Share News

ముక్కోణపు సిరీస్: సూపర్ ఓవర్‌లో శ్రీలంక-ఎ విజయం

ABN , Publish Date - Jun 15 , 2026 | 06:51 PM

ముక్కోణపు సిరీస్‌లో భాగంగా దంబుల్లా వేదికగా భారత్-ఎపై జరిగిన వన్డే మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా సాగింది. సూపర్ ఓవర్‌లో భారత్-ఎపై శ్రీలంక-ఎ విజయం సాధించింది.

ముక్కోణపు సిరీస్: సూపర్ ఓవర్‌లో శ్రీలంక-ఎ విజయం
India A vs Sri Lanka A

ఇంటర్నెట్ డెస్క్: ముక్కోణపు సిరీస్‌లో భాగంగా దంబుల్లా వేదికగా భారత్-ఎపై జరిగిన వన్డే మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా సాగింది. సూపర్ ఓవర్‌లో భారత్-ఎపై శ్రీలంక-ఎ విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య మ్యాచ్‌ ఫలితం టై కావడంతో సూపర్‌ ఓవర్‌ పెట్టారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 16/0 పరుగులు చేసింది. సహన్‌ అరాచ్చిగే (6*), అవిష్క ఫెర్నాండో (9*) రన్స్‌ చేశారు. అనంతరం ఛేదనకు దిగిన భారత్‌ 9/0 పరుగులు మాత్రమే చేసింది. సూర్యాంశ్‌ (3*), వైభవ్‌ సూర్యవంశీ (6*) రన్స్‌ చేశారు.


తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్-ఎ జట్టు 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. సూర్యాంశ్(72), విప్రాజ్ నిగమ్(51) హాఫ్ సెంచరీలు చేశారు. వైభవ్ సూర్యవంశీ(21) మరోసారి విఫలమయ్యాడు. మిగతా బ్యాటర్లంతా నిరాశపర్చారు. శ్రీలంక బౌలర్లలో షిరాజ్ 3, విజయకాంత్ 3, అరాచ్చిగే, మథులాన్, సహన్ తలొక వికెట్ పడగొట్టారు. విప్రాజ్ నిగమ్ చేసిన తప్పిదం వల్ల భారత్-ఎ టీమ్‌కు 10 పరుగుల పెనాల్టీని అంపైర్లు విధించారు. దీంతో శ్రీలంక-ఎ 10/0తో ఛేదన ప్రారంభించింది. 266 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక.. 50 ఓవర్లలో 265 పరుగులు చేసి భారత్ స్కోరును సమం చేసింది. శ్రీలంక బ్యాటర్ సదీరా సమరవిక్రమ(93) చెలరేగి ఆడాడు. త్రుటిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్ నిర్వహించారు. అందులో శ్రీలంక-ఎ విజయం సాధించింది.


ఇవి కూడా చదవండి:

భారత్‌తో హ్యాండ్‌షేక్ వివాదం: పాకిస్థాన్ కోచ్ రియాక్షన్ ఇదే

అవును.. మైదానంలో మాత్రం కోహ్లీ అహంకారే: రవి శాస్త్రి

Updated Date - Jun 15 , 2026 | 07:06 PM