Share News

నెదర్లాండ్స్‌లో భగ్గుమంటున్న ఎండలు.. ఆరుబయటే ఆమ్లెట్ వేసిన యువకుడు..

ABN , Publish Date - Jun 29 , 2026 | 12:00 PM

ప్రస్తుతం యూరప్‌ను అధిక ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. యూరప్ శీతల దేశాలు భానుడి ప్రతాపానికి విలవిలలాడుతున్నాయి.

నెదర్లాండ్స్‌లో భగ్గుమంటున్న ఎండలు.. ఆరుబయటే ఆమ్లెట్ వేసిన యువకుడు..
Netherlands heatwave

ప్రస్తుతం యూరప్‌ను అధిక ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. యూరప్ శీతల దేశాలు భానుడి ప్రతాపానికి విలవిలలాడుతున్నాయి. గత వారంలో తీవ్రమైన వేడి, వడగాల్పుల కారణంగా మూడు రోజుల్లోనే ఫ్రాన్స్‌లో సుమారు 1000 అదనపు మరణాలు సంభవించాయని ఆ దేశ ప్రజారోగ్య సంస్థ ఆదివారం వెల్లడించింది. తాజాగా నెదర్లాండ్స్‌లో పరిస్థితిని ఓ యువకుడు కళ్లకు కట్టినట్టు చూపించాడు (Netherlands heatwave).


ఓ యువకుడు తన ఇంటి బయట ఒక పాన్‌ను ఉంచి అందులో నూనె వేశాడు. కాసేపు ఎండలో ఉంచిన తర్వాత అందులో గుడ్డును పగలగొట్టి ఆమ్లెట్ వేశాడు. కాసేపటికే ఆమ్లెట్ తయారైపోయింది. ప్రస్తుతం నెదర్లాండ్స్‌లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటినట్టు ఆ యువకుడు పేర్కొన్నాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు (Europe heatwave 2026).


ఈ వీడియో చూసిన తర్వాత కొందరు యూరప్‌లోని ఎండలపై ఆందోళన వ్యక్తం చేశారు (Cooking egg outdoors). మరికొందరు మాత్రం 40 డిగ్రీల వేడికే గుడ్డు ఉడకడం కష్టమని పేర్కొన్నారు. నూనె ఎక్కువగా వేయడం వల్లే గుడ్డు ఉడికిందని మరికొందరు కామెంట్లు చేశారు. ఏదేమైనా యూరప్ ప్రజలు ఎండల ధాటికి తట్టుకోలేకపోతున్నారనేది మాత్రం సత్యం.


ఇవి కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..


అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక శాంతి.. దాడులు నిలిపివేయాలని ఒప్పందం..

Updated Date - Jun 29 , 2026 | 12:28 PM