Share News

కొద్ది గంటల్లో ప్రపంచానికి ఒక శుభవార్త అందవచ్చు: అమెరికా విదేశాంగ మంత్రి

ABN , Publish Date - May 24 , 2026 | 01:53 PM

ఇరాన్‌తో శాంతి చర్చల గురించి అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రుబియో కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

కొద్ది గంటల్లో ప్రపంచానికి ఒక శుభవార్త అందవచ్చు: అమెరికా విదేశాంగ మంత్రి
US Iran deal

ఇరాన్‌తో శాంతి చర్చల గురించి అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రుబియో కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 'మరికొన్ని గంటల్లో ప్రపంచానికి ఒక శుభవార్త అందే అవకాశం ఉంది' అని తెలిపారు. దీంతో అమెరికా-ఇరాన్ చర్చలు కీలక దశకు చేరుకున్నాయనే సంకేతాలు వెలువడ్డాయి (Iran peace talks).


రుబియో వ్యాఖ్యల నేపథ్యంలో అంతర్జాతీయ దృష్టి మొత్తం అమెరికా-ఇరాన్ చర్చలపై పడింది. తాజాగా డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరాన్‌తో శాంతి ఒప్పందం దాదాపు ఖరారైందని పేర్కొన్నారు. అధికారిక ప్రకటనకు ముందు ఒప్పందం తుది వివరాలపై చర్చిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. కాగా, హోర్ముజ్ జలసంధిపై ఎవరి నియంత్రణా లేకుండా స్వేచ్ఛా రవాణాకు అవకాశం ఉండాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి (US Iran deal).


కాగా, ఉగ్రవాదంపై పోరులో భారత్, అమెరికా కలిసి పని చేస్తాయని భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో రుబియో పేర్కొన్నారు (Iran negotiations). భారత్, అమెరికా రెండూ ఉగ్రవాద బాధిత దేశాలేనని, ఉగ్రవాదంపై పోరులో భారత్‌తో కలిసి నడుస్తామని పేర్కొన్నారు. ఇక, అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయని, త్వరలో ఆ దేశ బృందం భారత్‌కు రాబోతోందని జైశంకర్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

అమెరికా నిజాయితీగా వ్యవహరించడం లేదు.. చర్చల్లో రాజీ పడబోమన్న ఇరాన్..


ఈ రోజు బంగారం కొనాలనుకుంటున్నారా.. ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - May 24 , 2026 | 01:53 PM