ఫామ్‌హౌస్, స్కార్పియో, ఖరీదైన ఇల్లు.. మారిన అయోధ్య నిందితుడి జీవనశైలి..
ABN , Publish Date - Jun 29 , 2026 | 12:42 PM
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసులో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రధాన నిందితులుగా నిలిచారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసులో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రధాన నిందితులుగా నిలిచారు. ఆలయ విరాళాల నిధులను దుర్వినియోగం చేసిన కేసులో అరెస్టయిన ఎనిమిది మందిలో అనుకల్ప్ మిశ్రా, అతడి బావమరిది లవ్‌కుశ్ మిశ్రా కీలక నిందితులని అధికారులు అనుమానిస్తున్నారు (Ram Temple donation theft).
భక్తులు విరాళంగా ఇచ్చిన నగదు, ఇతర విలువైన వస్తువులను లెక్కించే బృందంలో లవ్‌కుశ్‌కు స్థానం దక్కేలా అనుకల్ప్ చక్రం తిప్పాడు. దేశ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించిన ఈ కుంభకోణానికి అనుకల్ప్ మిశ్రా కీలక సూత్రధారి అని దర్యాప్తు అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఇటీవలి కాలంలో అనుకల్ప్ మిశ్రా జీవన శైలి విలాసవంతంగా మారినట్టు తాజాగా బయటపడింది (Ayodhya Ram Temple Anukalp Mishra).
అయోధ్యకు సమీపంలోని బసవ గ్రామంలో అనుకల్ప్ మిశ్రా ఇల్లు అత్యంత విలాసవంతంగా ఉంది. ఇటీవలె గ్రామ శివార్లలో ఓ ఫామ్ హౌస్ కూడా కట్టుకున్నాడు. అలాగే ఇప్పటికే అతడికి ఓ కారు ఉన్నప్పటికీ తాజాగా ఒక స్కార్పియో వాహనాన్ని బుక్ చేశాడు. గత సంవత్సరం అయోధ్యలో సుమారు రూ. 65 లక్షల విలువైన ఒక ఇంటిని కూడా అనుకల్ప్ కొనుగోలు చేసినట్లు వెలుగులోకి వచ్చింది (Ram Temple donation scam).
కొన్నాళ్ల క్రితం వరకు అనుకల్ప్ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేదని, కానీ ఇప్పుడు వారికి ఏ లోటూ లేదని గ్రామస్థులు తెలిపారు (Ayodhya latest news). బ్యాంకు ఔట్‌సోర్సింగ్ బృందంలో పనిచేసిన అనుకల్ప్, మూడేళ్ల క్రితం ఆలయ విరాళాల లెక్కింపు బృందంలో చేరాడు. ఆ తర్వాత తన బావమరిది లవ్‌కుశ్ మిశ్రాను కూడా బ్యాంకు ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా అదే బృందంలో నియమించాడు. అధికారులు ప్రస్తుతం నిందితులైన ఎనిమిది మంది ఆస్తులు, ఆర్థిక స్థితిపై దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక శాంతి.. దాడులు నిలిపివేయాలని ఒప్పందం..