Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Jun 29 , 2026 | 06:03 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Jun 29, 2026 21:48 IST

    కాకినాడ: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు ప్రత్యేక ఆహారం అవసరమని జీజీహెచ్ నివేదిక

    • రోజుకు 2,500 క్యాలరీల సప్లిమెంటరీ డైట్ అందించాలని సిఫార్సు

    • మూడు పూటలా ఉడికించిన గుడ్డు, అరటిపండు, మజ్జిగ ఇవ్వాలని సూచన

    • దృఢమైన పరుపు, సర్వైకల్ దిండు కల్పించాలని వైద్యుల సిఫార్సు

    • వెన్నునొప్పి నేపథ్యంలో న్యాయస్థానం ఆదేశాలతో వైద్య పరీక్షలు

    • జిల్లా జడ్జికి నివేదిక సమర్పించిన జీజీహెచ్ సూపరింటెండెంట్

  • Jun 29, 2026 21:30 IST

    అమరావతి: ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం: సీఎం చంద్రబాబు

    • సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగ సంఘాల నేతలు

    • ఓల్డ్ పెన్షన్ స్కీం (OPS) అమలుపై ఉద్యోగ సంఘాల హర్షం

    • 2004 సెప్టెంబర్‌కు ముందు నోటిఫికేషన్ల ద్వారా నియామకమైన ఉద్యోగులకు OPS వర్తింపు

    • కార్పొరేషన్లు, గురుకుల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంపు

    • ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం

  • Jun 29, 2026 21:26 IST

    ఖమ్మం: రైతు ఆశీర్వాద సభ వేదిక మార్పు: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

    • వాతావరణ పరిస్థితుల దృష్ట్యా శిల్పకళా వేదిక నుంచి కార్యక్రమం

    • యథావిధిగా రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం

    • రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనాలని సూచన

    • 73.32 లక్షల మంది రైతుల ఖాతాల్లో దశల వారీగా నిధుల జమ

    • తొలి విడతలో 41.37 లక్షల మంది రైతులకు రూ.2,482.02 కోట్లు జమ

  • Jun 29, 2026 21:25 IST

    అంగన్‌వాడీ కేంద్రాల పని వేళల్లో మార్పు

    • ఎన్నికల విధుల్లో అంగన్‌వాడీ టీచర్ల నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం

    • BLO విధులు ఉన్న కేంద్రాలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే పని

    • జూన్ 29 నుంచి జూలై 28 వరకు కొత్త పని వేళలు అమలు

    • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

  • Jun 29, 2026 20:43 IST

    ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో తృటిలో తప్పిన పెను ప్రమాదం

    • షార్ట్‌సర్క్యూట్‌తో దగ్ధమైన కారు

    • ప్రమాదాన్ని గుర్తించి సురక్షితంగా బయటపడ్డ నలుగురు కుటుంబ సభ్యులు

    • ఘటనాస్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్

    • మంటలను అదుపులోకి తీసుకొచ్చిన అగ్నిమాపక సిబ్బంది

  • Jun 29, 2026 20:34 IST

    ఒక కులానికే పవన్‌ కల్యాణ్ పరిమితం కాదు: మంత్రి దుర్గేష్‌

    • కులాల మధ్య కుట్రకు వైసీపీ నేతల యత్నం: మంత్రి దుర్గేష్‌

  • Jun 29, 2026 20:11 IST

    తెలంగాణలో IPSల బదిలీలు

    • 13మంది IPSలను బదిలీ చేసిన ప్రభుత్వం

  • Jun 29, 2026 19:53 IST

    హైదరాబాద్: పోక్సో కేసులో ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు

    • మైనర్‌పై లైంగిక దాడి కేసులో నిందితుడిని దోషిగా తేల్చిన కోర్టు

    • పహాడీషరీఫ్ పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధింపు

    • నిందితుడికి రూ.20 వేల జరిమానా విధింపు

    • బాధితురాలికి రూ.1 లక్ష పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశం

  • Jun 29, 2026 19:39 IST

    విరిగిపడిన కొండచరియ.. తృటిలో తప్పించుకున్న బైకర్

    • అస్సాంలోని లోయెర్ సియాంగ్ జిల్లాలో ఆదివారం ఘటన

    • బైకర్ ఘాట్ రోడ్డుపై వెళుతుండగా విరిగిపడ్డ కొండచరియ

    • కొన్ని క్షణాల్లో ఊహించని విధంగా తప్పిన ముప్పు

    • నెట్టింట వీడియో వైరల్

  • Jun 29, 2026 18:53 IST

    ఢిల్లీ: ఆరోగ్య సేతు 2.0ను ప్రారంభించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా

    • హాజరైన వివిధ రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు

  • Jun 29, 2026 18:52 IST

    తెలంగాణ ఉద్యోగులకు మరో శుభవార్త

    • రూ.2వేల కోట్ల బకాయిల విడుదల

  • Jun 29, 2026 18:52 IST

    వరంగల్‌: బీజేపీ చీఫ్ నితిన్ నబీన్‌ కాన్వాయ్‌ను అడ్డుకున్న NSUI నేతలు

    • హన్మకొండలో NSUI నేతలను అడ్డుకున్న పోలీసులు

    • హన్మకొండ డిమార్ట్ దగ్గర ఘటన

  • Jun 29, 2026 18:46 IST

    హైదరాబాద్: ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు

    • రైలులో 13 డిఫెన్స్ మద్యం బాటిళ్ల స్వాధీనం

    • కాచిగూడ ఎక్సైజ్ సీఐ శ్రీధర్, ఎస్‌ఐ ధనరాజ్ ఆధ్వర్యంలో సోదాలు

    • స్వాధీనం చేసుకున్న బాటిళ్లు కర్ణాటకకు చెందినవిగా గుర్తింపు

    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు

  • Jun 29, 2026 18:33 IST

    విశాఖ: నవంబర్‌లో 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్

    • సమ్మిట్ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష

    • భవిష్యత్ రంగాలపై చర్చలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచన

    • అధికారులకు దిశానిర్దేశం చేసిన సీఎం

  • Jun 29, 2026 18:17 IST

    జర్మనీలోని స్టేడ్ నగరంలో కాల్పుల కలకలం

    • కాల్పుల్లో ఐదుగురి మృతి

    • ఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితుల అరెస్ట్

  • Jun 29, 2026 18:13 IST

    ఏఐ విఫలం.. ఫోర్డ్ కంపెనీలో మళ్లీ ఇంజనీర్ల నియామకం

    • ఏఐ ఆధారిత క్వాలిటీ వ్యవస్థలతో కానరాని ఫలితాలు

    • నాణ్యతా ప్రమాణాల సర్వేలో వెనకబడ్డ సంస్థ

    • అనుభవజ్ఞులైన ఇంజనీర్ల రాకతో చక్కబడ్డ పరిస్థితి

    • ఏఐకి ఇచ్చే శిక్షణను బట్టే దాని సామర్థ్యం ఉంటుందన్న సీనియర్ అధికారులు

  • Jun 29, 2026 17:59 IST

    సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం..

    • పోలీసుల ఎదుట లొంగిపోయిన అశోక్, జంగం నాని

    • కేసులో నిందితులుగా ఉన్నా అశోక్, నాని

  • Jun 29, 2026 17:45 IST

    అమరావతి: IPS పీవీ సునీల్ కుమార్‌కు సేవల నుంచి రిలీవ్

    • ఈ నెల 30న సేవల నుంచి రిలీవ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం

    • క్రమశిక్షణ, క్రిమినల్ కేసులపై విచారణకు ప్రభావం లేకుండా రిలీవ్

  • Jun 29, 2026 17:44 IST

    అమరావతి: వైద్య పరీక్షల కోసం ముంబై వెళ్లిన పవన్‌

    • భుజాల కండరాల నొప్పితో బాధపడుతున్న పవన్‌

    • వైద్య పరీక్షలకు ముంబై ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రికి పవన్

  • Jun 29, 2026 17:43 IST

    అమరావతి నిర్మాణ కాంట్రాక్టు సంస్థలతో సీఎం చంద్రబాబు

    • రాజధాని అభివృద్ధి పనుల నాణ్యత, వేగంపై ప్రత్యేక దృష్టి

    • ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో భాగమైనందుకు గర్వించండి: చంద్రబాబు

    • నిర్దేశిత గడువులోగా రాజధాని నిర్మాణాలు పూర్తి కావాలి: చంద్రబాబు

    • రాజధాని పనులపై ప్రతి 2 నెలలకు ఒకసారి సమీక్ష: చంద్రబాబు

    • హైదరాబాద్ ప్లస్‌గా అమరావతి నిర్మాణం జరగాలి: చంద్రబాబు

  • Jun 29, 2026 17:42 IST

    అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష

    • రాజధాని నిర్మాణ పనుల వేగవంతంపై అధికారులకు సీఎం దిశానిర్దేశం

    • రాజధాని అభివృద్ధి పనుల నాణ్యత, వేగంపై ప్రత్యేక దృష్టి

  • Jun 29, 2026 17:25 IST

    ఐర్లాండ్ కోచ్ సంచలన నిర్ణయం

    • కోచ్ పదవి నుంచి వైదొలిగిన హెన్రిచ్ మలన్

    • 2-0తో భారత్‌పై టీ20 సిరీస్‌ను కైవం చేసుకున్న ఐర్లాండ్

    • ఈ క్రమంలోనే కీలక నిర్ణయం తీసుకున్న ఐర్లాండ్ కోచ్

  • Jun 29, 2026 16:29 IST

    పాకిస్థాన్ పేసర్ షాహీన్ అఫ్రిదికి షాకిచ్చిన పీసీబీ

    • వెస్టిండీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు షాహీన్ ఔట్

    • హసన్ అలీ, నసీమ్ షాలను కూడా ఎంపిక చేయని పీసీబీ

    • జులై25 నుంచి విండీస్‌తో తొలి టెస్టు

  • Jun 29, 2026 16:23 IST

    బాపట్ల: అప్పికట్లలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నరేంద్ర వర్మ

    • బాపట్ల నుంచి అప్పికట్ల వరకు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే

    • నాగలి పట్టి వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టిన నరేంద్ర వర్మ

    • ఏరువాక వేడుకల్లో పెద్దఎత్తున పాల్గొన్న రైతులు, గ్రామస్థులు

  • Jun 29, 2026 16:21 IST

    విజయవాడ: గాదె సాయికృష్ణ కస్టోడియల్‌ డెత్‌ కేసు

    • ఇంటి భోజనం అనుమతించాలన్న సీఐ నాగరాజు పిటిషన్‌ విచారణ

    • సీఐ నాగరాజుకు ఇంటి భోజనానికి అనుమతించిన కోర్టు

  • Jun 29, 2026 16:20 IST

    తెలంగాణలో 36 మంది డీఎస్పీల బదిలీ

    • ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ సీవీ ఆనంద్‌

  • Jun 29, 2026 16:19 IST

    3 ఏళ్ల బాలికపై హత్యాచారం.. వృద్ధుడికి మరణ శిక్ష

    • పుణెలో ప్రత్యేక కోర్టు తీర్పు

    • ఇది అత్యంత అరుదైన కేసు అన్న కోర్టు

    • మే 1న దారుణం, 60 రోజుల్లో విచారణ పూర్తి

  • Jun 29, 2026 16:18 IST

    ఐర్లాండ్ పిచ్‌లపై రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు

    • భారత్‌లో 24 క్యారెట్ల బ్యాటింగ్ పిచ్‌లు ఉంటాయి: అశ్విన్

    • అక్కడ 24 క్యారెట్ల బ్యాటింగ్ పిచ్‌లు ఉండవు: అశ్విన్

    • ఐపీఎల్‌లో టీమిండియా ప్లేయర్లు ఎక్కువగా బ్యాటింగ్ పిచ్‌పై ఆడారు: అశ్విన్

  • Jun 29, 2026 16:18 IST

    అమరావతి: తాడేపల్లిలో 'షైనింగ్ స్టార్' కార్యక్రమానికి హాజరైన మంత్రి లోకేశ్

    • 10వ తరగతి, ఇంటర్‌లో రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు సత్కారం

    • ప్రతిభ కనబరిచిన విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిన మంత్రి లోకేశ్

    • విద్యార్థులను అభినందించి, ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించిన మంత్రి

  • Jun 29, 2026 16:05 IST

    ఢిల్లీ: వీబీ జీ రామ్‌జీ పథకంపై అభ్యంతరాలను కేంద్రానికి తెలిపిన మంత్రి సీతక్క

    • జులై 2న వీబీ జీ రామ్‌జీపై తెలంగాణ కేబినెట్ తుది నిర్ణయం: సీతక్క

    • వీబీ జీ రామ్‌జీ పథకం కొనసాగించాలా లేక ఆ స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకం ప్రవేశ పెట్టాలా అనే దానిపై నిర్ణయం: సీతక్క

  • Jun 29, 2026 16:02 IST

    హైదరాబాద్‌: KCP న్యూట్రీ మల్టీ విటమిన్ రైస్‌ ఉత్పత్తులు ప్రారంభించిన మంత్రి ఉత్తమ్‌

    • బియ్యం ఎగుమతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విధానం: ఉత్తమ్‌

    • ఎగుమతుల కోసం పరిశ్రమలకు అండగా ప్రభుత్వం: ఉత్తమ్‌

  • Jun 29, 2026 16:01 IST

    మంచిర్యాల: భీంపూర్‌లో మహిళా వార్డు మెంబర్‌ కుల బహిష్కరణ

    • కాంగ్రెస్ మద్దతుతో ఏకగ్రీవంగా గెలిచిన తానక్క

    • పంచాయతీ మాత్రం బీఆర్ఎస్ మద్దతుదారుల కైవసం

    • తానక్క కూడా బీఆర్ఎస్‌లో చేరాలని మిగతావాళ్ల పట్టు

    • పార్టీ మారనని స్పష్టం చేయడంతో తానక్క కుల బహిష్కరణ

  • Jun 29, 2026 16:00 IST

    మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష

    • మూసీ ప్రాజెక్ట్ తెలంగాణ భవిష్యత్‌కు పునాది: మంత్రి పొంగులేటి

    • హైదరాబాద్ రూపురేఖలు మార్చే చరిత్రాత్మక ప్రాజెక్ట్‌: పొంగులేటి

    • మూసీ ప్రాజెక్ట్‌తో నగరానికి కొత్త జీవం పోస్తాం: పొంగులేటి

  • Jun 29, 2026 15:58 IST

    నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

    • సెన్సెక్స్‌ 370, నిఫ్టీ 100కు పైగా పాయింట్ల నష్టం

  • Jun 29, 2026 15:21 IST

    అమెరికాలో బాపట్ల జిల్లా యువకుడి మృతి

    • అమెరికా వరదల్లో గల్లంతైన దేవరపల్లికి చెందిన వెంకటేష్‌

    • అమెరికాలో MS పూర్తిచేసి ఉద్యోగం చేస్తున్న వెంకటేష్‌

    • వరదల్లో గల్లంతైన వెంకటేష్‌ కారు, బ్యాగ్‌ గుర్తింపు

    • వెంకటేష్ కుటుంబ సభ్యులకు అమెరికా పోలీసుల సమాచారం

    • కుమారుడి మృతదేహాన్ని త్వరగా రప్పించాలంటున్న తల్లిదండ్రులు

  • Jun 29, 2026 15:19 IST

    తెలంగాణలో జిల్లా, గ్రామీణ స్థాయి క్రికెట్ అభివృద్ధిపై హెచ్‌సీఏ ఫోకస్

    • ప్రతి ఉమ్మడి జిల్లా కేంద్రంలో క్రికెట్ అకాడమీలు, గ్రౌండ్లు ఏర్పాటు

    • ఎంపిక చేసిన జిల్లాల్లో 7–8 ఎకరాల్లో ఆధునిక క్రికెట్ మౌలిక వసతులు

    • సూర్యాపేట, జగిత్యాల, నాగర్‌కర్నూల్, సిద్దిపేటలో నాలుగు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు

    • బీసీసీఐ ప్రమాణాలతో 15 ఎకరాల్లో ఆధునిక అకాడమీల నిర్మాణం

    • కొత్త లీగ్ విధానంతో 600 మందికి పైగా యువ క్రికెటర్లకు అవకాశం

    • C-డివిజన్‌లో 8 జిల్లా జట్లకు స్థానం కల్పించనున్న హెచ్‌సీఏ

    • అన్ని వయసుల జట్లకు మార్గనిర్దేశం చేసే మెంటార్‌ను నియమించనున్న హెచ్‌సీఏ

    • టి20 ఫైనల్‌కు సీఎం, గవర్నర్‌ను ఆహ్వానించేందుకు ప్రయత్నాలు: హెచ్‌సీఏ

  • Jun 29, 2026 15:10 IST

    త్రిభాషా విధానంపై స్పష్టతనిచ్చిన సీబీఎస్‌ఈ

    • ప్రస్తుతం టెన్త్ విద్యార్థులకు త్రిభాషా విధానం నుంచి మినహాయింపు

    • ప్రస్తుతం 7, 8, 9 తరగతుల విద్యార్థులకు కూడా మినహాయింపు

    • మూడో భాషపై విద్యార్థులకు స్కూళ్లలోనే ఇంటర్నల్ మార్కులు

    • ప్రస్తుతం 6వ తరగతి విద్యార్థులకు త్రిభాషా విధానం అమలు

    • 2026-27లో 6వ తరగతి విద్యార్థులకు బోర్డు పరీక్షలు తప్పనిసరి

  • Jun 29, 2026 15:07 IST

    హన్మకొండలో బీజేపీ చీఫ్ నితిన్‌ నబీన్‌

    • ఆదివాసీలతో కలిసి నృత్యం చేసిన నితిన్ నబీన్‌

  • Jun 29, 2026 15:06 IST

    హైదరాబాద్‌: ధరావత్ నిఖిల్ అనుమానాస్పద మృతిలో కీలక మలుపు

    • నిఖిల్ మృతిపై CBI విచారణకు హైకోర్టు ఆదేశం

    • నాలుగేళ్ల క్రితం అనుమానాస్పద స్థితిలో నిఖిల్ మృతి

  • Jun 29, 2026 15:05 IST

    ఏలూరు: రామచంద్ర ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ

    • ఎంబీఏ విద్యార్థి తులసీరామ్‌పై సుత్తితో దాడి చేసిన మరో విద్యార్థి

    • తలకు తీవ్ర గాయాలైన తులసీరామ్‌ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు

    • ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్న త్రీటౌన్ పోలీసులు

    • ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు

  • Jun 29, 2026 13:58 IST

    హైదరాబాద్: కేటీఆర్‌ అహంకారపు కళ్లకు ఎవరూ కనిపించడం లేదు: ఎమ్మెల్యే మేడిపల్లి

    • స్పీకర్‌ను అవమానించేలా వ్యాఖ్యలు చేసినందుకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి

    • స్పీకర్‌ చైర్‌లో దళితుడు కూర్చున్నారు కాబట్టే.. కేసీఆర్ సభకు రావడం లేదు: ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

  • Jun 29, 2026 13:26 IST

    ఢిల్లీ: గ్రామీణాభివృద్ధి పథకాలపై కేంద్రం సమీక్ష

    • పాల్గొన్న 27 రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి మంత్రులు

    • పీఎం ఆవాస్ కింద మరో 2కోట్ల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నాం: శివరాజ్‌సింగ్ చౌహాన్

    • లక్షపతి దీదీ లక్ష్యాన్ని రూ.3 కోట్లకు పెంపు: కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్

  • Jun 29, 2026 13:25 IST

    తెలంగాణపై శివరాజ్‌సింగ్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు

    • గ్రామీణ పథకాల అమలులో తెలంగాణ వెనుకబాటు: కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్

    • PMGSY రోడ్ల పనులు వేగవంతం కావాలి: శివరాజ్‌సింగ్

    • పెండింగ్ రోడ్ల పనులు పూర్తి చేయాలి: శివరాజ్‌సింగ్ చౌహాన్

    • PM ఆవాస్ సర్వే త్వరగా పూర్తి చేయాలి: కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్

  • Jun 29, 2026 13:19 IST

    హైదరాబాద్: గృహప్రవేశం చేసిన కుటుంబంపై 50 మంది దాడి

    • బొడుప్పల్‌లోని దేవేందర్ నగర్‌లో ఇల్లు కొనుగోలు చేసిన శ్యామ్ రావు

    • ఈరోజు ఉదయం కుటుంబసభ్యులతో గృహప్రవేశం చేసిన శ్యామ్ రావు

    • ఇల్లు తమదంటూ ఒక్కసారిగా దాడికి పాల్పడిన అల్లరిమూక

    • కేసు నమోదు, 12 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు

  • Jun 29, 2026 13:03 IST

    రేపటి మధిర రైతు ఆశీర్వాద సభ రద్దు

    • వర్షాల కారణంగా సీఎం రేవంత్ రెడ్డి సభ రద్దు

    • యథావిధిగా రేపు రైతు భరోసా విడుదల

    • రేపు హైదరాబాద్‌ శిల్పకళా వేదికలో రైతు భరోసా పంపిణీ సదస్సు

    • ఏర్పాట్ల కోసం అధికారులకు, మంత్రులకు ఆదేశాలు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

  • Jun 29, 2026 12:50 IST

    కృష్ణా: జగన్ డైరెక్షన్‌లోనే అమరావతిలో వైసీపీ అల్లర్లు: మంత్రి కొల్లు

    • అమరావతి పరిరక్షణ కమిటీ పేరుతో కొత్త డ్రామాకు తెర లేపారు: మంత్రి కొల్లు రవీంద్ర

    • పేర్ని నాని, అంబటి బూతులు మాట్లాడి రైతులను రెచ్చగొట్టారు: మంత్రి కొల్లు

    • జగన్ పూర్తిగా విజ్ఞత వదిలేశారు: మంత్రి కొల్లు

    • అమరావతిలో పర్యటించే హక్కు వైసీపీ నేతలకు లేదు: మంత్రి కొల్లు రవీంద్ర

  • Jun 29, 2026 12:45 IST

    అమరావతి: వైసీపీ నేతలపై మంత్రి బీసీ జనార్దన్‌ ఆగ్రహం

    • ప్రతిపక్ష హోదా దక్కని వాళ్లు.. సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు: మంత్రి బీసీ జనార్దన్‌

    • రప్పా..రప్పా.. అంటే పారిశ్రామికవేత్తలు వస్తారా?

    • గతంలో ఉన్న పరిశ్రమలను రాష్ట్రం నుంచి తరిమికొట్టారు

    • నేడు రాయలసీమకు ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి: బీసీ జనార్దన్‌

    • రాబోయే స్థానిక ఎన్నికల్లో గొడ్డలి పార్టీకి డిపాజిట్ రాదు: మంత్రి బీసీ జనార్దన్‌

  • Jun 29, 2026 12:40 IST

    మేడ్చల్: ఘట్‌కేసర్‌లో రెచ్చిపోతున్న పోకిరీలు

    • రాత్రి వేళల్లో కార్లను వెంబడిస్తూ దాడులు చేసే ప్రయత్నం

    • ఓ కారు డ్యాష్ క్యామ్‌లో రికార్డయిన పోకిరీల దృశ్యాలు

    • కారులో మహిళలు ఉండడంతో మరింత రెచ్చిపోయిన పోకిరీలు

    • ఘటనను వివరిస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన యువతి

  • Jun 29, 2026 12:30 IST

    దేశంలో ఇప్పటివరకు 8సార్లు SIR జరిగింది: కవిత

    • బోధన్‌ నియోజకవర్గంలో ఏడాదిలో 7 వేల ఓట్లు తొలగించారు: కవిత

    • దీనిపై ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలి: కవిత

    • సీఎం నియోజకవర్గంలో కేవలం 800 ఓట్లు మాత్రమే తొలగించారు: కవిత

    • మేం వెరిఫై చేస్తే 33వేల డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి: కవిత

    పూర్తి కథనం..

  • Jun 29, 2026 12:29 IST

    అయోధ్య బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మిశ్రా కీలక ప్రకటన

    • అయోధ్య విరాళాల కేసులో నిందితుల తరఫున ఎవరూ వాదించొద్దని నిర్ణయం

    • ఎవరైనా వాదిస్తే రూ.5లక్షల జరిమానా: అయోధ్య బార్ అసోసియేషన్

    • చంపత్‌రాయ్‌పై చర్యలు తీసుకోవాలని బార్ అసోసియేషన్ డిమాండ్

  • Jun 29, 2026 12:28 IST

    అమరావతి: RTGSపై సీఎం చంద్రబాబు సమీక్ష

    • డేటా ఆధారిత పాలన, నిర్ణయాలపై అధికారులతో సీఎం చంద్రబాబు చర్చ

    • ప్రభుత్వ సేవల సామర్థ్యాన్ని పెంచే అంశాలపై చర్చ

    • RTGS వ్యవస్థ పనితీరు, డేటా వినియోగంపై సమీక్ష

    • హాజరైన మంత్రి పార్థసారథి, సీఎస్, డీజీపీ తదితరులు

  • Jun 29, 2026 12:28 IST

    ఢిల్లీ: రాజ్యసభ సభ్యుడిగా మల్లికార్జున ఖర్గే ప్రమాణస్వీకారం

    • రాజ్యసభ చైర్మన్ కార్యాలయంలో ప్రమాణం చేసిన ఖర్గే

    • పాల్గొన్న సోనియా, కేసీ వేణుగోపాల్, ప్రియాంక, జేపీ నడ్డా, మేఘవాల్

  • Jun 29, 2026 12:12 IST

    జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షాలు

    • మొఘల్ రోడ్డుపై విరిగిపడ్డ కొండచరియలు

    • రాజౌరీ-పూంఛ్ మధ్య నిలిచిపోయిన వేల వాహనాలు

  • Jun 29, 2026 12:10 IST

    జయశంకర్ భూపాలపల్లి : కాటారం మండలం ఇబ్రహీంపల్లిలో దారుణం

    • నిద్రపోతున్న భార్య రజితను గొడ్డలితో హత్య చేసిన భర్త

    • ఘటనా స్థలానికి చేరుకొని, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Jun 29, 2026 12:08 IST

    ప్రకాశం: జగన్‌పై మంత్రి గొట్టిపాటి ఫైర్‌

    • గతంలో మూడు రాజధానుల పేరుతో నాటకాలు ఆడారు: మంత్రి గొట్టిపాటి

    • ఇప్పుడు మావిగన్ అంటున్నారు: మంత్రి గొట్టిపాటి

    • అమరావతి వెళ్లిన వైసీపీ నాయకులను రైతులు తరిమికొట్టారు: మంత్రి గొట్టిపాటి

    • ఏపీకి ఏం కావాలో జగన్‌కు తెలియదు: మంత్రి గొట్టిపాటి

  • Jun 29, 2026 12:05 IST

    రామాలయ చోరీ కేసు నిందితుడి విలాసవంతమైన జీవితం వెలుగులోకి

    • ఫామ్‌హౌస్‌, స్కార్పియో ఎస్‌యూవీ సహా భారీ ఆస్తులు సమకూర్చుకున్నట్లు దర్యాప్తులో వెల్లడి

    • విరాళాల నగదు లెక్కించే బృందంలో బావమరిదిని నియమింపజేసినట్లు ఆరోపణలు

    • భక్తుల విరాళాల దుర్వినియోగంపై దర్యాప్తు ముమ్మరం

    • కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం

    పూర్తి కథనం..

  • Jun 29, 2026 11:56 IST

    నిర్మల్: ఆర్మూర్‌లో హిందూ సంఘాల ర్యాలీ

    • ఓ ప్రైవేట్ స్కూల్‌లో బలవంతంగా ఉర్దూ బోధిస్తున్నారని నిరసన

    • అంబేద్కర్ చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకూ ర్యాలీ

    • ACP ఆఫీస్ ఎదుట భైఠాయించిన హిందూ సంఘాలు, బీజేపీ నేతలు

    • టీచర్‌పై చర్యలు తీసుకోవాలని ACPకి వినతిపత్రం అందజేత

  • Jun 29, 2026 11:54 IST

    అమరావతి: సాయంత్రం విశాఖకు మంత్రి నారా లోకేశ్

    • రేపు ఉదయం భోగాపురం మండలంలో ఆదర్శ పాఠశాలకు మంత్రి లోకేశ్

    • రేపు మధ్యాహ్నం గిరిజన యూనివర్సిటీ స్నాతకోత్సవానికి లోకేశ్

    • రేపు రాత్రికి మంగళగిరిలో APL ఫైనల్ మ్యాచ్‌కి నారా లోకేశ్

  • Jun 29, 2026 11:49 IST

    AIDMKకు మరో షాక్

    • AIDMKకు MLA విజయ్‌భాస్కర్ రాజీనామా

    • TVKలో చేరనున్న విజయ్ భాస్కర్

    • ఇప్పటికే AIDMKకు ఆరుగురు ఎమ్మెల్యేల రాజీనామా

    పూర్తి కథనం..

  • Jun 29, 2026 11:48 IST

    సుప్రీంకోర్టుకు అయోధ్య విరాళాల దుర్వినియోగం కేసు

    • విరాళాల చోరీపై CBIతో విచారణ జరిపించాలని పిటిషన్

    • అత్యవసర విచారణకు నిరాకరించిన సుప్రీం కోర్టు

    • కోర్టు రీఓపెన్ తర్వాత పిటిషన్ లిస్ట్ చేయాలని ఆదేశం

    • ప్రస్తుతం సుప్రీంకోర్టుకు కొనసాగుతున్న సెలవులు

    పూర్తి కథనం..

  • Jun 29, 2026 11:27 IST

    హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్

    • 100కు పైగా షాపింగ్ మాల్స్, లాడ్జిలకు నోటీసులు

    • మహిళల భద్రతే ధ్యేయంగా పోలీసుల చర్యలు

    • యాంటీ స్పై డిటెక్టర్ డివైస్ ఏర్పాటు చేసుకోవాలని నోటీసులు

    • సీక్రెట్‌ కెమెరాలను గుర్తించేందుకు యాంటీ స్పై డిటెక్టర్ డివైస్

    • స్పై డిటెక్టర్ డివైస్ లేకుంటే మాల్స్ సీజ్ చేస్తామని పోలీసుల హెచ్చరిక

  • Jun 29, 2026 10:41 IST

    గుంటూరు: ANGRAUలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని ప్రారంభించిన అచ్చెన్న

    • వైసీపీ హయాంలో వ్యవసాయానికి కనీస సహకారం లేదు: మంత్రి అచ్చెన్న

    • విత్తనాల కంపెనీలకు కూడా బకాయిలు పెట్టారు: మంత్రి అచ్చెన్నాయుడు

    • కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు రాయితీపై విత్తనాలు ఇస్తున్నాం: మంత్రి అచ్చెన్న

  • Jun 29, 2026 10:39 IST

    విజయనగరం: వైసీపీ ఆఫీస్ నిర్మాణంపై గోవా గవర్నర్ అశోక్‌ గజపతిరాజు ఆక్షేపణ

    • గతంలో చట్టాన్ని చుట్టంలా మార్చుకున్నారు: అశోక్‌గ జపతిరాజు

    • మా స్థలానికి సంబంధించిన రికార్డులను తారుమారు చేశారు: అశోక్‌గ జపతిరాజు

    • అధికారులకు ఫిర్యాదు చేశాం: అశోక్‌గజపతి రాజు

    • చర్యలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోంది: అశోక్‌గజపతి రాజు

  • Jun 29, 2026 10:38 IST

    సిద్దిపేట: కోహెడ మండలం కూరెళ్లలో మంత్రి పొన్నం పర్యటన

    • రైతులందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు: మంత్రి పొన్నం

    • రైతులు.. ఆరుతడి పంటలు వేసి అధిక దిగుబడులు సాధించాలి: మంత్రి పొన్నం

  • Jun 29, 2026 10:37 IST

    సౌతాఫ్రికాలో హనుమకొండ యువకుడి మృతి

    • విమాన ప్రమాదంలో ఆడెపు సుమంత్ మృతి

    • పైలట్ శిక్షణలో ఉండగా జరిగిన ప్రమాదం

    • మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు కేంద్రానికి విజ్ఞప్తి

  • Jun 29, 2026 10:34 IST

    తగ్గిన బంగారం ధరలు

    • హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,43,020

    • 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,31,100

    • హైదరాబాద్‌, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,45,000

  • Jun 29, 2026 10:31 IST

    ముంబైలో భారీ వర్షం

    • పలు ప్రదేశాల్లో నిలిచిన నీరు

    • ఇబ్బందులు పడుతున్న లోతట్టు ప్రాంత వాసులు

  • Jun 29, 2026 10:30 IST

    గుంటూరు: మరోసారి విచారణకు గడువు కోరిన మాజీమంత్రి అమర్నాథ్

    • రేపు విచారణకు వస్తానని మహిళా కమిషన్‌కు సమాచారం

    • హోంమంత్రి అనితపై అనుచిత వ్యాఖ్యలపై అమర్నాథ్‌కు మహిళా కమిషన్ నోటీసులు

  • Jun 29, 2026 10:20 IST

    గుంటూరు: వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది: ఎమ్మెల్యే ధూళిపాళ్ల

    • అనేక రకాల పంటలకు కూటమి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించింది

    • యాప్ ద్వారా ఎరువులు అందిస్తున్నాం

    • రైతులకు 3 బస్తాల యూరియా ఇస్తే ఉపయోగకరంగా ఉంటుంది: ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర

  • Jun 29, 2026 10:15 IST

    జగిత్యాల: మల్యాల మండలం నూకపల్లిలో దారుణం

    • భార్య లక్ష్మిని గొంతు నులిమి హత్య చేసిన భర్త

    • అనంతరం ఉరేసుకుని భర్త నాగరాజు ఆత్మహత్య

    • కుటుంబ కలహాలే కారణమంటున్న స్థానికులు

  • Jun 29, 2026 10:07 IST

    మహబూబ్ నగర్: దేవరకద్ర మండలం బస్వయిపల్లి గ్రామంలో దారుణం

    • అర్ధరాత్రి భర్త కుర్వ నాగేష్‌ను హత్య చేసిన భార్య కవిత

    • హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Jun 29, 2026 10:04 IST

    చెరువు సమీపంలో మహిళ మృతదేహం లభ్యం

    • పల్నాడు: అమరావతి మండలం లింగాపురం శివారులో ఘటన

    • తాగునీటి చెరువు సమీపంలో మహిళ మృతదేహం లభ్యం

    • కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Jun 29, 2026 09:48 IST

    శంషాబాద్‌లో ల్యాండ్ అవుతున్న విమానానికి లేజర్ లైట్స్ బెడద

    • నిన్న రాత్రి ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి శంషాబాద్‌ చేరుకున్న లుఫ్తాన్సా విమానానికి లేజర్ లైట్స్ తాకిడి

    • ITC అధికారులకు సమాచారం ఇచ్చిన పైలట్

    • దర్యాప్తు చేస్తున్న అధికారులు

    పూర్తి కథనం..

  • Jun 29, 2026 09:45 IST

    ఏలూరు: ABN ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. హాస్టల్ వార్డెన్ సస్పెన్షన్

    • చింతలపూడి ఎస్సీ బాలికల హాస్టల్ వార్డెన్ సస్పెన్షన్

    • 8వ తరగతి బాలిక దుప్పటి అడిగిందని హాస్టల్ నుంచి పంపించిన వార్డెన్ స్వప్న

    • బాలిక ఉదంతంపై ABN ఆంధ్రజ్యోతి వరుస కథనాలు

    • వార్డెన్ స్పప్నపై చర్యలు తీసుకున్న కలెక్టర్ వెట్రి సెల్వి

  • Jun 29, 2026 09:30 IST

    నెల్లూరు: సముద్ర తీర ప్రాంతంలో ఉద్రిక్తత

    • తీరానికి సమీపంలో హల్‌చల్ చేస్తున్న తమిళనాడు, పుదుచ్చేరి మరబోట్లు

    • స్థానిక మత్స్యకారులను రెచ్చగొట్టేలా తమిళనాడు, పుదుచ్చేరి జాలర్ల చర్యలు

    • రాళ్లు, ఖాళీ సీసాలు విసురుతూ దాడులకు పాల్పడుతున్న జాలర్లు

    • గస్తీ కోసం మూడు మరబోట్లను ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం

  • Jun 29, 2026 09:25 IST

    ఖమ్మంలో రేపటి సీఎం రేవంత్ సభపై సస్పెన్స్

    • మధిరలో రైతు ఆశీర్వాద సభకు రెయిన్ ఎఫెక్ట్

    • వర్షాలతో బురదమయమైన సభా ప్రాంగణం

    • సభాస్థలిని పరిశీలించనున్న మంత్రులు భట్టి, తుమ్మల

    • అనంతరం రేపటి సభపై నిర్ణయం

  • Jun 29, 2026 09:20 IST

    నిజామాబాద్: ఆర్మూర్‌లో నిరసన ర్యాలీకి హిందూ సంఘాల పిలుపు

    • ఓ ప్రైవేట్ స్కూల్లో విద్యార్థులకు ఉర్దూ బోధించడంపై వివాదం

    • ర్యాలీలో పాల్గొనేందుకు బయల్దేరిన ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి

    • భిక్కనూరు టోల్‌ప్లాజా దగ్గర వారిని అడ్డుకుని, అరెస్ట్ చేసిన పోలీసులు

  • Jun 29, 2026 09:15 IST

    భద్రాద్రి కొత్తగూడెం: అశ్వారావుపేట మండలం కావడిగుండ్లలో పెద్దపులి అలజడి

    • ఎద్దుపై దాడికి యత్నించి.. అడవిలోకి పారిపోయిన పులి

    • ప్లగ్ మార్క్స్ ఆధారంగా అడవిని జల్లెడపడుతున్న అటవీ సిబ్బంది

  • Jun 29, 2026 09:00 IST

    అన్నదాతలకు సీఎం చంద్రబాబు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు

    • పాడి పంటలతో రైతన్నల ఇళ్లలో వెలుగులు నిండాలని ప్రార్థిస్తున్నా: సీఎం చంద్రబాబు

    • మన భూమిని, మన ఆరోగ్యాన్ని..విషతుల్యం కాకుండా కాపాడుకుందాం: ఎక్స్‌లో సీఎం చంద్రబాబు

  • Jun 29, 2026 08:30 IST

    రంగారెడ్డి: మొయినాబాద్ పరిధి అజీజ్ నగర్‌లో విషాదం

    • ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ అనిల్ కుమార్(24)

    • చిన్నప్పటి నుంచి అజీజ్ నగర్‌లో తన అమ్మమ్మ ఇంట్లో ఉంటున్న అనిల్

    • ప్రేమ వ్యవహారం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్న పోలీసులు

    • మృతుడి తండ్రి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Jun 29, 2026 08:20 IST

    వనపర్తి జిల్లా పెబ్బేరు సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా

    • కర్నూలు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు

    • NH 44పై అదుపుతప్పి రోడ్డు మధ్యలో బోల్తా.. 30 మందికి స్వల్ప గాయాలు

    • ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు

    • క్షతగాత్రులను వనపర్తి జిల్లా పెబ్బేరు ప్రభుత్వాస్పత్రికి తరలింపు

    పూర్తి కథనం..

  • Jun 29, 2026 08:15 IST

    అమరావతి: వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితుల ఖాతాల్లోకి పరిహారం నిధులు

    • ఉదయం నుంచి ఖాతాల్లో జమ అవుతున్న పరిహారం ప్యాకేజీ మొత్తాలు

    • ఒక్కో నిర్వాసితుడికి రూ.12.50లక్షల నుంచి రూ.12.76లక్షల వరకు జమ

    • నిర్వాసితులకు రూ.300కోట్లు చెక్కును అందించిన సీఎం చంద్రబాబు

    • పరిహారం కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న నిర్వాసితులు

    పూర్తి కథనం..

  • Jun 29, 2026 08:10 IST

    ఏలూరు: ద్వారకాతిరుమల ఆలయంలో మరోసారి భద్రతా వైఫల్యం

    • స్వామివారి మూలవిరాట్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్

    • మూలవిరాట్‌తో పాటు ఆలయం లోపల వీడియో తీసిన వ్యక్తి

    • ద్వారకాతిరుమల ఆలయంలోకి సెల్‌ఫోన్ల నిషేధం

    • వీడియోలు తీస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్న భక్తులు

  • Jun 29, 2026 08:00 IST

    రంగారెడ్డి: మోకిలా పీఎస్ పరిధిలో విషాదం

    • ఇంట్లో ఉరేసుకుని దంపతుల ఆత్మహత్య

    • ఏడాదిన్నర క్రితం సాయి, పద్మ ప్రేమ వివాహం

    • కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Jun 29, 2026 07:50 IST

    అమరావతి: సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్

    • ఉదయం 11:15కు RTGSపై సీఎం చంద్రబాబు సమీక్ష

    • మధ్యాహ్నం 12:45కు రాజధాని పనులపై CRDA అధికారులు, నిర్మాణ సంస్థలతో సీఎం భేటీ

  • Jun 29, 2026 07:45 IST

    నంద్యాల: ఆత్మకూరు మండలం బైర్లూటిగూడెంలో దారుణం

    • భార్యపై బాణంతో దాడికి యత్నించిన భర్త

    • అడ్డుగా వచ్చిన అత్త కాలిలోకి దూసుకెళ్లిన బాణం, తీవ్రగాయాలు

    • కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Jun 29, 2026 07:40 IST

    ఉరి వేసుకుని.. గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య

    • ఎన్టీఆర్: నందిగామ మండలం ఐతవరం సమీపంలో విషాద ఘటన

    • జాతీయ రహదారి పక్కన విద్యుత్ స్తంభానికి ఉరి వేసుకుని గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య

    • కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Jun 29, 2026 07:19 IST

    అఫ్గానిస్థాన్ సరిహద్దు వెంబడి పాక్ భద్రతా దళాల ఆపరేషన్

    • ఉగ్ర స్థావరాలపై దాడుల్లో 29 మంది ఉగ్రవాదులు హతమైనట్టు పాక్ వెల్లడి

    • ఉగ్రదాడులకు ప్రతిస్పందనగా భూతల ఆపరేషన్ చేపట్టినట్టు పాక్ వెల్లడి

    • పోలీసులు, భద్రతా దళాలే లక్ష్యంగా ఇటీవల పాక్‌లో పెరిగిన ఉగ్రదాడులు

    పూర్తి కథనం..

  • Jun 29, 2026 07:16 IST

    నేడు 16వ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మండలి సదస్సు

    • కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా అధ్యక్షతన సదస్సు

    • ఆరోగ్య సేతు 2.0, పలు డిజిటల్‌ ఆరోగ్య సేవలను ప్రారంభించనున్న నడ్డా

  • Jun 29, 2026 07:16 IST

    విజయవాడ సాయికృష్ణ తల్లి పిటిషన్‌పై నేడు హైకోర్టు కీలక విచారణ

    • సాయికృష్ణ తల్లి వేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై విచారణ

  • Jun 29, 2026 07:15 IST

    సీషెల్స్‌లో ప్రధాని మోదీ మూడో రోజు పర్యటన

    • సీషెల్స్‌ జాతీయ దినోత్సవాలకు ప్రధాని మోదీ హాజరు

  • Jun 29, 2026 07:09 IST

    ఫిఫా ప్రపంచ కప్: రౌండ్ 16కు దూసుకెళ్లిన కెనడా

    • నాకౌట్ మ్యాచ్‌లో సాతాఫ్రికాకు షాకిచ్చిన కెనడా

    • దక్షిణాఫ్రికాపై 1-0 తేడాతో కెనడా విజయం

    • ఫిఫా ప్రపంచ కప్‌లో నాకౌట్ మ్యాచ్ గెలవడం కెనడాకు ఇదే తొలిసారి

    పూర్తి కథనం..

  • Jun 29, 2026 06:55 IST

    వరంగల్: నేటి కేటీఆర్ వరంగల్ పర్యటన వాయిదా

    • నేడు వరంగల్ తూర్పు, మహబూబాబాద్, డోర్నక‌ల్‌లో పర్యటించాల్సి ఉన్న కేటీఆర్

    • అనారోగ్య కారణాలతో వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన బీఆర్ఎస్ నాయకులు

  • Jun 29, 2026 06:52 IST

    తెలంగాణలో నితిన్‌ నబీన్‌ రెండో రోజు పర్యటన

    • నేడు వరంగల్‌కు బీజేపీ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌

    • బీజేపీ కార్యకర్తల సదస్సుకు హాజరుకానున్న నబీన్‌

    • ఆదివాసీ గిరిజన తెగల ప్రతినిధుల సమ్మేళనానికి హాజరు

  • Jun 29, 2026 06:52 IST

    నేడు ఢిల్లీలో ‘వీబీజీ రామ్‌జీ’ పై కీలక సమావేశం

    • సమావేశంలో పాల్గొననున్న మంత్రి సీతక్క

  • Jun 29, 2026 06:51 IST

    నేడు నిజామాబాద్‌ జిల్లాలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ గౌడ్‌ పర్యటన

    • నందిపేట్‌లో SIR సన్నాహక సమావేశానికి హాజరు

    • తర్వాత ఒలింపిక్‌ ర్యాలీలో పాల్గొననున్న మహేష్‌ గౌడ్‌

  • Jun 29, 2026 06:50 IST

    హోర్ముజ్‌ విషయంలో ఇతరుల జోక్యాన్ని సహించబోం: ఇరాన్‌

    • ఇతర దేశాల జోక్యంతో సమస్యలు తీవ్రమవుతాయి: ఇరాన్‌

  • Jun 29, 2026 06:41 IST

    వెనెజువెలా భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

    • భూకంపం దాటికి 1,450 మంది మృతి, 4 వేల మందికి గాయాలు

    • మరో 70 వేల మంది ఆచూకీ గల్లంతు

    • కొనసాగుతున్న సహాయక చర్యలు

  • Jun 29, 2026 06:40 IST

    రష్యాపై ఆగని ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులు

    • రష్యా ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు

    • దెబ్బతిన్న స్లావ్యాన్స్కీ, యారోస్లావ్‌ చమురు శుద్ధి కర్మాగారాలు

  • Jun 29, 2026 06:19 IST

    అమెరికా, ఇరాన్‌ కీలక నిర్ణయం

    • పరస్పరం దాడులు ఆపాలని నిర్ణయం

    • సైనిక చర్యలను ఆపేందుకు ఆమోదం

    • ఖతర్‌ వేదికగా జులై 1న ఉన్నత స్థాయి చర్చలు

    పూర్తి కథనం..

  • Jun 29, 2026 06:03 IST

    తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు

    • తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు

    • పలుచోట్ల పిడుగులు పడే అవకాశం.. ఎల్లో అలర్ట్‌ జారీ

    • ఏపీలోని ఉత్తరాంధ్ర, రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు