Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Aug 11 , 2026 | 06:03 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Aug 11, 2026 21:34 IST

    రిటైర్డ్ IPS భార్య తనూజ రంజన్ హత్య కేసులో కీలక పరిణామం

    • నేపాల్ ముఠా సభ్యుడు సునీల్ బహదూర్ ఔజీపై పీడీ యాక్ట్

    • జూబ్లీహిల్స్‌లో మర్డర్ ఫర్ గెయిన్ కేసులో ప్రధాన నిందితుడిగా సునీల్

    • తనూజ రంజన్‌ను బంధించి చేసి హత్య చేసినట్లు తేల్చిన పోలీసులు

  • Aug 11, 2026 21:31 IST

    కొరియన్‌ కనకరాజు సినిమా సక్సెస్‌ మీట్‌లో చిరంజీవి

    • దర్శకులు బాధ్యతగా సినిమాలు తీయాలి: చిరంజీవి

    • నిర్మాతలను నమిలేయకుండా సినిమాలు చేయాలి: చిరంజీవి

    • సినిమా సక్సెస్‌లు తగ్గిపోతున్న తరుణంలో మరింత జాగ్రత్తగా సినిమాలు నిర్మించాలి: చిరంజీవి

  • Aug 11, 2026 20:59 IST

    సంగారెడ్డి: కోహీర్ మం. వెంకటాపూర్‌ దగ్గర రోడ్డు ప్రమాదం, ఇద్దరి మృతి

    • డివైడర్ పైనుంచి కారు అవతలవైపు పడటంతో ఎదురుగా వస్తున్న నాలుగు వాహనాలు ధ్వంసం

    • ఘటనలో ఇద్దరు వ్యక్తుల మృతి

  • Aug 11, 2026 20:56 IST

    సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి

    • ⁠జహీరాబాద్ మం. సత్వార్ గ్రామ సమీపంలో యూటర్న్ వద్ద ప్రమాదం

    • ⁠కూలీలను తీసుకెళ్తున్న ఆటోను ఢీకొన్న ట్యాంకర్

    • ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురి దుర్మరణం

    • ⁠మృతుల సంఖ్య పెరిగే అవకాశం

    • కర్ణాటక రాష్ట్రం హుమనాబాద్ నుండి జహీరాబాద్ వస్తుండగా ఘటన

  • Aug 11, 2026 20:40 IST

    అమరావతి: రేపు శాంతిభద్రతలపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

    • బుధవారం మ.3:30 గంటలకు సచివాలయంలో హైలెవల్ మీటింగ్

    • డీజీపీ నుంచి స్టేషన్ హౌస్ ఆఫీసర్ల వరకు 1,300 మంది అధికారుల హాజరు

    • శాంతిభద్రతలు, మహిళలు-చిన్నారులపై నేరాల కట్టడిపై సీఎం సమీక్ష

  • Aug 11, 2026 20:39 IST

    అమరావతి: MLC హరి ప్రసాద్‌కు అస్వస్థత

    • పరామర్శించిన వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్

  • Aug 11, 2026 20:12 IST

    MLC అనంతబాబు మధ్యంతర బెయిల్ కోసం కోర్టులో మరోసారి పిటిషన్

    • అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలని పిటిషన్

    • ఈనె 13న విచారణకు రానున్న అనంతబాబు బెయిల్ పిటిషన్

  • Aug 11, 2026 19:57 IST

    అన్నమయ్య: మదనపల్లిలోని ఓ షాపులో అగ్నిప్రమాదం

    • రూ.3 లక్షల విలువైన వస్తువులు దగ్ధం

    • మంటల్ని అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది

  • Aug 11, 2026 19:36 IST

    రాబోయే 3 గంటలు మన్యం, విజయనగరం జిల్లాకు రెడ్ అలర్ట్

    • అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం: రాష్ట్ర వాతావరణ శాఖ

    • గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం: రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ

  • Aug 11, 2026 19:34 IST

    విజయవాడ: పౌర సరఫరాల సంస్థ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్

    • పౌర సరఫరాల సేవల పర్యవేక్షణకు ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు: మంత్రి

    • పరిశీలన, పర్యవేక్షణకు ప్రాధాన్యం: మంత్రి

    • ప్రజలకు సేవలు తెలిసేలా ప్రత్యేక డ్యాష్ బోర్డు: మంత్రి

  • Aug 11, 2026 19:32 IST

    ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డిని మరోసారి కస్టడీ కోరిన పోలీసులు

    • మరో రెండు రోజులు కస్టడీ కోరిన పోలీసులు

    • కస్టడీపై ముగిసిన వాదనలు, ఈ నెల 14కు తీర్పు రిజర్వ్

    • ఉదయ్ కృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు

    • రేపు బెయిల్ పిటిషన్‌పై ఉప్పరపల్లి కోర్టులో కొనసాగనున్న వాదనలు

  • Aug 11, 2026 19:11 IST

    కర్నూలు: దేవ్‌నగర్‌లో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి టీజీ భరత్‌

    • ఆగిపోయిన కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తాం: టీజీ భరత్

    • దేవ్‌నగర్‌లో మరో కమ్యూనిటీ హాల్‌ నిర్మిస్తాం: టీజీ భరత్

    • కేసీ కెనాల్‌కు ఫెన్సింగ్‌ ఏర్పాటు: టీజీ భరత్

  • Aug 11, 2026 19:04 IST

    నెల్లూరు: ఆత్మకూరు మం. అల్లీపురంలో రెండు బైక్‌లు ఢీ

    • ముగ్గురికి తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు

  • Aug 11, 2026 18:53 IST

    మెదక్‌: మనోహరాబాద్‌లోని వైన్‌ షాపులో చోరీ

    • షాపు తాళాలు పగలగొట్టి 10 వేల నగదు చోరీ

    • సీసీటీవీ ఫుటేజీలో రికార్డైన చోరీ దృశ్యాలు

  • Aug 11, 2026 18:47 IST

    రేపు హైదరాబాద్‌ కిమ్స్‌లో NTR భుజానికి సర్జరీ

    • ఇటీవల జూనియర్ ఎన్టీఆర్‌ భుజానికి గాయం

    • భుజం గాయంతో కొన్నిరోజులుగా వైద్యుల పర్యవేక్షణలో ఎన్టీఆర్‌కు చికిత్స

  • Aug 11, 2026 18:36 IST

    జీనోమ్ వ్యాలీలో ‘యామ్జెన్’ అత్యాధునిక పరిశోధన కేంద్రం

    • తెలంగాణ ప్రభుత్వంతో యామ్జెన్ MoU

    • మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఒప్పందం

    • హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాల విస్తరణకు యామ్జెన్ నిర్ణయం

    • జీనోమ్ వ్యాలీలో రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్: శ్రీధర్ బాబు

  • Aug 11, 2026 18:35 IST

    స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఢిల్లీలో హైఅలర్ట్‌

    • 19 మంది మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల

  • Aug 11, 2026 18:35 IST

    కొలంబియా భారీ భూకంపంలో కూలిన 16 వందల భవనాలు

    • 225 మందికి చేరిన మృతుల సంఖ్య

  • Aug 11, 2026 18:24 IST

    విమానంలో కుదుపుల ఘటనపై ఎయిరిండియా CEOకు సమన్లు

    • పుకెట్‌-ఢిల్లీ ఎయిరిండియా విమానంలో కుదుపులు

  • Aug 11, 2026 18:03 IST

    మార్కాపురంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులో స్వల్ప అగ్ని ప్రమాదం

    • విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో బ్యాంకులో చెలరేగిన మంటలు

    • మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది

    • ఎటువంటి నష్టం జరగలేదని తెలిపిన బ్యాంకు మేనేజర్

  • Aug 11, 2026 17:55 IST

    సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి తొలగిన అడ్డంకులు

    • భూసేకరణ నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలు కొట్టివేసిన హైకోర్టు

    • అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి తొలగిన అడ్డంకులు

  • Aug 11, 2026 17:46 IST

    ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ

    • ఇంటింటిపై మువ్వన్నెల జెండా ఎగురవేయాలి: ప్రధాని మోదీ

    • స్వాతంత్ర్య దినోత్సవం నాడు గర్వంగా జెండా పండుగ జరుపుకుందాం: మోదీ

    • స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులు అర్పిద్దాం: ప్రధాని

    • వికసిత్ భారత్‌ కోసం మనమంతా ప్రతిజ్ఞ చేద్దాం: మోదీ

    • హర్ ఘర్‌, ఘర్‌ ఘర్‌, హర్ మన్‌ తిరంగా ప్రతిజ్ఞ చేద్దాం: ప్రధాని

  • Aug 11, 2026 17:44 IST

    జాతీయ విపత్తు నియంత్రణ నిధి కింద 18 నగరాలకు ఆర్థిక సాయం

    • 18 నగరాలను ఎంపిక చేసినట్లు పార్లమెంట్‌కు తెలిపిన కేంద్రం

    • తొలి దశలో హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, పుణె, ముంబై, అహ్మదాబాద్‌, కోల్‌కతా ఎంపిక

    • తొలి దశలో రూ.3,075 కోట్లతో వరద నిర్వహణ: కేంద్రం

  • Aug 11, 2026 17:41 IST

    వందేమాతరం చట్ట సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

    • రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా మారిన వందేమాతరం బిల్లు

  • Aug 11, 2026 17:27 IST

    హైదరాబాద్‌: 4 జిల్లాల కలెక్టర్లతో మంత్రి పొంగులేటి సమీక్ష

    • హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి కలెక్టర్లతో రివ్యూ నిర్వహించిన మంత్రి శ్రీనివాస్

    • భూముల రెగ్యులరైజేషన్‌ డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో పెట్టాలి: మంత్రి పొంగులేటి

    • ఈ నెల 14లోగా అన్ని డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో పెట్టాలి: మంత్రి పొంగులేటి

    • ఫోర్జరీ డాక్యుమెంట్లకు చెక్ పెట్టేందుకే ఆన్‌లైన్ విధానం: పొంగులేటి

    • 22A దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: పొంగులేటి

  • Aug 11, 2026 17:15 IST

    అసోసియేషన్ వివాదంపై జానీ మాస్టర్ స్పందన

    • తెలిసో తెలియకో తప్పులు జరిగాయి: జానీ మాస్టర్‌

    • పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించాలి: జానీ మాస్టర్‌

    • ఇక ముందు తప్పులు జరగకుండా చూసుకుందాం: జానీ మాస్టర్

    • డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో గ్రూపులు కట్టొద్దు: జానీ మాస్టర్‌

    • అందరం సమష్టిగా పనిచేద్దాం: జానీ మాస్టర్‌

  • Aug 11, 2026 17:04 IST

    జీవన్‌రెడ్డికి కాంగ్రెస్ ఏం తక్కువ చేసింది?: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

    • జీవన్‌రెడ్డి వరుసగా ఓడినా టికెట్లు ఇచ్చాం: మంత్రి అడ్లూరి

    • జీవన్‌రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఎంతో గౌరవం ఇచ్చారు: అడ్లూరి

    • BRSలో జీవన్‌రెడ్డికి కాదు.. ఆయన కోడలికి టికెట్‌ ఇస్తారు: అడ్లూరి

    • మమ్మల్ని అవమానించినా జీవన్‌రెడ్డిని గౌరవిస్తున్నాం: అడ్లూరి

  • Aug 11, 2026 16:52 IST

    తెలంగాణలో పీఎం సూర్యఘర్‌ పథకంలో స్కాం జరిగింది: రఘునందన్‌

    • 40 వేల ఇళ్లకు సోలార్ ప్యానెల్స్ పేరుతో రూ.200 కోట్ల కుంభకోణం జరిగింది: రఘునందన్‌

    • స్కాంపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి ఫిర్యాదు చేశా: ఎంపీ రఘునందన్

    • కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కోరా: రఘునందన్

  • Aug 11, 2026 16:47 IST

    FCRA బిల్లుపై కేంద్రం కీలక నిర్ణయం

    • JPCకి FCRA సవరణ బిల్లు పంపాలని నిర్ణయం

    • విస్తృత పరిశీలన కోసం JPCకి బిల్లు

    • అన్ని పార్టీల అభిప్రాయాల కోసం JPCకి బిల్లు

    • FCRA బిల్లును ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్‌ డిమాండ్‌

  • Aug 11, 2026 16:30 IST

    అనకాపల్లి: కశింకోట వద్ద ఆటోలో తరలిస్తున్న 60 కిలోల గంజాయి స్వాధీనం

    • నలుగురు వ్యక్తుల అరెస్ట్‌

    • ఆటో సహా రెండు బైక్‌ల స్వాధీనం

  • Aug 11, 2026 16:29 IST

    హైదరాబాద్‌: కోకాపేటలో ట్రంప్ టవర్స్‌ నిర్మాణం

    • ట్రంప్ ఆర్గనైజేషన్‌, ట్రిబెకా డెవలపర్స్‌, ఐరా రియాల్టీ సంయుక్త నిర్మాణం

    • 65 అంతస్తులతో రెండు ట్రంప్ టవర్ల నిర్మాణం

    • ట్రంప్ టవర్లలో అతి ఖరీదైన 450 ప్లాట్లు

    • ఇప్పటికే ట్రంప్ టవర్లకు రెరా అనుమతులు

  • Aug 11, 2026 16:06 IST

    అమరావతి: RTGSను సందర్శించిన GST కౌన్సిల్ అధికారులు

    • RTGS కమాండ్ కంట్రోల్ సెంటర్‌ పరిశీలన

    • RTGS పనితీరు అద్భుతం: GST కౌన్సిల్‌ అధికారులు

    • RTGS ఇతర రాష్ట్రాలకు ఆదర్శం: GST కౌన్సిల్‌ అధికారులు

  • Aug 11, 2026 15:59 IST

    అగ్రిగోల్డ్‌ కేసులో మరిన్ని అస్తుల జప్తునకు ఏపీ ప్రభుత్వం ఆదేశం

    • అగ్రిగోల్డ్‌కు చెందిన 6.55 ఎకరాల భూమి అటాచ్‌

    • పోరంకి, పెనమలూరు, ఈదరలోని భూముల అటాచ్‌మెంట్‌కు ఉత్తర్వులు

    • కర్ణాటకలోనూ అగ్రిగోల్డ్‌ భూముల అటాచ్‌మెంట్‌

    • అటాచ్ ఆస్తులపై లావాదేవీలు నిలిపివేయాలని ఆదేశం

    • అటాచ్ ఆస్తుల నియంత్రణ CIDకి అప్పగింత

  • Aug 11, 2026 15:58 IST

    HIV, ఎయిడ్స్‌పై రేపు అవగాహన ర్యాలీ: మంత్రి రాజనర్సింహ

    • రేపటి నుంచి 2 నెలలపాటు ప్రచార కార్యక్రమాలు: రాజనర్సింహ

    • హైదరాబాద్‌లో రేపు ఉ.7:00 గంటలకు ర్యాలీ: మంత్రి రాజనర్సింహ

  • Aug 11, 2026 15:57 IST

    డిసెంబర్‌లో 'ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్': సీఎం రేవంత్‌

    • మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేలా కార్యాచరణ రూపొందించాలి: రేవంత్

    • గత సమ్మిట్ పెట్టుబడులపై పూర్తి నివేదిక కోరిన సీఎం రేవంత్‌

    • అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లోబల్‌ సమ్మిట్ నిర్వహణకు ప్లాన్‌

  • Aug 11, 2026 15:51 IST

    హైదరాబాద్‌: పాతబస్తీ మెట్రో పనులపై సీఎం రేవంత్‌ సమీక్ష

    • పాతబస్తీ మెట్రో పనుల్లో వేగం పెంచాలి: సీఎం రేవంత్

    • మెట్రో పనులకు టెండర్ ప్రక్రియ ప్రారంభించాలి: సీఎం రేవంత్‌

    • పెండింగ్ భూసేకరణ పనులు వేగంగా పూర్తిచేయాలి: సీఎం రేవంత్‌

    • మెట్రో రద్దీకి అనుగుణంగా అదనపు కోచ్‌లు కొనుగోలు చేయాలి: రేవంత్

    • ప్రస్తుత టెక్నాలజీపై ఢిల్లీ మెట్రో సలహాలు తీసుకోవాలి: రేవంత్‌

  • Aug 11, 2026 15:38 IST

    నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు

    • 388 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్

    • 112 పాయింట్ల నష్టంతో ముగిసిన నిఫ్టీ

  • Aug 11, 2026 15:34 IST

    నేతాజీ సుభాష్ చంద్రబోస్ చితాభస్మం (అస్థికలు) తరలింపుపై సుప్రీం నోటీసులు

    • కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ

    • జపాన్‌ నుంచి చితాభస్మం తెప్పించాలని కుమార్తె పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం

    • టోక్యోలోని రెంకోజీ ఆలయంలో ఉన్న నేతాజీ అస్థికలు

    • కేంద్రం స్పందన కోరిన సుప్రీంకోర్టు

  • Aug 11, 2026 15:14 IST

    విజయవాడ: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో నిందితుల రిమాండ్‌ను పొడిగించిన కోర్టు

    • నిందితులను వర్చువల్‌గా కోర్టుకు హాజరుపరిచిన సిట్

    • ఈనెల 25 వరకు నిందితులకు రిమాండ్‌ పొడిగింపు

  • Aug 11, 2026 15:12 IST

    ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్

    • ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీ కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

    • ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్‌ను రూ.1.50కే అందించనున్న ప్రభుత్వం

    • కొత్తగా ప్రకటించిన ఆక్వా జోన్లలో అర్హత కలిగిన అన్ని ఆక్వా ఫారాలకు రూ.1.50 యూనిట్ రాయితీ

  • Aug 11, 2026 15:11 IST

    వికారాబాద్ జిల్లా: యాలాల సమీపంలో ఇద్దరు వ్యక్తుల అనుమానాస్పద మృతి

    • కోకట్ సమీపంలోని పాలిసింగ్ యూనిట్లో ఘటన

    • మృతులు అబ్దుల్ లయాఖత్ (45), గోరెప్ప (32)గా గుర్తింపు

  • Aug 11, 2026 15:02 IST

    రేపు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ ఆత్మకథ పుస్తకం విడుదల

    • రేపు ఉ.9:30 గంటలకు విజ్ఞాన్‌ భవన్‌లో పుస్తకాన్ని విడుదల చేయనున్న ప్రధాని మోదీ

    • 'నా జీవితం.. నా పోరాటం' పేరుతో పుస్తక రచన

  • Aug 11, 2026 14:58 IST

    CCI అధికారులతో పత్తి కొనుగోళ్లపై మంత్రి తుమ్మల కీలక సమీక్ష

    • పత్తి కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలి: తుమ్మల నాగేశ్వరరావు

    • MSP కంటే తక్కువ ధరకు పత్తి అమ్మే పరిస్థితి రాకూడదు: తుమ్మల

    • 2026-27 సీజన్‌లో 46.33 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అంచనా: మంత్రి తుమ్మల

  • Aug 11, 2026 14:47 IST

    హిమాచల్‌లో వర్ష బీభత్సం.. 157 మంది మృతి

    • వరదలు, కొండచరియలతో 260 రహదారుల మూసివేత

    • నెల రోజుల్లో దాదాపు 160 మంది మృతి

    • 900కు పైగా ఆస్తులకు భారీ నష్టం

    • మరింత ముప్పు పొంచి ఉందన్న వాతావరణశాఖ

  • Aug 11, 2026 14:36 IST

    సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష

    • బషర్‌ అల్‌ అసద్‌కు మరణశిక్ష విధించిన సిరియా కోర్టు

    • మానవత్వానికి వ్యతిరేక నేరాలపై సంచలన తీర్పు

    • అసద్‌ బంధువు అతెఫ్‌ నజీబ్‌కు మరణశిక్ష విధింపు

    • సిరియా అంతర్యుద్ధ నేరాలపై కీలక తీర్పు

  • Aug 11, 2026 14:26 IST

    లోక్‌సభ రేపటికి వాయిదా

    • అమిత్ షా సభకు రావాలంటూ విపక్షాల నినాదాలు

    • విపక్షాల ఆందోళన మధ్య సభ వాయిదా

  • Aug 11, 2026 14:24 IST

    లోక్‌సభలో విపక్షాల నినాదాలు

    • అమిత్ షా సభకు రావాలంటూ విపక్షాల నినాదాలు

    • విపక్షం చర్చ నుంచి పారిపోతోంది: కిరణ్‌ రిజిజు

    • సమాధానం ఇచ్చేందుకు అమిత్‌ షా సిద్ధం: కిరణ్‌ రిజిజు

  • Aug 11, 2026 14:24 IST

    కేరళ పేరు కేరళంగా మార్పు బిల్లుకు లోక్‌సభ ఆమోదం

    • మూజువాణి ఓటుతో లోక్‌సభ ఆమోదం

    • లోక్‌సభలో విపక్షాల ఆందోళన మధ్యే బిల్లుకు ఆమోదం

  • Aug 11, 2026 13:47 IST

    ఢిల్లీ: భారత పార్లమెంట్ సంక్షోభంలో ఉంది: ఎంపీ మల్లు రవి

    • విద్యార్థులపై దాడికి అమిత్‌షా సమాధానం చెప్పాలి: ఎంపీ మల్లు రవి

    • దాడిపై అమిత్‌షా ఎక్కడా సమాధానం చెప్పలేదు: మల్లు రవి

    • అమిత్‌షా పార్లమెంట్‌కు వస్తున్నా.. సభకు రావడం లేదు: మల్లు రవి

  • Aug 11, 2026 13:45 IST

    గ్రాడ్యుయేట్ ఎన్నికల కోసం బీజేపీ, BRS మ్యాచ్ ఫిక్సింగ్: బల్మూరి వెంకట్

    • రెండు సీట్లలో చెరో స్థానంపై ఒప్పందానికి వచ్చారు: ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్

    • రాజాసింగ్‌ బీజేపీలో ఉన్నారా? లేదా?: బల్మూరి వెంకట్

    • తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ భ్రమ పడుతోంది: బల్మూరి వెంకట్

    • రాహుల్ సునామీలో బీజేపీ కొట్టుకుపోతుంది: బల్మూరి వెంకట్

  • Aug 11, 2026 13:44 IST

    తెలంగాణలో SIR ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తి

    • తెలంగాణలో మొత్తం ఓటర్లు 3.38 కోట్లు

    • 2.64 కోట్ల ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తి

    • 78.30శాతం ఫారాల డిజిటలైజేషన్ నమోదు

    • 73.39లక్షల ఎన్యూమరేషన్ ఫారాలు సేకరించలేకపోయిన అధికారులు

    పూర్తి కథనం..

  • Aug 11, 2026 13:43 IST

    ఆక్వా రంగాన్ని జగన్‌ నాశనం చేశారు: మంత్రి అచ్చెన్నాయుడు

    • జగన్‌ హయాంలో ఆరుసార్లు రొయ్య ఫీడ్‌ రేట్లు పెంచారు: మంత్రి అచ్చెన్నాయుడు

    • పరామర్శ పేరుతో జగన్‌ వస్తే.. ప్రశ్నించండి: అచ్చెన్నాయుడు

    • ఆక్వా రంగం చంద్రబాబు మానస పుత్రిక : మంత్రి అచ్చెన్నాయుడు

  • Aug 11, 2026 12:59 IST

    అబార్షన్ వ్యతిరేక ర్యాలీలో తమిళనాడు అసెంబ్లీ స్పీకర్

    • గర్భధారణతో కొత్త జీవి ప్రాణం పోసుకుంటుందన్న స్పీకర్

    • పిల్లలు దేవుడి దీవెనలని వ్యాఖ్య, వ్యతిరేకించొద్దని హితవు

    పూర్తి కథనం..

  • Aug 11, 2026 12:56 IST

    అమరావతి: నకిలీ పోలీసులతో వైసీపీ ర్యాలీలు: హోంమంత్రి అనిత

    • నకిలీ పోలీసులతో ర్యాలీలు నిర్వహించే వాళ్లు ప్రజలకు ఏం సందేశం ఇస్తారు?: అనిత

    • గొడ్డలి పార్టీ నేతలకు రాజకీయాల్లో కొనసాగే అర్హత లేదు: హోంమంత్రి అనిత

    • వైసీపీ క్రిమినల్‌ రాజకీయాలు చేస్తోంది: హోంమంత్రి అనిత

    • పోలీసు వ్యవస్థ గౌరవాన్ని, విశ్వసనీయతను దెబ్బతీస్తే ఉపేక్షించం: హోంమంత్రి అనిత

  • Aug 11, 2026 12:55 IST

    ప.గో. జిల్లాలో రూ.500 కోట్లతో విద్యుత్‌ సరఫరా చేపట్టాం: మంత్రి గొట్టిపాటి రవికుమార్

    • ఆక్వా రంగానికి విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి ఇబ్బందీ ఉండదు: మంత్రి గొట్టిపాటి

    • 81 లక్షల మంది రైతులకు సబ్సిడీ కింద రూ.15 వేల కోట్లు: గొట్టిపాటి

    • వైసీపీ విధించిన ట్రూ-ఆప్‌ ఛార్జీలను రద్దు చేశాం: మంత్రి గొట్టిపాటి రవికుమార్

  • Aug 11, 2026 12:54 IST

    విశాఖ: వైసీపీ దిక్కుతోచని స్థితిలో ఉంది: బీజేపీ ఏపీ చీఫ్‌ మాధవ్‌

    • ఏం చేయాలో తెలియక DSCపై రాజకీయం చేస్తోంది: బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్‌

    • క్రీడా కోటాలో ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది: మాధవ్‌

    • వైసీపీ ఆందోళనకు వ్యతిరేకంగా ఉద్యోగులు నిరసన తెలిపారు: మాధవ్‌

    • వైసీపీ చేస్తున్న ర్యాలీలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు: బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్‌

  • Aug 11, 2026 12:53 IST

    విజయవాడ: సమ్మె బాటలో మున్సిపల్ కాంట్రాక్టర్లు

    • బకాయిలు చెల్లించాలని కాంట్రాక్టర్ల నిరసన

    • విజయవాడ నగర పరిధిలో నిలిచిపోయిన పనులు

  • Aug 11, 2026 12:35 IST

    హైదరాబాద్: ఈ నెల 18 నుంచి KBR పార్క్ చుట్టూ వన్‌ వే

    • వన్‌ వేకు అన్ని ఏర్పాట్లూ చేసిన ట్రాఫిక్ పోలీసులు

    • అండర్ పాస్‌లు, ఫ్లైఓవర్ నిర్మాణం నేపథ్యంలో వన్‌ వే

    • జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్లే రెండు వైపులా వన్‌వే

    • నిర్మాణ పనులు పూర్తయ్యే వరకూ వన్ వే అమలు

  • Aug 11, 2026 12:34 IST

    హైదరాబాద్: రాష్ట్రం కోసం వరుణయాగం చేసినా విమర్శలా?: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

    • ప్రభుత్వం మంచి చేస్తే BRS నేతలకు మింగుడు పడటం లేదు: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

    • వరుణయాగాన్ని డ్రామా అంటారా?: ఆది శ్రీనివాస్

    • కేసీఆర్ చేసిన యాగాలు కూడా డ్రామాలేనా?: ఆది శ్రీనివాస్

    • కరువు వస్తే బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రతిపక్షం.. రాజకీయం చేస్తోంది: ఆది శ్రీనివాస్

    • రైతులను హరీశ్ రావు తప్పుదోవ పట్టిస్తున్నారు: ఆది శ్రీనివాస్

  • Aug 11, 2026 12:32 IST

    హైదరాబాద్: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం దగ్గర ధర్నా

    • ధర్నాకు దిగిన స్వచ్ఛ ఆటో కార్మికులు

    • చెత్త సేకరణను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించడంపై నిరసన

  • Aug 11, 2026 12:25 IST

    నీట్ పరీక్షకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం

    • తమిళనాడు అసెంబ్లీ నుంచి బీజేపీ MLAల వాకౌట్

    • నీట్‌తో పిల్లల దృష్టి స్కూల్ చదువు నుంచి కోచింగ్‌లపైకి మళ్లుతోందన్న మంత్రి అరుణ్‌రాజ్

  • Aug 11, 2026 12:15 IST

    యూపీ: ఘజియాబాద్‌లో కూలిన మూడంతస్తుల భవనం

    • శిథిలాల కింద చిక్కుకున్న ముగ్గురిని కాపాడిన సహాయ సిబ్బంది

    • ఇంకా పలువురు చిక్కుకున్నట్లు సమాచారం

    • కొనసాగుతున్న సహాయక చర్యలు

  • Aug 11, 2026 12:10 IST

    అమరావతి: GSDP, నెలవారీ ఆర్థిక నివేదికపై సీఎం చంద్రబాబు సమీక్ష

    • గత నెల ఆర్థిక నివేదికను సీఎంకు అందజేసిన ప్రణాళికా విభాగం

    • ఎల్‌నినో సంక్షోభంలోనూ సానుకూల వృద్ధి

    • 2025-26 రెండో త్రైమాసికంలో 10.7% వృద్ధి రేటు నమోదు

    పూర్తి కథనం..

  • Aug 11, 2026 12:04 IST

    అమరావతి: కృష్ణానదిలో మొసలి కలకలం

    • రాజధాని ప్రాంతం తాళ్లాయపాలెం ఘాట్ సమీపంలో ఒడ్డుకు వచ్చిన మొసలి

    • మొసలిని చూసి భయభ్రాంతులకు గురైన మత్స్యకారులు

    • రోజూ అదే ప్రాంతానికి కృష్ణా నదిలోకి ఈతకు వెళ్తున్న స్థానికులు

    • మొసలి కనిపించడంతో వారిలో సైతం ఆందోళన

    • ఒడ్డుకు చేరిన మొసలిని ఫొటోలు తీసిన స్థానికులు

  • Aug 11, 2026 11:54 IST

    శ్రీకాకుళం: మహిళా SIపై దాడి కేసులో మరో 11 మంది లొంగుబాటు

    • ఆముదాలవలస పీఎస్‌లో లొంగిపోయిన నిందితులు

    • ఈ కేసులో ఇప్పటికే చింతాడ రవికుమార్‌తో పాటు మరో 13 మంది అరెస్ట్‌

    • పరారీలో మరో ముగ్గురు నిందితులు

  • Aug 11, 2026 11:53 IST

    జార్ఖండ్‌లో కొనసాగుతున్న బంద్

    • రాంచీ రోడ్లపై బీజేపీ శ్రేణుల నిరసనలు

    • బీజేపీ శ్రేణులు, పోలీసుల మధ్య ఘర్షణ

    • రోడ్డుపై టైర్లు కాల్చేందుకు నిరసనకారుల యత్నం

    • విద్యార్థులపై లాఠీఛార్జ్‌కు నిరసనగా బీజేపీ ఆందోళనలు

    • సీఎం హేమంత్ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్

    • రాహుల్‌గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు

  • Aug 11, 2026 11:08 IST

    ఢిల్లీ: లోక్ సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా

    • విపక్షాల ఆందోళన నడుమ సభ వాయిదా

  • Aug 11, 2026 11:04 IST

    విశాఖ: రాహుల్‌ సిప్లిగంజ్‌పై కేసు నమోదు

    • రాహుల్‌ సిప్లిగంజ్‌తో పాటు మరో 15 మందిపై కేసు నమోదు

    • రాహుల్‌ సిప్లిగంజ్‌ బావమరిది పెళ్లి పేరుతో మోసం చేశాడని యువతి ఫిర్యాదు

    • విశాఖలోని MVP పీఎస్‌ నుంచి మహిళా పీఎస్‌కు కేసు బదిలీ

    పూర్తి కథనం..

  • Aug 11, 2026 11:03 IST

    నెల్లూరు: మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డిపై కేసు నమోదు

    • విక్రమ్‌రెడ్డితో పాటు 13 మంది వైసీపీ నేతలపై కేసు నమోదు

    • ఆత్మకూరులో అనుమతి లేకుండా ర్యాలీ చేశారని కేసు నమోదు

    పూర్తి కథనం..

  • Aug 11, 2026 10:56 IST

    కొత్త యూట్యూబర్లకు మానిటైజేషన్‌ కష్టాలు

    • వాచ్‌టైమ్‌ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్‌

    • 8,000 వాచ్‌ అవర్స్‌ తప్పనిసరి చేయనున్న యూట్యూబ్‌

    • 2027 ఫిబ్రవరి నుంచి కొత్త నిబంధనలు

    • కొత్త యూట్యూబర్లపై పెరగనున్న ఒత్తిడి

    • మానిటైజేషన్‌ కోసం కఠినమైన నిబంధనలు

    youtube.jpg

  • Aug 11, 2026 10:48 IST

    యూపీ: ప్రయాగ్‌రాజ్‌లో నకిలీ న్యాయవాదుల కలకలం

    • మూడు రోజుల్లో తప్పుడు సర్టిఫికెట్లు ఉన్న 39 మంది న్యాయవాదులపై కేసులు

  • Aug 11, 2026 10:47 IST

    ఢిల్లీ: పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీల ఆందోళన

    • రాహుల్ గాంధీ సభ నుంచి పారిపోతున్నారంటూ నినాదాలు

    • జార్ఖండ్‌లో విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్ విషయంలోనూ రాహుల్ గాంధీ మౌనంగా ఉన్నారు

  • Aug 11, 2026 10:39 IST

    ఢిల్లీ: NDA పార్లమెంటరీ పార్టీ సమావేశం

    • మంగళ్ మిలాన్‌లో పాల్గొన్న ప్రధాని మోదీ

    • జల్‌శక్తి శాఖ పనితీరుపై NDA ఎంపీలకు వివరణ

    • పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

  • Aug 11, 2026 10:38 IST

    థాయ్‌లాండ్‌లో ఇబ్బందిపడుతున్న విద్యార్థులతో మాట్లాడిన AP భవన్‌ అధికారులు

    • మంత్రి లోకేశ్ ఆదేశాలతో విద్యార్థులతో మాట్లాడిన ఏపీ భవన్‌ అధికారులు

    • సమాచారాన్ని థాయ్‌లాండ్‌లోని భారత రాయబారికి పంపిన అధికారులు

    • స్థానిక కరెన్సీ లేక ఇబ్బందిపడుతున్నారని తెలిపిన ఏపీ భవన్‌ అధికారులు

    • తక్‌ ఇమ్మిగ్రేషన్‌ అధికారులకు సూచనలు ఇవ్వాలని కోరిన అధికారులు

    • విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి పంపేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

  • Aug 11, 2026 10:37 IST

    రాజస్థాన్‌ ఝులావర్‌ జిల్లాలో భారీ వర్షాలు

    • ఒక్క రోజులో 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు

    • ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు, వాగులు

    • కాళీసింధ్‌ డ్యామ్‌ 11 గేట్లు ఎత్తి నీటి విడుదల

    • సునేల్‌లో జలమయమైన ప్రధాన రహదారులు

  • Aug 11, 2026 10:35 IST

    జార్ఖండ్ బంద్‌కు బీజేపీ పిలుపు

    • విద్యార్థులపై లాఠీఛార్జ్‌కు నిరసనగా ఆందోళన

    • రాంచీ రోడ్లపై బీజేపీ శ్రేణుల నిరసనలు

  • Aug 11, 2026 10:34 IST

    పంద్రాగస్టు సందర్భంగా ఢిల్లీలో హైఅలర్ట్

    • 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల పోస్టర్ల విడుదల

  • Aug 11, 2026 10:33 IST

    ఢిల్లీ: పార్లమెంట్‌కు ర్యాలీగా NDA ఎంపీలు

    • విపక్షాలకు పోటీగా NDA ఎంపీల ర్యాలీ

    • విపక్షాలు పార్లమెంట్‌ను అడ్డుకుంటున్నాయంటూ ర్యాలీ

    • విపక్ష సభ్యులు చర్చకు రావాల్సింది పోయి.. ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారని నినాదాలు

  • Aug 11, 2026 10:22 IST

    హైదరాబాద్: చికిత్స పొందుతూ నాలుగేళ్ల బాలుడి మృతి

    • గుడిమల్కాపూర్ పీఎస్ పరిధిలో ఇటీవల తండ్రి దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాలుడు

    • దంపతుల గొడవలో కుమారుడిని పిల్లర్‌కు గుద్ది, దాడి చేసిన తండ్రి సల్మాన్

  • Aug 11, 2026 10:20 IST

    నెల్లూరు: ఆత్మకూరు మండలం మహిమలూరు గ్రామంలో ప్రమాదం

    • పేలిన గ్యాస్ సిలిండర్.. ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు

    • ప్రమాదంలో గాయపడిన జమీల, సవితమ్మ

    • 108 ద్వారా గాయపడిన మహిళలను ఆత్మకూరు జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలింపు

  • Aug 11, 2026 10:06 IST

    మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీకి బెదిరింపులు

    • గంగూలి, ఆయన సతీమణి డోనాను హత్య చేస్తామని బెదిరింపులు

    • పోలీసులకు ఫిర్యాదు చేసిన సౌరభ్ గంగూలీ

    పూర్తి కథనం..

  • Aug 11, 2026 10:05 IST

    జార్ఖండ్ విద్యార్థి నాయకుడు దేవేంద్రనాథ్ మహతోపై దాడిని ఖండించిన అభిజిత్ దీప్కే

    • విద్యార్థులపై లాఠీఛార్జ్ ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు: అభిజిత్ దీప్కే

  • Aug 11, 2026 10:04 IST

    తమిళనాడు సీఎం విజయ్‌పై నటుడు కమల్‌హాసన్ ప్రశంసలు

    • తమిళ తల్లి ప్రార్థనా గీతాన్ని మొదట పాడాలన్న తీర్మానంపై హర్షం

    • ఇదే ధోరణి కొనసాగించండి అంటూ కమల్‌హాసన్ పోస్ట్

  • Aug 11, 2026 09:45 IST

    SIRపై ఎక్స్‌లో నటుడు ప్రకాశ్ రాజ్ పోస్ట్

    • మిమ్మల్ని ఎన్నుకోని వారి ఓట్లు తొలగించవచ్చు కానీ.. మిమ్మల్ని సింహాసనం దించకుండా మమ్మల్ని ఆపలేరు: ప్రకాశ్ రాజ్

  • Aug 11, 2026 09:40 IST

    మన్మోహన్‌కు క్లీన్‌చిట్‌పై స్పందించిన సోనియాగాంధీ

    • మన్మోహన్‌పై వచ్చిన ఆరోపణలన్నీ అబద్ధాలే: సోనియా గాంధీ

    • మన్మోహన్ నిజాయితీకి సుప్రీం తీర్పు నిదర్శనం: సోనియా గాంధీ

    • మన్మోహన్‌పై రాజకీయ కక్షతో దాడి జరిగింది: సోనియా గాంధీ

    • మన్మోహన్ ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్ర జరిగింది: సోనియా గాంధీ

    • మన్మోహన్ హయాంలో అపూర్వమైన ఆర్థిక మార్పులు వచ్చాయి: సోనియా గాంధీ

  • Aug 11, 2026 09:30 IST

    అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు

    • ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలుంటే ప్రసూతి సెలవుల బంద్

    • పిల్లల సంఖ్య ఆధారంగానే ప్రసూతి సెలవులు

    • మహిళ వేసిన పిటిషన్‌ను కొట్టేసిన అలహాబాద్ హైకోర్టు

  • Aug 11, 2026 09:25 IST

    నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్లు

    • సెన్సెక్స్ 300, నిఫ్టీ 80 పాయింట్లకుపైగా నష్టం

  • Aug 11, 2026 09:20 IST

    పుణె-సాతారా హైవేపై రోడ్డు ప్రమాదం

    • శిర్వాల్ దగ్గర కారు-లారీ ఢీ, నలుగురి మృతి

    • మరో ఇద్దరికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు

  • Aug 11, 2026 09:15 IST

    హైదరాబాద్: ఈనెల 13న సనత్‌నగర్‌ టిమ్స్‌ ప్రారంభం

    • టిమ్స్‌ను ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి

    • 15న సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

    • 16న ములుగు, పరకాలలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

    • మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకోనున్న రేవంత్

    • అనంతరం ములుగు కలెక్టర్ కార్యాలయం ప్రారంభం

  • Aug 11, 2026 09:00 IST

    నేడు CCI సీఎండీతో మంత్రి తుమ్మల కీలక భేటీ

    • హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌ గోల్కొండ హోటల్‌లో ఉదయం 11 గంటలకు సమావేశం

    • రాష్ట్రంలో పత్తి MSP కొనుగోళ్లకు సన్నాహకాలపై సమీక్ష

    • రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు సజావుగా నిర్వహించడంపై మంత్రి దృష్టి

    • పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై చర్చ

  • Aug 11, 2026 08:45 IST

    పంజాగుట్ట శ్మశానవాటికలో పసికందు మృతదేహం మాయం

    • గోతిలో కనిపించని పసికందు మృతదేహం

    • రెండో పసికందు అంత్యక్రియల కోసం రావడంతో విషయం వెలుగులోకి

    • బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేసిన కుటుంబసభ్యులు

    • కాటికాపరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

    పూర్తి కథనం..

  • Aug 11, 2026 08:30 IST

    నెల్లూరు: బుచ్చిరెడ్డిపాలెం మండలం ముంబై జాతీయ రహదారిపై ప్రమాదం

    • నంద్యాల నుంచి నెల్లూరుకి వెళ్తున్న కారు బోల్తా

    • కారు ప్రమాదంలో ఒకరి మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు

    • మృతుడు నెల్లూరుకు చెందిన షేక్. జావీద్ (26)గా గుర్తింపు

  • Aug 11, 2026 08:20 IST

    హైదరాబాద్: జీడిమెట్ల ఆర్టీసీ బస్సు డిపోలో డ్రైవర్ నిర్లక్ష్యం

    • బ్రేక్ చెక్ చేస్తుండగా అదుపుతప్పి మెకానిక్‌పై నుంచి వెళ్లిన బస్సు

    • తీవ్రగాయాలతో మెకానిక్ సంతోష్‌(36) మృతి, కేసు నమోదు

  • Aug 11, 2026 08:15 IST

    హైదరాబాద్: నార్సింగి కారు బీభత్సం కేసులో ఐదుగురి అరెస్ట్

    • డ్రైవర్‌తో పాటు నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు

    • డ్రైవర్‌కు అల్కాహాల్ టెస్టులో పర్సంటేజ్ 100 BAC

    • రాంగ్ రూట్‌లో వచ్చి రిటైర్డ్ ఆర్మీ జవాన్‌ను ఢీకొట్టిన కారు

    • ఘటనలో రిటైర్డ్ ఆర్మీ జవాన్‌ రవీందర్‌ మృతి

    • ప్రమాద సమయంలో మద్యం మత్తులో ఐదుగురు యువకులు

  • Aug 11, 2026 08:00 IST

    జూబ్లీహిల్స్ రిచ్ కిడ్స్ ట్రాప్ కేసులో మరో ఇద్దరి అరెస్ట్

    • నిందితులు మీనాకుమారి, వినీల్ చౌదరి అలియాస్ వినీల్ బాబు అరెస్ట్

    • జైపూర్‌లోని బందర్సెంద్రీ పీఎస్ పరిధిలో అరెస్ట్ చేసిన పోలీసులు

    • సోషల్ మీడియాను ఎరగా చేసుకుని పరిచయాలు పెంచుకున్నట్టు గుర్తింపు

    • వ్యక్తిగత సమాచారం సేకరించి, బ్లాక్‌మెయిల్ చేసినట్టు గుర్తింపు

  • Aug 11, 2026 07:45 IST

    CURE పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పెంపు

    • ఈ నెల 15 వరకు గడువు పొడిగించిన తెలంగాణ సర్కార్‌

    • వరుస సెలవుల దృష్ట్యా మరో ఐదు రోజులు అవకాశం

    • ఇప్పటి వరకూ క్రూ పరిధిలో వచ్చిన 46,121 దరఖాస్తులు

  • Aug 11, 2026 07:30 IST

    తెలంగాణకు మూడు రోజుల పాటు వర్ష సూచన

    • యూపీ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం

    • అల్పపీడనం ప్రభావంతో కొనసాగుతున్న రుతుపవన ద్రోణి

    • తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ

    • నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాల్లో వర్షం

    • నిర్మల్‌, సూర్యాపేట, నల్లగొండ, మహబూబాబాద్‌ జిల్లాల్లో వర్షం పడే ఛాన్స్‌

  • Aug 11, 2026 07:20 IST

    ఈ నెల 13న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం

    • కోస్తా, రాయలసీమలో వారం రోజుల పాటు వర్షాలు

  • Aug 11, 2026 07:15 IST

    ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చిన్నారుల అశ్లీల వీడియోల పోస్ట్‌పై కేసు

    • అశ్లీల వీడియోలను ఇతరులకు షేర్ చేస్తున్న గాజులరామారం వ్యక్తి

    • బాలురను లైంగికంగా వేధిస్తున్న వీడియోలు షేర్‌

    • NCRBకి అమెరికాకు చెందిన NCMEC నిఘా సంస్థ సమాచారం

    • NCRB సమాచారంతో కేసు నమోదు చేసిన జీడిమెట్ల పోలీసులు

  • Aug 11, 2026 07:00 IST

    కడప: వల్లూరు పీఎస్‌ పరిధిలో కిడ్నాప్‌ కలకలం

    • విద్యార్థి సాయిప్రణవ్‌శర్మను బలవంతంగా కారులో తీసుకెళ్లిన కిడ్నాపర్లు

    • కారును వెంబడించిన పోలీసుల వాహనం

    • పోలీసుల వాహనాన్ని ఢీకొట్టి తప్పించుకునేందుకు యత్నం

    • ముగ్గురు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • Aug 11, 2026 06:45 IST

    నేటి నుంచి ఏపీలో జూనియర్‌ డాక్టర్ల సమ్మె

    • స్టైఫండ్‌ పెంచాలంటూ జూడాల సమ్మె నిర్ణయం

    • సమ్మె చేస్తున్నట్లు APJUDA ప్రకటన

  • Aug 11, 2026 06:40 IST

    ఈ నెల 14న తెలంగాణ కేబినెట్‌ సమావేశం

    • 14న ఉదయం 10:30కు సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన భేటీ

  • Aug 11, 2026 06:30 IST

    ఈ నెల 19న ఏపీ కేబినెట్‌ సమావేశం

    • 19న ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ

  • Aug 11, 2026 06:25 IST

    నేడు 17వ రోజు పార్లమెంట్‌ సమావేశాలు

    • లోక్‌సభలో వివాదాలపై వివరణ ఇవ్వనున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా

  • Aug 11, 2026 06:20 IST

    ఏలూరు: నేడు పాలకొల్లులో ఆక్వా రైతుల సమావేశం

    • హాజరుకానున్న మంత్రులు నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్

  • Aug 11, 2026 06:15 IST

    నేడు తిరంగా ర్యాలీపై బీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు సమీక్ష

    • 14న బీజేపీ ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్‌పై తిరంగా ర్యాలీ

  • Aug 11, 2026 06:05 IST

    తెలంగాణలో SIRపై BRS కసరత్తు

    • నేడు SIR స్టేట్‌ కమిటీతో కేటీఆర్‌ భేటీ

  • Aug 11, 2026 06:00 IST

    పశ్చిమ కొలంబియాలోని నగరాల్లో 7.4 తీవ్రతతో భూకంపం

    • బొగోటాకు 400 కి.మీ. దూరంలోని చోకోలో భూకంప కేంద్రం

    • భూకంపం ధాటికి పెరీరా, క్విబ్డ్‌, కాలి, మనిజాలెస్‌ నగరాల ధ్వంసం

    • కొలంబియా వ్యాప్తంగా దెబ్బతిన్న 20కిపైగా మున్సిపాలిటీలు

    • శక్తివంతమైన భూకంపం తర్వాత 4.8, 2.8 తీవ్రతతో మరో 2 ప్రకంపనలు