-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National and International breaking Live Updates of 22 August 2026
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Aug 22 , 2026 | 07:15 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Aug 22, 2026 21:55 IST
హైదరాబాద్‌లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో లండన్‌లో రౌండ్ టేబుల్ సమావేశం
లండన్ యూనివర్సిటీ ప్రతినిధులతో తెలంగాణ రైజింగ్ బృందం భేటీ
హైదరాబాద్‌లో క్యాంపస్ ఏర్పాటు చేస్తామని లండన్ యూనివర్సిటీ ప్రతినిధుల వెల్లడి
-
Aug 22, 2026 21:24 IST
హాకీ ప్రపంచ కప్: కీలక మ్యాచ్‌లో టీమిండియా ఓటమి
ప్రపంచ నంబర్ వన్ నెదర్లాండ్స్‌పై 3-1 తేడాతో భారత్ ఓటమి
భారత తరఫున ఒక గోల్ సాధించిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్
-
Aug 22, 2026 20:45 IST
వికారాబాద్ జిల్లా: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
తాండూర్ పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామ సమీపంలో ఘటన
ఊరు చివరకు బహిర్భూమికి వెళ్లి వస్తుండగా ఢీకొన్న వాహనం
మృతుడు వడ్డే సాయిలు(40) గా గుర్తింపు
మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Aug 22, 2026 20:30 IST
నెల్లూరు: సంగం మండలం వెంగారెడ్డి పాలెం సమీపంలో రోడ్డు ప్రమాదం
సైక్లిస్టును ఢీకొట్టిన కారు
సైకిల్‌పై ఉన్న దండు చిన్న (48)అక్కడికక్కడే మృతి
ఆపకుండా వెళ్లిపోయిన కారు యజమాని
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Aug 22, 2026 20:20 IST
నెల్లూరు: ఆత్మకూరు తోటవీధిలో సీఎన్జీ కారులో మంటలు
వెంగళరావుకు చెందిన కారు పూర్తిగా దగ్ధం
సుమారు రూ.4 లక్షల ఆస్తి నష్టం
-
Aug 22, 2026 20:15 IST
ఉద్యోగాలు, ప్రతిభకు నెంబర్‌వన్ సిటీగా విశాఖ: సీఎం చంద్రబాబు
మారిటైమ్ గేట్‌వే, టెక్నాలజీ-ఇన్నోవేషన్ హబ్‌గా విశాఖ: సీఎం చంద్రబాబు
ఇంటర్నేషనల్ వాటర్ స్పోర్ట్స్ డెస్టినేషన్‌గా విశాఖ: చంద్రబాబు
వాటర్ స్పోర్ట్స్ టూరిజానికి విశాఖలో అపార అవకాశాలు: చంద్రబాబు
బ్రిక్స్ దేశాలతో క్రీడా భాగస్వామ్యానికి ఏపీ సిద్ధం: సీఎం చంద్రబాబు
-
Aug 22, 2026 20:00 IST
కాకినాడ: ఉమెన్స్ నర్సింగ్ కాలేజీ విద్యార్థినుల మధ్య ఘర్షణ
సెల్‌ఫోన్ చోరీ అంశంపై మణిపూర్ రాష్ట్రం, స్థానిక మహిళా విద్యార్థినుల మధ్య వాగ్వాదం
పలువురు విద్యార్థినులకు గాయాలు, ఆస్పత్రికి తరలింపు
విద్యార్థినుల ఘర్షణపై మణిపూర్ CMO నుంచి ఏపీ CMO ఆఫీస్‌కు ఫోన్
విచారణ చేపట్టిన DMHO, DME విచారణ
-
Aug 22, 2026 19:50 IST
క్రమశిక్షణ కమిటీకి కొండా సురేఖ మరో లేఖ
నన్ను, నా కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నారు: మంత్రి కొండా సురేఖ
కొందరి నేతల వ్యాఖ్యల వెనుక అసలు వ్యక్తులను గుర్తించాలి: కొండా సురేఖ
అసలు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి: కొండా సురేఖ
క్రమశిక్షణ కమిటీకి ఇప్పటికే వివరణ ఇచ్చా: మంత్రి కొండా సురేఖ
-
Aug 22, 2026 19:45 IST
DSCపై జగన్‌కు మరోసారి మంత్రి లోకేశ్ సవాల్
టైమ్, డేట్ నువ్వే ఫిక్స్ చెయ్.. చర్చకు నేను సిద్ధం: లోకేశ్
త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలి: మంత్రి నారా లోకేశ్
-
Aug 22, 2026 18:45 IST
హైదరాబాద్‌లో TG SAFE దాడులు
ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులతో కలిసి 10 ప్రత్యేక బృందాలతో తనిఖీలు
20 డార్క్ స్టోర్లపై సోదాలు చేసిన TG సేఫ్
BigBasket, Blinkit, Zepto డార్క్ స్టోర్లలో తనిఖీలు
పలు స్టోర్లలో శుభ్రతా ప్రమాణాలను ఉల్లగించినట్లు గుర్తింపు
ఆహార పదార్థాల నిల్వ, నిర్వహణలో లోపాలు ఉన్నట్లు గుర్తింపు
-
Aug 22, 2026 18:36 IST
బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్: ట్రీసా-గాయత్రి జోడీకి కాంస్యం
సెమీస్‌లో చైనా జంటపై ఓడిన భారత జోడీ
21-18, 13-21, 8-21 తేడాతో ఓడిన ట్రీసా-గాయత్రి
మహిళల డబుల్స్ విభాగంలో పతకం నెగ్గిన రెండో భారత జోడీగా ట్రీసా-గాయత్రి రికార్డు
-
Aug 22, 2026 18:34 IST
కొండా సుస్మిత లైన్ దాటి ఆరోపనలు చేశారు: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
అనిరుధ్, రాజగోపాల్ హద్దు మీరలేదు: మహేశ్ గౌడ్
పార్టీ లైన్ ఎవరు దాటినా చర్యలు తప్పవు: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
-
Aug 22, 2026 18:33 IST
రాజమండ్రి: ఏఈ నూకరాజు భార్య మీనా మృతదేహం లభ్యం
ఆత్రేయపురం మండలం మూలస్థానం అగ్రహారం దగ్గర ఘటన
గోదావరిలో మీనా మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు
ఆత్మహత్యకు పాల్పడిన 7రోజుల తర్వాత మీనా మృతదేహం లభ్యం
-
Aug 22, 2026 18:32 IST
ఎన్టీఆర్: జి.కొండూరు మండలం కట్టుబడిపాలెం దగ్గర ప్రమాదం
తారకరామ కాలువలో పల్టీకొట్టిన ఇబ్రహీంపట్నంకు చెందిన ప్రైవేట్ పాఠశాల బస్సు
కాలువలో నీళ్లు లేకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డ విద్యార్థులు
బస్సులో ఉన్న విద్యార్థులను బయటకు తీసిన రైతులు
ప్రమాద సమయంలో బస్సులో 20 మంది విద్యార్థులు
-
Aug 22, 2026 18:31 IST
విజయనగరం: DSC, APPSCకి తేడా తెలియని వ్యక్తి జగన్: మంత్రి నారా లోకేశ్
అలాంటి వ్యక్తి సీఎం ఎలా అయ్యారో తెలియడం లేదు: మంత్రి నారా లోకేశ్
గొడ్డలి పార్టీ చెప్పేది ఒకటి... చేసేది మరొకటి: మంత్రి నారా లోకేశ్
-
Aug 22, 2026 18:20 IST
విజయవాడ: మాజీ మంత్రి జోగి రమేష్‌కు ముందస్తు బెయిల్
జోగి రమేష్‌తో పాటు కుటుంబ సభ్యులకు షరతులతో బెయిల్
గృహ హింస, వరకట్న వేధింపుల కేసులో బెయిల్ మంజూరు
విచారణకు పిలిచినప్పుడు హాజరుకావాలని జోగి రమేష్‌కు ఆదేశం
-
Aug 22, 2026 18:15 IST
సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనపై ఖర్గే స్పందన
విదేశాంగశాఖ నిర్ణయంపై ఖర్గే ఆగ్రహం: ఖర్గే
రాజకీయ కారణాలతో పర్యటనకు అనుమతి రద్దు చేశారు: ఖర్గే
పెట్టుబడులు ఆహ్వానించడానికే రేవంత్ పర్యటన: ఖర్గే
సీఎంల విదేశీ పర్యటనలను అడ్డుకోవడం తగదు: ఖర్గే
కావాలనే పర్యటనకు అనుమతి ఇవ్వలేదు: ఖర్గే
-
Aug 22, 2026 18:00 IST
కొండా సురేఖ వివరణపైనే ప్రధాన చర్చ: మల్లు రవి
సీఎంపై సుస్మిత అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు గుర్తింపు: మల్లు రవి
3 అంశాలపై చర్చించాం: మల్లు రవి
అందరు ఇచ్చిన ఫిర్యాదులపై మరోసారి చర్చించి నిర్ణయం
-
Aug 22, 2026 17:45 IST
ఏపీలో 10,060 పోస్టులకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్
నాలుగు దశల్లో 10,060 పోస్టుల భర్తీకి అనుమతి
సెప్టెంబర్ 15న 3,231 పోస్టులకు నోటిఫికేషన్
రెండో దశలో గ్రూప్-1లో 149 పోస్టులు
పోలీస్ కానిస్టేబుల్ 542, సివిల్ సీఐ 182 పోస్టులు
అక్టోబర్ 15న 2,311 పోస్టులకు నోటిఫికేషన్
-
Aug 22, 2026 17:32 IST
ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం
ఎంఐ ‘డైరెక్టర్ ఆఫ్ పెర్ఫార్మెన్స్’గా భారత మాజీ క్రికెటర్ జుబిన్ భారుచా నియామకం
రాజస్థాన్ రాయల్స్‌తో 16 ఏళ్ల ప్రయాణానికి ముగింపు
-
Aug 22, 2026 17:30 IST
ఇబ్రహీంపట్నం పీఎస్ సమీపంలో విషాద ఘటన
కారు నుంచి దిగుతుండగా స్పృహ తప్పి పడిపోయిన వ్యక్తి
వెంటనే స్పందించి, CPR చేసిన పోలీసులు
ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతి
మృతుడు ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండకు చెందిన దేవరపల్లి రాజాగా గుర్తింపు
-
Aug 22, 2026 17:26 IST
రాత్రి 7 గంటలకు బీజేపీ కేంద్ర కార్యాలయానికి ప్రధాని మోదీ
నూతన జాతీయ కార్యవర్గం తొలి సమావేశంలో పాల్గొననున్న మోదీ
నూతన జాతీయ కార్యవర్గాన్ని ఉద్దేశించి మాట్లాడనున్న ప్రధాని మోదీ
-
Aug 22, 2026 17:26 IST
తెలంగాణలో RR రియల్‌ఎస్టేట్ నడుస్తోంది: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
కమీషన్లు ఇవ్వకపోతే భూములను 22Aలో పెడుతున్నారు: కిషన్ రెడ్డి
22A పేరుతో భూములను దోచుకుంటున్నారు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
-
Aug 22, 2026 17:15 IST
కర్నూలు: హంపీ సమీపంలోని తుంగభద్ర నదిలో విషాదం
నదిలో తల్లీకూతుళ్ల గల్లంతు
కాలుజారి నీళ్లలో పడిపోయిన తల్లీకూతుళ్లు తల్లి షాహీన్(38), కుమార్తె యాస్మీన్ (13)
కౌతాళం మండలం సులేకేరి గ్రామానికి చెందిన వారిగా గుర్తింపు
బంధువులతో కలిసి హంపి పర్యటనకు వెళ్లిన తల్లీకూతురు
గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు
-
Aug 22, 2026 16:56 IST
లండన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
కేంబ్రిడ్జ్ వర్సిటీ విద్యావేత్తలతో తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల సమావేశం
సీఎం రేవంత్ నేతృత్వంలో కేంబ్రిడ్జి ప్రతినిధులతో కీలక చర్చలు
విద్య, పరిశోధన రంగాల్లో భాగస్వామ్య అవకాశాలపై విస్తృత చర్చ
హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
-
Aug 22, 2026 16:48 IST
నిజామాబాద్: బోధన్ పోలీస్ స్టేషన్‌లో వ్యక్తి వీరంగం
గంజాయి మత్తులో సీఐ, కానిస్టేబుల్‌పై దాడి చేసిన సాయిలు అనే వ్యక్తి
కాలు, చేతి వేళ్లు కొరకడంతో పోలీసులకు తీవ్ర గాయాలు
ఆస్పత్రిలో సిబ్బందిపై కూడా దాడికి యత్నించిన సాయిలు
అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
Aug 22, 2026 16:36 IST
డీఎస్సీలో ఎలాంటి అవకతవకలూ జరగలేదు: సీఎం చంద్రబాబు
ఉద్యోగాలు ఇస్తే నాకు ఎక్కడ పేరు వస్తుందోనని కుట్ర పన్నారు: సీఎం చంద్రబాబు
మెగా డీఎస్సీ ఇచ్చి ఉద్యోగాలిస్తే.. 350 పిటిషన్లు వేశారు: సీఎం
మెరిట్‌పైనే పోస్టులు ఇచ్చిన సంప్రదాయం మాది: సీఎం
ఉపాధ్యాయులను అగౌరవపరిచే కుట్రకు వైసీపీ తెరలేపింది: సీఎం చంద్రబాబు
-
Aug 22, 2026 16:35 IST
విజయనగరం: టీడీపీ శ్రేణులతో మంత్రి నారా లోకేశ్ సమావేశం
పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి
ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఆధ్వర్యంలో సమావేశం
-
Aug 22, 2026 16:30 IST
ఢిల్లీలో భారీగా పెరుగుతున్న స్వైన్‌ఫ్లూ కేసులు
ఒక్కరోజులో 114 కొత్త స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు
ఈ ఏడాది ఢిల్లీలో 1777 స్వైన్‌ఫ్లూ కేసులు
రెండు వారాల్లో 433 కొత్త కేసులు నమోదు
వర్షాకాలంలో స్వైన్‌ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి: ఎయిమ్స్ వైద్యులు
-
Aug 22, 2026 16:28 IST
హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు
అంజయ్యనగర్‌లోని అక్రమ నిర్మాణాలన్నీ తొలగిస్తాం
ఎవరినీ ఉపేక్షించం: హైడ్రా కమిషనర్ రంగనాథ్
-
Aug 22, 2026 15:39 IST
హైదరాబాద్: గచ్చిబౌలిలో ఏడంతస్తుల భవనం కూలిన ఘటనలో ఇద్దరి మృతి
భవనం శిథిలాలు పడి పక్కన ఉన్న అపార్ట్‌మెంట్‌లో ఇద్దరికి గాయాలు
పక్కన ఉన్న అపార్ట్‌మెంట్ గోడలతో పాటు సామగ్రి ధ్వంసం
ఖాళీ చేసి వెళ్తున్న పక్క అపార్ట్‌మెంట్‌వాసులు
-
Aug 22, 2026 15:38 IST
కృష్ణా జిల్లా కంకిపాడు: యూరప్ దేశాల్లో ఉద్యోగాల పేరుతో భారీ మోసం.!
'ఫ్లయింగ్ బోర్డర్స్' అనే సంస్థ ద్వారా నిరుద్యోగులను మోసం చేసిన వైనం
విశాఖ, అల్లూరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల యువత నుంచి రూ.కోట్ల వసూళ్లు
ఉద్యోగాలు రాకపోవడంతో విశాఖ 'ద్వారకా' పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు
కృష్ణా జిల్లా తాడిగడపలోని సౌజన్య ఇంటికి వెళ్లిన విశాఖ ద్వారకా పోలీసులు
ఫ్లయింగ్ బోర్డర్స్ నిర్వాహకురాలిని అరెస్టు చేసి విశాఖకు తరలించిన పోలీసులు
-
Aug 22, 2026 15:36 IST
హైదరాబాద్: గచ్చిబౌలిలో కుప్పకూలిన బిల్డింగ్ వద్ద కొనసాగుతున్న సహయక చర్యలు
ఘటనా స్థలానికి చేరుకున్న సీఎంసీ కమిషనర్ సుజన, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ
ఘటనా స్థలానికి చేరుకున్న NDRF సిబ్బంది
-
Aug 22, 2026 15:20 IST
బంగ్లా-ఆస్ట్రేలియా రెండో టెస్టు: తొలి రోజు ముగిసిన ఆట
101 పరుగుల ఆధిక్యంలో ఆస్ట్రేలియా
తొలి ఇన్నింగ్స్‌లో 64 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్
6 వికెట్లతో చెలరేగిన ఆసీస్ బౌలర్ స్టార్క్
తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ స్కోర్ 165/8
6 వికెట్లు తీసిన బంగ్లా బౌలర్ షోర్‌ఫుల్ ఇస్లామ్
-
Aug 22, 2026 14:30 IST
నంద్యాల: ఆత్మకూరు మండలం సిద్ధాపురంలో అధికారులపై దాడికి యత్నం
విద్యుత్ శాఖ అధికారులపై కత్తితో దాడికి యత్నించిన వ్యక్తి
సిద్ధాపురంలో విద్యుత్ బకాయిలు చెల్లించలేదని కనెక్షన్ కట్ చేసేందుకు వెళ్లిన అధికారులు
కనెక్షన్ కట్ చేస్తుండగా ఆగ్రహంతో కత్తితో దాడికి దిగిన పీర్ల కొండబాబు
జేఎల్ఎం అశోక్ రెడ్డిపై కత్తితో దాడికి యత్నించిన కొండబాబు
బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన ఆత్మకూరు పోలీసులు
-
Aug 22, 2026 14:15 IST
హైదరాబాద్: నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో పవర్ ఎగ్జిబిషన్–2026 ప్రారంభం
ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
మూడు రోజుల పాటు కొనసాగనున్న పవర్ ఎగ్జిబిషన్
విద్యుత్ రంగంలోని ఆధునిక సాంకేతికతల ప్రదర్శన
విద్యుత్ భద్రతా చర్యలు, పునరుత్పాదక ఇంధనంపై ప్రత్యేక ప్రదర్శనలు
-
Aug 22, 2026 14:00 IST
సిరిసిల్ల: వేములవాడ పోలీసులకు నటి మాధురి రాథోడ్ ఫిర్యాదు
డాన్సర్ ఈశ్వర్‌సాయి భార్య శరణ్యపై ఫిర్యాదు చేసిన నటి మాధురి
ఈనెల 19న తనపై శరణ్య దాడి చేశారని మాధురి ఫిర్యాదు
తన ఐఫోన్ తీసుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్న మాధురిరాథోడ్
తనపై దుష్ప్రచారం చేశారని పలు సోషల్ మీడియా ఖాతాలపైనా ఫిర్యాదు
-
Aug 22, 2026 13:55 IST
హైదరాబాద్: రోడ్లు, భవనాల శాఖపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష
CRIF రోడ్ల పనుల పురోగతి, సేతుబంధన్, ROB పనుల పురోగతిపై చర్చ
సెక్రటేరియట్ సోలార్ పార్కింగ్‌పై చర్చ, పలు డిజైన్ల పరిశీలన
-
Aug 22, 2026 13:50 IST
హైదరాబాద్: గచ్చిబౌలిలో కూలిన ఏడంతస్తుల భవనం
పాక్షికంగా దెబ్బతిన్న పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్లు
అంజయ్యనగర్‌లో 50 గజాల్లో భవనం నిర్మాణం
నాలాను అనుకుని ఏడంతస్తుల భవనం నిర్మించిన యజమాని
CMC నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా భవనం నిర్మాణం
గతంలో నోటీసులు ఇచ్చిన CMC టౌన్‌ప్లానింగ్ అధికారులు
ఘటనాస్థలికి అధికారులు, రెస్క్యూ సిబ్బంది
-
Aug 22, 2026 13:40 IST
UPSC, APPSC సంస్థలంటే యువతకు గొప్ప విశ్వాసం: మంత్రి పార్థసారథి
దేశ, రాష్ట్ర విధానాలను అమలు చేసే అత్యున్నత ఉద్యోగులను ఎంపిక చేస్తారు
విశ్వసనీయత దెబ్బతీసేలా ఎవరు ప్రవర్తించినా ఊరుకోం: మంత్రి పార్థసారథి
-
Aug 22, 2026 13:32 IST
హైదరాబాద్: రైన్ బజార్ పీఎస్ పరిధిలో భారీ చోరీ
యాకుత్‌పురాలో ఖలీల్ అనే వ్యక్తి ఇంట్లో దొంగతనం
ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి చేతివాటం ప్రదర్శించిన దుండగులు
సుమారు 17 తులాల బంగారం, రూ. 4 లక్షల నగదు, 9 లక్షల విదేశీ కరెన్సీ అపహరణ
ఖలీల్ భార్య అల్మారా తెరచి చూడగా వెలుగులోకి వచ్చిన చోరీ వ్యవహారం
బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన రైన్ బజార్ పోలీసులు, క్లూస్ టీమ్
-
Aug 22, 2026 13:20 IST
అనకాపల్లి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
అనకాపల్లి అంటే బెల్లం ఒక్కటే కాదు.. ఇండస్ట్రియల్ ఏరియా: సీఎం చంద్రబాబు
రాబోయే రోజుల్లో దేశంలోనే అనకాపల్లి జిల్లా నెం.1 అవుతుంది: సీఎం చంద్రబాబు
అనకాపల్లికి నీళ్లు తెచ్చే బాధ్యత నాది: సీఎం చంద్రబాబు
త్వరలోనే అనకాపల్లి, విశాఖకు గోదావరి నీళ్లు తెస్తాం: సీఎం చంద్రబాబు
జిల్లాలో ప్రతి చెరువు, రిజర్వాయర్లను నింపుతాం: సీఎం చంద్రబాబు
-
Aug 22, 2026 13:04 IST
1000 గోల్స్‌కు చేరువలో క్రిస్టియానో రొనాల్డో
977వ కెరీర్ గోల్ సాధించిన రొనాల్డో
వెయ్యి గోల్స్‌కు మరో 23 గోల్స్ దూరం
చివరి సీజన్‌కు ఘనంగా శ్రీకారం చుట్టిన రొనాల్డో
చరిత్ర సృష్టించేందుకు 23 గోల్స్ దూరంలో రొనాల్డో
41 ఏళ్ల వయసులోనూ రొనాల్డో జోరు
-
Aug 22, 2026 13:00 IST
హైదరాబాద్: 3 రోజుల్లో వివరణ ఇవ్వమన్నారు.. ఇచ్చా: చిన్నారెడ్డి
నేను ఢిల్లీకి వెళ్లను: చిన్నారెడ్డి
సీఎం రేవంత్ వచ్చాక కలుస్తా: చిన్నారెడ్డి
-
Aug 22, 2026 13:00 IST
హైదరాబాద్: గాంధీభవన్‌కు చిన్నారెడ్డి
కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్మన్ శ్యామ్ మోహన్‌కు వివరణ
పార్టీ, ఎమ్మెల్యే మేఘారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చిన్నారెడ్డి
షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో వివరణ ఇచ్చిన చిన్నారెడ్డి
-
Aug 22, 2026 12:49 IST
యూపీలో 52 మంది నేతలకు బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు
సీఎం యోగి ఆదిత్యనాథ్, అఖిలేశ్, మాయావతికి బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నేతలకు భద్రత పెంచనున్నట్లు సమాచారం
-
Aug 22, 2026 12:47 IST
నాలుగేళ్లలోపు చిన్నారులకు ఆ మెడిసిన్ ఇవ్వొద్దు: కేంద్రం
క్లోర్‌ఫెనిరమెన్ మలేట్, ఫినైల్‌ఫ్రైన్ హైడ్రోక్లోరైడ్ ఉన్న ఫిక్స్‌డ్ డోస్ డ్రగ్ కాంబినేషన్ల వినియోగంపై ఆంక్షలు విధించిన కేంద్రం
కాంబినేషన్ల తయారీ, విక్రయాలపైనా ఆంక్షలు
-
Aug 22, 2026 12:47 IST
లండన్‌లో సీఎం రేవంత్‌రెడ్డితో లివర్‌పూల్ ప్రతినిధుల భేటీ
లివర్‌పూల్ సిటీ డెవలప్‌మెంట్, ఫుట్‌బాల్ క్లబ్ ప్రతినిధులతో సమావేశం
తెలంగాణతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి లివర్‌పూల్ ఆసక్తి
లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ, క్రీడలు, క్రియేటివ్ ఎకానమీపై భాగస్వామ్యం
అక్టోబర్‌లో హైదరాబాద్‌కు లివర్‌పూల్ ప్రతినిధుల బృందం
హైదరాబాద్ పర్యటనలో భాగస్వామ్యంపై అధికారిక ఒప్పందానికి సన్నాహాలు
-
Aug 22, 2026 12:25 IST
వైభవ్ సూర్యవంశీకి టెస్టుల్లోనూ అవకాశం ఇవ్వాలి: రాహుల్ ద్రవిడ్
రెడ్‌బాల్ క్రికెట్లోనూ వైభవ్‌ను తీర్చిదిద్దాలన్న ద్రవిడ్
వైభవ్‌పై అంచనాల విషయంలో తొందరపడకూడదు: రాహుల్ ద్రవిడ్
-
Aug 22, 2026 11:57 IST
హైదరాబాద్: AIతో సైబర్ నేరాలు మరింత పెరిగే అవకాశం: హైకోర్టు సీజే జస్టిస్ ఏకే సింగ్
AIతో డేటా ట్రాన్స్‌ఫార్మేషన్ వేగంగా జరుగుతోంది: జస్టిస్ ఏకే సింగ్
నేరాల విచారణలో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి: జస్టిస్ ఏకే సింగ్
-
Aug 22, 2026 11:56 IST
ఢిల్లీ: ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు సుప్రీంకోర్టులో ఊరట
2016 ఈవెంట్‌పై విధించిన జరిమానా రద్దు
గ్రీన్ ట్రైబ్యునల్ జరిమానాపై సుప్రీం తీర్పు
రూ.5 కోట్ల పెనాల్టీని తిరిగి చెల్లించాలని ఆదేశం
-
Aug 22, 2026 11:51 IST
కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువు మృతి
ప్రసవం కోసం నిన్న ఆస్పత్రిలో చేరిన ఎక్కపల్లి తండా గర్భిణి
నార్మల్ డెలివరీకి అవకాశముందని సర్జరీకి నిరాకరించిన వైద్యులు
నార్మల్ డెలివరీ కాకపోవడంతో ఇవాళ ఆపరేషన్, శిశువు మృతి
వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బాధిత కుటుంబీకుల ఆందోళన
-
Aug 22, 2026 11:45 IST
సీఎం రేవంత్‌రెడ్డిపై వ్యక్తిగత విమర్శలను సహించం: ఆది శ్రీనివాస్
సురేఖపై చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీకి లేఖ రాస్తాం: ఆది శ్రీనివాస్
రేవంత్‌ను చూస్తే కేటీఆర్‌కు వణుకు పుడుతోంది: ఆది శ్రీనివాస్
బలహీనపడుతున్నది కాంగ్రెస్ కాదు.. BRS: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
-
Aug 22, 2026 11:40 IST
ప్రకాశం జిల్లా ప్రజలను జగన్ మోసం చేశారు: మంత్రి నిమ్మల
వెలిగొండ పనులు పూర్తి కాకుండానే జాతికి అంకితం చేసిన వ్యక్తి జగన్: మంత్రి
నిర్వాసితులకు రూ.900 కోట్ల పరిహారంలో జగన్ పైసా కూడా చెల్లించలేదు: మంత్రి
నిర్వాసితులను మోసం చేసిన ఘనత జగన్‌కే దక్కుతుంది: మంత్రి
-
Aug 22, 2026 11:21 IST
చెన్నై: స్టాలిన్ అధ్యక్షతన డీఎంకే నేతల సమావేశం
పార్టీ పదవుల్లో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయం
జిల్లా అధ్యక్ష, కార్యదర్శ పదవులు యువతకు ఇచ్చే యోచన
78 జిల్లా అధ్యక్ష పదవులను 110కి పెంచాలని నిర్ణయం
జెన్‌జీలకు ప్రాధాన్యం ఉవ్వాలని ఉదయనిధి ఆలోచన
యువతకు పదవులపై పార్టీలో సీనియర్ల వ్యతిరేకత
-
Aug 22, 2026 11:03 IST
గంజాయి చాక్లెట్లు రవాణా చేస్తున్న లేడీ అరెస్ట్
23 కిలోల గంజాయి చాక్లెట్లను పట్టుకున్న కుత్బుల్లాపూర్ జోన్ ఎస్వోటీ పోలీసులు
మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు రవాణా చేస్తూ విద్యార్థులే టార్గెట్‌గా చేసుకొని అమ్మకాలు
గాజులరామారం మహాదేవపురానికి చెందిన ముగ్గురు యువకులతో పాటు లేడీని అరెస్ట్ చేసిన ఎస్వోటీ పోలీసులు
జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్‌కు నిందితులను అప్పగించిన ఎస్వోటీ పోలీసులు
-
Aug 22, 2026 11:02 IST
హైదరాబాద్: కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిని కలిసిన కంది శ్రీనివాస్‌రెడ్డి
క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులకు వివరణ ఇచ్చిన కంది
ఆదిలాబాద్ డీసీసీ సమావేశంలో వివాదం నేపథ్యంలో కంది శ్రీనివాస్‌రెడ్డికి ఇటీవల షోకాజ్ నోటీసులు
-
Aug 22, 2026 10:33 IST
అమరావతి: ఈనెల 31న వెలిగొండ ప్రాజెక్ట్ తొలిదశను ప్రారంభిస్తాం: సీఎం చంద్రబాబు
అసాధ్యమన్న వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని సుసాధ్యం చేశాం: సీఎం
ఎన్టీఆర్ వేసిన వివిధ ప్రాజెక్టుల ఫౌండేషన్లను పూర్తి చేసి, ప్రారంభించడం నా అదృష్టం: సీఎం
-
Aug 22, 2026 10:32 IST
తిరుపతి: జూ పార్క్ రోడ్డులో చెట్టుకు ఉరివేసుకుని ఆటో డ్రైవర్ ఆత్మహత్య
రేణిగుంటలో ఉంటూ ఆటో నడుపుతున్న పురుషోత్తం (34)
పురుషోత్తం స్వస్థలం చిత్తూరు జిల్లా సంతపేట
అప్పులు ఎక్కువగా ఉండటంతో ఆత్మహత్య చేసుకున్న పురుషోత్తం
-
Aug 22, 2026 10:30 IST
హైదరాబాద్: మధ్యాహ్నం 3గంటలకు గాంధీభవన్‌లో క్రమశిక్షణ కమిటీ సమావేశం
కొండా సురేఖ, చిన్నారెడ్డి అంశంపై చర్చ
రాజగోపాల్‌రెడ్డి అంశంలో నిర్ణయం తీసుకోనున్న కమిటీ
-
Aug 22, 2026 10:21 IST
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం
CISF సిబ్బందిని వెనక్కి తీసుకోవాలని కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు
నవంబర్ 17 నాటికి యూనిట్ మొత్తం ఖాళీ చేయాలని ఆదేశం
-
Aug 22, 2026 10:21 IST
అమెరికా: 7.5 మిలియన్ డాలర్ల మోసం కేసులో భారతీయుడి అరెస్ట్
వృద్ధులను లక్ష్యంగా చేసుకుని రూ.కోట్లు దోచుకున్నట్టు ఆరోపణలు
కెనడా మీదుగా ఖతార్ పారిపోతుండగా జై సునీల్ భారతి గోస్వామి అరెస్ట్
నిందితుడి స్వస్థలం గుజరాత్
-
Aug 22, 2026 10:19 IST
అమెరికా-కెనడా వాణిజ్య చర్చలు విఫలం
చర్చలు విఫలం కావడంతో కెనడాపై 50శాతం టారిఫ్‌లు
తక్షణమే టారిఫ్‌లు అమల్లోకి తెచ్చిన అమెరికా
-
Aug 22, 2026 09:37 IST
అమరావతి: వెలిగొండ నిర్వాసితులకు మరో విడత పరిహారం అందజేత
మూడో విడత పరిహారం పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
రూ.250 కోట్ల పరిహారం చెక్కును నిర్వాసితులకు అందజేసిన సీఎం
ఇప్పటివరకూ నిర్వాసితులకు రూ.768 కోట్లు అందజేసిన కూటమి ప్రభుత్వం
త్వరలోనే వెలిగొండ ప్రాజెక్టు తొలి దశను ప్రారంభించనున్న ప్రభుత్వం
-
Aug 22, 2026 09:35 IST
ఆసీస్‌తో రెండో టెస్టు.. 64 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్
తొలి ఇన్నింగ్స్‌లో కుప్పకూలిన బంగ్లాదేశ్
ఆరు వికెట్లు తీసిన మిచెల్ స్టార్క్
-
Aug 22, 2026 09:18 IST
జయశంకర్ భూపాలపల్లి: మానవత్వాన్ని మరిచిన దారుణ ఘటన
HIVతో బాధపడుతున్న మహిళను అడవిలో వదిలేసి వెళ్లిన కుటుంబసభ్యులు
ఇది గమనించి 108 వాహనానికి సమాచారం అందించిన స్థానికులు
మహాదేవపూర్ సామాజిక ఆసుపత్రికి తరలింపు
112 ద్వారా పోలీసులకు సమాచారం అందించినప్పటికీ నిర్లక్ష్యం వహించారంటున్న స్థానికులు
కరీంనగర్ హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్తున్నామని చెప్పి అడవిలో వదిలేసిన కుటుంబసభ్యులు
-
Aug 22, 2026 09:13 IST
ఖమ్మం: రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ సమీపంలో బైక్‌ను ఢీకొట్టిన కారు
ప్రమాదంలో ఇద్దరి మృతి
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Aug 22, 2026 09:11 IST
ఢిల్లీ: కొత్త టీమ్‌తో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ భేటీ
10 గంటలకు కొత్త కార్యవర్గంతో నితిన్ సమావేశం
సమావేశంలో పాల్గొననున్న నూతన కార్యవర్గ సభ్యులు
అమిత్ షా కూడా సమావేశంలో పాల్కొనే అవకాశం
-
Aug 22, 2026 09:04 IST
హైదరాబాద్: బంజారాహిల్స్‌లో దారుణం.. మామను తుపాకీతో బెదిరించిన అల్లుడు
3,400 గజాల స్థలం కోసం 75 ఏళ్ల వృద్ధుడిపై బెదిరింపులు
టేబుల్‌పై రివాల్వర్ పెట్టి రియల్ ఎస్టేట్ అగ్రిమెంట్‌పై సంతకం చేయించిన అల్లుడు
అల్లుడితో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు
నిందితులపై ఆర్మ్స్ యాక్ట్ (Arms Act) కింద కేసు నమోదు
-
Aug 22, 2026 09:00 IST
హైదరాబాద్: ఆర్అండ్‌బి అధికారులతో మంత్రి కోమటిరెడ్డి సమీక్ష
CRIF రోడ్లు, సేతుబంధన్, ROB పనుల్లో వేగం పెంచాలి: మంత్రి కోమటిరెడ్డి
2025-26లో రూ.868 కోట్లతో 422.36 కిలోమీటర్ల రోడ్ల పనులు: కోమటిరెడ్డి
హైలెవెల్ బ్రిడ్జిలు, ROB పనులు నిర్ణీత గడువులో పూర్తి చేయాలి: కోమటిరెడ్డి
మిర్యాలగూడ, నందిపహాడ్ బ్రిడ్జి పనులు వెంటనే ప్రారంభించాలి: మంత్రి కోమటిరెడ్డి
-
Aug 22, 2026 08:56 IST
తిరుమల: టీటీడీ ఎస్వీబీసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీధర్ వర్మ
శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీధర్ వర్మ
కార్యక్రమానికి హాజరైన ఏన్టీఆర్ తనయులు జయకృష్ణ, రామకృష్ణ
-
Aug 22, 2026 08:56 IST
తిరుపతి: తల్లికి తెలీకుండా బిడ్డను తీసుకెళ్లిన తండ్రి
కిడ్నాప్ కేసు నమోదు చేసిన అలిపిరి పోలీసులు
మూడు నెలలుగా దంపతులు వెంకటకృష్ణ, వర్ష మధ్య విభేదాలు
రెండు రోజుల క్రితం భార్యకు తెలీకుండా బిడ్డను తీసుకెళ్లిన వెంకటకృష్ణ
పోలీసులకు భార్య వర్ష ఫిర్యాదు, కేసు నమోదు
-
Aug 22, 2026 08:55 IST
హైదరాబాద్: కంపెనీ ఖాతాదారుల క్రెడిట్ కార్డులతో భారీ మోసం
రూ.1.64 కోట్ల విలువైన 386 అక్రమ లావాదేవీలు
అక్యూబ్ బిజినెస్ అండ్ టెక్నాలజీస్ మాజీ ఉద్యోగి రిషబ్ జగ్గీ నిర్వాకం
సంస్థకు చెందినవారి 9 క్రెడిట్ కార్డుల వివరాలతో విమాన టికెట్ల బుకింగ్
సీసీఎస్‌లో కంపెనీ డైరెక్టర్ ఫిర్యాదు, కేసు నమోదు
-
Aug 22, 2026 08:53 IST
హైదరాబాద్: గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం
ఐటీ ఉద్యోగి మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు
మృతుడు బెంగాల్‌కు చెందిన అబ్బాస్(25)
-
Aug 22, 2026 08:53 IST
నిజామాబాద్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పర్యటన
పాములబస్తీలో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన మంత్రి
-
Aug 22, 2026 08:52 IST
ఉక్రెయిన్‌పై డ్రోన్లతో విరుచుకుపడ్డ రష్యా
14 మంది మృతి, 120 మందికి గాయాలు
రష్యా దాడులను ఖండించిన జెలెన్‌స్కీ
-
Aug 22, 2026 08:51 IST
హైదరాబాద్: కంపెనీ ఖాతాదారుల క్రెడిట్ కార్డులతో భారీ మోసం
రూ.1.64 కోట్ల విలువైన 386 అక్రమ లావాదేవీలు
అక్యూబ్ బిజినెస్ అండ్ టెక్నాలజీస్ మాజీ ఉద్యోగి రిషబ్ జగ్గీ నిర్వాకం
సంస్థకు చెందినవారి 9 క్రెడిట్ కార్డుల వివరాలతో విమాన టికెట్ల బుకింగ్
సీసీఎస్‌లో కంపెనీ డైరెక్టర్ ఫిర్యాదు, కేసు నమోదు
-
Aug 22, 2026 08:06 IST
యాదాద్రి: దోతిగూడెంలోని పరిశ్రమలో అగ్నిప్రమాదం
హేజోలోని రసాయన పరిశ్రమలో పేలిన రియాక్టర్
ఇద్దరు కార్మికుల మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం
ప్రమాదంలో మరో 10మందికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు
మృతులు నల్లగొండ, ఖమ్మం వాసులు నాగిరెడ్డి, నరేష్‌కుమార్
-
Aug 22, 2026 08:05 IST
నంద్యాల: మెడికల్ కాలేజీ MBBS ఫస్టియర్ పరీక్షల్లో గందరగోళం
2026 ప్రశ్నపత్రం బదులు.. 2023 నాటి పేపర్ ఇచ్చిన ఇన్విజిలేటర్లు
15 నిమిషాల తర్వాత 2026 ప్రశ్నపత్రం పంపిణీ
-
Aug 22, 2026 08:04 IST
పోలవరం: చింతూరు మండలం బొడుగూడెం దగ్గర రోడ్డుప్రమదం
లారీని వెనుక నుంచి ఢీకొట్టిన కారు
ఇద్దరి మృతి, మృతులు అయ్యన్న(35), వినయ తేజ(28)గా గుర్తింపు
-
Aug 22, 2026 08:03 IST
హైదరాబాద్: ఓ స్టార్ హోటల్ చైర్మన్‌పై లైంగిక వేధింపుల కేసు
బేగంపేట పీఎస్‌లో ఫిర్యాదు చేసిన హోటల్‌లో పనిచేస్తున్న మహిళ
తరచూ అసభ్యకర వ్యాఖ్యలతో వేధించాడని మహిళ ఆరోపణ
జీతం పెంపు కోసం లైంగిక కోరికలు తీర్చాలని బలవంత పెట్టారని ఫిర్యాదు
షీటీమ్స్, మహిళా సంక్షేమ విభాగానికి కూడా బాధితురాలు ఫిర్యాదు
-
Aug 22, 2026 08:02 IST
కాంగ్రెస్ నేతల షోకాజ్ నోటీసుల గడువు నేటితో ముగింపు
పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలతో పాటు క్రమశిక్షణ ఉల్లంఘనలపై వివరణ కోరిన కాంగ్రెస్
కొండా సురేఖ సహా పలువురు నేతలకు షోకాజ్ నోటీసులు
3 రోజుల గడువు విధించిన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ
నేతల వివరణను పరిశీలించి నిర్ణయం తీసుకోనున్న కమిటీ
-
Aug 22, 2026 07:54 IST
కామన్వెల్త్ క్రీడల్లో రజతానికే పరిమితమైన నీరజ్ చోప్రా
లుసానె డైమండ్ లీగ్‌లో భారత జావెలిన్ స్టార్ నీరజ్‌కు రెండో స్థానం
88.14 మీటర్లు ఈటెను విసిరిన శ్రీలంక అథ్లెట్ రుమేశ్ పతిరగెకు అగ్రస్థానం
88.05 మీటర్లు ఈటెను విసిరి రెండోస్థానంలో నిలిచిన నీరజ్ చోప్రా
-
Aug 22, 2026 07:46 IST
అమరావతి: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం పంపిణీ
నేడు మూడో విడత పరిహారం అందించనున్న సీఎం చంద్రబాబు
2,027 కుటుంబాలకు రూ.250 కోట్ల పరిహారం అందించనున్న సీఎం
సీఎం క్యాంప్ ఆఫీసులో రూ.250 కోట్ల చెక్కు అందించనున్న సీఎం
-
Aug 22, 2026 07:37 IST
నేడు ఢిల్లీలో బీజేపీ నూతన జాతీయ కార్యవర్గం సమావేశం
నితిన్ నబీన్ అధ్యక్షతన జరగనున్న సమావేశం
బీజేపీ బలోపేతం, సంస్థాగత అంశాలపై భేటీలో చర్చ
నూతన కార్యవర్గానికి దిశా నిర్దేశం చేయనున్న నబీన్
-
Aug 22, 2026 07:23 IST
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు
చికిత్స కోసం బారీ భద్రత నడుమ ఆసుపత్రికి తరలింపు
అడియాలా జైలు నుంచి ఇమ్రాన్ ఖాన్‌ను...
ఇస్లామాబాద్‌లోని షిఫా ఇంటర్నేషనల్ హాస్పిటల్‌కు తరలింపు
-
Aug 22, 2026 07:15 IST
మయన్మార్‌లో మరో ఘోరం
సగయింగ్ రీజియన్‌లోని ఒక బౌద్ధ ఆశ్రమంపై సైన్యం వైమానిక దాడి
ధ్యాన కార్యక్రమంలో పాల్గొన్న 14 మంది మృతి, 20 మందికి గాయాలు