Share News

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - May 25 , 2026 | 06:36 AM

గత కొన్ని రోజులుగా పెరుగుతూ వెళ్లిన బంగారం ధరలు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతుండడంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభిస్తోంది. సోమవారం ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
gold and silver rates today

బంగారం ధరలు స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వెళ్లిన బంగారం ధరలు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతుండడంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభిస్తోంది. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాలతో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి కారణంగా బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి (Gold and Silver Rates).


గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, సోమవారం ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,59,050గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,45,790గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,59,200గా, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,45,940గా ఉంది (Live Gold Rates).


మరోవైపు వెండి ధరలు కూడా స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి (Silver prices today). కిలోకు వంద రూపాయల మేర తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్‌, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,94,900గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,84,900గా ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.2,94,900గా, బెంగళూరులో రూ.2,84,900గా ఉంది.

గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.


ఈ వార్తలనూ చదవండి:

చరిత్రాత్మక శాంతి ఒప్పంద ప్రయత్నాలు.. అణు నిల్వలపై తెగని ఉత్కంఠ

కొద్ది గంటల్లో ప్రపంచానికి ఒక శుభవార్త అందవచ్చు: అమెరికా విదేశాంగ మంత్రి

Updated Date - May 25 , 2026 | 06:36 AM