Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Jun 15 , 2026 | 05:46 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Jun 15, 2026 21:49 IST

    కాకినాడ: పిఠాపురంలోని ఆదిత్య స్కూల్ వద్ద తల్లిదండ్రుల ఆందోళన

    • ఫ్రీ సీట్లకు ఫీజు చెల్లించమంటున్నారని ఆగ్రహం

    • తల్లిదండ్రుల ఫిర్యాదుతో పుస్తకాల విక్రయించే గదికి సీలు వేసిన విద్యాశాఖ అధికారులు

  • Jun 15, 2026 21:48 IST

    విజయవాడ: పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం

    • పటమట ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర కరెంట్ తీగలపై పడిన హోర్డింగ్‌

  • Jun 15, 2026 21:47 IST

    'SIR'పై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్

    • ఓట్లను తొలగించేందుకు కుట్ర జరుగుతోంది: సీఎం

    • ఓట్లు తొలగిస్తే రాజకీయంగా ప్రమాదకర పరిస్థితి: సీఎం

    • జిల్లా స్థాయిలో ఇన్‌చార్జ్ మంత్రులు పర్యవేక్షించాలి: సీఎం

    • ఎక్కడైనా సమస్య వస్తే సంబంధిత పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌దే బాధ్యత: సీఎం

    • ఈ నెల 20లోగా ఇన్‌చార్జ్ మంత్రులు సమీక్షించాలి: సీఎం

    • ప్రతి బూత్‌ను BLOలతో అనుసంధానం చేసుకోవాలి: సీఎం

  • Jun 15, 2026 21:45 IST

    హైదరాబాద్‌: మౌలాలి భరత్‌నగర్‌లో పోలీసులపై రాళ్ల దాడి

    • ఇరువర్గాల ఘర్షణను అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులపై దాడి

    • పోలీసు వాహనం అద్దాలు ధ్వంసం, కానిస్టేబుల్‌కు గాయాలు

  • Jun 15, 2026 21:44 IST

    డీఆర్‌డీఓకు మరో భారీ విజయం

    • ఒడిశా తీరంలో క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం

    • నిర్దేశించిన లక్ష్యాలన్నీ ఛేదించిన స్వదేశీ క్షిపణి

    • భారత రక్షణ రంగానికి మరింత బలం చేకూర్చనున్న క్షిపణి

    • భారత్ క్షిపణి సామర్థ్యాల్లో మరో కీలక మైలురాయి

    • దేశ రక్షణ వ్యవస్థకు మరింత పదును పెట్టనున్న స్వదేశీ క్షిపణి

  • Jun 15, 2026 21:43 IST

    అమరావతి: మంత్రి లోకేష్‌తో ఎమ్మెల్సీల భేటీ

    • హాజరైన కంచర్ల శ్రీకాంత్‌, చిరంజీవి, భూమిరెడ్డి

    • టీచర్లు, ఉద్యోగుల సమస్యలపై చర్చ

  • Jun 15, 2026 20:27 IST

    నల్లగొండ: నకిలీ కరెన్సీ నోట్లు తయారుచేస్తున్న ఇద్దరి అరెస్టు

    • నకిలీ కరెన్సీ, ప్రింటర్‌, స్కానర్‌ స్వాధీనం

  • Jun 15, 2026 19:46 IST

    బాల్య వివాహాల నిర్మూలనకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు

    • తరుణి స్వచ్ఛంద సంస్థతో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఎంఓయూ

    • మంత్రి సీతక్క సమక్షంలో అవగాహన ఒప్పందంపై సంతకాలు

    • 'బాల్య వివాహం – బతుకు ఆగం' నినాదంతో రాష్ట్రవ్యాప్త ప్రచారం

    • బాల్య వివాహాలు, మైనర్ గర్భధారణల నివారణే లక్ష్యం

    • గ్రామాల నుంచి రాష్ట్ర స్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు

    • అంగన్‌వాడీ సిబ్బంది, అధికారులకు ప్రత్యేక శిక్షణ

  • Jun 15, 2026 19:26 IST

    సోషల్ మీడియాలో ఎంపీ కేశినేని చిన్నికి కేశినేని నాని కౌంటర్‌

    • M అంటే మట్టి.. P అంటే పేకాట అంటూ విమర్శలు

    • 'నీ శిష్యుడి కాల్‌ లాగ్‌ చూసి షాక్ అయ్యావటగా' అని కౌంటర్

    • రాబోయే రోజుల్లో నీకు షాకులే షాకులు: కేశినేని నాని

  • Jun 15, 2026 19:25 IST

    రెండో రోజు సింగపూర్ పర్యటనలో సీఎం చంద్రబాబు

    • సింగపూర్‌లో రేపు వరల్డ్‌ సిటీస్‌ సదస్సులో పాల్గొననున్న చంద్రబాబు

    • CII సమ్మిట్‌ బిజినెస్ రోడ్‌షోలో పాల్గొననున్న ఏపీ సీఎం

  • Jun 15, 2026 19:24 IST

    హైదరాబాద్‌: కాంగ్రెస్ నేతల జూమ్ మీటింగ్‌

    • TPCC చీఫ్ మహేశ్ గౌడ్‌ అధ్యక్షతన సమావేశం

    • హాజరైన సీఎం రేవంత్‌, ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌

    • 'SIR' ప్రక్రియపై తెలంగాణ కాంగ్రెస్ నేతల చర్చ

  • Jun 15, 2026 19:23 IST

    మేడ్చల్‌: కీసరలో విషాదం

    • ధర్మారం చెరువులో ఫొటోషూట్‌కు వెళ్లి ముగ్గురి మృతి

    • మృతులు ఆంటోని(18), జోసెఫ్‌(18), టోనీ (17)గా గుర్తింపు

  • Jun 15, 2026 19:20 IST

    శ్రీలంక ప్లేయర్‌ను తోసేసిన వైభవ్ సూర్యవంశీ

    • సూపర్ ఓవర్ ముగిశాక వైభవ్ సూర్యవంశీ, శ్రీలంక ప్లేయర్ల మధ్య వాగ్వాదం

    • ఈ క్రమంలో శ్రీలంక ప్లేయర్‌ను తోసేసిన వైభవ్ సూర్యవంశీ

    • నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

  • Jun 15, 2026 18:53 IST

    ముక్కోణపు సిరీస్: భారత్-ఎపై శ్రీలంక-ఎ విజయం

    • భారత్-ఎ స్కోర్ 265/10, శ్రీలంక-ఎ స్కోర్ 265/9

    • సూపర్ ఓవర్లో గెలిచిన శ్రీలంక-ఎ

    పూర్తి కథనం

  • Jun 15, 2026 18:49 IST

    విజయవాడ: థార్‌ జీపుల ఫైట్‌ కేసు నిందితులకు బెయిల్

    • బొల్లా ఓం, లింగమనేని రోహిత్‌లకు బెయిల్‌ మంజూరు

  • Jun 15, 2026 18:48 IST

    హైదరాబాద్‌: మియాపూర్‌లో భార్య ఆత్మహత్య కేసులో భర్త అరెస్ట్

    • భూపేంద్ర సాహును అరెస్ట్ చేసిన పోలీసులు

  • Jun 15, 2026 18:41 IST

    మైసూర్‌లోని పబ్‌లో అగ్నిప్రమాదం.. ఇద్దరి మృతి

    • కిచెన్‌లో సిలిండర్ పేలి భారీగా ఎగిసిపడుతున్న మంటలు

    • 12 మందికి తీవ్ర గాయాలు, కొనసాగుతున్న సహాయక చర్యలు

  • Jun 15, 2026 18:32 IST

    డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీ

    • హాజరైన మంత్రులు తుమ్మల, ఉత్తమ్, శ్రీధర్‌బాబు

    • ఎగుమతి రకాల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని నిర్ణయం

    • నాణ్యమైన బియ్యం ఉత్పత్తి, నిల్వ సహా మార్కెటింగ్ వ్యవస్థలను బలోపేతం చేయాలని నిర్ణయం

    • రైతుల ఆదాయం పెంపు, మార్కెట్ అనుసంధానం కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని నిర్ణయం

  • Jun 15, 2026 18:18 IST

    మోదీ పాలనలో అవినీతికి తావులేదు: ఎంపీ అర్వింద్‌

    • దేశంలో నక్సలిజం పూర్తిగా అంతమైంది: ఎంపీ అర్వింద్‌

    • సంక్షేమ పథకాల్లో రేవంత్ సర్కార్ విఫలం: ఎంపీ అర్వింద్‌

    • కమీషన్లు వచ్చే పనులే చేస్తున్నారు: ఎంపీ అర్వింద్‌

    • సీఎం సహా మంత్రులంతా అవినీతి చేస్తున్నారు: అర్వింద్‌

  • Jun 15, 2026 18:18 IST

    ముక్కోణపు సిరీస్: శ్రీలంక-ఎ, భారత్-ఎ మ్యాచ్ టై

  • Jun 15, 2026 18:08 IST

    ఢిల్లీ, రాజస్థాన్ సహా ఉత్తరాది రాష్ట్రాలలో భారీ ఈదురు గాలులు

    • రాజస్థాన్‌లోని షకావత్, చురులో దుమ్ము ధూళితో కూడిన ఇసుక తుపాను

    • ఇసుక తుపాను ధాటికి పలు ప్రాంతాలను కమ్మేసిన దుమ్ము ధూళి

  • Jun 15, 2026 18:04 IST

    ఎన్టీఆర్‌: నందిగామ, కంచికచర్లలో ఈదురుగాలులతో వర్షం

    • ఎ.కొండూరు తండాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం

  • Jun 15, 2026 17:36 IST

    కాకినాడ: చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యంపై ఎస్పీ బిందుమాధవ్‌

    • పాపను ముందస్తు ప్రణాళికతో కిడ్నాప్‌ చేశారని భావించట్లేదు: ఎస్పీ

    • చిన్నారిని ఎవరైనా తీసుకెళ్లారేమో అనే కోణంలో దర్యాప్తు: ఎస్పీ

    • చిన్నారి కోసం పోలీసులు, NDRF, SDRFతో గాలింపు: ఎస్పీ

  • Jun 15, 2026 17:22 IST

    జైపూర్‌లో కాక్రోచ్‌ పార్టీ వ్యవస్థాపకుడిపై దాడి

    • అభిజిత్‌ దీప్కేపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి

    • ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలో దాడి

  • Jun 15, 2026 16:36 IST

    క్రికెట్‌ను వదిలేయాలని అనుకున్నా: శ్రేయాంక పాటిల్

    • తన కెరీర్‌లో ఎదుర్కొన్న కఠిన దశ గురించి వెల్లడించిన శ్రేయాంక

    • గాయాల కారణంగా చాలాకాలం పాటు ఆటకు దూరమైన శ్రేయాంక

    • అప్పుడు డిప్రెషన్‌లోకి వెళ్లా.. క్రికెట్ వదిలేయాలనుకున్నా: శ్రేయాంక

  • Jun 15, 2026 16:23 IST

    సీఎం రేవంత్‌కు భయం పట్టుకుంది: టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు

    • పదవి పోతుందన్న ఆలోచనతో ఏదేదో మాట్లాడుతున్నారు

    • కేంద్రంపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారు

    • హైదరాబాద్ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది

    • రాజకీయ విమర్శలతోనే సీఎం రేవంత్ కాలం గడుపుతున్నారు

    • ప్రజలకు ఇచ్చిన హామీలపై రేవంత్‌ మాట్లాడాలి

    • సీఎం రేవంత్‌వి అన్నీ డైవర్షన్‌ పాలిటిక్స్‌

  • Jun 15, 2026 16:22 IST

    హైదరాబాద్: ORR ఎగ్జిట్ 18A–నార్సింగి రింగ్‌రోడ్ కనెక్టివిటీపై కీలక నిర్ణయం

    • మంచిరేవుల పరిధిలో భూసేకరణకు టీజీ సర్కార్‌ గ్రీన్ సిగ్నల్

    • ORR ఎగ్జిట్-18A నుంచి నార్సింగి రింగ్‌రోడ్‌ వరకు మూసీ నది వెంట కొత్త సర్వీస్ రోడ్‌, ప్రధాన వంతెన నిర్మాణం

  • Jun 15, 2026 16:21 IST

    చైనాకు పోటీగా ఒప్పందం దిశగా భారత్‌-అమెరికా

    • భారత్‌ నుంచి 'క్రిటికల్ మినరల్స్‌' దిగుమతి చేసుకోనున్న అమెరికా

    • ఫ్రాన్స్‌ G-7 దేశాల సదస్సులో కీలక ఒప్పందం చేసుకోనున్న భారత్‌-అమెరికా

  • Jun 15, 2026 16:20 IST

    ట్రాన్స్‌జెండర్ల హక్కుల సవరణ చట్టం వివాదంపై సుప్రీం కీలక నిర్ణయం

    • దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో ఉన్న అన్ని కేసులను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వం పిటిషన్

    • భిన్నమైన తీర్పుల వల్ల గందరగోళం తలెత్తకుండా ఉండేందుకే కేసులను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని కోరిన కేంద్రం

    • హైకోర్టుల్లో జరుగుతున్న విచారణలపై సుప్రీంకోర్టు స్టే

    • కొత్త చట్టం రాజ్యాంగ బద్ధతను నేరుగా తామే విచారిస్తామన్న సుప్రీం

    • కేంద్రం పిటిషన్‌ను స్వీకరిస్తూ.. ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు

  • Jun 15, 2026 16:15 IST

    భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

    • 736 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్

    • 231 పాయింట్ల లాభంతో ముగిసిన నిఫ్టీ

  • Jun 15, 2026 15:59 IST

    గోల్కొండలో సంచలనం సృష్టించిన హత్య కేసును ఛేదించిన పోలీసులు

    • ప్రధాన నిందితుడు సహా నలుగురి అరెస్ట్

    • నిందితులకు జ్యుడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు

    • ప్రేమ వివాహమే ఈ హత్యకు కారణమని వెల్లడించిన పోలీసులు

  • Jun 15, 2026 15:22 IST

    నందిగామలో కొత్త తరహా మోసం

    • ఫోన్‌తో పరారై రూ.99 వేల నగదు కాజేసిన మాయగాడు

  • Jun 15, 2026 15:21 IST

    భారత్‌తో హ్యాండ్‌షేక్ వివాదం: పాకిస్థాన్ కోచ్ రియాక్షన్ ఇదే

    • మహిళల టీ20 ప్రపంచ కప్: పాక్‌పై భారత్ ఘన విజయం

    • టాస్ సమయంలో హ్యాండ్‌షేక్ ఇచ్చుకోని ఇరుజట్ల ప్లేయర్లు

    • ఈ అంశంపై స్పందించిన పాక్ కోచ్

    • హ్యాండ్‌షేక్‌ వల్ల ఒరిగేదేమీ లేదంటూ వ్యాఖ్య

  • Jun 15, 2026 15:19 IST

    SIR, మీనాక్షి వివాదంపై టీబీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు స్పందన

    • SIR వల్ల ఓట్లు తొలగిస్తే కేరళంలో UDF ఎలా గెలిచింది?

    • తెలంగాణలో పాక్‌, బంగ్లాదేశ్‌ వారికి ఓట్లు ఉన్నాయి

    • ఓట్‌ చోరీ, సీట్‌ చోరీ చేసేది కాంగ్రెస్సే: రాంచందర్‌రావు

    • సీట్‌ చోరీతో నెహ్రూ, ఇందిర ప్రధానులయ్యారు: రాంచందర్‌రావు

    • పౌరసత్వం రాకముందే సోనియా ఓటు వేశారు: రాంచందర్‌రావు

  • Jun 15, 2026 15:18 IST

    చిత్తూరు: పులిగుండులో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం

    • యోగాలో పాల్గొన్న కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే థామస్

    • గంటపాటు యోగాసనాలు చేసిన కలెక్టర్, ఎమ్మెల్యే

    • రోజూ అరగంట వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చన్న ఎమ్మెల్యే థామస్

    • యోగా చేద్దాం.. ఆరోగ్యంగా జీవిద్దామన్న కలెక్టర్ సుమిత్ కుమార్

  • Jun 15, 2026 15:15 IST

    మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేసిన మంత్రి లోకేశ్, బ్రాహ్మణి దంపతులు

    • హైదరాబాద్ నివాసంలో వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

    • విశిష్టమైన సోమవారం సందర్భంగా రుద్రాభిషేకం నిర్వహించిన లోకేశ్ దంపతులు

    • రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమం కోసం మహాశివుడికి అభిషేకం

    • వేదమంత్రోచ్ఛారణల మధ్య భక్తిశ్రద్ధలతో పూజలు చేసిన లోకేశ్ దంపతులు

  • Jun 15, 2026 15:11 IST

    RTI యాక్టివిజంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

    • సమాచార హక్కు (RTI) ఉద్యమం కొత్త వ్యాపారంగా మారింది: సుప్రీం

    • RTI కార్యకర్త అని చెప్పుకుంటూ కొందరు బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నారని సుప్రీంకోర్టు ఆగ్రహం

    • ఇలాంటి ప్రవృత్తిని అనుమతించలేమని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు

  • Jun 15, 2026 15:10 IST

    ఢిల్లీ: ఈడీ ముందు హాజరైన అభిషేక్ బెనర్జీ

    • ప్రైమరీ స్కూలు ఉద్యోగాల కుంభకోణం కేసులో విచారణ

    • ఈ స్కాములో లబ్ధిదారుడుగా అభిషేక్ ఉన్నట్టు అనుమానిస్తున్న ఈడీ

  • Jun 15, 2026 15:01 IST

    మహబూబాబాద్‌లోని కాలేజీలో అశ్లీల చిత్రాల కలకలం

    • ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజీలో తరగతి గదుల గోడలపై అశ్లీల చిత్రాలు, అసభ్యకరమైన రాతలు

    • విస్తుపోయిన విద్యార్థులు, అధ్యాపకులు

    • విద్యాలయంలో అశ్లీల చిత్రాలు, రాతలపై విద్యార్థి సంఘాల ఆగ్రహం

    • ఇది కళాశాల ఫిజికల్ డైరెక్టర్ విష్ణు గణేష్ పనే అని కళాశాల ప్రిన్సిపాల్ గండి విష్ణు ఆరోపణ

  • Jun 15, 2026 15:00 IST

    చిత్తూరు: కుప్పంలో 35 మంది వైసీపీ నేతలపై కేసు నమోదు

    • ఈ నెల 12న అనుమతులు లేకుండా వైసీపీ నేతల ర్యాలీ

    • కుప్పం పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన వైసీపీ నేతలు

    • పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు

  • Jun 15, 2026 14:59 IST

    అమరావతి: ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి కామెంట్స్..

    • అధికారం కోల్పోయిన నాటి నుంచి నిత్యం కుట్రలు చేస్తున్న వైసీపీ ముఠా

    • ప్రజా రాజధాని అమరావతిపై కుల విషం చిమ్మి రాజకీయ పబ్బం గడుపుకున్నారు

    • అమరావతి అందరిది.. 34,323 ఎకరాల్లో అన్ని కులాల వారి భూములు ఉన్నాయి

    • రాజధాని భూముల్లో ఎస్సీ, ఎస్టీలు 32%, రెడ్లు 23%, బీసీలు 14% ఉన్నారు

    • అమరావతిలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన రైతులు కేవలం 18 శాతమే

    • అధికారిక లెక్కలు స్పష్టంగా ఉన్నా ఒకే కులానికి అంటగట్టడం వైసీపీ కుట్ర

  • Jun 15, 2026 14:56 IST

    జపాన్ ప్రజల క్రమశిక్షణకు ప్రపంచం ఫిదా

    • ఫిఫా మ్యాచ్ అనంతరం స్టేడియాన్ని శుభ్రం చేసిన జపాన్ ఫ్యాన్స్

    • ఇందుకు సంబంధించిన వీడియోలకు నెట్టింట భారీ స్పందన

    • క్రమశిక్షణకు జపాన్ మారుపేరంటూ జనాల ప్రశంసలు

  • Jun 15, 2026 14:54 IST

    IND VS SL: బ్యాటింగ్ ప్రారంభించక ముందే శ్రీలంక-ఏ ఖాతాలో 10 పరుగులు

    • లక్ష్య ఛేదనను 10/0తో ప్రారంభించనున్న శ్రీలంక-ఏ

    • భారత బ్యాటర్ విప్రాజ్‌ డేంజర్‌ ఏరియాలోకి రావడంతో 10 పరుగుల పెనాల్టీ

    • శ్రీలంక లక్ష్యం ప్రస్తుతం 50 ఓవర్లలో 256 పరుగులు

  • Jun 15, 2026 14:44 IST

    సమస్యలపై మాట్లాడదామంటే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సమయం ఇవ్వరు: సీఎం రేవంత్

    • కిషన్‌రెడ్డి బాధ్యత తీసుకుని మాట్లాడాలి: సీఎం

    • రుణం ఇవ్వకపోతే కనీసం NOC అయినా ఇప్పించరా?: సీఎం

    • నిధులు ఇప్పించి NOC ఇస్తే శాలువా కప్పి సన్మానిస్తాం: సీఎం

  • Jun 15, 2026 14:44 IST

    లోన్‌ బదిలీ కాకుండా కిషన్‌రెడ్డి వల్లే ఆగింది: సీఎం రేవంత్

    • మెట్రో విస్తరణకు రూ.40 వేల కోట్లు కావాలి: సీఎం

    • అంతా మేమే భరిస్తాం.. NOC ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం: సీఎం

    • కేంద్రం భాగస్వామ్యం లేకుండా మెట్రో విస్తరిస్తామన్నాం: సీఎం

    • రాజకీయంగా నష్టం జరుగుతుందని కుట్ర పన్నారు: సీఎం

    • మెట్రో విస్తరణను బీఆర్ఎస్, బీజేపీ అడ్డుకుంటున్నాయి: సీఎం

    • మెట్రో విస్తరణ జరిగేచోట బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలే ఉన్నారు: సీఎం

  • Jun 15, 2026 14:42 IST

    IRFC రుణం బదిలీ ప్రక్రియకు అంతా సిద్ధం చేశాం: సీఎం రేవంత్‌

    • రూ.84కోట్ల డాక్యుమెంట్ ఫీజు కూడా చెల్లించాం: సీఎం

    • ఈక్విటీ కింద రూ.1,400 కోట్లు జమ చేశాం: సీఎం

    • రూ.13,400 కోట్లకు 4శాతం వడ్డీకి 20ఏళ్లకు ఒప్పించాం: సీఎం

    • మే 21న అశ్వినీ వైష్ణవ్‌ను కిషన్‌రెడ్డి కలిసి అడ్డుపడ్డారు: సీఎం

    • తెలంగాణలో బీజేపీ ఉండాలా? వద్దా? అని ఒత్తిడి చేశారు: సీఎం

    • కిషన్‌రెడ్డి వల్లే రుణం బదిలీ ఆగిపోయింది: సీఎం

    • మెట్రో ప్రాజెక్ట్‌ను కిషన్‌రెడ్డే అడ్డుకుంటున్నారు: సీఎం

    • కిషన్‌రెడ్డి నిధులు విడుదల చేయిస్తారా? లేదా?: సీఎం

  • Jun 15, 2026 14:40 IST

    కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కేసీఆర్ తిట్టినట్లు నేను తిట్టలేదు: సీఎం రేవంత్‌

    • కేసీఆర్‌ డైరెక్షన్‌లోనే కిషన్‌రెడ్డి పనిచేస్తున్నారు: సీఎం

    • కేసీఆర్‌కు లొంగిపోయి కిషన్‌రెడ్డే అడ్డుపడుతున్నారు: సీఎం

    • కిషన్‌రెడ్డి వెనుక కేటీఆర్‌ ఉన్నారు: సీఎం

    • కేటీఆర్‌ కుట్రలకు కిషన్‌రెడ్డి సహకరిస్తున్నారు: సీఎం

    • కేటీఆర్‌ కుట్రలు చేస్తుంటే.. కిషన్‌రెడ్డి అమలు చేస్తున్నారు: సీఎం

    • కిషన్‌రెడ్డికి అంత తెలివిలేదు.. కేటీఆర్‌ చెప్పిందే చేస్తున్నారు: సీఎం

  • Jun 15, 2026 14:38 IST

    దేశంలో భారీగా పెరిగిన ద్రవ్యోల్బణం

    • ప్రస్తుతం 9.68 శాతంగా ద్రవ్యోల్బణం నమోదు

  • Jun 15, 2026 14:38 IST

    భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

    • 900 పాయింట్లకుపైగా లాభంలో సెన్సెక్స్

    • 300 పాయింట్లకుపైగా లాభంలో నిఫ్టీ

  • Jun 15, 2026 14:38 IST

    ఎంపీ రఘునందన్‌ రాజీనామా సవాల్‌పై సీఎం రేవంత్‌ స్పందన

    • 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ హామీ ఇచ్చారు: రేవంత్‌

    • దేశ ప్రజల ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని మోదీ అన్నారు

    • హామీలపై మోదీ రాజీనామా చేస్తే నేను మా కేబినెట్‌ రద్దు చేసేందుకు సిద్ధం: సీఎం రేవంత్‌

  • Jun 15, 2026 14:29 IST

    అవును.. కోహ్లీ అహంకారి: రవి శాస్త్రి

    • విరాట్‌ను అహంకారి అంటూ పెట్టిన ఓ పోస్టుపై స్పందించిన రవి శాస్త్రి

    • మైదానంలో ఉన్నంత వరకే విరాట్ అహంకారి: రవి శాస్త్రి

    • గ్రౌండ్ దాటిన తర్వాత ఉండే కోహ్లీ పూర్తిగా భిన్నం: రవి శాస్త్రి

  • Jun 15, 2026 14:28 IST

    వైసీపీ నేత అమర్‌నాథ్‌పై ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు ధ్వజం

    • హోంమంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్

    • అమర్‌నాథ్ వ్యాఖ్యలు మహిళా లోకాన్ని అవమానించేలా ఉన్నాయి: పల్లా

    • మహిళలను అవమానించడం వైసీపీ విధానమా?: పల్లా

    • మహిళా మంత్రిపై వ్యక్తిగత దూషణలు వైసీపీ దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనం: పల్లా

  • Jun 15, 2026 14:05 IST

    IND vs SL: ముగిసిన భారత్-ఏ బ్యాటింగ్

    • భారత్-ఏ స్కోర్ 265/10

    • హాఫ్ సెంచరీలతో రాణించిన సూర్యాంశ్ షెడ్జే(72), విప్రాజ్ నిగమ్(51)

    • రుతురాజ్ గైక్వాడ్(37), తిలక్ వర్మ(23)

    • శ్రీలంక- ఏ జట్టు టార్గెట్ 266

  • Jun 15, 2026 13:48 IST

    కేసీఆర్ వచ్చాక మెట్రో నిర్మాణంలో నిర్లక్ష్యం వహించారు: సీఎం రేవంత్ రెడ్డి

    • 2014-17 మధ్య మెట్రో పనులు పూర్తిగా ఆగిపోయాయి: రేవంత్

    • కేసీఆర్ సాకులు చెప్పి మెట్రో పనులు మూడేళ్లు ఆలస్యం చేశారు

    • రూ.7వేల కోట్ల అంచనాలు పెరిగేలా చేశారు: సీఎం రేవంత్‌రెడ్డి

    • మేం అధికారంలోకి రాగానే మెట్రో విస్తరణపై దృష్టి పెట్టాం: సీఎం రేవంత్ రెడ్డి

  • Jun 15, 2026 13:41 IST

    హైదరాబాద్‌ను విశ్వనగరం అని చెప్పుకుంటున్నాం: సీఎం రేవంత్‌రెడ్డి

    • అంతర్జాతీయ ప్రమాణాలతో రవాణా సౌకర్యం ఉండాలి: సీఎం రేవంత్‌రెడ్డి

    • ఉమ్మడి రాష్ట్రంలోనే హైదరాబాద్‌ అభివృద్ధికి కృషి చేశారు

    • కాంగ్రెస్ హయాంలోనే మెట్రో పనులు ప్రారంభమయ్యాయి

    • రూ.15వేల కోట్లతో పనులు ప్రారంభించారు: సీఎం రేవంత్‌రెడ్డి

  • Jun 15, 2026 13:22 IST

    స్లొవేకియాలో ప్రధాని మోదీ పర్యటన

    • వందేమాతరం గీతంతో మోదీకి స్వాగతం

    • భారత జాతీయ గీతాన్ని ఆలపించిన స్లొవేకియా బృందం

    • స్లొవేకియాలో పర్యటించిన భారత తొలి ప్రధానిగా మోదీ

  • Jun 15, 2026 13:09 IST

    మెదక్: అక్కన్నపేటలో సెల్ టవర్ ఎక్కి రైతు నిరసన

    • తన భూమిని కబ్జా చేశారని, న్యాయం చేయాలని డిమాండ్

    • రైతు శ్రీనివాస్‌ను కిందకు దింపేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు

  • Jun 15, 2026 13:08 IST

    ఇరాన్-అమెరికా ఒప్పందాన్ని స్వాగతించిన ప్రధాని మోదీ

    • పశ్చిమాసియాలో శాంతికి ఈ ఒప్పందం సహకరిస్తుంది: మోదీ

  • Jun 15, 2026 12:54 IST

    నంద్యాల: పాణ్యం నూలు మిల్లు సమీపంలో ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం

    • అదుపుతప్పి డివైడర్‌పైకి దూసుకెళ్లిన హైదరాబాద్–తిరుపతి బస్సు

    • ప్రమాద సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు

    • డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం

    • ప్రాణనష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు

  • Jun 15, 2026 12:51 IST

    ట్రంప్‌ డీల్‌తో మాకే సంబంధం లేదు: ఇజ్రాయెల్

    • ట్రంప్ డీల్‌కు కట్టుబడి ఉండనక్కర్లేదన్న ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్

    • గతంలో ఒత్తిడులకు తలొగ్గి మూల్యం చెల్లించుకున్నామని వ్యాఖ్య

    • అమెరికా అంటే ఎంతో గౌరవం ఉందని స్పష్టీకరణ

    పూర్తి కథనం..

  • Jun 15, 2026 12:49 IST

    హోర్ముజ్‌ జలసంధిని తెరవడానికి సహకరించేందుకు సిద్ధమైన ఫ్రాన్స్‌, బ్రిటన్‌

    • ఈ విషయాన్ని ఎక్స్‌ వేదికగా వెల్లడించిన ఫ్రాన్స్‌ అధ్యక్షుడు

    • అంతర్జాతీయ వాణిజ్యానికి హోర్ముజ్‌ జలసంధి అత్యంత కీలక మార్గమని గుర్తుచేసిన మేక్రాన్‌

    • హోర్ముజ్‌ రీఓపెనింగ్‌ ఆపరేషన్‌లో పాల్గొనడానికి ఇప్పటికే ఆసక్తి చూపిన బ్రిటన్‌

    • పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక పరిణామం

  • Jun 15, 2026 12:45 IST

    SIRపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌వి అనవసర విమర్శలు: రాంచందర్‌రావు

    • దొంగ ఓట్లను తొలగించడానికే SIR: రాంచందర్‌రావు

    • బంగ్లాదేశీయులు, రొహింగ్యాలను ఓటర్‌ లిస్ట్‌ నుంచి తొలగించవద్దా?

    • రొహింగ్యాలకు హైదరాబాద్‌లో ఓటు హక్కు ఇద్దామా?: రాంచందర్‌రావు

    • దొంగ ఓట్లను చేర్చడంలో కాంగ్రెస్‌ ఎక్స్‌పర్ట్‌: రాంచందర్‌రావు

    • ఓట్ల చోరీ చేసిందే కాంగ్రెస్‌ పార్టీ: రాంచందర్‌రావు

  • Jun 15, 2026 12:43 IST

    ముగిసిన ఫిలింఛాంబర్ సబ్ కమిటీ సమావేశం

    • రాబోయే సినిమాలను పర్సంటేజీ విధానంలో ప్రదర్శించేందుకు సిద్ధమన్న నిర్మాతలు‌

    • అయితే అది ఎంత పర్సంటేజీ అనేది త్వరలో నిర్ణయించనున్న సబ్ కమిటీ

    • వారం రోజుల అనంతరం మరోసారి సమావేశం

  • Jun 15, 2026 12:37 IST

    ఇందిరా గాంధీ జీవించి ఉంటే బీజేపీని నిషేధించేవారు: అశోక్‌ గహ్లోత్‌

    • జైపుర్‌లో జరిగిన అవార్డుల కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేత వ్యాఖ్యలు

    • ప్రస్తుతం దేశంలో పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని అభిప్రాయం

    • ప్రజలు ఇప్పటికైనా మేల్కోవాలని పిలుపునిచ్చిన గహ్లోత్‌

    • లేదంటే దాని పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిక

    • గహ్లోత్‌ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం

  • Jun 15, 2026 12:34 IST

    సింగపూర్‌లో UN హాబిటాట్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ

    • ఏపీలో UN హాబిటాట్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరిన సీఎం

    • UN హాబిటాట్‌తో భాగస్వామ్యం కోరుకుంటున్నామన్న చంద్రబాబు

    • సానుకూలంగా స్పందించిన UN హాబిటాట్ ప్రతినిధులు

    • ఏపీలో 'రైజప్' కార్యక్రమాన్ని అమలు చేయాలని సీఎం ప్రతిపాదన

  • Jun 15, 2026 12:21 IST

    తెలంగాణ వ్యాప్తంగా నిలిచిన వాహన సారథి సాఫ్ట్‌వేర్

    • సేవలు నిలిచిపోవడంతో రవాణా శాఖ ఆఫీసుల్లో భారీగా క్యూలు

    • పునరుద్ధరణకు సమయం పడుతుందంటున్న అధికారులు

  • Jun 15, 2026 12:20 IST

    హైదరాబాద్: సచివాలయం దగ్గర వాల్ పోస్టర్ల కలకలం

    • ఉచిత పథకాలు వద్దు.. పేదలకు ఇళ్లు, ఉద్యోగాలివ్వాలని పోస్టర్లు

    • నిన్న రాత్రి సచివాలయం దగ్గర పోస్టర్లు అంటించిన మహిళ

    • రమ్య అనే మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • Jun 15, 2026 11:58 IST

    తెలంగాణ ఏర్పాటును నేను వ్యతిరేకించలేదు: ఏపీ డిప్యూటీ సీఎం పవన్

    • ఏపీని కాంగ్రెస్ విభజించిన తీరుపైనే ఆవేదన వెలిబుచ్చాం: పవన్ కల్యాణ్

    • తెలంగాణ విభజనకు ఏనాడూ జనసేన అడ్డు చెప్పలేదు: పవన్

    • కాంగ్రెస్ విభజించిన తీరు.. అసంతృప్తి, అశాంతిని సృష్టించింది: పవన్

    • ఇప్పటికీ ఆస్తుల పంపిణీ, తదితర సమస్యలు అలానే ఉన్నాయి: పవన్

    • ఢిల్లీ మెడలు వంచుతామని చాలా మంది మాట్లాడుతున్నారు: పవన్

    • కానీ ఢిల్లీకి రాగానే ఎవరి నోర్లు పెగలవు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

    పూర్తి కథనం..

  • Jun 15, 2026 11:51 IST

    నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా-ఏ

    • శ్రీలంక-ఏ జట్టుతో భారత్-ఏ మ్యాచ్

    • 23 పరుగులకే ఔటైన కెప్టెన్ తిలక్ వర్మ

    • ప్రస్తుతం 22 ఓవర్లకు భారత్-ఏ స్కోర్ 115/4

  • Jun 15, 2026 11:50 IST

    మరోసారి విఫలమైన వైభవ్ సూర్యవంశీ!

    • శ్రీలంక-ఏ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో 21 పరుగులకే ఔటైన వైభవ్

    • తొలి మ్యాచ్ లోనూ కేవలం14 పరుగులు చేసిన వైభవ్

    • లిస్ట్-ఏ మ్యాచ్‌లో విఫలమవుతున్న వైభవ్

    పూర్తి కథనం..

  • Jun 15, 2026 11:31 IST

    భారత మహిళా క్రీడాకారిణి దీప్తి శర్మ కీలక వ్యాఖ్యలు

    • పాక్‌తో మ్యాచ్ అనంతరం దీప్తి కీలక వ్యాఖ్యలు

    • ఒత్తిడి పరిస్థితుల్లో ఆడటం నాకు ఇష్టం: దీప్తి

    • ప్రాక్టీస్ వేళ నేర్చుకున్నవే మైదానంలో అమలు చేయడానికి ప్రయత్నిస్తాను: దీప్తి

  • Jun 15, 2026 11:24 IST

    చెన్నై: సీఎం విజయ్, సంగీత విడాకుల కేసు విచారణ వాయిదా

    • తదుపరి విచారణ ఆగస్టు 7కు వాయిదా వేసిన చెంగల్పట్టు కోర్టు

    • గతేడాది డిసెంబర్‌లో విడాకుల కోసం సంగీత పిటిషన్

  • Jun 15, 2026 11:24 IST

    హైదరాబాద్: ఫిలించాంబర్‌లో సబ్ కమిటీ సమావేశం

    • హాజరైన సురేష్‌బాబు, దిల్‌రాజు, సబ్ కమిటీ సభ్యులు

    • పర్సంటేజ్ విధానం, చిన్న చిత్రాలకు థియేటర్స్ కొరతపై చర్చ

  • Jun 15, 2026 10:51 IST

    నిజామాబాద్: మోర్తాడ్ మండలం డొంకల్ గేట్ వద్ద మూడు గ్రామాల రైతుల ధర్నా

    • యూరియా యాప్‌ను రద్దు చేసి, పెంచిన ఎరువు ధరలను తగ్గించాలని డిమాండ్

    • యూరియాను పాత పద్ధతిలోనే అందించాలని రైతుల డిమాండ్

  • Jun 15, 2026 10:49 IST

    స్లొవేకియాలో ప్రధాని మోదీ పర్యటన

    • ఘన స్వాగతం పలికిన స్లొవేకియా ప్రధాని పీటర్

    • స్లొవేకియాలో పర్యటించిన భారత తొలి ప్రధానిగా మోదీ

  • Jun 15, 2026 10:49 IST

    సింగపూర్‌లో ఏపీ సీఎం చంద్రబాబు బిజీబిజీ

    • కాపిటలిస్టుల రౌండ్‌టేబుల్‌ సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు

    • హాజరైన సింగపూర్‌‌లోని భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే, మంత్రి నారాయణ తదితరులు

    • భారత్.. సంస్కరణలతో దూసుకుపోతున్న అతి పెద్ద ఆర్థిక శక్తి: సీఎం చంద్రబాబు

  • Jun 15, 2026 10:45 IST

    కేరళంలో నిఫా వైరస్ కలకలం

    • అప్రమత్తమైన తమిళనాడు ప్రభుత్వం

    • కేరళం, కర్ణాటక సరిహద్దులతో పాటు నీలగిరి, కోయంబత్తూరు తదితర జిల్లాల్లో మెడికల్ క్యాంప్‌లు

    • నిఫా లక్షణాలు ఉన్నవారిని గుర్తిస్తున్న అధికారులు

  • Jun 15, 2026 10:33 IST

    మంచిర్యాల: హరీష్‌రావుపై TRS చీఫ్ కవిత విమర్శలు

    • హరీష్ రూ.40లక్షల టన్నుల బొగ్గు స్కామ్ జరిగిందంటున్నారు: కవిత

    • సరైన సమాచారం లేకుండానే కోల్ బెల్ట్‌లో తిరుగుతున్నారు: కవిత

    • కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా హరీష్‌రావు మాయలో పడ్డారు: కవిత

    • హరీష్‌రావు లేఖ రాయగానే.. కిషన్‌రెడ్డి వెంటనే మరో లేఖ రాశారు: కవిత

  • Jun 15, 2026 10:32 IST

    భూపాలపల్లి: సింగరేణి KTK-5 గనిలో తప్పిన ప్రమాదం

    • బ్లాస్టింగ్ చేస్తుండగా చేతిలోనే పేలిన మందుగుండు

    • కార్మికుడి చేతికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు

    • ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన సింగరేణి అధికారులు

  • Jun 15, 2026 10:32 IST

    అంతర్జాతీయ మార్కెట్‌లో భారీగా తగ్గిన ముడిచమురు ధర

    • 83.30 డాలర్లకు పడిపోయిన బ్యారెల్ క్రూడాయిల్ ధర

    • అమెరికా-ఇరాన్ ఒప్పందంతో తగ్గిన చమురు ధరలు

  • Jun 15, 2026 10:31 IST

    నంద్యాల: శ్రీశైలం మల్లన్న సేవలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

    • అమ్మవారిని దర్శించుకున్న కిషన్‌రెడ్డి దంపతులు

    • కిషన్‌రెడ్డికి స్వాగతం పలికిన అర్చకులు, ఈవో శ్రీనివాసులు

  • Jun 15, 2026 10:30 IST

    భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

    • 1000 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్‌

    • 300 పాయింట్లకు పైగా పెరిగిన నిఫ్టీ

    పూర్తి కథనం..

  • Jun 15, 2026 10:29 IST

    ఫిఫా ప్రపంచ కప్ 2026: స్వీడన్ ఘన విజయం

    • ఫిపా వరల్డ్ కప్‌లో శుభారంభం చేసిన స్వీడన్

    • ట్యునీసియాపై 5-1 తేడాతో విజయం సాధించిన స్వీడన్

  • Jun 15, 2026 09:53 IST

    హైదరాబాద్: రూ.800 కోట్లతో అల్పాహార పథకం అమలు: మంత్రి పొన్నం

    • డ్రాపౌట్స్ తగ్గించి హాజరు శాతం పెంచడమే ప్రధాన లక్ష్యం: పొన్నం

    • ప్రభుత్వ విద్యను ప్రోత్సహించే విధంగా బడిబాట కార్యక్రమం: మంత్రి పొన్నం ప్రభాకర్

  • Jun 15, 2026 09:51 IST

    హైదరాబాద్: స్కూళ్లలో 'బ్రేక్‌ఫాస్ట్ విత్ మిల్క్' ప్రారంభం

    • పాఠశాల పునఃప్రారంభం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం

    • రాజ్‌భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అల్పాహారం పథకాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం

    • వారానికి 6 రోజులు పాలు, రాగి జావా పంపిణీ

    • ఇంటర్‌ విద్యార్థులకూ అల్పాహారం, మధ్యాహ్న భోజనం

    tg.jpg

  • Jun 15, 2026 09:26 IST

    ఫిఫా వరల్డ్ కప్ 2026: ఐవరీ కోస్ట్ విజయం

    • ఈక్వెడార్‌పై 1-0 తేడాతో ఐవరీ కోస్ట్ గెలుపు

    • మ్యాచ్ చివరి సమయంలో గోల్ కొట్టిన ఐవరీ కోస్ట్ ప్లేయర్

  • Jun 15, 2026 09:21 IST

    బంజారాహిల్స్‌లో ఓ సినీ నటికి వేధింపులు.. కేసు నమోదు

    • అవకాశాల పేరుతో.. ఓ వ్యక్తి లైంగికంగా వేధించాడని ఫిర్యాదు చేసిన నటి

    • కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్న బంజారాహిల్స్ పోలీసులు

  • Jun 15, 2026 09:14 IST

    హైదరాబాద్: మియాపూర్‌లో ఇంటర్ విద్యార్థి మృతి

    • తండ్రికి సహాయం చేస్తూ విద్యుత్ షాక్‌తో మహేష్‌ జాదవ్ మృతి

    • ఇంటర్‌లో 950 మార్కులు సాధించిన విద్యార్థి మహేష్‌ జాదవ్

  • Jun 15, 2026 09:01 IST

    మంచిర్యాల: కాసిపేట గని కార్మికులను కలిసిన కవిత

    • TRS పార్టీ పెట్టిన తర్వాత తొలి యాత్ర సింగరేణిలోనే చేస్తున్నాం: కవిత

    • HMSతో కలిసి కార్మికుల సమస్యలపై పోరాటం చేస్తాం: కవిత

    • ఒక్కో విభాగాన్ని ప్రైవేటుపరం చేస్తూ సింగరేణిని దెబ్బతీస్తున్నారు

    • సీఎం, డిప్యూటీ సీఎం కార్మికులను మభ్య పెడుతున్నారు: కవిత

    • సింగరేణి అభివృద్ధికి విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవాలి: కవిత

  • Jun 15, 2026 09:00 IST

    నిజామాబాద్: నాందేవ్ వాడ సాయిబాబా ఆలయంలో చోరీకి యత్నం

    • గేటు తాళాలు పగులగొడుతుండగా అప్రమత్తమైన స్థానికులు

    • ముగ్గురు దుండగుల పట్టివేత

    • నిందితులు హర్యానా వాసులు.. విచారిస్తున్న పోలీసులు

  • Jun 15, 2026 08:47 IST

    నెల్లూరు: సంగం మండలం దువ్వూరులో తీవ్ర విషాదం

    • ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్య

    • మృతులు తండ్రి మధుసూధనరావు, తల్లి రత్నావళి, కుమారుడు సుకృతిన్‌గా గుర్తింపు

  • Jun 15, 2026 08:47 IST

    నీట్ రీ ఎగ్జామ్ హాల్‌టికెట్ల విడుదల

    • వెబ్‌సైట్‌లో అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని NTA ప్రకటన

    • ఈనెల 21న నీట్ యూజీ-2026 రీ ఎగ్జామ్

  • Jun 15, 2026 08:04 IST

    రంగారెడ్డి జిల్లాలో రవాణా శాఖ అధికారుల దాడులు

    • స్కూల్ బస్సులపై అధికారుల ప్రత్యేక దృష్టి

    • ప్రతి బస్సునూ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న రవాణా శాఖ అధికారులు

    • నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభంతో తనిఖీలు

  • Jun 15, 2026 07:25 IST

    తెలంగాణలో నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం

    • రాజ్‌భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అల్పాహారం పథకాన్ని ప్రారంభించనున్న మంత్రి పొన్నం

  • Jun 15, 2026 07:25 IST

    నేటి నుంచి ఢిల్లీలో జనసేన ప్రత్యేక కార్యక్రమాలు

    • వివిధ రాష్ట్రాల నేతలతో భేటీకానున్న పవన్

    • సేనాగళం లక్ష్యాలను దేశ ప్రజలకు వివరించనున్న పవన్

  • Jun 15, 2026 07:24 IST

    కాకినాడ: ఇంకా దొరకని చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ

    • చిన్నారి కోసం 9 రోజులుగా గాలింపు

    • రంగంలోకి NDRF, SDRF బృందాలు

  • Jun 15, 2026 07:23 IST

    చెన్నై: నేడు సీఎం విజయ్, సంగీత విడాకుల కేసు విచారణ

    • చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విచారణ

    • గతేడాది డిసెంబర్‌లో విడాకుల కోసం సంగీత పిటిషన్

  • Jun 15, 2026 07:23 IST

    నేడు ఈడీ ముందుకు TMC నేత అభిషేక్ బెనర్జీ

    • మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరుకానున్న అభిషేక్

  • Jun 15, 2026 07:22 IST

    అంతర్జాతీయ మార్కెట్‌లో భారీగా తగ్గిన ముడిచమురు ధర

    • 84 డాలర్లకు పడిపోయిన బ్యారెల్ క్రూడాయిల్ ధర

    • అమెరికా-ఇరాన్ ఒప్పందంతో తగ్గిన చమురు ధరలు

  • Jun 15, 2026 06:23 IST

    బాపట్ల జిల్లా: సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో చోరీకి ప్రయత్నించిన దోపిడీ దొంగలు

    • చెంగల్పట్టు నుంచి కాకినాడ వెళ్తున్న రైలు

    • నిద్రిస్తున్న ప్రయాణికుల నుంచి ఆభరణాలు లాక్కునే ప్రయత్నం

    • ప్రతిఘటించి కేకలు వేసిన ప్రయాణికులు

    • చైన్ లాగి.. రైలు ఆగగానే పరారైన దొంగలు

    • దొంగలపై రైల్వే పోలీసుల కాల్పులు

    • చీకట్లో పరారైన దుండగులు.. బాపట్ల, అప్పికట్ల స్టేషన్ల మధ్య ఘటన

    పూర్తి కథనం..

  • Jun 15, 2026 05:54 IST

    ప్రైవేట్‌ స్కూళ్లు, కాలేజీల్లో ఫీజుల నియంత్రణపై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌

    • ఈ నెలలోనే రూల్స్‌ తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు

    • ఫీజుల నియంత్రణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్‌ ఆదేశాలు

  • Jun 15, 2026 05:53 IST

    ఏపీలో నేటి నుంచి SIR సర్వే ప్రారంభం

    • ఇంటింటికీ వచ్చి ఓటర్లకు ఎన్యూమరేషన్‌ ఫామ్స్‌ అందజేయనున్న బూత్‌ లెవల్‌ అధికారులు

    • తెలంగాణలో ఈ నెల 25 నుంచి SIR సర్వే ప్రారంభం

  • Jun 15, 2026 05:48 IST

    సింగపూర్‌లో ఇవాళ, రేపు పలు భేటీలకు హాజరుకానున్న సీఎం చంద్రబాబు

    • నేడు సింగపూర్ ప్రధాని సహా పారిశ్రామికవేత్తలతో భేటీలు

    • రేపు వరల్డ్ సిటీస్ సమ్మిట్‌లో పాల్గొని ప్రసంగించనున్న సీఎం

    • రేపు CII నిర్వహించే రోడ్ షోకు హాజరుకానున్న సీఎం చంద్రబాబు

  • Jun 15, 2026 05:48 IST

    నేడు లోక్‌సభ స్పీకర్‌ను కలవనున్న TMC రెబల్ ఎంపీలు

    • TMC తమదేనంటూ స్పీకర్‌కు లేఖ ఇవ్వనున్న ఎంపీలు

    • నేడు TMC రెబల్ ఎంపీలతో బెంగాల్ సీఎం సువేందు అధికారి భేటీ

  • Jun 15, 2026 05:47 IST

    అమెరికాతో అవగాహన ఒప్పందం కుదిరింది: ఇరాన్‌

    • ఒప్పందం కుదిరిందని ఇరాన్‌ డిప్యూటీ ఫారిన్‌ మినిస్టర్‌ ఘరీబా బాదీ ప్రకటన

    • ఈ నెల 19న స్విట్జర్లాండ్‌లో సంతకాలు, 60 రోజుల పాటు చర్చలు

    • లెబనాన్‌ సహా ఇతర ప్రాంతాల్లో నిలిచిపోనున్న మిలిటరీ ఆపరేషన్స్‌

    • డీల్‌ చేసుకుంటే శత్రువులను నమ్మినట్లు కాదు: ఘరీబా బాదీ

    • అమెరికా హామీలకు కట్టుబడి ఉంటుందో లేదో పరిశీలిస్తాం: ఇరాన్‌

    పూర్తి కథనం..

  • Jun 15, 2026 05:46 IST

    అమెరికా-ఇరాన్‌ మధ్య శాంతి ఒప్పందం

    • ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరినట్లు ట్రంప్‌ ప్రకటన

    • సుంకం లేకుండా హోర్ముజ్‌ జలసంధి తెరుచుకుంటుంది: ట్రంప్‌

    • ఇరాన్‌ ఓడరేవుల దిగ్బంధం ఎత్తివేయాలని ఆదేశించా: ట్రంప్‌

  • Jun 15, 2026 05:46 IST

    విజయనగరం: పోలీస్ క్రీడా మైదానంలో నేడు కూటమి విజయోత్సవ సభ

    • హాజరుకానున్న ఇన్‌చార్జ్‌ మంత్రి అనిత, కొండపల్లి శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు

  • Jun 15, 2026 05:46 IST

    నేటి నుంచి నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రారంభం

    • తొలి సర్వీస్‌ బెంగళూరుకు నడపనున్న ఇండిగో ఎయిర్‌లైన్స్‌

    • నోయిడా ఎయిర్‌పోర్ట్‌ నుంచి 16 చోట్లకు విమాన సర్వీసులు