అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం
ABN , Publish Date - Jun 15 , 2026 | 06:31 AM
కొన్ని నెలల పాటు ప్రపంచాన్ని కలవర పెట్టిన పశ్చిమాసియా ఉద్రిక్తతలకు ఎట్టకేలకు చెక్ పడింది. ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
ఇంటర్నెట్ డెస్క్: కొన్ని నెలల పాటు ప్రపంచాన్ని కలవర పెట్టిన పశ్చిమాసియా ఉద్రిక్తతలకు ఎట్టకేలకు చెక్ పడింది. ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఎలాంటి సుంకం లేకుండా హోర్ముజ్ జలసంధి తెరుచుకుంటుంది చెప్పారు. ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని సైన్యాన్ని ఆదేశించానని కూడా తెలిపారు. అమెరికా నావికా దళ దిగ్బంధనం కూడా తొలగిస్తున్నట్టు చెప్పారు. ‘షిప్‌ల ఇంజన్లను స్టార్ట్ చేయండి, ఆయిల్ తరలించండి’ అంటూ ఉత్సాహంగా పిలుపునిచ్చారు.
డీల్ కుదిరితే శత్రువును నమ్మినట్టు కాదు..
ఈ పరిణామాలపై ఇరాన్ కూడా స్పందించింది. అమెరికాతో అవగాహన ఒప్పందం కుదిరిందని ప్రకటించింది. యుద్ధం ముగించేందుకు ఒప్పందం కుదిరిందని తెలిపింది. ఇరాన్ డిప్యూటీ విదేశాంగ శాఖ మంత్రి ఘరీబా బాదీ ఈ ప్రకటన చేశారు. ఈ నెల 19న స్విట్జర్లాండ్‌లో ఒప్పందంపై సంతకాలు చేస్తామన్నారు. ఈ దిశగా దాదాపు 60 రోజుల పాటు చర్చలు జరిగాయని చెప్పారు. అయితే, డీల్ చేసుకున్నంత మాత్రాన శత్రువులను నమ్మినట్లు కాదని కూడా ఘరీబా బాదీ చెప్పారు. అమెరికా హామీలకు కట్టుబడి ఉంటుందో లేదో పరిశీలిస్తామని అన్నారు. ఈ ఒప్పందం నేపథ్యంలో లెబనాన్ సహా ఇతర ప్రాంతాల్లో మిలటరీ ఆపరేషన్స్ నిలిచిపోనున్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
బీరుట్‌పై దాడులు చేయకుండా ఉండాల్సింది.. ఇజ్రాయెల్‌పై ట్రంప్ అసంతృప్తి..
స్పేస్ ఎక్స్ ఐపీఓ.. సంస్థలో పని చేసిన వెల్డర్‌కూ జాక్‌పాట్..