Share News

బస్సు బోల్తా.. 30 మంది ప్రయాణికులకు గాయాలు

ABN , Publish Date - Jun 29 , 2026 | 09:13 AM

వనపర్తి జిల్లా పెబ్బేరు సమీపంలోని 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు.

బస్సు బోల్తా.. 30 మంది ప్రయాణికులకు గాయాలు
Road Accident In Wanaparty District

వనపర్తి, జూన్ 29: వనపర్తి జిల్లా పెబ్బేరు సమీపంలోని 44వ నెంబర్ జాతీయ రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న టీజీఎస్ ఆర్టీసీ బస్సు సోమవారం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. రహదారిపై వెళ్తున్న వాహనదారులతో పాటు స్థానికులు వెంటనే స్పందించి.. వారిని పెబ్బేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


ప్రయాణికులకు స్వల్పంగా గాయాలయ్యాయని వైద్యులు వెల్లడించారు. వారికి ప్రాథమిక చికిత్స అందించినట్లు చెప్పారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులతోపాటు ఆర్టీసీ ఉన్నతాధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపారు.


ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు వెంటనే బోల్తా పడిన బస్సును రహదారిపై నుంచి తొలగించారు. దీంతో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బస్సు బోల్తా.. 30 మంది ప్రయాణికులకు గాయాలు

రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: డిప్యూటీ సీఎం

For More AP News And Telugu News

Updated Date - Jun 29 , 2026 | 09:38 AM