-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National and International breaking Live Updates of 14th August 2026 kjr
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Aug 14 , 2026 | 06:00 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..
Live News & Updates
-
Aug 14, 2026 20:32 IST
నిజామాబాద్: భారీగా అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
పిట్లం వద్ద గుజరాత్‌కు అక్రమంగా తరలిస్తున్న 30 టన్నుల PDS బియ్యం పట్టుకున్న పోలీసులు
-
Aug 14, 2026 20:19 IST
కృష్ణా జిల్లా: మంత్రి కొల్లు రవీంద్రను కలిసిన నకిలీ పట్టా బాధితులు
పేర్ని నాని ఇచ్చిన పట్టాలతో రుణాలు తీసుకుని ఇళ్లు కట్టుకున్నాం: బాధితులు
-
Aug 14, 2026 20:02 IST
ఏపీ కేబినెట్ సమావేశం తేదీలో మార్పు
ఈ నెల 18న ఏపీ మంత్రిమండలి సమావేశం
-
Aug 14, 2026 19:39 IST
అమరావతి: స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకానికి రేపటితో ఏడాది పూర్తి
స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం గ్రాండ్ సక్సెస్
రేపు 'స్త్రీ శక్తికి సంవత్సరం - రెట్టింపైన ఆత్మగౌరవం' పేరుతో కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
పరేడ్ గ్రౌండ్ నుంచి సీఎం క్యాంప్ ఆఫీస్‌కు స్త్రీ శక్తి లబ్ధిదారులతో సీఎం ప్రయాణం
-
Aug 14, 2026 19:23 IST
విద్యుత్ దీపాల వెలుగుల్లో ఏపీ అసెంబ్లీ, సచివాలయ భవనాలు
సచివాలయం 5 భవనాలకు ప్రత్యేక విద్యుత్ అలంకరణ
విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న ఏపీ అసెంబ్లీ భవనం
అసెంబ్లీ, సచివాలయం దగ్గర రోడ్లకు ఇరువైపులా విద్యుత్ అలంకరణ
సెంట్రల్ పార్కులోనూ వివిధ రంగుల విద్యుత్ దీపాలతో అలంకరణ
-
Aug 14, 2026 19:11 IST
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ముర్ము సందేశం
వికసిత్ భారత్ లక్ష్యంగా మనం పనిచేయాలి: ముర్ము
రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి: రాష్ట్రపతి ముర్ము
అభివృద్ధి ఫలాలు ప్రతి పౌరుడికి అందాలి: రాష్ట్రపతి ముర్ము
వందేమాతరం గేయాన్ని మనం గౌరవించాలి: రాష్ట్రపతి ముర్ము
-
Aug 14, 2026 18:58 IST
నేపాల్‌కు అగ్నిపథ్ సెగలు
భారత సైన్యంలోకి తమను తీసుకోవాలంటూ నేపాలీ యువత డిమాండ్
2020లో కరోనాతో భారత్ సైన్యంలో నిలిచిన నేపాలీల నియామకాలు
2022లో అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చిన భారత్
-
Aug 14, 2026 18:43 IST
రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆగ్రహం
రాహుల్ తీరు ప్రజాస్వామ్యానికి మచ్చ: రాజ్‌నాథ్
మహిళలను కించపర్చే విధంగా రాహుల్ ప్రవర్తించారు: రాజ్‌నాథ్
గతంలో ఎన్నడూ సోనియా, మన్మోహన్ ఇలా ప్రవర్తించలేదు: రాజ్‌నాథ్
మోదీ ప్రధాని అయ్యాక భారత్ ప్రతిష్ఠ పెరిగింది: రాజ్‌నాథ్
-
Aug 14, 2026 18:42 IST
ప్రధాని మోదీ విదేశాంగ విధానంపై రాహుల్ సెటైర్లు
-
Aug 14, 2026 18:36 IST
వందేమాతరం గౌరవించని వారిపై చర్యలు తీసుకోవాలి: కిషన్‌రెడ్డి
వందేమాతరాన్ని అవమానిస్తున్న మజ్లిస్ నేతలపై చర్యలు తీసుకోవాలి
కొన్ని పార్టీలు రాజ్యాంగాన్ని అవమానిస్తున్నాయి: కిషన్‌రెడ్డి
-
Aug 14, 2026 18:25 IST
మోదీ నాయకత్వంలో దేశం ముందుకెళ్తోంది: బండి సంజయ్
జాతీయ జెండాను కాంగ్రెస్ కాపీ కొట్టింది: బండి సంజయ్
మోదీ పాలనలో దేశంలో అల్లర్లు, అరాచకాలు తగ్గాయి: బండి సంజయ్
-
Aug 14, 2026 18:20 IST
ఇదే నా చివరి ప్రపంచకప్ కావొచ్చు: హాకీ ప్లేయర్ మన్‌ప్రీత్ సింగ్
చివరి ప్రపంచకప్‌గా భావించి బరిలోకి దిగుతా: మన్‌ప్రీత్ సింగ్
ఈసారి ప్రపంచకప్ కలను సాకారం చేసుకుంటాం: మన్‌ప్రీత్ సింగ్
-
Aug 14, 2026 18:11 IST
ఏడాది ముందే ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల జమ: సీఎ రేవంత్ రెడ్డి
మాజీ సీఎం, మాజీ మంత్రులు జనగణనలో పాల్గొనలేదు: రేవంత్
-
Aug 14, 2026 18:09 IST
మహనీయుల స్ఫూర్తి కోసమే విగ్రహాల ఏర్పాటు: సీఎం రేవంత్ రెడ్డి
ఓటు అనే ఆయుధాన్ని అంబేడ్కర్ అందించారు: సీఎం రేవంత్
సమాజంలో మార్పును తీసుకొచ్చిన ఫులే: రేవంత్
ప్రజాపాలనలో జ్యోతిబాఫులే విధానాలు కొనసాగిస్తున్నాం: రేవంత్
-
Aug 14, 2026 18:05 IST
మంచిర్యాల: చెన్నూరు బస్టాండ్‌లో అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు
8 బైక్‌లపై దూసుకెళ్లిన బస్సు, తప్పిన ముప్పు
-
Aug 14, 2026 17:42 IST
శ్రీనగర్: కశ్మీరీ పండిట్లను బెదిరిస్తే కఠిచ చర్యలే: సీఎం ఒమర్ అబ్దుల్లా
-
Aug 14, 2026 17:41 IST
హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ముగిసిన DSP భీమ్‌రెడ్డి కస్టడీ
ACB ప్రత్యేక కోర్టులో హాజరుపర్చిన అధికారులు
2 రోజులపాటు కస్టడీకి తీసుకుని ప్రశ్నించిన ACB
రూ.200 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు ACB గుర్తింపు
భీమ్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్, చంచల్‌గూడ జైలుకు తరలింపు
-
Aug 14, 2026 17:27 IST
తనపై జరిగిన దాడిపై స్పందించిన అకాలీ దళ్ చీఫ్ సుఖ్‌బీర్‌సింగ్ బాదల్
దాడులకు భయపడేది లేదు: సుఖ్‌బీర్‌సింగ్ బాదల్
నన్ను చంపేందుకు రెండుసార్లు యత్నించారు: బాదల్
దేవుడే నన్ను కాపాడారు: సుఖ్‌బీర్‌సింగ్ బాదల్
-
Aug 14, 2026 17:14 IST
పాకిస్థాన్: బలూచిస్థాన్ హోం మంత్రిపై దాడి.. భద్రతా సిబ్బంది మృతి
హోంమంత్రి మీర్ జియావుల్లా కాన్వాయ్‌పైనా దాడి
సురక్షితంగా బయటపడిన హోంమంత్రి
పాక్ స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఘటన
-
Aug 14, 2026 17:02 IST
శ్రీకాకుళం: మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు బెయిల్
బెయిల్ మంజూరు చేసిన సోంపేట కోర్టు
కాశీబుగ్గ హిట్ అండ్ రన్ కేసులో సీదిరి అప్పలరాజుకు బెయిల్
23 రోజులుగా జిల్లా జైల్లో రిమాండ్‌లో ఉన్న సీదిరి అప్పలరాజు
-
Aug 14, 2026 16:55 IST
నెలాఖరులోగా వెలిగొండ, పోలవరం లెఫ్ట్ కెనాల్ ప్రారంభం: మంత్రి నిమ్మల రామానాయుడు
ఈ నెల 17 నుంచి వెలిగొండ నిర్వాసితులకు పరిహారం చెల్లిస్తాం: మంత్రి నిమ్మల
పోలవరం ప్రాజెక్టు పనులు 77 శాతం పూర్తి చేశాం: నిమ్మల
పోలవరం ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం: నిమ్మల
-
Aug 14, 2026 16:48 IST
హైదరాబాద్: కొండపల్లి గణేశ్ అలియాస్ బంగార్రాజు అరెస్ట్
పలువురి నుంచి రూ.33 కోట్లు వసూలు
వసూలు చేసిన మొత్తాన్ని ఇతర దేశాలకు తరలించిన బంగార్రాజు
-
Aug 14, 2026 16:31 IST
ఢిల్లీ హైకోర్టుకు బెదిరింపు మెయిల్ చేసిన ఆగంతకులు
ఆగస్టు 15న బాంబులతో దాడి చేస్తామంటూ బెదిరింపు మెయిల్
పోలీస్ డ్రస్‌లో వచ్చి ఎర్రకోటలో పేలుళ్లకు పాల్పడతారని మెయిల్
ప్రధాని సందేశమిచ్చే సమయంలోనే పేలుళ్లకు పాల్పడనున్నట్లు వెల్లడి
1984లో సిక్కులపై హింసాకాండకు బాధ్యులైన నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
-
Aug 14, 2026 16:30 IST
హైదరాబాద్: ట్యాంక్‌బండ్‌పై భారీ తిరంగా ర్యాలీ
హర్ ఘర్ తిరంగాలో భాగంగా బీజేపీ తిరంగా ర్యాలీ
మన ఐక్యతను చాటేలా తిరంగా ర్యాలీ
-
Aug 14, 2026 16:30 IST
అమరావతి: అసెంబ్లీ సమావేశాల భద్రతపై కో-ఆర్డినేషన్ సమావేశం
స్పీకర్ అయ్యన్న, మండలి ఛైర్మన్ మోషేన్‌రాజు అధ్యక్షతన భేటీ
భద్రతా చర్యలపై IPS అధికారులు, అసెంబ్లీ ఉన్నతాధికారులతో చర్చ
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
-
Aug 14, 2026 16:29 IST
రేపు సంగారెడ్డిలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్న సీఎం రేవంత్
అంబేడ్కర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ
సంగారెడ్డిలో నెహ్రూ, రాజీవ్‌గాంధీ విగ్రహావిష్కరణ
ఐబీ చౌరస్తాలో విగ్రహాలను ఆవిష్కరించనున్న సీఎం రేవంత్
-
Aug 14, 2026 16:22 IST
హైదరాబాద్: ఫులే దంపతుల విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
నెక్లెస్ రోడ్డులో మహాత్మా జ్యోతిబా ఫులే, సావిత్రీబాయి ఫులే విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం
హాజరైన టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ తదితరులు
-
Aug 14, 2026 15:59 IST
TDRపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
TDR (ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్) జారీ, వినియోగ నిబంధనల్లో మార్పులు
తెలంగాణ బిల్డింగ్ రూల్స్-2012లో సవరణ
HMDA పరిధిలో TDR వినియోగానికి మరింత వెసులుబాటు
HMDA ప్రాజెక్టుల కోసం అవసరమైన/స్వాధీనం చేసుకున్న భూములకు HMDAనే TDR సర్టిఫికెట్ల జారీ
-
Aug 14, 2026 15:53 IST
స్వల్ప నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
సెన్సెక్స్ 70, నిఫ్టీ 30 పాయింట్ల నష్టం
-
Aug 14, 2026 15:52 IST
హైదరాబాద్: ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి కస్టడీపై విచారణ వాయిదా
రెండు రోజులు అదనపు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్
తీర్పును ఈ నెల 17కి వాయిదావేసిన ఉప్పరపల్లి కోర్టు
ఉదయ్ కృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్‌పై పోలీసులు కౌంటర్ దాఖలు
బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈ నెల 17కు వాయిదా
-
Aug 14, 2026 15:47 IST
నల్లగొండ: దక్షిణాఫ్రికాలో జానపాటి పవన్ అనే యువకుడు అనుమానాస్పద మృతి
ఇటీవల ఉద్యోగం కోసం దక్షిణాఫ్రికా వెళ్లిన పెద్దవూర మం. చలకుర్తికి చెందిన పవన్
తన కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని పవన్‌ను గగనపల్లి హనుమంత్‌రెడ్డి తీసుకెళ్లినట్లు సమాచారం
పవన్ మృతికి హనుమంత్‌రెడ్డి కారణమని గ్రామస్థుల ఆరోపణ
-
Aug 14, 2026 15:35 IST
సీఎం రేవంత్‌రెడ్డిది డ్రామా కంపెనీ: ఎంపీ ధర్మపురి అర్వింద్
కేంద్రంతో స్నేహంగా ఉంటూ డ్రామాలు: ధర్మపురి అర్వింద్
పార్టీలు వేరు.. ప్రభుత్వాలు వేరు: ధర్మపురి అర్వింద్
-
Aug 14, 2026 15:22 IST
యూఎస్, యూకేల్లో భారతీయులపై 7 రెట్లు పెరిగిన దాడులు
రాజ్యసభలో భారత విదేశాంగ శాఖ వెల్లడి
యూఎస్, యూఏఈ, యూకేల్లో అత్యధికంగా దాడులు
-
Aug 14, 2026 15:13 IST
అమరావతి: పోలవరం, వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష
రాష్ట్రంలోని రిజర్వాయర్లలో నీటి నిల్వలు, విడుదలపై చర్చ
లోటు వర్షపాతం, భూగర్భ జలాలు, తాగునీటి సరఫరా, జలధార-జలహారతి కార్యక్రమాల అమలుపై సీఎం దిశానిర్దేశం
పోలవరం ప్రాజెక్టులో 89.9% సివిల్ పనులు పూర్తయ్యాయన్న అధికారులు
-
Aug 14, 2026 15:01 IST
తిరుపతి: పుత్తూరులో విషాదం
విద్యుత్ షాక్‌తో ఇద్దరు విద్యార్థుల మృతి
పుత్తూరులోని కె.ఎన్ రోడ్డు మౌనిక ఆప్టికల్స్ సమీపంలో పూజా టెక్స్‌టైల్స్ వద్ద విషాద ఘటన
-
Aug 14, 2026 14:46 IST
గంజాయి నిందితుడు బొల్లా కిరణ్ కేసులో ట్విస్ట్
గంజాయి నిందితుడు కిరణ్‌తో పోలీసులకు సంబంధాలు
కిరణ్ ఇంట్లో పోలీసుల వాకీటాకీ స్వాధీనం
ఒడిశా నుంచి కిరణ్ నివాసానికి గంజాయి పార్సిల్స్
ఒడిశా నుంచి 31 మంది యువతులతో గంజాయి రాకెట్
-
Aug 14, 2026 14:45 IST
నిర్మల్ జిల్లా: నలుగురు మంత్రులు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు: మహేశ్వర్‌రెడ్డి
మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రాదని అందినకాడికి దోచుకుంటున్నారు: మహేశ్వర్ రెడ్డి
హేట్ ప్రివెన్షన్ స్పీచ్ బిల్లుతో భయపెట్టాలని చూస్తున్నారు: మహేశ్వర్‌రెడ్డి
కాంగ్రెస్ అవినీతిపై ఈడీకి ఆధారాలతో ఫిర్యాదు చేస్తాం: మహేశ్వర్‌రెడ్డి
BRSతో సీఎంకు ఉన్న అనుబంధాన్ని బయటపెడతాం: BJLP నేత మహేశ్వర్‌రెడ్డి
-
Aug 14, 2026 14:32 IST
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0 నిర్వహణకు కేబినెట్ నిర్ణయం
డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో సదస్సు నిర్వహణకు ప్రత్యేక కమిటీల ఏర్పాటు
గతేడాది కంటే ఘనంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం
ఈసారి 'ఇన్వెస్ట్ తెలంగాణ' థీమ్‌తో సదస్సు నిర్వహణ
-
Aug 14, 2026 14:29 IST
కాకినాడ: పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి పూజలు
ద్రాక్షారామం భీమేశ్వర స్వామి అమ్మవార్లను దర్శించుకున్న పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా
స్వాగతం పలికిన రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్, జనసేన ఇన్‌ఛార్జి పొలిశెట్టి చంద్రశేఖర్
-
Aug 14, 2026 13:50 IST
ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
సమరయోధుల త్యాగఫలమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ: గవర్నర్ అబ్దుల్ నజీర్
ప్రాణత్యాగం చేసిన గొప్ప వ్యక్తులను స్మరించుకునే పవిత్ర దినం: గవర్నర్ అబ్దుల్ నజీర్
సత్యం, అహింస, శాంతి, సోదరభావాలకు పునరంకితం కావాలి: గవర్నర్ అబ్దుల్ నజీర్
జాతి నిర్మాణానికి అందరం ప్రతిజ్ఞ చేద్దాం: గవర్నర్ అబ్దుల్ నజీర్
-
Aug 14, 2026 13:25 IST
నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ సంచలన వ్యాఖ్యలు
భారత సహనం, ఉదారత బలహీనత కాదన్న ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్
ఎంతటి ప్రమాదాన్నైనా ఎదుర్కొని ప్రత్యర్థులపై ఎదురుదాడి చేస్తాం: దోవల్
‘ఆపరేషన్ సింధూర్’ డాక్యుసిరీస్‌లో తొలిసారిగా నోరువిప్పిన జాతీయ భద్రతా సలహాదారు
-
Aug 14, 2026 13:15 IST
సైబర్ నేరాల బాధితుల్లో రిటైర్డ్ ఉద్యోగులే ఎక్కువ: DGP CV ఆనంద్
40 రకాల సైబర్ నేరాలను గుర్తించాం: DGP సీవీ ఆనంద్
నేరాల స్వరూపం మారుతోంది: DGP సీవీ ఆనంద్
ఫిజికల్ దోపిడీల నుంచి సైబర్, నార్కోటిక్ నేరాలకు మార్పు: DGP సీవీ ఆనంద్
-
Aug 14, 2026 13:04 IST
సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణకు సుప్రీంకోర్టులో భారీ ఊరట
అమరావతి అసైన్డ్ భూముల కేసులో ఆళ్ల రామకృష్ణారెడ్డి SLPని కొట్టివేసిన సుప్రీంకోర్టు
-
Aug 14, 2026 13:01 IST
హైదరాబాద్: నేనూ సైబర్ క్రైమ్ బాధితుడినే: హీరో నాగార్జున
నాలుగేళ్ల క్రితం నేను సైబర్ ఫ్రాడ్‌కు గురయ్యా: హీరో నాగార్జున
భారీ లాభాలు ఇచ్చే ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ అని మాయ చేశారు: హీరో నాగార్జున
కానీ.. నాకు సైబర్ ఫ్రాడ్‌పై అవగాహన ఉండటంతో పోలీసులకు ఫోన్ చేశా: హీరో నాగార్జున
సైబర్ క్రైమ్ అరికట్టడంలో దేశంలోనే తెలంగాణ పోలీసులు నంబర్ వన్: హీరో నాగార్జున
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జున
-
Aug 14, 2026 12:53 IST
IAS అధికారులపై ఎంపీ ఈటల విమర్శలు
కొందరు IASలు సీఎం డైరెక్షన్‌లో పని చేస్తున్నారు: ఈటల
భూములను ఉద్దేశపూర్వకంగా నిషేదిత జాబితాలో పెడుతున్నారు: ఈటల
సీఎం నుంచి క్లారిఫికేషన్ వచ్చాక వాటిని క్లియర్ చేస్తున్నారు: ఈటల
ఇదంతా సీఎం కనుసన్నల్లోనే జరుగుతోంది: ఎంపీ ఈటల రాజేందర్
-
Aug 14, 2026 12:30 IST
రాహుల్‌పై దాఖలైన పరువు నష్టం పిటిషన్ కొట్టివేత
వీర్ సావర్కర్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో సుప్రీం తీర్పు
-
Aug 14, 2026 12:11 IST
విజయవాడ: జగన్ మానసిక పరిస్థితి సరిగా లేదు: ఎంపీ చిన్ని
జగన్ అసెంబ్లీకి రాని ఒక మొద్దు విద్యార్థి: ఎంపీ కేశినేని శివనాథ్
APPSCలో జరిగిన అక్రమాలపై ప్రశ్నిస్తారని జగన్‌కు భయం: ఎంపీ కేశినేని శివనాథ్
-
Aug 14, 2026 12:10 IST
నాకు, విద్యార్థులకు మధ్య BCI జోక్యం చేసుకోవద్దు: CJI జస్టిస్ సూర్యకాంత్
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశాలపై CJI ఆగ్రహం
విద్యార్థులకు నిరసన తెలిపే హక్కు ఉంటుంది: CJI జస్టిస్ సూర్యకాంత్
నేను కూడా విద్యార్థి దశలో నిరసనల్లో చురుగ్గా పాల్గొన్నా: CJI
విద్యార్థులకు లీగల్ ఎయిడ్ కోర్సుల్లో ప్యానల్‌గా అవకాశం కల్పిస్తాం: CJI
విద్యార్థులకు సుప్రీంకోర్టు అండగా ఉంటుంది: CJI జస్టిస్ సూర్యకాంత్
-
Aug 14, 2026 11:53 IST
తిరుపతి: చంద్రగిరిలో డీఎస్సీ అభ్యర్థుల భారీ ప్రదర్శన
డీఎస్సీలో కూటమి విజయం.. గొడ్డలి పార్టీకి చెంపదెబ్బ పేరుతో ప్రదర్శన
ర్యాలీలో పాల్గొన్న డీఎస్సీ అభ్యర్థులు, కూటమి నాయకులు
ఫ్లైఓవర్ వంతెన నుంచి టవర్ క్లాక్ వరకూ పాదయాత్ర
-
Aug 14, 2026 11:51 IST
మార్కాపురం: వెలిగొండ ప్రాజెక్టు సొరంగంలో విరిగిపడ్డ కొండచరియులు
తూర్పు కాలువ సప్లయ్ ఛానల్ సొరంగంలో విరిగిపడిన కొండచరియలు
కార్మికులు ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం
అర్ధవీడు మండలం కాకర్ల ఆనకట్ట వద్ద ఘటన
-
Aug 14, 2026 11:45 IST
కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలకు ఊరట
మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే
బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చిన విజయ్ సర్కార్
ఉత్తర్వులను రద్దు చేస్తూ గత నెల మద్రాస్ హైకోర్టు తీర్పు
-
Aug 14, 2026 11:30 IST
విజయనగరం: CISF ఆధీనంలోకి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం
అధికారికంగా రేపు బాధ్యతల స్వీకరణ
హాజరుకానున్న సీఐఎస్ఎఫ్ డీజీ, పలువురు ఉన్నతాధికారులు
-
Aug 14, 2026 11:15 IST
ఏపీలో ఆధునాతన అగ్నిమాపక వాహనాల ప్రారంభం
వాహనాలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
సీడ్ యాక్సెస్ రోడ్‌లో ఫైర్ వెహికల్స్ ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమం
రూ.40కోట్ల వ్యయంతో 58 ఆధునిక ఫైర్ ఫైటింగ్ వాహనాలు
25 ఫైర్ ఫైటింగ్, 20 వాటర్ బౌజర్లు, 13 క్విక్ రెస్పాన్స్ వాహనాలు
-
Aug 14, 2026 11:00 IST
ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం విజయ్ లేఖ
543 ఎంపీ సీట్లు, 33శాతం మహిళల రిజర్వేషన్‌పై లేఖ
లోక్‌సభ సీట్లు యథాతథంగా 543గానే ఉంచాలి: సీఎం విజయ్
చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ అమలు చేయాలి
మహిళా రిజర్వేషన్‌ను డీలిమిటేషన్‌తో ముడిపెట్టొద్దు: సీఎం విజయ్
-
Aug 14, 2026 10:45 IST
నెల్లూరు: వైసీపీ హయాంలో భూ అక్రమాలపై ప్రభుత్వం సీరియస్
సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాణి కనుసన్నల్లో భారీగా భూ అక్రమాలు
వైసీపీ నేతలతో అంటకాగిన పలువురు అధికారులు
ఆరుగురు తహసీల్దార్లు, RI, సర్వేయర్, VROలపై అభియోగాల నమోదు
10 రోజుల్లో వివరణ ఇవ్వాలని అధికారులకు నోటీసులు
-
Aug 14, 2026 10:36 IST
విజయవాడ: ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ప్రారంభమైన శ్రావణ మాస సందడి
మొదటి శుక్రవారం సందర్భంగా ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
ఈ నెల21న వరలక్ష్మీ వ్రతం, 27, 28, 29 తేదీల్లో పవిత్రోత్సవాలు
సెప్టెంబర్ 4న సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
-
Aug 14, 2026 10:30 IST
కాకినాడ జిల్లా: పిఠాపురం పాదగయ క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
శ్రావణ శుక్రవారం కావడంతో తరలివచ్చిన భక్తులు
అమ్మవార్లను దర్శించుకుని, ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించిన మహిళలు
-
Aug 14, 2026 10:20 IST
కోనసీమ: ముమ్మిడివరం మండలం అనాతవరంలో ప్రమాదం
అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు
ప్రమాదంలో వైద్య విద్యార్థి జయసూర్య(30) మృతి, మరో ముగ్గురికి తీవ్రగాయాలు
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Aug 14, 2026 10:15 IST
గుంటూరు: డీఎస్సీ పేరుతో వైసీపీ నానా యాగీ చేస్తోంది: యరపతినేని శ్రీనివాసరావు
జగన్ హయాంలో డీఎస్సీ వేయలేదు.. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు: యరపతినేని శ్రీనివాసరావు
మంచిని చెడుగా చూపడం వైసీపీ నైజంగా కనిపిస్తోంది: ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు
-
Aug 14, 2026 10:00 IST
ఖమ్మం జిల్లా: వైరా మండలం గరికపాడులో ప్రత్యేక పూజలు
1008 బిందెల నీటితో మహా శివుడికి జలాభిషేకం
శ్రీ భగవాన్ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో కార్యక్రమం
సకాలంలో వర్షాలు కురిసి, పంటలు పండాలని పూజలు
-
Aug 14, 2026 09:45 IST
మంత్రి శ్రీధర్‌బాబు అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీ
గోదావరి పుష్కరాలు-2027 ఏర్పాట్లు, సన్నద్ధతపై చర్చ
హాజరైన పలు శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు
-
Aug 14, 2026 09:30 IST
మార్కాపురం: అర్ధరాత్రి వెలుగొండ టన్నెల్‌లోకి మంత్రి నిమ్మల
TBM మెషిన్ వెలికితీత పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు
లైనింగ్ పనులను అడిగి తెలుసుకున్న మంత్రి నిమ్మల
4 గంటల పాటు టన్నెల్‌లోనే ఉండి పనుల పరిశీలన
మరో వారంలో పనులు పూర్తి చేయాలని మంత్రి ఆదేశం
-
Aug 14, 2026 09:15 IST
తిరుపతి: తొట్టంబేడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విషాదం
ఆస్తి రిజిస్ట్రేషన్ వివాదంతో గడ్డి మందు తాగి రైతు మునిరాజా ఆత్మహత్యాయత్నం
పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు
-
Aug 14, 2026 09:00 IST
అబద్ధాలు, కట్టుకథలతో చరిత్రను మార్చలేరు: హరీశ్ రావు
కాళేశ్వరం లేకుండానే పంటలు పండినట్లు చెబుతున్నారు: హరీశ్ రావు
ఎల్లంపల్లి, దేవాదుల, సీతారామ ప్రాజెక్టులను పూర్తి చేశాం: హరీశ్ రావు
చెరువుల పునరుద్ధరణతో భూగర్భ జలాలు పెరిగాయి: మాజీ మంత్రి హరీశ్ రావు
-
Aug 14, 2026 08:50 IST
జయశంకర్ భూపాలపల్లి: మల్హార్ మండలం కొయ్యూరులో విషాద ఘటన
విద్యుత్ షాక్‌తో తండ్రి కొట్టేకోళ్ల బాపు(48), కొడుకు మనోజ్ (20) మృతి
వ్యవసాయ భూమి వద్ద బోరులోని మోటారు బయటకు తీస్తుండగా ఘటన
మృతుల స్వగ్రామం కాటారం మండలంలోని మార్వాడిపల్లి
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Aug 14, 2026 08:45 IST
కడప: పులివెందులలో నేడు మంత్రుల పర్యటన
జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సవిత, బీసీ జనార్దన్ రెడ్డిల పర్యటన
ప్రజా దర్బార్ , అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష
టీడీపీ కార్యకర్తలతో సమావేశం, కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రులు
-
Aug 14, 2026 08:30 IST
అమరావతి: సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్
ఉదయం 10:30కు నూతన అగ్నిమాపక వాహనాలను ప్రారంభించనున్న సీఎం
ఉదయం 11:30కు పోలవరం, సాగునీటు ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష
-
Aug 14, 2026 08:15 IST
చిత్తూరు: ఎస్ఆర్ పురం మండలం క్షీర సముద్రంలో దారుణం
నిద్రిస్తున్న తండ్రి ఆనంద్(45)ను కత్తితో నరికిన కొడుకు
అడ్డొచ్చిన సొంత అత్తపై కూడా దాడి
ఇంటి నుంచి పారిపోతూ 108కు ఫోన్ చేసిన నిందితుడు
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Aug 14, 2026 08:05 IST
మహబూబ్ నగర్ జిల్లా: భూత్పూర్ NH 44 పై ప్రైవేట్ బస్సు బోల్తా
ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు
32 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్తుండగా ఘటన
-
Aug 14, 2026 08:00 IST
నల్సార్ విద్యార్థుల అంశంలో వెనక్కి తగ్గిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా
నల్సార్ విద్యార్థులపై ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకున్న BCI
నల్సార్ విద్యార్థులు ఎక్కడైనా న్యాయవాదులుగా నమోదు చేసుకోవచ్చు: BCI
-
Aug 14, 2026 07:55 IST
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో 24 గంటలుగా ఎడతెరిపి లేని వాన
భారీ వర్షాలతో ఒడిశాలోని పలు ప్రాంతాల్లో వరదలు
జమ్మూకశ్మీర్‌లోని భదర్వాలో వడగండ్లతో కూడిన భారీ వర్షం
ఆకస్మిక వర్షంతో శ్రీనగర్-లేహ్ హైవేపై విరిగిపడిన కొండచరియలు
హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో భారీ వర్షాలు, స్తంభించిన జనజీవనం
-
Aug 14, 2026 07:50 IST
ఉత్తరాఖండ్: చమోలి జిల్లాలో ఘోర ప్రమాదం
నిర్మాణంలో ఉన్న జలవిద్యుత్ ప్రాజెక్ట్ సొరంగంలోకి వరద
ఏడుగురు కార్మికుల మృతి, మరో 13 మందికి గాయాలు
మరో ఇద్దరు కార్మికుల ఆచూకీ గల్లంతు, కొనసాగుతున్న గాలింపు
ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ ధామి
-
Aug 14, 2026 07:45 IST
సంగారెడ్డి: జోగిపేట ఏరియా ఆస్పత్రిలో మరో ఇద్దరు వైద్యులపై వేటు
డాక్టర్ శివశంకర్‌రెడ్డి, డాక్టర్ తుల్జా భవానీ సస్పెన్షన్
ఇప్పటికే డాక్టర్ రమేష్‌ను సస్పెండ్ చేసిన అధికారులు
తమకు బదులుగా విధుల్లో ప్రైవేట్ వైద్యుడిని ఉంచినట్టు గుర్తింపు
వైద్యుల నిర్లక్ష్యంపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర సీరియస్
-
Aug 14, 2026 07:30 IST
నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం
ఉదయం 10:30కు సీఎం రేవంత్ అధ్యక్షతన భేటీ
చట్టసభల్లో ప్రవేశానికి వయోపరిమితిని 21 ఏళ్లకు తగ్గించాలని బిల్లు పెట్టడంపై చర్చ
మెట్రో విస్తరణ, హిల్ట్ పాలసీపై చర్చించే అవకాశం
-
Aug 14, 2026 07:15 IST
మహారాష్ట్ర: నాసిక్ ప్రాంతంలో స్వల్ప భూప్రకంపనలు
రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.4గా నమోదు
-
Aug 14, 2026 07:00 IST
శ్రీకాకుళం: నేడు పోలీస్ కస్టడీకి వైసీపీ చింతాడ రవికుమార్
మహిళా ఎస్‌ఐపై దాడి కేసులో ఏ1గా ఉన్న చింతాడ రవికుమార్
రవితో పాటు మరో 13 మంది నిందితులను కస్టడీకి కోర్టు అనుమతి
-
Aug 14, 2026 06:50 IST
హైదరాబాద్: ట్రేడింగ్ పేరుతో చార్టర్డ్ అకౌంటెంట్‌కు టోకరా
టెలిగ్రామ్ ద్వారా CA నరసింహారెడ్డిని సంప్రదించిన కేటుగాళ్లు
పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయంటూ ఎర
యాప్‌లో కృత్రిమ లాభాలు చూపిస్తూ మోసం
-
Aug 14, 2026 06:45 IST
హైదరాబాద్: నేడు ట్యాంక్‌బండ్‌పై భారీ తిరంగా ర్యాలీ
'హర్ ఘర్ తిరంగా'లో భాగంగా టీబీజేపీ ర్యాలీ
మధ్యాహ్నం 1:30కు అంబేద్కర్ విగ్రహం నుంచి ర్యాలీ
-
Aug 14, 2026 06:30 IST
నేడు యాదాద్రి ట్రస్ట్ బోర్డు తొలి సమావేశం
డోనర్ పాలసీ, రవాణా, పార్కింగ్ సమస్యలపై చర్చ
వసతి, ప్రసాదాలపై నిర్ణయం తీసుకునే అవకాశం
ఆలయ అభివృద్ధి, సౌకర్యాలపై దృష్టి
-
Aug 14, 2026 06:17 IST
రేపు సంగారెడ్డిలో సీఎం రేవంత్ బహిరంగ సభ
లక్ష మందితో సీఎం సభ నిర్వహణకు ఏర్పాట్లు
కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అందించనున్న సీఎం రేవంత్ రెడ్డి
-
Aug 14, 2026 06:15 IST
నేడు మాజీ మంత్రి సీదిరి బెయిల్ పిటిషన్‌పై విచారణ
బెయిల్ పిటిషన్‌ను విచారించనున్న సోంపేట కోర్టు
-
Aug 14, 2026 06:12 IST
నేడు ఏపీ లోకాయుక్త చైర్మన్ సెలక్షన్ కమిటీ భేటీ
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న సమావేశం
కొత్త చైర్మన్ ఎన్నికపై కొనసాగుతున్న ఉత్కంఠ
-
Aug 14, 2026 06:10 IST
బంగ్లాదేశ్‌లో తీవ్ర విద్యుత్ సంక్షోభం
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కరెంట్ కోతలు
పరిస్థితి తీవ్రంగా మారడంతో విద్యుత్ వినియోగంపై ఆంక్షలు
షాపింగ్ మాల్స్, మార్కెట్లు, దుకాణాలను రాత్రి 8 తర్వాత మూసేయాలని ఆదేశాలు
-
Aug 14, 2026 06:09 IST
రష్యా, ఉక్రెయిన్ మధ్య పరస్పర దాడులు
రష్యాలోకి చొచ్చుకెళ్లిన ఉక్రెయిన్ డ్రోన్లు
సరిహద్దుకు 1,300 కి.మీ. దూరంలో ఉన్న రిఫైనరీపై దాడులు
మాస్కో చమురు పరిశ్రమను దెబ్బతీయడమే లక్ష్యంగా.. మూడు రోజుల్లో చేపట్టిన నాలుగో దాడి
-
Aug 14, 2026 06:07 IST
హైదరాబాద్: నార్సింగిలో దారుణ హత్య
యువకుడు మహమ్మద్‌ను వెంటాడి చంపిన స్నేహితులు
ఇనుపరాడ్లతో మహమ్మద్‌ను కొట్టి చంపిన స్నేహితులు
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Aug 14, 2026 06:05 IST
హైదరాబాద్: గ్యాస్ సిలిండర్లకు ఈ-కేవైసీ గండం
ఆగస్టు 16.. తుది గడువుగా నిర్ణయం
ముందే పంపిణీ నిలిపివేస్తున్న డిస్ట్రిబ్యూటర్లు
-
Aug 14, 2026 06:00 IST
ఈ నెల 17నుంచి ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్
17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్ ఆతిథ్యం
ప్రధాన ఆకర్షణగా స్టార్ ప్లేయర్ పీవీ సింధు