Share News

తెలంగాణలో SIR ఎన్యూమరేషన్ పూర్తి... ఓటర్ల జాబితాలో కీలక మార్పులు

ABN , Publish Date - Aug 11 , 2026 | 01:51 PM

తెలంగాణలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ(SIR) ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రంలో మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

తెలంగాణలో SIR ఎన్యూమరేషన్ పూర్తి... ఓటర్ల జాబితాలో కీలక మార్పులు
Telangana SIR

హైదరాబాద్, ఆగస్టు 11: తెలంగాణలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ(SIR) ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రంలో మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దాదాపు 2.64 కోట్ల ఫారాలను డిజిటలైజేషన్ చేసినట్లు వెల్లడించారు. మొత్తం 78.30 శాతం ఫారాల డిజిటలైజేషన్ నమోదు అయినట్లు తెలిపారు. 73.39 లక్షల ఎన్యూమరేషన్ ఫారాలను సేకరించలేకపోయినట్లు అధికారులు వెల్లడించారు. వీటిలో 21.70 శాతం ఫారాలను అన్‌కలెక్టబుల్‌గా గుర్తించారు.


45.18 లక్షల మంది ఓటర్లు శాశ్వతంగా వలస వెళ్లినట్లు గుర్తించారు. అలాగే 9.22 లక్షల మంది మరణించినట్లు నమోదు కాగా, మరో 11.25 లక్షల మంది అందుబాటులో లేరని లేదా ట్రేస్ కాలేదని అన్నారు. అలాగే, 6.70 లక్షల మంది ఇప్పటికే ఇతర ప్రాంతాల్లో ఓటర్లుగా నమోదై ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో తెలంగాణలో SIR ఎన్యూమరేషన్ అనంతరం ఓటర్ల జాబితాలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి...

పూడ్చిపెట్టిన పసికందు మృతదేహం మాయం.. పోలీసుల విచారణ

గుడిమల్కాపూర్‌లో బాలుడిపై తండ్రి దాడి ఘటన.. చికిత్స పొందుతూ చిన్నారి మృతి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 11 , 2026 | 02:38 PM