పెరిగిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర
ABN , Publish Date - Sep 01 , 2026 | 09:34 AM
దేశవ్యాప్తంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను ఆయిల్ కంపెనీలు పెంచాయి. దేశ రాజధాని ఢిల్లీలో గ్యాస్ సిలిండర్‌పై రూ.9.50 పెంచాయి.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 01: దేశవ్యాప్తంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను ఆయిల్ కంపెనీలు మంగళవారం పెంచాయి. వివిధ నగరాల్లో స్వల్ప తేడాతో వీటి ధరలు పెంచాయి. దేశ రాజధాని ఢిల్లీలో గ్యాస్ సిలిండర్‌పై రూ.9.50 పెంచాయి. దీంతో ఢిల్లీలో ఈ గ్యాస్ సిలిండర్ ధర రూ.2,747.50 అయింది.
చెన్నైలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.10.50 పెంచాయి. దాంతో చెన్నైలో గ్యాస్ సిలిండర్ ధర రూ.2,961కి చేరింది. కోల్‌కతాలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.11.50 పెంచగా.. ఆ నగరంలో దీని ధర రూ.2,884 అయింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో సిలిండర్‌పై రూ.9.50 పెరిగింది. దాంతో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 2,701కి చేరింది.
అయితే ఈ ఏడాది మే 1వ తేదీన వాణిజ్య గ్యాస్ సిలిండర్‌పై రూ.993 ఆయిల్ కంపెనీలు పెంచాయి. ఆ తర్వాత ఆగస్టు1వ తేదీన రూ.200 తగ్గించాయి. తాజాగా ఈ రోజు వాణిజ్య గ్యాస్ సిలిండర్‌పై స్వల్పంగా ధరలను కంపెనీలు పెంచాయి. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రం పెంచలేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
దేశంలో చిప్‌ల తయారీకి రూ.1.27 లక్షల కోట్ల ప్రోత్సాహకాలు
For More Business News And Telugu News