Share News

గృహ హింస, వరకట్న వేధింపుల కేసులో జోగి రమేశ్ కుటుంబానికి ఊరట..

ABN , Publish Date - Aug 22 , 2026 | 05:05 PM

గృహ హింస, వరకట్న వేధింపుల కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబానికి భారీ ఊరట లభించింది. జోగి రమేశ్, ఆయన కుమారుడు జోగి రాజీవ్‌ సహా వారి కుటుంబసభ్యులకు విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

గృహ హింస, వరకట్న వేధింపుల కేసులో జోగి రమేశ్ కుటుంబానికి ఊరట..
Jogi Ramesh

ఇంటర్‌నెట్ డెస్క్: గృహ హింస, వరకట్న వేధింపుల కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబానికి భారీ ఊరట లభించింది. జోగి రమేశ్, ఆయన కుమారుడు జోగి రాజీవ్‌ సహా వారి కుటుంబసభ్యులకు విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో బాధితురాలైన (మేఘన) లేదా సాక్షులను ఎట్టి పరిస్థితుల్లోనూ బెదిరించడం, ప్రభావితం చేయడం లేదా ప్రలోభపెట్టడం చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది. విచారణాధికారి (IO) సూచించిన తేదీలు, సమయాల్లో సంబంధిత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

Updated Date - Aug 22 , 2026 | 05:13 PM