Share News

బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్: ట్రీసా-గాయత్రి జోడీకి కాంస్యం

ABN , Publish Date - Aug 22 , 2026 | 07:01 PM

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల జోడీ పుల్లెల గాయత్రి గోపిచంద్- ట్రీసా జాలీ కాంస్య పతకం సాధించింది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ సెమీ ఫైనల్స్‌లో ట్రీసా-గాయత్రి జోడీ చైనాకు చెందిన లియు షెంగ్షు, టాన్ నింగ్ చేతిలో 21-18, 13-21, 8-21 తేడాతో ఓటమి పాలైంది.

బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్: ట్రీసా-గాయత్రి జోడీకి కాంస్యం
World Badminton Championships

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల జోడీ పుల్లెల గాయత్రి గోపిచంద్- ట్రీసా జాలీ కాంస్య పతకం సాధించింది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ సెమీ ఫైనల్స్‌లో ట్రీసా-గాయత్రి జోడీ చైనాకు చెందిన లియు షెంగ్షు, టాన్ నింగ్ చేతిలో 21-18, 13-21, 8-21 తేడాతో ఓటమి పాలైంది. అయితే మహిళల డబుల్స్ విభాగంలో భారత్ చివరిసారిగా 2011లో పతకం సాధించింది. అప్పట్లో జ్వాలా గుత్తా-అశ్విని పొన్నప్ప కూడా కాంస్యం గెలిచారు. మళ్లీ 15 ఏళ్ల తర్వాత అదే విభాగంలో ట్రీసా-గాయత్రి కాంస్యం గెలిచి రికార్డు నెలకొల్పారు.


మ్యాచ్‌ను చైనా జోడీ దూకుడుగా ప్రారంభించినా.. భారత షట్లర్లు అద్భుతంగా పుంజుకున్నారు. కీలక సమయాల్లో వరుస పాయింట్లు సాధిస్తూ ఆధిపత్యం ప్రదర్శించిన ట్రీసా-గాయత్రి తొలి గేమ్‌ను 21-18తో సొంతం చేసుకున్నారు. రెండో గేమ్‌లో ఇరు జట్ల మధ్య పోరు నువ్వా-నేనా అన్నట్టుగా సాగింది. స్కోరు 12-12తో సమం కావడంతో మ్యాచ్‌ ఉత్కంఠగా మారింది. అయితే ఆ తర్వాత టాన్‌ నింగ్‌-లియు షెంగ్షు జోడీ ఒక్కసారిగా గేర్‌ మార్చింది. వరుస పాయింట్లు సాధిస్తూ భారత జోడీపై ఒత్తిడి పెంచిన చైనా షట్లర్లు రెండో గేమ్‌ను 21-13తో గెలిచారు. దీంతో మ్యాచ్‌ నిర్ణాయత్మక మూడో గేమ్‌కు వెళ్లింది. మూడో గేమ్‌లో మాత్రం ట్రీసా-గాయత్రి జోడీ పెద్దగా ప్రతిఘటించలేకపోయింది. ఆరంభం నుంచే చైనా జోడీ ఆధిపత్యం కొనసాగించింది. భారత షట్లర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా 21-8తో మూడో గేమ్‌ను ముగించి మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.


ఇవి కూడా చదవండి:

ప్రపంచ మాజీ బాక్సింగ్ ఛాంపియన్ జొలాని దారుణ హత్య

కోహ్లీ కాదు సచినే గొప్ప.. ఆ దేశాల్లోనే అసలు సత్తా తెలుస్తుంది: ఆకాశ్ చోప్రా

Updated Date - Aug 22 , 2026 | 07:05 PM