహాచలం స్వామివారిని దర్శించుకోనున్న నితిన్ నబీన్‌

    • ఈరోజు ఏపీ బీజేపీ రాష్ట్రస్థాయి కార్యవర్గ భేటీ

    • జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేతృత్వంలో సమావేశం

  • Aug 18, 2026 07:00 IST

    నేడు ఉ.11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం

    • కీలక బిల్లులకు ఆమోదం తెలపనున్న మంత్రిమండలి

    • బీసీ బిల్లు, మేయర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికలపై చర్చ

  • Aug 18, 2026 06:53 IST

    స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

    • 24క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.1,55,670

    • 22క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.1,42,710

    • కిలో వెండి ధర రూ.2,54,900