-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP and Telangana National International breaking Live Updates of 1st September 2026 kjr
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Sep 01 , 2026 | 06:31 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Sep 01, 2026 20:55 IST
హైదరాబాద్: డీఎస్పీ భీమ్ రెడ్డికి బెయిల్ మంజూరు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న డీఎస్పీ భీమ్‌రెడ్డి
బెయిల్‌పై విడుదలైన డీఎస్పీ భీమ్ రెడ్డి
-
Sep 01, 2026 20:15 IST
ఢిల్లీ: 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా అధికారిణిగా శక్తి శర్మ
భారత సాయుధ దళాల్లోని నాన్-మెడికల్ విభాగం నుంచి తొలి మహిళా ఆఫీసర్
'అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ (ఎడ్యుకేషన్)'గా పదవీ బాధ్యతల స్వీకరణ
జూన్ 18, 1994న ఐఏఎఫ్ ఎడ్యుకేషన్ బ్రాంచ్‌లో చేరి, మూడు దశాబ్దాలకు పైగా విశిష్ట సేవలు
-
Sep 01, 2026 20:07 IST
చంద్రబాబు వల్లే తెలుగువారికి ప్రపంచస్థాయి గుర్తింపు: మంత్రి గొట్టిపాటి రవికుమార్
పార్టీలో కోటి మందిని సభ్యులుగా చేర్చి సుశిక్షితులైన కార్యకర్తల్ని అందించిన ఘనత చంద్రబాబుది: గొట్టిపాటి
పార్టీని నాశనం చేద్దామనుకున్నవారే నాశనమైపోయారు: గొట్టిపాటి
గత వైసీపీ విధ్వంస పాలనలో ఎన్ని సవాళ్లు ఎదురైనా ప్రపంచంలోని తెలుగువారంతా చంద్రబాబు వెంట నిలిచారు: గొట్టిపాటి
100కుపైగా దేశాల్లో చంద్రబాబు కోసం నిరసనలు చేపట్టారు: గొట్టిపాటి
-
Sep 01, 2026 19:59 IST
ఢిల్లీ: కేసీ వేణుగోపాల్‌తో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి భేటీ
సుమారు గంటకు పైగా కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయిన రేవంత్ రెడ్డి
కొండా సురేఖ, రాష్ట్ర రాజకీయాలపై ఇరువురి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం
-
Sep 01, 2026 19:55 IST
అమరావతి: పాఠశాల, ఇంటర్ విద్యాశాఖలపై మంత్రి లోకేశ్ సమీక్ష
అక్షర ఆంధ్ర సత్ఫలితాలు ఇస్తోంది: మంత్రి లోకేశ్
వచ్చే ఏడాదికి సంపూర్ణ అక్షరాస్యత దిశగా అడుగులు: మంత్రి లోకేశ్
అక్షర ఆంధ్రలో ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు భాగస్వామ్యం కావాలి: మంత్రి లోకేశ్
బడి బయట పిల్లలను స్కూళ్లలో చేర్చేలా చొరవ చూపాలి: మంత్రి లోకేశ్
మిడ్ డే మీల్‌పై ఫీడ్ బ్యాక్ అందించాలి: మంత్రి లోకేశ్
-
Sep 01, 2026 19:54 IST
క్రిటికల్ మినరల్స్ పరిశోధనపై తెలంగాణ కీలక ముందడుగు
మోనాష్-ఐఐటీ హైదరాబాద్-సింగరేణి భాగస్వామ్యం
క్రిటికల్ మినరల్స్ రంగంలో పరిశోధన వేగవంతానికి నిర్ణయం
-
Sep 01, 2026 19:54 IST
ఉత్తరాంధ్ర కల సాకారం దిశగా మరో కీలక ముందడుగు: మంత్రి నిమ్మల రామానాయుడు
రేపు పోలవరం LMC తొలిదశకు నీరు విడుదల: మంత్రి నిమ్మల
ఏలేరు, పంపా, తాండవ, శారద, వరాహ నదులను దాటుకుంటూ ఎల్‌ఎంసీ ద్వారా గోదావరి జలాలు: మంత్రి నిమ్మల
-
Sep 01, 2026 19:47 IST
హైదరాబాద్: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన టోలిచౌకి ఎస్సై
ఎస్సై ఆర్. పాండు నాయక్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ
కేసు నమోదు చేయకుండా ఉండేందుకు రూ.10 వేలు డిమాండ్
పాస్‌పోర్ట్ స్వాధీనం చేసుకోకుండా ఉండేందుకు కూడా లంచం డిమాండ్
వలపన్ని ఎస్సైను పట్టుకున్న సిటీ రేంజ్-1 ఏసీబీ అధికారులు
ఎస్సైను అరెస్ట్ చేసి ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన అధికారులు
-
Sep 01, 2026 19:38 IST
ఒంగోలు ఎంపీ మాగుంటపై చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విమర్శలు
ఎన్నికల సమయంలో తప్ప మాగుంటకి ప్రజలు గుర్తుండరు
ఎంపీ పదవి అడ్డుపెట్టుకొని మాగుంట వ్యాపారాలు: చెవిరెడ్డి
మాగుంట వ్యాపారాలు అన్నీ బయటపెడతాం: చెవిరెడ్డి
వెలిగొండ ప్రాజెక్టు నిర్మించి నీళ్లు తెచ్చింది వైఎస్ఆర్, జగన్: చెవిరెడ్డి
వ్యాపారాల కోసం మాగుంట దిగజారి మాట్లాడుతున్నారు: చెవిరెడ్డి
-
Sep 01, 2026 19:30 IST
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌కు చేరిన నైనీ మైన్ తొలి బొగ్గు రేక్
4 వేల టన్నుల బొగ్గుతో YTPSకు చేరిన తొలి రైలు
ఒడిశాలోని నైనీ బొగ్గు గని నుంచి బొగ్గు రవాణా ప్రారంభం
సుమారు 1,050 కిలోమీటర్లు ప్రయాణించి దామరచర్లకు చేరిన రేక్
అధిక ఊష్ణ సామర్థ్యం కలిగిన నాణ్యమైన బొగ్గు
బొగ్గు నాణ్యతతో బాయిలర్ల పనితీరు మెరుగుపడే అవకాశం
బూడిద సమస్యలు తగ్గి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరిగే అవకాశం
TGGENCO, సింగరేణి, రైల్వేల సమన్వయంతో తొలి రేక్ రవాణా
-
Sep 01, 2026 18:56 IST
ఢిల్లీ: కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి
-
Sep 01, 2026 18:47 IST
హైదరాబాద్: సింగరేణి కాలనీలో యువకుడు మహేష్(19) ఆత్మహత్య
-
Sep 01, 2026 18:46 IST
హైదరాబాద్: చందానగర్‌లో భారీగా స్టెరాయిడ్ ఇంజక్షన్ల సీజ్
ఇద్దరు అరెస్టు, రూ.లక్ష విలువైన ఇంజక్షన్లు స్వాధీనం
-
Sep 01, 2026 18:23 IST
పశ్చిమగోదావరి: నరసాపురం నియోజకవర్గంలో ముగిసిన సీఎం చంద్రబాబు పర్యటన
మొగల్తూరు నుంచి ఉండవల్లి బయలుదేరిన సీఎం
-
Sep 01, 2026 18:22 IST
కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు బెదిరింపు లేఖ
ఉగ్రవాదులు త్వరలోనే హత్య చేస్తారని లేఖలో హెచ్చరిక
కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేసిన పాశ్వాన్ కార్యాలయం
-
Sep 01, 2026 18:10 IST
హైదరాబాద్: తెలంగాణలో మహిళలు ఆర్థిక వృద్ధి సాధిస్తున్నారు: మంత్రి పొన్నం ప్రభాకర్
347.36 కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేశారు: మంత్రి
ఉచిత బస్సు ద్వారా మహిళలు రూ.12,167 కోట్లు ఆదా చేశారు: మంత్రి
600 బస్సులకు మహిళలను యజమానులు చేశాం: మంత్రి
-
Sep 01, 2026 18:01 IST
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి భేటీ
గంటకుపైగా కొనసాగుతున్న భేటీ
కొండా సురేఖ ఎపిసోడ్ నేపథ్యంలో నేతల భేటీకి ప్రాధాన్యం
-
Sep 01, 2026 18:01 IST
తెలంగాణ ఆరోగ్యశాఖలో తుదిదశకు మరో రిక్రూట్‌మెంట్
1,931 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్
1:1.25 నిష్పత్తిలో అభ్యర్థుల షార్ట్ లిస్టింగ్
ఈనెల 16 నుంచి 26 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్
వెరిఫికేషన్‌కు హాజరుకానివారికి ఈనెల 28న మరో అవకాశం
వెరిఫికేషన్ అనంతరం ఫైనల్ మెరిట్, సెలక్షన్ లిస్ట్ విడుదల
రెండున్నరేళ్లలో ఆరోగ్యశాఖలో 15 వేలకుపైగా పోస్టుల భర్తీ
-
Sep 01, 2026 18:00 IST
ఢిల్లీకి క్యూ కడుతున్న టీకాంగ్రెస్ నేతలు
రేపు ఢిల్లీకి భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు
ఇప్పటికే ఢిల్లీలో పలువురు మంత్రులు
-
Sep 01, 2026 17:56 IST
అఫ్గాన్‌తో సిరీస్.. భారత్ జట్టును ప్రకటించిన బీసీసీ
కెప్టెన్‌గా శ్రేయస్, వైస్ కెప్టెన్‌గా తిలక్ వర్మ
-
Sep 01, 2026 17:45 IST
ఢిల్లీ: తుమ్మిడిహెట్టిపై ముగిసిన సీడబ్ల్యూసీ సమావేశం
కేంద్ర జలసంఘం చైర్మన్ అధ్యక్షతన సమావేశం
తుమ్మిడిహెట్టి సాంకేతిక, అంతర్రాష్ట్ర అంశాలపై తెలంగాణ, మహారాష్ట్ర ఉన్నతాధికారుల సమీక్ష
గత ఒప్పందాన్ని సవరించాలని కోరడం వెనుక కారణాలను సమావేశంలో వివరించిన తెలంగాణ
152 మీటర్ల ఎత్తు ఉండాలని కోరుతున్న తెలంగాణ
త్వరలో మరోసారి సమావేశం కావాలని నిర్ణయం
-
Sep 01, 2026 17:43 IST
ఎంపీ లాడ్స్ వినియోగంపై బండి సంజయ్ వివరణ
ఎంపీ లాడ్స్ నిధులన్నీ వినియోగించాం: బండి సంజయ్
రూ.17.5 కోట్ల నిధులకు రూ.16.47 కోట్లు వినియోగించాం
94 శాతం పనులు పురోగతిలో ఉన్నాయి: బండి సంజయ్
-
Sep 01, 2026 17:31 IST
ఏపీలో SIR గడువు పెంచిన CEC
ఈనెల 10 వరకు SIR గడువు పెంపు
క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారానికి అక్టోబర్ 5 వరకు అవకాశం
అక్టోబర్ 9న తుది ఓటర్ల జాబితా
-
Sep 01, 2026 17:25 IST
అమరావతి: ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌ను ప్రారంభించిన డీజీపీ
విభజన తర్వాత తొలిసారి పోలీసు స్పోర్ట్స్ మీట్: డీజీపీ
నిత్యం క్రీడలు ఆడటం వల్ల ఎన్నో ప్రయోజనాలు: డీజీపీ
చదువుతోపాటు యువత క్రీడల్లోనూ రాణించాలి: డీజీపీ
-
Sep 01, 2026 17:20 IST
పాకిస్థాన్ క్రికెట్‌లో బిగ్ ట్విస్ట్
సెలక్షన్ కమిటీకి మిస్బా ఉల్ హక్ రాజీనామా
అతడి రాజీనామాను ఆమోదించని పీసీబీ
-
Sep 01, 2026 17:19 IST
ఢిల్లీ: విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే కేసుల ఎత్తివేత నిర్ణయం: కేంద్ర మంత్రి జేపీ నడ్డా
విద్యార్థులపై ఎలాంటి కఠిన చర్యలు ఉండవని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం: జేపీ నడ్డా
కేంద్రంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎఫ్‌ఐఆర్‌ల రద్దు ప్రక్రియను వేగవంతం: జేపీ నడ్డా
దేశ యువత, విద్యార్థుల అభ్యున్నతే ప్రధాని మోదీ ప్రాధాన్యం: కేంద్ర మంత్రి జేపీ నడ్డా
-
Sep 01, 2026 16:46 IST
సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు
నీట్ ఆందోళనల్లో దేశవ్యాప్తంగా విద్యార్థులపై నమోదైన FIRలు రద్దు
రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం అన్నికేసులు కొట్టివేసిన సుప్రీం
నిరసనల్లో పాల్గొనడం నేరం కాదు: సుప్రీంకోర్టు
విద్యార్థులు, యువత భవిష్యత్ దృష్ట్యా నిర్ణయం: సుప్రీంకోర్టు
తీవ్ర నేర నేపథ్యం, ఆస్తి నష్టానికి పాల్పడిన 2,873 మందిపై చట్టప్రకారం కేసుల నమోదుకు మినహాయింపు ఇచ్చిన సుప్రీంకోర్టు
-
Sep 01, 2026 16:45 IST
పాకిస్థాన్ క్రికెట్‌పై హర్షా భోగ్లే సెటైర్లు
విచిత్ర నిర్ణయాలు తీసుకోవడంలో పాక్‌ను నమ్మొచ్చు: భోగ్లే
తప్పుడు నిర్ణయాలతో పాక్ గుర్తింపు సంపాదిస్తోంది: భోగ్లే
-
Sep 01, 2026 16:22 IST
తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్‌సాయి
ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన ఈశ్వర్ సాయి
ఈశ్వర్ సాయిపై BNS 69 కింద నార్సింగి పీఎస్‌లో కేసు
పెళ్లి పేరుతో యువతి మాధురి రాథోడ్‌ని మోసం చేసినట్లు ఫిర్యాదు
-
Sep 01, 2026 16:15 IST
కాసేపట్లో ఢిల్లీ వెళ్లనున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
క్యాబినెట్ విస్తరణ ఊహాగానాల నేపథ్యంలో ఢిల్లీకి ఆశావాహులు
తనకు మంత్రి పదవి ఇస్తానని హైకమాండ్ హామీ ఇచ్చిందంటున్న రాజగోపాల్ రెడ్డి
తనకు ఇచ్చిన హామీ గుర్తు చేసేందుకు ఢిల్లీకి వెళ్తున్నానన్న రాజగోపాల్ రెడ్డి
-
Sep 01, 2026 16:13 IST
ఢిల్లీకి మంత్రి కొండా సురేఖ
సాయంత్రం ఢిల్లీలో టీకాంగ్రెస్ నేతలతో కీలక భేటీ
కొండా సురేఖను బర్తరఫ్ చేసే అంశంపైనే ప్రధాన చర్చ
సురేఖ ఢిల్లీ పర్యటనపై తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి
-
Sep 01, 2026 16:10 IST
కోల్‌కతా: మాజీ సీఎం మమతా బెనర్జీ మేనకోడలు బృష్టి ముఖర్జీ(28) మృతి
బీర్భూమ్‌లోని తన ఇంట్లో ఉరివేసుకున్న బృష్టి ముఖర్జీ
మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలింపు
కొంతకాలంగా డిప్రెషన్‌కు చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యుల వెల్లడి
విడాకుల ప్రక్రియలో ఉన్నట్లు సమాచారం
-
Sep 01, 2026 15:53 IST
ఎస్‌సీవో సదస్సు ఫొటోలో ప్రధాని నరేంద్ర మోదీని క్రాప్ చేసిన పాకిస్థాన్
షెహబాజ్ షరీఫ్‌ను మధ్యలో చూపించేందుకు గ్రూప్ ఫొటోను ఎడిట్ చేసిన పాక్ పీఎంవో
పాక్ ఎడిటింగ్‌ను బయటపెట్టిన మోదీ షేర్ చేసిన పూర్తి గ్రూప్ ఫొటో
మోదీని వీడియోలోనూ క్రాప్ చేసిన షెహబాజ్ అధికారిక సోషల్ మీడియా ఖాతా
పాక్ తీరుపై నెటిజన్ల ఫైర్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్
-
Sep 01, 2026 15:48 IST
అమరావతి: జలంతోనే జీవం, జీవితం అంటూ సీఎం చంద్రబాబు పోస్ట్
వెలిగొండ ఫీడర్ కెనాల్‌లో వానరాలు దాహార్తి తీర్చుకుంటున్న వీడియోను 'ఎక్స్'లో షేర్ చేసిన సీఎం చంద్రబాబు
వెలిగొండ జలాలతో కరవు ప్రాంతంలో ప్రాణులకూ తాగునీటి అవసరాలు తీరడం సంతోషకరం: సీఎం
-
Sep 01, 2026 15:46 IST
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ 13, నిఫ్టీ 25 పాయింట్ల నష్టం
-
Sep 01, 2026 15:32 IST
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టులో ఊరట
సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్‌ను సస్పెండ్ చేసిన డివిజన్ బెంచ్
తదుపరి విచారణ నవంబర్ 3కు వాయిదా వేసిన హైకోర్టు
అప్పటి వరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను మార్చాలన్న సింగిల్ బెంచ్ ఆర్డర్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేసిన డివిజన్ బెంచ్
-
Sep 01, 2026 15:24 IST
ఢిల్లీ: షాంగై సదస్సు అనంతరం భారత్‌కు పయనమైన ప్రధాని మోదీ
ఉజ్బెకిస్థాన్, కిర్గిస్థాన్‌లో నాలుగు రోజులపాటు పర్యటించిన మోదీ
ప్రాంతీయ భద్రత, ఆర్థిక సహకారంపై ప్రధాని ప్రసంగం
ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని ప్రపంచ దేశాలకు మోదీ పిలుపు
-
Sep 01, 2026 15:21 IST
కర్నూలులో ఉగ్ర కలకలం
కర్నూలులో అనుమానాస్పద ఉగ్రవాది నూర్ మహ్మద్ అరెస్టు
కర్నూలు శివారు గొందిపర్లలోని పరిశ్రమలో పనిచేస్తున్న సికింద్రాబాద్ వాసి నూర్ మహ్మద్
హైదరాబాద్‌కు తరలించిన ఇంటెలిజెన్స్ బ్యూరో
-
Sep 01, 2026 15:17 IST
ముంబైతోనే హార్దిక్ పాండ్య!
పాండ్యను జట్టులోనే కొనసాగించాలనుకుంటున్న ఎంఐ
కెప్టెన్‌గా తిలక్ వర్మ ఉండొచ్చని సమాచారం
-
Sep 01, 2026 15:15 IST
హైదరాబాద్‌ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ యువతకు ప్రపంచస్థాయి విద్య అందుబాటులోకి రానుంది: సీఎం రేవంత్‌రెడ్డి
హార్వర్డ్ యూనివర్సిటీ కూడా తెలంగాణలో కోర్సులు, ప్రోగ్రామ్‌లకు ఆసక్తి చూపుతోంది: సీఎం
-
Sep 01, 2026 15:14 IST
ప్రభుత్వ సేవలన్నీ ఆన్‌లైన్‌లో అందించడమే లక్ష్యం: ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్
ప్రభుత్వ సేవలు సంక్లిష్టంగా ఉండకూడదు: ప్రఖర్ జైన్
సరళతరం, సులభంగా సేలవలందించడమే లక్ష్యం: ప్రఖర్ జైన్
ఇప్పటికే మనమిత్ర ప్రజాదరణ పొందింది: ప్రఖర్ జైన్
ఇప్పుడు 'ఏపీ ఒన్ యాప్' కూడా తెస్తున్నాం: ప్రఖర్ జైన్
-
Sep 01, 2026 15:13 IST
ఢిల్లీ: ఈనెల 5న ఇండియా గేట్ మార్చ్‌ను ఉపసంహరించుకున్న సీజేపీ
ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం అందిస్తామని సుప్రీంకోర్టుకు కేంద్రం హామీ
కేంద్రం హామీతో నిరసన ర్యాలీని విరమించుకున్న సీజేపీ
-
Sep 01, 2026 14:44 IST
ఉగ్రవాదం వ్యూహాత్మక సంపద కారాదు: ప్రధాని మోదీ
షాంఘై సదస్సు వేదికగా మరోసారి పాక్‌కు మోదీ హెచ్చరిక
ఉగ్ర వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలి: మోదీ
-
Sep 01, 2026 13:12 IST
ఢిల్లీకి బయల్దేరిన మంత్రి కొండా సురేఖ
సాయంత్రం ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో కీలక భేటీ
కొండా సురేఖను బర్తరఫ్ చేసే అంశంపైనే ప్రధాన చర్చ
కొండా సురేఖ ఢిల్లీ పర్యటనపై తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి
-
Sep 01, 2026 13:00 IST
ఎస్-400 వ్యవస్థల కొనుగోలుకు భారత్ ముందడుగు
ఐదు స్క్వాడ్రన్ల కొనుగోలుకు భారత టెండర్‌కు ప్రతిపాదన సమర్పించిన రష్యా
భారత సైనిక వ్యవస్థలో 'సుదర్శన్'గా పేరుగాంచిన రష్యన్ ఎస్-400 ట్రయంఫ్ క్షిపణి
ఆపరేషన్ సిందూర్‌లో పలు వైమానిక ముప్పులను అడ్డుకున్న సుదర్శన్
-
Sep 01, 2026 12:50 IST
కంటోన్మెంట్‌లోని మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ.. సెక్యూరిటీ అలర్ట్ ప్రకటించిన అధికారులు
ఆయుధాల గదిని పరిశీలించిన మల్కాజిగిరి సీపీ సుమతి
ఈ కేసు ఛేదించేందుకు ఆరు పోలీసు బృందాల ఏర్పాటు
ఢిల్లీ నుంచి మద్రాస్ రెజిమెంట్‌కు చేరుకున్న ఆర్మీ ఉన్నతాధికారుల బృందం
-
Sep 01, 2026 12:45 IST
క్రికెట్‌లో కోహ్లీనే మెస్సి, రొనాల్డో: థాయ్ ఇన్‌ఫ్లుయెన్సర్
లార్డ్స్ మైదానంలో కోహ్లీని చూసి సంబరపడిపోయిన ఇన్‌ఫ్లుయెన్సర్
సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో
-
Sep 01, 2026 12:40 IST
ప.గో.జిల్లా మొగల్తూరు: ప్రజా కార్యక్రమాల్లో సంస్కరణలు తీసుకొచ్చాం: సీఎం చంద్రబాబు
45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్నోసార్లు నరసాపురం వచ్చాను: సీఎం చంద్రబాబు
నాకు మొగల్తూరు మండలం కొత్త కాదు: సీఎం చంద్రబాబు
31 సంవత్సరాల క్రితం నేను సీఎం అయ్యాను.. అన్న విషయం కూడా మర్చిపోయాను: సీఎం చంద్రబాబు
అనేక పాలనా సంస్కరణలకు నాంది పలికాం: సీఎం చంద్రబాబు
-
Sep 01, 2026 12:36 IST
విజయవాడ: సెంట్రల్ నియోజకవర్గం 24వ డివిజన్‌లో పెన్షన్ల పంపిణీ
కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని), ఎమ్మెల్యే బొండా ఉమ
-
Sep 01, 2026 12:35 IST
ప.గో.: గత ప్రభుత్వం ఆక్వా రైతుల సమస్యలను గాలికొదిలేసింది: కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆశలకు అనుగుణంగా పనిచేస్తున్నాయి
నరసాపురం బైపాస్ రోడ్డు నిర్మాణానికి వచ్చే నెలలో శ్రీకారం: కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ
-
Sep 01, 2026 12:30 IST
పల్నాడు జిల్లా: గురజాల నగర పంచాయతీలో వైసీపీకి షాక్
టీడీపీలో చేరిన వైసీపీ కౌన్సిలర్లు, ఇన్‌చార్జ్ మున్సిపల్ ఛైర్మన్
ఇన్ చార్జ్ మున్సిపల్ ఛైర్మన్‌తో పాటు ఆరుగురు కౌన్సిలర్లు టీడీపీలో చేరిక
ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు సమక్షంలో టీడీపీలో చేరిన కౌన్సిలర్లు
పార్టీ కండువా కప్పి.. టీడీపీలోకి ఆహ్వానించిన యరపతినేని
-
Sep 01, 2026 12:24 IST
ప.గో. జిల్లా మొగల్తూరు: 1995 సెప్టెంబర్ 1వ తేదీ రాష్ట్ర చరిత్రను తిరగరాసిన రోజు: మంత్రి రామానాయుడు
అదే రోజు తొలిసారిగా చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం
తెలుగుజాతికి బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రపంచంలో ఉన్న ఏకైక వ్యక్తి చంద్రబాబు
ఉమ్మడి ఏపీలోగానీ, విభజిత ఏపీలోగానీ ఎక్కువ కాలం సీఎంగా చేసిన వ్యక్తి చంద్రబాబు
-
Sep 01, 2026 12:21 IST
గోవా నుంచి ఢిల్లీ రావాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం
టేకాఫ్ అయిన కాసేపటికే గోవా ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్
విమానం ల్యాండింగ్ సమయంలో ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ప్రకటన
ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు ఇండిగో వెల్లడి
-
Sep 01, 2026 12:17 IST
ఖర్గే ప్రసంగించిన వేదిక శుద్ధి ఘటనను ఖండించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఇది ఖర్గేకు జరిగిన అవమానం కాదు.. దళిత సమాజంపై జరిగిన దాడి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
మనిషి నిలబడ్డ నేలను శుద్ధి చేయాలనుకోవడం ఏ కాలపు మనస్తత్వం?
వేదికలను కాదు.. వివక్షతో నిండిన మనస్తత్వాలను శుద్ధి చేయాలి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
-
Sep 01, 2026 12:15 IST
నల్లగొండ: ప్రతిపక్ష హోదాకు కేసీఆర్ రాజీనామా చేయాలి: ప్రభుత్వ విప్, MLA వేముల వీరేశం
గత ప్రభుత్వ విధ్వంసపు పునాదులపై వికాసపు సభ నిర్వహిస్తున్నాం: ప్రభుత్వ విప్ వేముల వీరేశం
గత ముఖ్యమంత్రి 420 హామీలు ఇచ్చి తెలంగాణను విధ్వంసం చేశారు
తెలంగాణలో BRS పార్టీ కనుమరుగవుతుంది: ప్రభుత్వ విప్ వేముల వీరేశం
-
Sep 01, 2026 12:10 IST
శ్రీకాకుళం: వైసీపీ కార్యకర్తలకు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు క్లాస్
సభ మధ్యలో జారుకుంటున్న సొంత పార్టీ శ్రేణులపై అసహనం
ప్రతిపక్షంలో ఉంటే నోరు విప్పరా.. అంటూ క్లాస్
-
Sep 01, 2026 12:05 IST
హైదరాబాద్: గణేశ్ ఉత్సవాలపై MCRHRDలో మంత్రి పొన్నం సమీక్ష
పాల్గొన్న ఉన్నతాధికారులు, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి సభ్యులు
-
Sep 01, 2026 12:00 IST
తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్ కేసుపై అప్పీల్‌కు వెళ్లిన రంగనాథ్
ఇదే కేసులో రంగనాథ్‌ను తప్పించి మరో అధికారిని నియమించాలని గతంలో సింగిల్ బెంచ్ తీర్పు
సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
-
Sep 01, 2026 11:50 IST
ఢిల్లీ: తుమ్మిడిహెట్టిపై CWC కీలక సమావేశం
కేంద్ర జలవనరుల సంఘం చైర్మన్ అధ్యక్షతన భేటీ
పాల్గొన్న తెలంగాణ, మహారాష్ట్ర ఉన్నతాధికారులు
తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఎత్తు, ముంపు తీవ్రతపై చర్చ
-
Sep 01, 2026 11:45 IST
ఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కరెన్సీ చెస్ట్‌లో ఫేక్ నోట్లు
కరెన్సీ చెస్ట్‌లో రూ.7.40కోట్ల నోట్లు మార్చి ఫేక్ కరెన్సీ
PNB విస్తృత ఆడిటింగ్‌లో వెలుగు చూసిన నోట్ల అక్రమం
ఘటనలో PNB అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు
సీనియర్ మేనేజర్ సహా ముగ్గురు అధికారుల సస్పెన్షన్
-
Sep 01, 2026 11:36 IST
నెల్లూరు: వైసీపీ హయాంలో ప్రజావ్యతిరేక పాలన సాగింది: MLA కోటంరెడ్డి
కులమతాల మధ్య చిచ్చుపెడుతూ వైసీపీ వికృత రాజకీయం చేస్తోంది: MLA కోటంరెడ్డి
విజయసాయిని సజ్జల నీచాతినీచంగా దూషించారు: MLA కోటంరెడ్డి
-
Sep 01, 2026 11:32 IST
7.8శాతం GDP వృద్ధిపై ప్రధాని సంబరాలు ముందస్తు ప్రచారమే: కాంగ్రెస్ నేత జైరాం రమేష్
దేశంలో పెట్టుబడులు, వినియోగం మందగించాయి: కాంగ్రెస్ నేత జైరాం రమేష్
ప్రజలపై కేంద్రం హైవోల్టేజ్ ధరల భారాన్ని మోపుతోంది: జైరాం రమేష్
గణాంకాల గారడీతో ప్రజలను భ్రమల్లో ముంచెత్తుతున్నారు: జైరాం రమేష్
-
Sep 01, 2026 11:30 IST
హైదరాబాద్: నీట్ యూజీ-2026 అభ్యర్థులకు కీలక సూచన
MBBS ఫేజ్-1 కౌన్సెలింగ్ వెబ్ ఆప్షన్ల నమోదుకు మరో గంట సమయం
ఫేజ్-1లో వెబ్ ఆప్షన్లు నమోదు చేయని అభ్యర్థులు తదుపరి కౌన్సెలింగ్ దశల్లో నమోదు చేసుకునేందుకు వీలులేదు
అభ్యర్థులు వెంటనే వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి: ఎక్స్‌లో మంత్రి దామోదర
-
Sep 01, 2026 11:28 IST
మళ్లీ గాయపడ్డ హార్దిక్ పాండ్య!
అఫ్గానిస్థాన్‌తో సిరీస్‌కు ముందు టీమిండియాకు షాక్
తొడ కండరాల గాయం నుంచి కోలుకుంటున్న స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య
ఇటీవలే ఫిట్‌నెస్ సాధించినట్లు వార్తలు
ఇంతలోనే శిక్షణ సమయంలో మళ్లీ గాయపడినట్లు సమాచారం
-
Sep 01, 2026 11:25 IST
మెదక్: రామాయంపేటలో యూరియా కోసం రైతుల ధర్నా
మెదక్-రామాయంపేట రహదారిపై బైఠాయించిన రైతులు
2వేల బస్తాల యూరియా బుకింగ్.. నిమిషంలోనే క్లోజ్ కావడంతో నిరసన
-
Sep 01, 2026 11:20 IST
జీ గ్రూప్ అధినేత సుభాష్ చంద్ర రీపేమెంట్ ప్లాన్ ఆమోదంపై NCLT స్టే
గత నెల 25న ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తూ తీర్పు
తీర్పు ఇచ్చిన సభ్యుల మధ్య స్పష్టమైన అభిప్రాయం లేదని ట్రైబ్యునల్ వ్యాఖ్య
ప్రక్రియ ముగిసేవరకూ సుభాష్ చంద్ర ఆస్తులు బదిలీ చేయకూడదని NCLT ఆదేశం
ఈ వ్యవహారంలో సంబంధిత రుణదాతలు, లీగల్ పార్టీలందరికీ నోటీసులు
-
Sep 01, 2026 11:19 IST
ప.గో.: సీఎం చంద్రబాబు నరసాపురం పర్యటనలో స్వల్ప మార్పు
మొగల్తూరులో పెన్షన్లు పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు
అనంతరం ప్రజావేదికలో ప్రసంగించనున్న చంద్రబాబు
-
Sep 01, 2026 11:15 IST
నంద్యాల: బనగానపల్లె రంగరాజుపేటలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి
రూ.64లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ కాల్వల నిర్మాణాలను ప్రారంభించిన మంత్రి
-
Sep 01, 2026 11:00 IST
ఢిల్లీ: కాసేపట్లో కేంద్రమంత్రి రామ్మోహన్‌తో మంత్రి తుమ్మల భేటీ
భద్రాద్రి కొత్తగూడెం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు అంశంపై చర్చ
-
Sep 01, 2026 10:45 IST
హైదరాబాద్: పరారీలో ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి
ఈశ్వర్ సాయిపై నార్సింగి పీఎస్‌లో కేసు నమోదు
గత నెల 22న ఈశ్వర్ సాయిపై మాధురి రాథోడ్ ఫిర్యాదు
పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను శారీరకంగా వాడుకుని మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్న మాధురి రాథోడ్
ఈశ్వర్ సాయి కోసం గాలిస్తున్న 2 ప్రత్యేక పోలీస్ బృందాలు
-
Sep 01, 2026 10:30 IST
ఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఎంపీ లింగమనేని రమేష్ లేఖ
ఏపీలోని 13 నవోదయ విద్యాలయాలు, రెండు ఎయిమ్స్‌లకు బడ్జెట్ సహాయం అందించాలని ఎంపీ వినతి
-
Sep 01, 2026 10:15 IST
హైదరాబాద్: ఆయుధాల చోరీతో కంటోన్మెంట్‌లో హైఅలర్ట్
కట్టుదిట్టమైన భద్రత ఉన్న ఆయుధాల గదిలో భారీ చోరీ
4 ఏకే-47 తుపాకులు, 6 పిస్టళ్లు, ఒక ఇన్సాస్ రైఫిల్ మాయం
ఆయుధాలతో పాటు మందుగుండు సామగ్రి కూడా అపహరణ
ఇప్పటికే సెక్యూరిటీ అలర్ట్ ప్రకటించి ఆర్మీ స్కూళ్లకు సెలవు ప్రకటన
-
Sep 01, 2026 10:05 IST
నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో ఉద్రిక్తత
వెలుగోడుకు బయల్దేరిన వైసీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు
పోలీసులతో వైసీపీ నేతల వాగ్వాదం, తోపులాట
-
Sep 01, 2026 10:00 IST
మెస్సి రిటైర్‌మెంట్‌పై ప్రముఖుల సందేశాలు
నంబర్ 10 లేకుండా అర్జెంటీనా జెర్సీ కళ తప్పుతుంది: శిఖర్ ధావన్
ఈ ప్రపంచం నిన్ను గుర్తు పెట్టుకుంటుంది లియో: యువరాజ్ సింగ్
-
Sep 01, 2026 09:50 IST
తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా?: టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు
పరామర్శకు వెళ్తుంటే అక్రమ అరెస్టులు చేస్తున్నారు
పార్టీ ఆఫీసులు, ఇళ్లపై దాడులు సరికాదు: టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు
-
Sep 01, 2026 09:45 IST
విజయవాడ: పోలీసులపై దాడి చేసిన నిందితుడిపై కాల్పులు
దేవరపల్లిలో కానిస్టేబుల్‌పై దాడి చేసి పరారైన అవినాద్
కంకిపాడు దగ్గర నిందితుడిని పట్టుకునేందుకు పోలీసుల యత్నం
CI, కానిస్టేబుల్‌పై కత్తితో దాడి చేసిన నిందితుడు అవినాష్
కానిస్టేబుల్ శ్రీనివాస్ ఛాతిలో కత్తితో పొడిచిన నిందితుడు
నిందితుడు అవినాష్ కాళ్లపై కాల్పులు జరిపిన కంకిపాడు సీఐ
-
Sep 01, 2026 09:35 IST
అనకాపల్లి జిల్లా: పాయకరావుపేట మండలం పీఎల్ పురంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేసిన హోంమంత్రి అనిత
పింఛన్ల పంపిణీలో పాల్గొన్న ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్
ఇంటింటికీ వెళ్లి స్వయంగా పింఛన్లను అందజేసిన హోం మంత్రి అనిత
-
Sep 01, 2026 09:30 IST
తూ.గో.: విధుల్లో నిర్లక్ష్యం వహించిన నలుగురు పోలీసులపై వేటు
కోరుకొండలో మహిళపై హత్యాయత్నం ఘటనలో 4 రోజులు ఆలస్యంగా కేసు నమోదు
నలుగురు పోలీసులను వీఆర్‌కు పంపుతూ ఎస్పీ ఆదేశాలు
కోరుకొండ SI రమేష్, రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి ఔట్‌పోస్ట్ ASI శ్రీదేవిపై వేటు
హెడ్‌కానిస్టేబుళ్లు లక్ష్మణ్, నాగమల్లేశ్వరరావును వీఆర్‌కు పంపిన ఎస్పీ నరసింహ కిషోర్
-
Sep 01, 2026 09:25 IST
అనకాపల్లి: నర్సీపట్నం మండలం కొత్త లక్ష్మీపురంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నం స్పీకర్ అయ్యన్నపాత్రుడు
-
Sep 01, 2026 09:20 IST
నెల్లూరు: వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది: మంత్రి నారాయణ
వైసీపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా స్థానిక ఎన్నికలు ఆగవు
వైసీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులే లేరు: మంత్రి నారాయణ
-
Sep 01, 2026 09:15 IST
సాకర్ దిగ్గజం మెస్సీ రిటైర్మెంట్‌పై స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్‌లో మెస్సీతో ఆడిన క్షణాలు గుర్తుచేసుకున్న రేవంత్
మైదానంలో కొన్ని నిమిషాలు మెస్సీతో గడపడం గొప్ప అదృష్టం
యావత్ ఫుట్‌బాల్ ప్రపంచాన్నీ.. మెస్సీ ఉర్రూతలూగించారు: సీఎం రేవంత్ రెడ్డి
-
Sep 01, 2026 09:10 IST
మేడ్చల్ మల్కాజిగిరి: మేడిపల్లి పీఎస్ పరిధిలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్
పీర్జాదిగూడ బీపీఎం గ్రీన్‌ల్యాండ్స్ కాలనీలో నలుగురు దొంగల చోరీ యత్నం
కాలనీ మొత్తం తిరుగుతూ ఇళ్లలో చోరీకి విఫలయత్నం
దొంగలను గమనించిన మహిళ.. కేకలు వేయడంతో పరారీ
సీసీ ఫుటేజీ ఆధారంగా దొంగల కోసం గాలిస్తున్న పోలీసులు
-
Sep 01, 2026 09:00 IST
విశాఖ: మారికవలసలో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళన
సంఘీభావం తెలిపిన పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు
-
Sep 01, 2026 08:55 IST
భారత్ 7.8 జీడీపీపై ప్రధాని మోదీ స్పందన
భారత్ అభివృద్ధికి ఇది ఉదాహరణ: ప్రధాని మోదీ
ఆత్మనిర్భర్ భారత్‌కు ఇది నిదర్శనం: ప్రధాని మోదీ
-
Sep 01, 2026 08:50 IST
చిత్తూరు: పలమనేరులో హృదయ విదారక ఘటన
పట్టణంలో భిక్షాటన చేసే వృద్ధురాలిపై కత్తితో దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తి
పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలింపు.. చికిత్స పొందుతూ వృద్ధురాలి మృతి
దాడి చేసిన వ్యక్తి ఆచూకీ కోసం పోలీసుల గాలింపు
డబ్బుల కోసమే హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్న స్థానికులు
-
Sep 01, 2026 08:45 IST
ఢిల్లీ: దేశవ్యాప్తంగా పెరిగిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు
14 కేజీల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరలో లేని మార్పు
ఢిల్లీలో రూ.9.50 పెరిగిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర
ప్రస్తుతం ఢిల్లీలో రూ.2,747.50గా ఉన్న వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర
-
Sep 01, 2026 08:40 IST
రష్యా సైన్యంలోని 51 మంది భారతీయుల మృతి
భారత విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ వెల్లడి
రష్యా సైన్యంలో మొత్తం 227 మంది చేరారన్న విదేశాంగ శాఖ
వారిలో 137 మంది సైన్యం నుంచి బయటకు వచ్చేశారని ప్రకటన
-
Sep 01, 2026 08:10 IST
కృష్ణాజిల్లా: గుడివాడ 8వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ
లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
పేదలకు నెలవారీ భరోసానే ఎన్టీఆర్ భరోసా పింఛన్: ఎమ్మెల్యే రాము
ప్రతి పైసా అవినీతి లేకుండా లబ్ధిదారులకు చేరడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే రాము
-
Sep 01, 2026 08:05 IST
సంగారెడ్డి: పటాన్‌చెరు మండల పరిధిలో బాలికపై అత్యాచారం
వాచ్‌మన్ కుటుంబంపై దాడి చేసి, 17 ఏళ్ల బాలికను ఎత్తుకెళ్లిన నలుగురు యువకులు
రామేశ్వరం బండ పరిధిలో బాలికపై పలుమార్లు లైంగిక దాడి
బాలికను అక్కడే వదిలేసి పరారీ
ముగ్గురిపై పోక్సో కేసు, నిందితుల కోసం గాలింపు
-
Sep 01, 2026 08:00 IST
హైదరాబాద్: టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు గృహనిర్బంధం
నల్లగొండకు వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
నిన్న నల్లగొండ జిల్లా అధ్యక్షుడు వర్షిత్‌రెడ్డి తల్లి, కుటుంబ సభ్యులపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి
పరామర్శకు వెళ్లకుండా రాంచందర్‌ను అడ్డుకున్న పోలీసులు
-
Sep 01, 2026 07:50 IST
నేడు తెలంగాణ సచివాలయంలో ఉద్యోగుల ఆందోళన
TGSA ఆధ్వర్యంలో మధ్యాహ్నం 12:30 గంటలకు బాహుబలి గేట్ వద్ద ఆందోళన
PRC, DAల కోసం ఉద్యోగుల డిమాండ్
పెండింగ్ బిల్లులు, EHS సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి
OPS, DPCల సమస్యలపై ఉద్యోగుల ఆందోళన
-
Sep 01, 2026 07:45 IST
తిరుమల: గత నెలలో రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు
ఆగస్టులో శ్రీవారిని దర్శించుకున్న 24.56 లక్షల మంది భక్తులు
హుండీ ద్వారా రూ.137.44 కోట్ల ఆదాయం
ఆగస్టులో 3 సార్లు రూ.5 కోట్లు దాటిన హుండీ ఆదాయం
ఆగస్టు 18న అత్యధికంగా రూ.6.12 కోట్లను హుండీ ద్వారా సమర్పించిన భక్తులు
తలనీలాలు సమర్పించిన 10.50 లక్షల మంది భక్తులు
-
Sep 01, 2026 07:40 IST
మెదక్: పాపన్నపేట జెడ్పీ హైస్కూల్లో ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు
విద్యార్థులతో అనుచితంగా మాట్లాడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు
చైల్డ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసిన విద్యార్థులు
ఆరోపణలపై విచారణ చేసిన జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు
నివేదిక మేరకు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసిన డీఈవో రాజు
-
Sep 01, 2026 07:35 IST
నేడు డిల్లీకి తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఢిల్లీలో ఆల్ ఇండియా ఇరిగేషన్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్
కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు కాన్ఫరెన్స్
హాజరుకానున్న మంత్రి ఉత్తమ్
-
Sep 01, 2026 07:30 IST
తిరుపతి: సెంట్రల్ బస్టాండ్‌లో దొంగల చేతివాటం
మహిళ హ్యాండ్‌బ్యాగ్‌లోని నగల బాక్స్ చోరీ
పుత్తూరులో పెళ్లికి హాజరై తిరుగు ప్రయాణంలో పుంగనూరు బస్సు ఎక్కుతుండగా ఘటన
బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఈస్ట్ పోలీసులు
-
Sep 01, 2026 07:27 IST
న్యూయార్క్‌లో మహిళ అరాచకం.. పోలీసు కాల్పుల్లో మృతి
టైమ్స్ స్క్వేర్‌లో మంగళవారం ఘటన
ఇద్దరు వ్యక్తులపై కత్తితో దాడి చేసిన మహిళ
పోలీసులు కాల్పులు జరపడంతో మృతి
ఘటనపై కొనసాగుతున్న దర్యాప్తు
-
Sep 01, 2026 07:15 IST
తిరుపతి: టీటీడీ సిబ్బందికి స్మార్ట్ గుర్తింపు కార్డుల జారీకి ఈవో ప్రొసీడింగ్స్
టీటీడీ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది కోసం కార్డుల ముద్రణ
స్మార్ట్ కార్డు ద్వారా నెలకు సబ్సిడీ రేటుకే రూ.20 కి 10 లడ్డూల పంపిణీ
ప్రతి 3 నెలలకోసారి సుపథం ద్వారా శ్రీవారి దర్శనం
విధులను బట్టి వేర్వేరు రంగుల్లో క్యూఆర్ కోడ్‌తో కూడిన స్మార్ట్ కార్డుల ముద్రణ
-
Sep 01, 2026 07:10 IST
శ్రీకాకుళం: సోంపేట మండలం ఎర్ర ముక్కం గ్రామ సముద్ర తీరంలో ప్రమాదం
తెప్ప బోల్తా పడి వంక యాదవ రావు (56) మృతి
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Sep 01, 2026 07:00 IST
నెల్లూరు: రౌడీషీటర్ లక్ష్మీశెట్టి సాయితేజ హత్యకేసును 24గంటల్లో ఛేదించిన పోలీసులు
హత్యకు స్నేహితుల మధ్య పాతకక్షలే కారణం
మద్యం తాగుతుండగా తలపై బండరాయితో కొట్టి హత్య
8 మంది అరెస్ట్, మిగతా వారి కోసం గాలింపు
-
Sep 01, 2026 06:55 IST
తిరుపతి: APSPDCLలో 40 మంది ఉద్యోగులకు పదోన్నతులు
ఇంజినీరింగ్ విభాగంలో 28 మందికి, అకౌంట్స్ విభాగంలో 12 మందికి పదోన్నతులు
ఉత్తర్వులు జారీ చేసిన APSPDCL సంస్థ సీఎండీ శివశంకర్
-
Sep 01, 2026 06:50 IST
హైదరాబాద్‌లో ప్రస్తుతం పుత్తడి ధరలు ఇవీ
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,760
22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ.1,43,690
కిలో వెండి ధర రూ.2,59,900
-
Sep 01, 2026 06:25 IST
మార్కాపురం: మార్కాపురంపెద్దారవీడు కలనూతల వద్ద ప్రమాదం
వెలిగొండ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన కారు
చెట్టు పైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్న ముగ్గురు యువకులు
స్థానికుల సమాచారంతో స్పందించిన అధికారులు
ఏడు గంటల పాటూ శ్రమించి.. ముగ్గురినీ కాపాడిన రెస్క్యూ టీం
-
Sep 01, 2026 06:21 IST
నేపాల్ వరదల్లో 939కి పెరిగిన మృతుల సంఖ్య
వరదల్లో 4,500 మందికి పైగా గల్లంతు
గల్లంతైనవారిలో 33 దేశాలకు చెందిన పర్యాటకులు
300 మంది భారత పర్యాటకుల గల్లంతు
గల్లంతైనవారి కోసం కొనసాగుతున్న గాలింపు
-
Sep 01, 2026 06:20 IST
నేడు, రేపు ఢిల్లీలో జల్ జీవన్ మిషన్‌పై సమీక్ష
హాజరుకానున్న పలు రాష్ట్రాల సీఎంలు, జలవనరుల మంత్రులు
హర్ ఘర్ నల్ జల్ పురోగతిపై సమగ్ర చర్చ
బకాయిలు, కరవు పరిస్థితులపై కీలక సమీక్ష
రెండో రోజు భేటీకి హాజరుకానున్న ప్రధాని మోదీ
-
Sep 01, 2026 06:18 IST
నేడు తుమ్మడిహెట్టి అంశంపై CWC సమావేశం
హాజరుకానున్న తెలంగాణ, మహారాష్ట్ర అధికారులు
-
Sep 01, 2026 06:17 IST
హైదరాబాద్: నేడు ఇందిరాపార్క్ దగ్గర PRTU ధర్నా
ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్
-
Sep 01, 2026 06:15 IST
నేడు హైకోర్టులో కొండా సురేఖ మాజీ OSD పిటిషన్ విచారణ
హత్యాయత్నం కేసు కొట్టేయాలని కొండా సురేఖ మాజీ ఓఎస్‌డీ సుమంత్ పిటిషన్
మధ్యంతర రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరణ
నేడు మరోసారి విచారించనున్న తెలంగాణ హైకోర్టు
-
Sep 01, 2026 06:12 IST
నేడు షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాలపై హైకోర్టులో విచారణ
సింగిల్ జడ్జి ఆదేశాలపై డివిజన్ బెంచ్‌లో అప్పీల్
-
Sep 01, 2026 06:10 IST
ట్రైనీ IPS ఉదయ్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ
సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేసిన ఉదయ్‌కృష్ణ
పొటెన్సీ టెస్ట్ అవసరం లేదని ఉదయ్‌కృష్ణ పిటిషన్
నేడు విచారించనున్న తెలంగాణ హైకోర్టు
-
Sep 01, 2026 06:07 IST
కడప: నేడు, రేపు పులివెందులలో జగన్ పర్యటన
పులివెందుల క్యాంప్ కార్యాలయంలో జగన్ ప్రజాదర్బార్
రేపు ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద జగన్ నివాళులు
-
Sep 01, 2026 06:05 IST
నేటి నుంచి ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026
రాష్ట్ర పోలీసు శాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా క్రీడా పోటీలు
VIT-AP వర్సిటీ, ఆచార్య నాగార్జున వర్సిటీ వేదికలుగా పోటీలు
నేటి నుంచి ఈ నెల 4 వరకు పోలీసు క్రీడా సంబరం
సాయంత్రం మంగళగిరి APSP 6వ బెటాలియన్‌లో పోటీల ప్రారంభం
-
Sep 01, 2026 06:03 IST
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
జల్‌శక్తి శాఖ సమావేశానికి హాజరుకానున్న సీఎం రేవంత్
తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపుపై చర్చ
కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలనూ కలిసే అవకాశం
కొండా సురేఖ, కేబినెట్ విస్తరణపై చర్చించే ఛాన్స్
-
Sep 01, 2026 06:02 IST
ఢిల్లీ: నేడు రామ్‌లీలా మైదానంలో సీపీఐ ర్యాలీ
రాజ్యాంగం, లౌకికవాద పరిరక్షణే లక్ష్యంగా ర్యాలీ
పాల్గొననున్న డి.రాజా సహా పలువురు జాతీయనేతలు
-
Sep 01, 2026 06:02 IST
సామాజిక కార్యకర్త అన్నా హజారేకు తీవ్ర అస్వస్థత
ముంబైలోని బాంబే ఆస్పత్రికి తరలింపు
ప్రస్తుతం ICUలో చికిత్స పొందుతున్న అన్నా హజారే
-
Sep 01, 2026 06:01 IST
నేడు నర్సాపురం, మొగల్తూరులో సీఎం చంద్రబాబు పర్యటన
NTR భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
ఉదయం 11కు నర్సాపురంలో సీఎం చంద్రబాబు పెన్షన్ల పంపిణీ
పొన్నపల్లిలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు
-
Sep 01, 2026 06:00 IST
కిర్గిస్థాన్‌లో ప్రధాని మోదీ పర్యటన
నేడు షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సు
పుతిన్, కిర్గిస్థాన్ అధ్యక్షుడు ఝుపరోవ్‌తో చర్చలు జరపనున్న ప్రధాని మోదీ