Share News

అసలైన బిన్ లాడెన్ నేనే.. వైట్‌హౌస్ కాల్పుల ఘటన నిందితుడి పోస్టు

ABN , Publish Date - May 24 , 2026 | 04:21 PM

శ్వేత సౌధం వద్ద కాల్పులకు తెగబడి, భద్రతాసిబ్బంది దాడిలో మరణించిన నిందితుడు నసీర్ బెస్ట్ గతంలో ట్రంప్‌ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పలు పోస్టులు పెట్టినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.

అసలైన బిన్ లాడెన్ నేనే.. వైట్‌హౌస్ కాల్పుల ఘటన నిందితుడి పోస్టు
White House shooting

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్ష భవనం శ్వేత సౌధం వద్ద ఆదివారం కాల్పులకు తెగబడ్డ నిందితుడు నసీర్ బెస్ట్ అధ్యక్షుడు ట్రంప్‌ను టార్గెట్ చేస్తూ ఆన్‌లైన్‌లో పలు పోస్టులు పెట్టినట్టు అధికారులు గుర్తించారు. అధ్యక్షుడికి హాని తలపెడతానంటూ అతడు ఈ పోస్టులను పెట్టినట్టు దర్యాప్తులో తాజాగా వెలుగులోకి వచ్చింది. తానే అసలైన బిన్ లాడెన్ అని కొన్ని పోస్టుల్లో నిందితుడు పేర్కొన్నాడు. నిందితుడి అనుమానాస్పద వైఖరి సీక్రెట్ సర్వీసు ఏజెంట్స్ దృష్టికి వచ్చినప్పటికీ అతడు హింసకు దిగవచ్చన్న ఆధారాలు మాత్రం అప్పట్లో లభించలేదని సమాచారం. ఒక సందర్భంలో అధికారులకు చిక్కిన అతడు తాను క్రీస్తు అవతారాన్ని అని కూడా చెప్పుకున్నట్టు తెలిసింది. అతడికి మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు తెలిసింది.


గతేడాది జూన్‌లో నిందితుడు వైట్‌హౌస్‌కు వెళ్లే ఒక మార్గాన్ని బ్లాక్ చేసేందుకు ప్రయత్నించగా అధికారులు అతడిని సైకియాట్రీ ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. ఆ తరువాతి నెలలోనే అతడు వైట్‌హౌస్ కాంప్లెక్స్ డ్రైవ్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించి మళ్లీ అధికారులకు దొరికిపోయాడు. ఇక తాజా ఘటనలో బెస్ట్ శ్వేతసౌధం సమీపంలోని ఒక చెకింగ్ పాయింట్ వద్ద తన బ్యాగులోని గన్నును తీసి కాల్పులకు దిగిన విషయం తెలిసిందే. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అతడిని మట్టుపెట్టారు. ఘటన సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శ్వేతసౌధంలోనే ఉన్నారు. దీంతో, అక్కడి భద్రతపై ఆందోళన పెరిగింది.


ఈ వార్తలనూ చదవండి:

చరిత్రాత్మక శాంతి ఒప్పంద ప్రయత్నాలు.. అణు నిల్వలపై తెగని ఉత్కంఠ

కొద్ది గంటల్లో ప్రపంచానికి ఒక శుభవార్త అందవచ్చు: అమెరికా విదేశాంగ మంత్రి

Updated Date - May 24 , 2026 | 05:06 PM